భారతదేశంలో పలు వాహన తయారీ సంస్థలు ఇప్పటికే డీజిల్ కార్ల ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేశాయి. ఢిల్లీ వంటి నగరాల్లో డీజిల్ వాహనాల వినియోగాన్ని కూడా అక్కడి ప్రభుత్వం నిషేదించింది. దీనికి ప్రధాన కారణం పర్యావరణ హితమే. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం ప్రకారం, రాష్ట్రంలో హైబ్రిడ్ కార్లపై రోడ్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. ఇది హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్లకు వర్తిస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, పచ్చదనాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
యూపీ ప్రభత్వం తీసుకున్న నిర్ణయంతో మారుతి సుజుకి, టయోటా వంటి సంస్థలు బాగా లాభపడే అవకాశం ఉంది. అయితే పన్నుల తగ్గింపు ఎంత వరకు ఉంటుందని నోటిఫికేషన్‌లో వెల్లడించలేదు, కానీ 100 శాతం రాయితీ ఉంటుందని సమాచారం. ఇప్పటికే మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి కార్లు ఉత్తమ అమాంకాలను పొందుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీటి సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.
ప్రస్తుతం గ్రాండ్ విటారా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హైబ్రిడ్ కార్ల రిజిస్ట్రేషన్ ధర యూపీలో సుమారు రూ. 1.80 లక్షల వరకు ఉంటుంది. ఇది ఎంచుకున్న వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. గరిష్టంగా రూ.3 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ మొత్తాన్ని కస్టమర్ లాభంపొందవచ్చు.
హైబ్రిడ్ కార్ల మీద రోడ్ ట్యాక్ రద్దుకు సంబంధించిన కీలక ప్రకటన కేవలం యూపీ ప్రభుత్వం మాత్రమే ప్రకటించింది. ఈ నిరయాన్ని మరిన్ని రాష్ట్రాలు ఆహ్వానించే అవకాశం ఉంది. ఇదే జరిగితే రోడ్లమీద హైబ్రిడ్ వాహనాల సంఖ్య పెరుగుతుంది. తద్వారా కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది.
Comments
Please login to add a commentAdd a comment