టయోటా లాంచ్ చేసిన మరో ఫెస్టివ్ ఎడిషన్ ఇదే.. | Toyota Rumion Festive Edition SUV launched in India And Full Details | Sakshi
Sakshi News home page

టయోటా లాంచ్ చేసిన మరో ఫెస్టివ్ ఎడిషన్ ఇదే..

Published Tue, Oct 22 2024 9:21 PM | Last Updated on Tue, Oct 22 2024 9:24 PM

Toyota Rumion Festive Edition SUV launched in India And Full Details

టయోటా కంపెనీ గ్లాన్జా, టైసర్, హైరైడర్ ఫెస్టివల్ ఎడిషన్‌లను లాంచ్ చేసింది. ఇప్పుడు తాజాగా రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ కారు కొనుగోవులు చేసేవారు ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండానే రూ. 20608 విలువైన యాక్సెసరీలను పొందవచ్చు.

టయోటా రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్ మడ్ ఫ్లాప్‌లు, మ్యాట్‌లు, క్రోమ్ డోర్ వైజర్, స్పాయిలర్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా టెయిల్‌గేట్, రియర్ బంపర్, హెడ్‌ల్యాంప్, నంబర్ ప్లేట్, బాడీ మౌల్డింగ్‌లకు గార్నిష్‌లు ఉన్నాయి. ఈ కొత్త యాక్ససరీస్ వల్ల కారు మరింత అద్భుతంగా కనిపిస్తుంది.

టయోటా రూమియన్ దాని మునుపటి మోడల్‌లోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 102 Bhp పవర్, 138 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ అప్షన్స్ పొందుతుంది. ఈ ఫెస్టివల్ ఎడిషన్ ఎస్, జీ, వీ ట్రిమ్‌లలో మాత్రమే కాకుండా CNG రూపంలో కూడా అందుబాటులో ఉంది.

ఇదీ చదవండి: టయోటా టైజర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌.. మంచి ఆఫర్‌తో..

మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టయోటా రూమియన్ ప్రధానంగా మారుతి సుజుకి ఎర్టిగా, కియా కారెన్స్, హ్యుందాయ్ అల్కాజార్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఇది ఫెస్టివ్ ఎడిషన్ కాబట్టి మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఈ కారు ఎప్పటి వరకు మార్కెట్లో విక్రయానికి ఉంటుందనేది తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement