Hybrid Car
-
ఆస్టన్ మార్టిన్ ఫస్ట్ హైబ్రిడ్ కారు 'వల్హల్లా' ఇదే (ఫోటోలు)
-
రెండేళ్లు.. లక్ష సేల్స్: ఈ కారు రేటెంతో తెలుసా?
భారతదేశంలో వాహన విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ప్రజలు కొన్ని బ్రాండ్ కార్లను మాత్రమే అధికంగా కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి కోవకు చెందిన కార్లలో ఒకటి ఇన్నోవా హైక్రాస్. ఇప్పటికే ఈ కారును లక్ష మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. కేవలం రెండేళ్లలో కంపెనీ ఈ అరుదైన ఘనతను సాధించింది.2022లో అమ్మకానికి వచ్చిన టయోటా ఇన్నోవా హైక్రాస్.. ఇన్నోవా క్రిస్టాతో పాటు అమ్ముడైంది. ప్రారంభంలో అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నపటికీ.. ఆ తరువాత సేల్స్ భారీగా పెరిగాయి. ఈ కారు పెట్రోల్ - హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ పొందుతుంది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.ఇదీ చదవండి: పెరగనున్న బీఎండబ్ల్యూ ధరలు: ఎప్పటి నుంచో తెలుసా?టయోటా ఇన్నోవా హైక్రాస్ నాన్-హైబ్రిడ్ వేరియంట్లు 172 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. టాప్ వేరియంట్లు స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 184 హార్స్ పవర్ అందించే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుతాయి. మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 19.77 లక్షల నుంచి రూ. 30.98 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ధరలు మీరు ఎంచుకునే వేరియంట్ ఆధారంగా మారుతూ ఉంటాయి. -
శుభవార్త.. హైబ్రిడ్ కార్ల కొనుగోలుపై రోడ్ ట్యాక్స్ లేదు
భారతదేశంలో పలు వాహన తయారీ సంస్థలు ఇప్పటికే డీజిల్ కార్ల ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేశాయి. ఢిల్లీ వంటి నగరాల్లో డీజిల్ వాహనాల వినియోగాన్ని కూడా అక్కడి ప్రభుత్వం నిషేదించింది. దీనికి ప్రధాన కారణం పర్యావరణ హితమే. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం ప్రకారం, రాష్ట్రంలో హైబ్రిడ్ కార్లపై రోడ్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. ఇది హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్లకు వర్తిస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, పచ్చదనాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.యూపీ ప్రభత్వం తీసుకున్న నిర్ణయంతో మారుతి సుజుకి, టయోటా వంటి సంస్థలు బాగా లాభపడే అవకాశం ఉంది. అయితే పన్నుల తగ్గింపు ఎంత వరకు ఉంటుందని నోటిఫికేషన్లో వెల్లడించలేదు, కానీ 100 శాతం రాయితీ ఉంటుందని సమాచారం. ఇప్పటికే మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి కార్లు ఉత్తమ అమాంకాలను పొందుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీటి సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.ప్రస్తుతం గ్రాండ్ విటారా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హైబ్రిడ్ కార్ల రిజిస్ట్రేషన్ ధర యూపీలో సుమారు రూ. 1.80 లక్షల వరకు ఉంటుంది. ఇది ఎంచుకున్న వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. గరిష్టంగా రూ.3 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ మొత్తాన్ని కస్టమర్ లాభంపొందవచ్చు. హైబ్రిడ్ కార్ల మీద రోడ్ ట్యాక్ రద్దుకు సంబంధించిన కీలక ప్రకటన కేవలం యూపీ ప్రభుత్వం మాత్రమే ప్రకటించింది. ఈ నిరయాన్ని మరిన్ని రాష్ట్రాలు ఆహ్వానించే అవకాశం ఉంది. ఇదే జరిగితే రోడ్లమీద హైబ్రిడ్ వాహనాల సంఖ్య పెరుగుతుంది. తద్వారా కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. -
500 కిమీ/గం స్పీడ్.. బుగాటి సరికొత్త హైపర్ కారు
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కారును అభివృద్ధి చేసిన సుమారు ఎనిమిది సంవత్సరాల తరువాత 'బుగాటి' (Bugatti) మరో సూపర్ కారును లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. దీని వేగం 500 కిమీ/గం. ఈ కారుకు సంబంధించిన యాక్సలరేషన్ వీడియోను కంపెనీ ఇప్పటికే తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.స్పీడోమీటర్‌కు ఎడమవైపున మూడు గేజ్‌లు సెట్ చేసి ఉండటం ఇక్కడ గమనించవచ్చు. ఇందులో రీడింగ్ గరిష్టంగా 350 కిమీ/గం మాత్రమే చూపిస్తుంది. అయితే వీడియోలో గేజ్‌లు ఈ వేగాన్ని అధిగమించడం చూడవచ్చు. బుగాటి రిమాక్ సీఈఓ మేట్ రిమాక్ కొత్త బుగాటి హైపర్‌కార్‌లో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఉంటుందని ఇప్పటికే ధ్రువీకరించారు.ఐకానిక్ క్వాడ్ టర్బో డబ్ల్యూ16 స్థానంలో.. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వీ16 ఇంజిన్ మాత్రమే కాకుండా మూడు ఎలక్ట్రిక్ మోటార్లను పొందనున్నట్లు సమాచారం. కారు ముందు భాగంలో రెండు మోటార్లు, వెనుక భాగంలో ఒక మోటార్ ఉంటుంది. ఇవన్నీ 25 కిలోవాట్ సామర్థ్యంతో ఉన్నట్లు సమాచారం.బుగాటి కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు ఇప్పటికే మార్కెట్లో ఉన్న చిరోన్ కంటే కొంచెం బరువుగా ఉంటుంది. పవర్ అవుట్‌పుట్ కూడా దాని స్టాండర్డ్ మోడల్ కంటే ఎక్కువగానే ఉంటుంది. కంపెనీ సరికొత్త హైపర్ కారు గురించి మరిన్ని వివరాలను జూన్ 21న అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.Engineered for speed.Pour l’éternité.Watch ‘La Grande Première’ live: https://t.co/D4Er3Kg34c20.06.2024#BUGATTI #PourLÉternité pic.twitter.com/29Wj6G1M6Y— Bugatti (@Bugatti) June 20, 2024 -
హైబ్రీడ్ కార్.. ఒక్కసారికి 2000 కిమీ ప్రయాణం
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఆధునిక ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఈ తరుణంలో చైనాకు చెందిన బీవైడీ కంపెనీ సింగిల్ చార్జితో ఏకంగా 2000 కిమీ కంటే ఎక్కువ ప్రయాణించే హైబ్రిడ్ కారును ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.బీవైడీ కంపెనీ ఆవిష్కరించిన కొత్త హైబ్రిడ్ కారును ఒక ఫుల్ ఛార్జ్ చేసి.. ఫుల్ ట్యాంక్ ఇంధనం నింపిన తరువాత, ప్రయాణం ప్రారంభిస్తే.. 2000 కిమీ ప్రయాణించే వరకు మళ్ళీ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యూయల్ ట్యాంక్‌లో ఇంధనం నింపాల్సిన అవసరం కూడా లేదు.కంపెనీ ఆవిష్కరించిన కారు పేరు తెలియాల్సి ఉంది. అయితే దీని ధర 100000 యువాన్లు (13800 అమెరికన్ డాలర్లు) వరకు ఉంటుందని సమాచారం. లాంచ్ సమయంలో కంపెనీ అధికారిక ధరలను వెల్లడిస్తుంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ హైబ్రిడ్ కారుకు సంబంధించిన ఫీచర్స్ మాత్రమే కాకుండా.. లాంచ్ డేట్ వంటి వివరాలు కూడా అధికారికంగా త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
నితిన్ గడ్కరీ ఆవిష్కరించిన ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు.. ఇది చాలా స్పెషల్!
భారతదేశం అభివృద్ధివైపు వేగంగా పరుగులు పెడుతున్న తరుణంలో ఈ రోజు కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రపంచంలోనే మొట్ట మొదటి బిఎస్6 హైబ్రిడ్ కారుని ఆవిష్కరించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పెట్రోల్, డీజిల్ కార్ల వినియోగంతో కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ప్రపంచంలోని చాలా దేశాలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ ఫ్యుయల్ పుట్టుకొచ్చింది. టయోటా కంపెనీకి చెందిన ఈ 'ఇన్నోవా హైక్రాస్' ఇథనాల్ శక్తితో నడిచే ప్రోటోటైప్ హైబ్రిడ్ కారు. ఈ లేటెస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్ ఇంజిన్ E100 గ్రేడ్ ఇథనాల్‌తో (100 శాతం ఇథనాల్) పనిచేసేలా తయారైంది. సెల్ఫ్ ఛార్జింగ్ లిథియం అయాన్ బ్యాటరీ ఇందులో ఉంటుంది. కావున ఈవీ మోడ్‌లో కూడా నడుస్తుంది. ఇందులోని 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజన్ పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఫ్లెక్స్ ఫ్యూయెల్ టెక్నాలజీ.. ఫ్లెక్స్ ఫ్యూయెల్ టెక్నాలజీ అనేది ఇంజిన్‌ను ఇథనాల్-పెట్రోల్ మిశ్రమంతో పనిచేసేలా చేస్తుంది. దీని వల్ల కర్బన ఉద్గారాలు తక్కువగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా E20 ఇంధనం అందుబాటులో ఉంది. ప్రస్తుతం బ్రెజిల్ అత్యధిక ఇథనాల్ మిశ్రమాన్ని 48 శాతం వరకు మిక్స్ చేస్తోంది. భారతదేశంలోని అనేక సంస్థలు తమ వాహనాలను E20 ఇంధన సామర్థ్యంతో ప్రారంభించాయి. ఇదీ చదవండి: ఉత్పత్తి నిలిపివేసిన టయోటా.. షాక్‌లో కస్టమర్లు - కారణం ఇదే! ఇథనాల్.. ఇతర ఇంధనాలతో పోలిస్తే ఇథనాల్ అనేది తక్కువ ఖర్చుతో లభిస్తుంది. ఎందుకంటే బయోవేస్ట్ నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేస్తారు. కావున ఇలాంటి వాహనాల వినియోగానికి అయ్యే ఖర్చు.. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. అయితే ఈ రకమైన కార్లు ఎప్పటి నుంచి వినియోగంలోకి వస్తాయనేది తెలియాల్సి ఉంది. -
ఇండియన్ మార్కెట్లోని టాప్ 5 హైబ్రిడ్ కార్లు - వివరాలు
Top 5 Hybrid Cars In India: భారతీయ మార్కెట్లో హైబ్రిడ్ కార్ల వినియోగం ఎక్కువవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను ఈ విభాగంలో విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం దేశీయ విఫణిలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ధరలు రూ. 16.46 లక్షల నుంచి రూ. 19.99 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు ఒక లీటరుకు గరిష్టంగా 27.97 కిమీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ కారు అద్భుతమైన పనితీరుని అందించేలా రూపొందించారు. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఆధునిక కాలంలో అందుబాటులో ఉన్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరలు రూ. 18.29 లక్షల నుంచి రూ. 19.79 లక్షల వరకు ఉంటుంది. ఇది 27.97 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని సమాచారం. ఇది సిటీ అండ్ హైవే రెండింటిలోనూ 20 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. డిజైన్ అండ్ ఫీచర్స్ కలిగిన ఈ కారులో తక్కువ ఇతర మోడల్స్ కంటే కూడా తక్కువ బూట్ స్పేస్ లభిస్తుంది. హోండా సిటీ హైబ్రిడ్ రూ. 18.99 లక్షల నుంచి రూ. 20.49 లక్షల మధ్య లభించే ఈ కారు కూడా మన జాబితాలో ఉత్తమ మైలేజ్ అందించే బెస్ట్ కారు. ఇది 23.13 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. అయితే సిటీ అండ్ హైవే వంటి వాటిని లోబడి కొంత వరకు మైలేజ్ తగ్గే అవకాశం ఉండవచ్చు. పనితీరు చాలా చురుగ్గా ఉంటుంది. ఇదీ చదవండి: ఫ్రెండ్‌షిప్‌డే రోజు మిత్రులకు గిఫ్ట్‌గా ఓ స్మార్ట్‌వాచ్ - ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్! మారుతి సుజుకి ఇన్విక్టో మారుతి సుజుకి కంపెనీకి చెందిన మరో హైబ్రిడ్ మోడల్ ఇన్విక్టో. దీని ప్రారంభ ధర రూ. 24.79 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 28.42 లక్షలు. మైలేజ్ విషయానికి వస్తే.. ఇది ఒక లీటరుకు గరిష్టంగా 23.24 కిమీ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. మన జాబితాలో ఇది కొంత ఖరీదైన కారు అనే చెప్పాలి. అయితే ధరకు తగిన ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళ.. ఎలాన్ మస్క్, అంబానీ కంటే ఎక్కువే! టయోటా ఇన్నోవా హైక్రాస్ టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హైక్రాస్ ధర రూ. 25.30 లక్షల నుంచి రూ. 30.26 లక్షల వరకు ఉంటుంది. ఇది 23.24 కిమీ/లీ మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఉత్తమ పనితీరుని అందించే ఈ కారు అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలను పొందగలిగింది. -
ఆ కంపెనీ భారీ ప్లాన్.. లీటర్‌కి 40 కి.మీ వరకు మైలేజ్‌తో నడిచే కార్లు వస్తున్నాయట!
ఇటీవల కార్ల వాడకం పెరుగుతోంది. ఇదివరకు కస్టమర్లు స్టైలిష్ లుక్, సాకర్యాలు, ఫీచర్ల, ధరను చూసేవాళ్లు. ప్రస్తుతం ఇంధన ధరల భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిపై కూడా ఓ కన్నేస్తున్నారు. కొంతవరకు, (CNG) సీఎన్జీ ఇంధనం ఈ సమస్యను పరిష్కరించడంలో సహాయపడింది. అయితే ఇప్పుడు సీఎన్జీ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి, కానీ అవి ప్రస్తుతం కొంచెం ఖరీదుగా ఉండడం, పైగా వాటి ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెద్దగా లేకపోవడంతో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఇటువంటి సమయంలో, ఎక్కువ మంది కంపెనీలు తమ దృష్టిని హైబ్రిడ్ టెక్నాలజీ కార్ల వైపు మళ్లిస్తున్నాయి. అందుకే రానున్న కాలంలో అదిరిపోయే మైలేజ్‌తో ఉన్న కార్లు మార్కెట్లో విడుదలకు తయారీదారులు ప్లాన్ చేస్తున్నారు. నివేదికల ప్రకారం.. మారుతి నుంచి ఆ రెండు కార్లు ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్, డిజైర్ మారుతి కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. కస్టమర్లు కోరుకునే బడ్జెట్ ధరలతో పాటు ఫీచర్లు, కార్ల పనితీరు కారణంగా ఇవి సేల్స్‌లో దూసుకుపోతున్నాయి. తదపరి మారుతి నుంచి స్విఫ్ట్, డిజైర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో రానున్నాయని నివేదికలు చెప్తున్నాయి. మారుతి ఈ రెండు మోడళ్లలో 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చే అవకాశం ఉంది. ఈ కార్ల ఇంజిన్లు కూడా టయోటా స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో తయారు కావచ్చని సమాచారం. నివేదికల ప్రకారం.. మారుతి స్విఫ్ట్, మారుతి డిజైర్ హైబ్రిడ్ మోడల్ కార్లు దేశంలో అత్యంత ఇంధన-సమర్థవంతమైన వాహనాలుగా మారనున్నాయి. ఇవి 35 km/l నుంచి 40 km/l వరకు మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. హైబ్రిడ్ టెక్నాలజీతో స్విఫ్ట్ , డిజైర్ 2024 తొలి త్రైమాసికంలో మార్కెట్లో రావొచ్చు. ప్రస్తుతం మైలేజ్ పరంగా గ్రాండ్ విటారా SUV 27.97 కిమీ/లీతో ఫ్యూయల్ ఎకానమీ చార్ట్‌లలో ముందుంది. ఇదిలా ఉండగా మారుతీ సుజుకీ మాత్రం ఈ కొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్ల అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. చదవండి: నగదు చెల్లింపుల కోసం క్యూ ఆర్ కోడ్ స్కాన్.. ఇవి తెలుసుకోకపోతే జేబుకి చిల్లే! -
అన్ని మోడళ్ల కార్లను మార్చేస్తున్న వోల్వో.. కారణం ఇదే!
లగ్జరీ కార్ల తయారీలో ఉన్న స్వీడన్ కంపెనీ వోల్వో 2030 నాటికి భారత మార్కెట్లో పూర్తిగా ఎలక్ట్రిక్ మోడళ్లనే ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో లభిస్తున్న అన్ని మోడళ్లను మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్‌కు మార్చింది. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో వోల్వో ఖాతాలో ప్రస్తుతం భారత్‌లో ఎస్యూవీ ఎక్స్‌సీ40 రిచార్జ్ కొలువుదీరింది. వచ్చే ఏడాది మధ్య కాలంలో పూర్తి ఎలక్ట్రిక్ మోడల్ మరొకటి రానుంది. కాగా, 2023 శ్రేణి మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఎక్స్‌సీ40 ఎస్యూవీ, ఎస్90 సెడాన్, మిడ్ సైజ్ ఎస్యూవీ ఎక్స్‌సీ60, ఎస్యూవీ ఎక్స్‌సీ90 కార్లను కంపెనీ బుధవారం ఆవిష్కరించింది. కొత్త ఫీచర్లను జోడించి వీటికి రూపకల్పన చేసినట్టు వోల్వో కార్ ఇండియా ఎండీ మల్హోత్రా తెలిపారు. చదవండి: కొన్ని గంటల్లో ఈ బ్యాంక్ షట్ డౌన్: అంతకుముందే సొమ్ము తీసుకోండి! -
త్వరలో అన్ని కార్లలో హైబ్రీడ్ టెక్నాలజీ: మారుతీ సుజుకీ
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల టెక్నాలజీలపై మరింతగా దృష్టి పెట్టే దిశగా ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) వచ్చే 5–7 ఏళ్లలో తమ అన్ని కార్ల మోడల్స్‌లోనూ హైబ్రీడ్ సాంకేతికతను వినియోగించాలని యోచిస్తోంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు, సీఎన్జీ కార్లు, ఇథనాల్.. బయో సీఎన్జీ అనుకూల ఇంజిన్లపై మరింత దృష్టి పెట్టనున్నట్లు సంస్థ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సీవీ రామన్ తెలిపారు. రాబోయే అయిదు నుంచి ఏడేళ్లలో ప్రతీ మోడల్లో ఎంతో కొంత గ్రీన్ టెక్నాలజీ ఉంటుందని చెప్పారు. -
హోండా నుంచి న్యూ మోడల్ కారు
సాక్షి, హైదరాబాద్: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ కొత్త మోడల్ కారును లాంచ్ చేసింది. నాగోల్ గ్రీన్ హోండా షోరూమ్ వద్ద బుధవారం ‘ఈ–హెవ్’ మోడల్ కారును హైదరాబాద్ మెట్రోవాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు (హెచ్ఎమ్ఎస్ఎస్) ఎండీ ఎం.దానకిశోర్ లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో సీఈఓ వివేకానంద ఆర్యశ్రీ, సేల్స్ హెడ్ శ్రీధర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోండా ‘న్యూ సిటీ ఈ–హెవ్’ దేశంలో మొదటి బలమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనమని చెప్పారు. మెయిన్ స్ట్రీమ్ సెగ్మెంట్లో విప్లవాత్మక స్వీయ–ఛార్జింగ్‌తో అత్యంత సమర్థవంతంగా పని చేస్తోందన్నారు. గత నెల 14 నుంచి బుకింగ్ మొదలు కాగా, ఈ నెలలో అమ్మకాలను ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు. దీని పనితీరు, సామర్ధ్యం ప్రాముఖ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. (చదవండి: యూట్యూబ్ క్రియేటర్లకు గూగుల్ భారీ షాక్!) -
వచ్చేస్తున్నాయి..హోండా సిటీ హైబ్రిడ్ కార్లు..బుకింగ్స్ షురూ..!
న్యూఢిల్లీ: కొత్తగా ప్రకటించిన సిటీ కారు ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెర్షన్ ’ఇ:హెచ్ఈవీ’ ఉత్పత్తిని ప్రారంభించినట్లు హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) వెల్లడించింది. రాజస్థాన్‌లోని తాపుకారా ప్లాంట్‌లో వీటిని తయారు చేస్తున్నట్లు వివరించింది. హోండా సిటీ ఇ:హెచ్ఈవీని వచ్చే నెల తొలినాళ్లలో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ టకుయా సుమురా తెలిపారు. డీలర్ల దగ్గర రూ. 21,000 లేదా కంపెనీ వెబ్సైట్లో రూ. 5,000 చెల్లించడం ద్వారా కారును బుక్ చేసుకోవచ్చని వివరించా రు. ఇందులో విశిష్టమైన సెల్ఫ్ చార్జింగ్ ఫీచర్ ఉందని పేర్కొన్నారు. 3 ఏళ్ల అన్లిమిటెడ్ కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీ ఉంటుందని, లిథియం అయాన్ బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కి.మీ. (ఏది ముందైతే అది) వివరించారు. చదవండి: ఒకే సారి రూ. 3 లక్షల వరకు పెంపు..ఈ కంపెనీ కార్లు మరింత ప్రియం..! -
హోండా సిటీ హైబ్రిడ్ కారు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ తాజాగా తమ సిటీ ఈ:హెచ్ఈవీ సెడాన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కారును గురువారం ఆవిష్కరించింది. ఈ కారుకి సంబంధించి బుకింగ్స్ ప్రారంభించామని, వచ్చే నెలలో మార్కెట్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నామని సంస్థ భారత విభాగం ప్రెసిడెంట్ తకుయా సుమురా తెలిపారు. రెండు సెల్ఫ్–చార్జింగ్ మోటార్లు, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వంటి ప్రత్యేకతలు ఈ కారులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మరింత విస్తృతమైన యాంగిల్‌తో ఫ్రంట్ కెమెరా, ముందున్న రహదారిని స్కాన్ చేసి .. ప్రమాదాలను నివారించేలా డ్రైవరును అప్రమత్తం చేయగల సాంకేతికత మొదలైనవి ఇందులో పొందుపర్చినట్లు సుమురా వివరించారు. వచ్చే ఏడాది సరికొత్త ఎస్‌యూవీని (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం) భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు సుమురా తెలిపారు. తమ ఉత్పత్తుల ఎగుమతులకు భారత్‌ను కీలక కేంద్రంగా మార్చుకోవడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెడుతోందని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 20 వేల పైచిలుకు వాహనాలు ఎగుమతి చేశామని, ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు అదే స్థాయిలో ఎగుమతులు ఉండగలవని సుమురా వివరించారు. చిప్‌ల కొరత, సరఫరా వ్యవస్థ సమస్యలతో వాహనాల ఉత్పత్తిపై ప్రభావం పడుతోందని ఆయన తెలిపారు. -
అదిరిపోయిన రెనాల్ట్ కొత్త హైబ్రిడ్ కారు.. మైలేజ్ కూడా చాలా ఎక్కువే..!
ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ తయారీసంస్థ రెనాల్ట్ సీ-సెగ్మెంట్ వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం ఆస్ట్రల్ పేరుతో కొత్త ఎస్యువీ మోడల్ కారునీ ప్రపంచ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న కడ్జార్ ఎస్యువీ స్థానంలో కొత్తగా ఆస్ట్రల్ ఎస్యువీ కారును తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారు వోల్వో ఎక్స్ సీ40, వోక్స్ వ్యాగన్ టి-రోక్, ఫోర్డ్ కుగా, టయోటా ఆర్ఎవీ4 వంటి వాటితో పడనుంది. రెనాల్ట్ సీఈఓ లూకా డీ మియో మాట్లాడుతూ.. "సరికొత్త రెనాల్ట్ ఆస్ట్రల్ అనేది సీ-సెగ్మెంట్ ఎస్యువీ. రెనాల్ట్ తన పూర్తి సామర్థ్యం మేరకు తీసుకొచ్చిన ఒక ప్రతిరూపం" అని అన్నారు. జపాన్ దేశానికి చెందిన మిత్సుబిషి, నిస్సాన్ కంపెనీలతో కలిసి ఆస్ట్రల్ కారుని అభివృద్ధి చేసినట్లు తెలిపింది. థర్డ్ జనరేషన్ సీఎంఎఫ్-సీడీ ప్లాట్ ఫారమ్ వినియోగించిన సంస్థ మొదటి కారు ఇది. ఇది ఒక హైబ్రిడ్ కారుగా సంస్థ పేర్కొంది. ఐసీఈ వాహనంలో రెండు పెట్రోల్ ఇంజిన్లు ఉన్నాయి. 130 హెచ్‌పీ 48 మైల్డ్ హైబ్రిడ్ అడ్వాన్స్డ్ ఇంజిన్, 140 హెచ్‌పి/160 హెచ్‌పి సామర్ధ్యం గల 12వీ మిల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఇందులో ఉంది. కొత్త రెనాల్ట్ ఆస్ట్రల్ టర్బోఛార్జ్డ్ 1.2-లీటర్ త్రీ-సిలిండర్ ఇంజిన్'ను ఒక మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్'తో జత చేశారు. ఇది "డీజిల్ వాహనాలకు నిజమైన ప్రత్యామ్నాయం" అని కంపెనీ పేర్కొంది. రెనాల్ట్ ఆస్ట్రల్ ఎస్యువీ 48వి మైల్డ్ హైబ్రిడ్ అడ్వాన్స్ డ్ వేరియెంట్ 48వీ లిథియం-అయాన్ బ్యాటరీ, స్టార్టర్ మోటార్ సహాయంతో 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. ఈ మైల్డ్ హైబ్రిడ్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆస్ట్రల్ ఎస్యువీ కారు ఇంధన వినియోగం 100 కిలోమీటర్లకు 5.3 లీటర్ల వరకు తక్కువగా ఉండవచ్చని రెనాల్ట్ పేర్కొంది. ఈ మోడల్ కార్లలో ఈ మైలేజ్ చాలా ఎక్కువ అని చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. రెనాల్ట్ ఆస్ట్రల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్, 1.3 లీటర్ 4-సిలిండర్ టర్బోఛార్జ్డ్ డైరెక్ట్-ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజిన్ సహాయంతో పనిచేస్తుంది. దీనిని మెర్సిడెస్ బెంజ్ సహ-అభివృద్ధి చేసింది. దీనిలో 9.3 అంగుళాల హెడ్స్-అప్ డిస్ ప్లే, యాక్టివ్ డ్రైవర్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ సెంటరింగ్, 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటెడ్ పార్క్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్, రియర్ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, మ్యాట్రిక్స్ ఎల్ఈడీ విజన్ స్మార్ట్ లైటింగ్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. (చదవండి: ఫ్యూచర్‌కు షాక్! లీగల్ నోటీసులు పంపిన రిలయన్స్!) -
పెట్రోల్‌తోనే కాదు కరెంటుతో కూడా నడుస్తోంది..! ఈ కారు..! ధర ఎంతంటే..?
టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఫేస్‌లిఫ్టెడ్ క్యామ్రీ హైబ్రిడ్‌ను విడుదల చేసింది. టయోటా క్యామ్రీ సరికొత్త ఫీచర్స్‌తో, కొత్త కలర్ ఆప్షన్‌తో, ఇంటీరియర్స్‌లో సరికొత్త మార్పులతో రానుంది. 2022 టయోటా క్యామ్రీ హైబ్రిడ్ కారు ధర రూ. 41.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారులో 2.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్‌తో సీవీటీతో జతచేయబడి ఉంది. డిజైన్‌లో సరికొత్తగా..! టయోటా న్యూ క్యామ్రీ కొత్త బంపర్, క్రోమ్ ఇన్సర్ట్స్తో గ్రిల్ పొందుతుంది. టెయిల్‌ల్యాంప్‌లను సరికొత్తగా డిజైన్ చేశారు. అంతేకాకుండా బ్లాక్ బేస్ ఎక్స్టెన్షన్లతో కూడిన ఎరుపు ఎల్ఈడీ బ్రేక్ లైట్ల క్లస్టర్‌ను కలిగి ఉంది. డార్క్ మెటాలిక్ ఫినిషింగ్‌తో కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ కారుకు మరింత ఆకర్షణీయంగా నిలవనుంది. ఇంటీరియర్స్ విషయానికి వస్తే..! సెంట్రల్ కన్సోల్, డ్యాష్‌బోర్డ్‌లో బ్లాక్ ఇంజనీర్డ్ వుడ్ ఎఫెక్ట్ ఫిల్మ్‌ను జోడించడంతో క్యాబిన్ లోపల కొత్త లుక్ రానుంది. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో రెండింటిలోనూ అందుబాటులో ఉంది. 9-స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్‌తో జత చేయబడిన 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఫ్లోటింగ్ డిస్ప్లేను కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో రానుంది. కారులో ముఖ్యంగా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 10-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, మెమరీ అసిస్టెడ్ టిల్ట్-టెలీస్కోపిక్ స్టీరింగ్ అడ్జస్ట్, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, హెడ్స్-అప్ డిస్ప్లేను టయోటా ఏర్పాటుచేసింది. మరిన్నీ ఫీచర్స్..! కారులోని రిక్లైనింగ్ సీట్స్, పవర్ అసిస్టెడ్ రియర్ సన్‌షేడ్, క్లైమేట్ కంట్రోల్, ఆడియో సెట్టింగ్స్‌తో కూడిన టచ్ ప్యానెల్, 3-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అమర్చారు. టయోటా క్యామ్రీలో 9 ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ అసిస్ట్, క్లియరెన్స్ అండ్ బ్యాక్ సోనార్, స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి యాక్టివ్, ప్యాసివ్ సేఫ్టీ సిస్టమ్‌లు కూడా ఉన్నాయి. పవర్‌ట్రెయిన్ 2.5-లీటర్ నాలుగు-సిలిండర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్‌ను కల్గి ఉంది. 218bhp శక్తిని ఉత్పత్తి చేయనుంది. 221ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తోంది. హైబ్రిడ్ సిస్టమ్‌లో భాగంగా 245V నికెల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీతో రానుంది. కర్భన ఉద్గారాలను పూర్తిగా ఆపివేసే ప్రయత్నంలో భాగంగా టయోటా తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని టీకేఎమ్ సేల్స్ అండ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అతూల్ సూద్ అన్నారు. క్యామ్రీ భారతీయ మార్కెట్లలో 2013లోనే ప్రవేశపెట్టినప్పటీకీ, ఇప్పుడు వచ్చిన ఫేస్‌లిఫ్ట్ క్యామ్రీ భారతీయులను మరింత ఆకట్టుకుంటుందని ఆయన తెలిపారు. చదవండి: సరికొత్తగా హోండా సీబీఆర్300ఆర్ బైక్..! ధర ఎంతంటే...? -
టెస్లా కంటే తోపు కారును లాంచ్ చేసిన హువావే..! ఏకంగా 1000కిమీ మేర..
Huawei Unveils Aito M5 Hybrid Car Claims It Is Better Than Tesla Model Y: అమెరికన్ ఎలక్ట్రిక్ తయారీ సంస్థ టెస్లాకు ధీటైన ఎలక్ట్రిక్ కారును ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హువావే ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. టెస్లానే కాకుండా దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల సంస్థలకు పోటీగా నిలుస్తోందని హువావే ప్రకటించింది. హువావే ఐటో ఎమ్5 ఇటీవల చైనీస్ కంపెనీ హువావే అనేక దేశాల్లో ప్రతికూలతలు ఎదురైనాయి. అమెరికా లాంటి దేశాలు హువావేపై నిషేధాన్ని విధించాయి. ప్రస్తుతం హువావే ఆవిష్కరించిన ‘ఐటో ఎమ్5’ కారుతో ఆయా దేశాల్లో పునరాగమనం చేసేందుకు ప్రయత్నాలను చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఐటో ఎమ్5 కారును హువావే ప్రదర్శించింది. ఇక్కడ ఈ కారు ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక హైబ్రిడ్ కారు. విద్యుత్, ఇంధనంతో నడిచేలా ఐటో ఎమ్5ను హువావే ఆవిష్కరించింది. స్పెసిఫికేషన్ల పరంగా ఈ వాహనం టెస్లా మోడల్ వైని అధిగమించగలదని కంపెనీ పేర్కొంది. ఈ కారులో హువావే రూపొందించిన ఆపరేటింగ్ సిస్టమ్ హర్మోని ఒఎస్తో పనిచేయనుంది. ఈ కారులో డబుల్ లేయర్డ్ సౌండ్ ప్రూఫ్ గ్లాస్ ఉన్నట్లు తెలుస్తోంది. 200కెడబ్ల్యూహెచ్ బ్యాటరీతో సుమారు 1000 కిమీ మేర ప్రయాణిస్తోందని హువావే పేర్కొంది. ఇది ఒక హైబ్రిడ్ కారు కావున ఒకవేళ ఛార్జింగ్ జీరో అయినా కూడా నిర్విరామంగా ప్రయాణం కొనసాగించవచ్చును. ఐటో ఎమ్5 ధర ఎంతంటే..! ఈ కారు విద్యుత్, ఇంధనం రెండింటితోనూ నడుస్తోంది. ఐటో ఎమ్5 ధర 250,000 యువాన్ (సుమారు రూ. 29,45,915)గా ఉంది. కాగా టెస్లా వై మోడల్ ధర 280,752 యువాన్ (సుమారు రూ. 33,07,887)గా ఉంది. అంటే హువావే ఆవిష్కరించిన కారు టెస్లా వై మోడల్ కంటే తక్కువ ధరలో లభించనుంది. చైనీస్ న్యూ ఇయర్ తర్వాత ఫిబ్రవరి 20, 2022 నాటికి కస్టమర్లకు కారును డెలివరీ చేయడం ప్రారంభిస్తామని హువావే ఒక ప్రకటనలో వెల్లడించింది. చదవండి: చెప్పినట్లే చేశాడు..అన్నింటీని అమ్మేసిన ఎలన్ మస్క్..! -
Viral Video: ప్రేమతో... మీ నాన్న ... గిఫ్ట్‌గా లంబోర్గిని
హనోయి(వియత్నాం): కొడుకు అడిగిందే ఆలస్యం అతని కోసం లంబోర్గిని కారును గిఫ్టుగా ఇచ్చాడు తండ్రి. అయితే ఆ కొడుకు వయసు కేవలం ఐదేళ్లు. అందుకుని కోట్లు పోసి షోరూంలో కారును కొనలేదు, 65 రోజులు శ్రమించి కొడుక్కి తగ్గట్టుగా వుడెన్ కారుతు తయారు చేసి తండ్రి తన ప్రేమను చాటుకున్నాడు. కొడుకు అడిగితే వియత్నాంకి చెందిన ట్రూంగ్ వాన్ డోవ్ కార్పెంటర్ పనిలో దిట్ట. అదే అతని జీవనాధారం. కార్పెంటర్ పనితో పాటు సాంకేతిక అంశాలపైనా తనకు పట్టుంది. దీంతో వడ్రంగి పనికి సాంకేతిక జోడించి కొత్తకొత్త డిజైన్లు చేస్తుండేవాడు. ఒకరోజు టీవీలో లంబోర్గిని కారును చూసి, అది కావాలని అడిగాడు అతని కొడుకు. 65 రోజుల శ్రమ కుమారుడు అడగటమే ఆలస్యం రంగంలోకి దిగిపోయాడు ట్రూంగ్ వాన్ డోవ్. వెంటనే కారు తయారీకి అవసరమైన వస్తువులు తెచ్చేశాడు. మొదటగా కారు బేస్‌ను సిద్ధం చేశారు. ఆ తర్వాత చక్రాలు తిరిగేందుకు అనువుగా కారు బాడీని రెడీ చేశాడు. ఆ తర్వాత అచ్చం లంబోర్గిని సియాన్ రోస్టర్ తరహాలో ముందు, వెనుక భాగంలో డిజైన్ సిద్ధం చేశాడు. కారు కదిలేందుకు వీలుగా బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్లు అమర్చాడు. దీంతో ఈ బుల్లి లంబోర్గిని కారు గంటలకు 25 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదని ట్రూంగ్ చెబుతున్నాడు. ఫిదా కారు తయారీకి సంబంధించిన వీడియోతో పాటు కారులో ట్రూంగ్ అతని కొడుకు వియత్నాం విధుల్లో చక్కర్లు కొట్టిన వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు ట్రూంగ్. కొడుకుపై అతని ప్రేమకు, కొడుకు ముచ్చట తీర్చేందుకు అతడు పడ్డ శ్రమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
ఆటోమొబైల్ రంగానికి టయోటా బంపర్ ఆఫర్..
ముంబై: దేశీయ ఆటోమొబైల్ రంగానికి వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ శుభవార్త తెలపింది. జపాన్‌కు చెందిన టయోటా త్వరలోనే భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. అత్యాధునిక సాంకేతికతతో టయోటా కార్లను నిర్మించనున్నామని, రూ.2000 కోట్లపైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొంది. అయితే దేశంలో ఆటోమొబైల్ రంగానికి అధిక పన్నుల వల్ల టయోటా సంస్థ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. పెట్టుబడుల అంశంపై టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎండీ మసకాజు యోషిమురా స్పందిస్తూ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు టయోటా సంస్థ ఎప్పుడు సిద్ధమేనని, భారత జాతీయ లక్ష్యాలను టయోటో గౌరవిస్తుందని, ఆటోమొబైల్ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తామని యోషిమురా పేర్కొన్నారు. మరోవైపు టయోటా వ్యూహాలపై వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ స్పందిసూ చిన్న కార్లలో కూడా త్వరలో అత్యాధునిక సాంకేతికత ప్రవేశపెట్టనున్నామని, 2025 సంవత్సరం వరకు హైబ్రిడ్ టెక్నాలజీ అభివృద్ధి చెందవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా దేశంలో రానున్న పెట్టుబడులలో ప్రపంచ వ్యాప్త సాంకేతికతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. కాగా ఇటీవల సెల్ఫ్ చార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్ వెల్‌ఫైర్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. హైదరాబాద్ వేదికగా ఈ లగ్జరీ మల్టీ పర్పస్ వాహనాన్ని కంపెనీ విడుదల చేసిన విషయం తెలిసిందే. -
టయోటా హైబ్రిడ్ కార్ల రీకాల్
టోక్యో: జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ టయోటా మరోసారి భారీగా హైబ్రిడ్ కార్లను రీకాల్ చేయనుంది. సాంకేతిక లోపాలకారణంగా సుమారు 24 లక్షల కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించింది. సాంకేతిక సమస్యల కారణంగా కార్లలో మంటలంటుకునే అవకాశం ఉందంటూ గత నెలలో ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల టయోటా హైబ్రిడ్ కార్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. -
ఇక పెట్రోల్ , డీజిల్ కార్లు బంద్
హెల్సింకి: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘వోల్వో’ 2019 నుంచి కేవలం ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లనే తయారు చేయనుంది. ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి ప్రధానమైన వాహన కంపెనీగా వోల్వో చరిత్రలో నిలిచిందని, కంపెనీ ప్రస్థానంలో తాజా చర్య చాలా కీలకమైనదని వోల్వో సీఈవో హకాన్ శామ్యూల్సన్ తెలిపారు. ఎలక్ట్రిక్ కార్ల విభాగానికి మారడం వల్ల కంపెనీ బ్రాండ్ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. 2025 నాటికి 10 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కస్టమర్ల నుంచి తమకు ఎలక్ట్రిక్ కార్లకు అధిక డిమాండ్ వస్తోందన్నారు. వినియోగదారుల అవసరాలకు స్పందించాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుత టెక్నాలజీతో ఒకసారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణించే కార్లను రూపొందిస్తున్నామని, అయితే ఇందుకు నాణ్యమైన బ్యాటరీలను సరఫరా చేసే సప్లయర్స్ చాలా అవసరమని, వారి కోసం వెతుకుతున్నామని వివరించారు. కాగా స్వీడన్‌కు చెందిన ఈ కంపెనీ 1927 నుంచి కార్లను తయారు చేస్తూ వస్తోంది.