లక్నో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పౌరసత్వంపై అలహాబాద్ హైకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీకి భారత్, యూకే పౌరసత్వాలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.
రాహుల్ గాంధీకి యూకే పౌరసత్వం ఉందని, కాబట్టే భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కర్ణాటకు చెందిన న్యాయవాది ఎస్ విఘ్నేష్ శిశిర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు. విఘ్నేష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తీర్పును డిసెంబ్ 20కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలతో రాహుల్ పౌరసత్వంపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌బీ పాండే హోం మంత్రిత్వ శాఖ సూచించారు.
ఈ సందర్బంగా పిటిషనర్ ఎస్ విఘ్నేష్ శిశిర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి రెండు యూకే, భారత్‌లో పౌరసత్వం ఉందనే ఆధారాలు లభించాయి. వాటన్నింటిని కోర్టుకు సమర్పించాం. భారత చట్టాల ప్రకారం ఒక పౌరుడికి రెండు దేశాల్లో పౌరసత్వం ఉండకూడదు. అలా ఉంటే ఒక దేశ పౌరసత్వం రద్దు అవుతుంది. రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని భారత ప్రభుత్వం రద్దు చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment