
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఆధునిక ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఈ తరుణంలో చైనాకు చెందిన బీవైడీ కంపెనీ సింగిల్ చార్జితో ఏకంగా 2000 కిమీ కంటే ఎక్కువ ప్రయాణించే హైబ్రిడ్ కారును ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
బీవైడీ కంపెనీ ఆవిష్కరించిన కొత్త హైబ్రిడ్ కారును ఒక ఫుల్ ఛార్జ్ చేసి.. ఫుల్ ట్యాంక్ ఇంధనం నింపిన తరువాత, ప్రయాణం ప్రారంభిస్తే.. 2000 కిమీ ప్రయాణించే వరకు మళ్ళీ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యూయల్ ట్యాంక్‌లో ఇంధనం నింపాల్సిన అవసరం కూడా లేదు.
కంపెనీ ఆవిష్కరించిన కారు పేరు తెలియాల్సి ఉంది. అయితే దీని ధర 100000 యువాన్లు (13800 అమెరికన్ డాలర్లు) వరకు ఉంటుందని సమాచారం. లాంచ్ సమయంలో కంపెనీ అధికారిక ధరలను వెల్లడిస్తుంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ హైబ్రిడ్ కారుకు సంబంధించిన ఫీచర్స్ మాత్రమే కాకుండా.. లాంచ్ డేట్ వంటి వివరాలు కూడా అధికారికంగా త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము.
Comments
Please login to add a commentAdd a comment