festive
-
పండుగలో 42,88,248 వాహనాలు కొనేశారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పండుగల సీజన్లో వాహనాల అమ్మకాలు జోరుగా సాగాయి. ఈ ఏడాది 42 రోజులపాటు సాగిన ఫెస్టివ్ పీరియడ్‌లో అన్ని విభాగాల్లో కలిపి ఏకంగా 11.76 శాతం వృద్ధితో 42,88,248 యూనిట్లు రోడ్డెక్కాయి. గతేడాది పండుగల సీజన్లో కస్టమర్లకు చేరిన వాహనాల సంఖ్య 38,37,040 యూనిట్లు.ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) ప్రకారం.. ఒడిశాలో తుఫాను, దక్షిణాదిన అకాల వర్షాలతో పరిశ్రమ అంచనాలను చేరుకోలేకపోయింది. అన్నీ అనుకూలిస్తే పండుగల సీజన్లో పరిశ్రమ 45 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటుందని భావించింది. కాగా, ఈ ఏడాది పండుగల సీజన్లో ప్యాసింజర్ వాహనాల రిటైల్ విక్రయాలు 7 శాతం పెరిగి 6,03,009 యూనిట్లు నమోదయ్యాయి. బలమైన గ్రామీణ డిమాండ్ నేపథ్యంలో టూవీలర్స్ అమ్మకాలు 14 శాతం దూసుకెళ్లి 33,11,325 యూనిట్లను తాకాయి.వాణిజ్య వాహనాల రిటైల్ సేల్స్ 1 శాతం పెరిగి 1,28,738 యూనిట్లు, త్రిచక్ర వాహనాలు 7 శాతం అధికమై 1,59,960 యూనిట్లకు ఎగశాయి. ట్రాక్టర్ల విక్రయాలు 2 శాతం క్షీణించి 85,216 యూనిట్లకు పడిపోయాయి’ అని ఫెడరేషన్ వివరించింది. క్యాలెండర్ సంవత్సరం ముగియడానికి ఇంకా ఒకటిన్నర నెలలు మిగిలి ఉన్నందున 2024 స్టాక్‌ను విక్రయించడంపై దృష్టి పెట్టాలని తయారీ సంస్థలను ఎఫ్ఏడీఏ కోరింది. -
టయోటా లాంచ్ చేసిన మరో ఫెస్టివ్ ఎడిషన్ ఇదే..
టయోటా కంపెనీ గ్లాన్జా, టైసర్, హైరైడర్ ఫెస్టివల్ ఎడిషన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు తాజాగా రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ కారు కొనుగోవులు చేసేవారు ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండానే రూ. 20608 విలువైన యాక్సెసరీలను పొందవచ్చు.టయోటా రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్ మడ్ ఫ్లాప్‌లు, మ్యాట్లు, క్రోమ్ డోర్ వైజర్, స్పాయిలర్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా టెయిల్‌గేట్, రియర్ బంపర్, హెడ్‌ల్యాంప్, నంబర్ ప్లేట్, బాడీ మౌల్డింగ్లకు గార్నిష్‌లు ఉన్నాయి. ఈ కొత్త యాక్ససరీస్ వల్ల కారు మరింత అద్భుతంగా కనిపిస్తుంది.టయోటా రూమియన్ దాని మునుపటి మోడల్లోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 102 Bhp పవర్, 138 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అప్షన్స్ పొందుతుంది. ఈ ఫెస్టివల్ ఎడిషన్ ఎస్, జీ, వీ ట్రిమ్‌లలో మాత్రమే కాకుండా CNG రూపంలో కూడా అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: టయోటా టైజర్ లిమిటెడ్ ఎడిషన్.. మంచి ఆఫర్‌తో..మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టయోటా రూమియన్ ప్రధానంగా మారుతి సుజుకి ఎర్టిగా, కియా కారెన్స్, హ్యుందాయ్ అల్కాజార్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఇది ఫెస్టివ్ ఎడిషన్ కాబట్టి మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఈ కారు ఎప్పటి వరకు మార్కెట్లో విక్రయానికి ఉంటుందనేది తెలియాల్సి ఉంది. -
పండగ వేళ: ఫ్యాషన్ అండ్ బ్యూటీ క్వీన్‌లా మెరవాలంటే..!
పండుగ సీజన్ ఫుల్ స్వింగ్‌లోకి వచ్చేసింది. వినాయక చవితి తరువాత వరుసగా వచ్చే పండుగల సందడి మామూలుగా ఉండదు. ఇంటిని అందంగా అలంకరించుకోవడం, పిండి వంటలు మాత్రమే కాదు, పండుగకు అందంగా తయారు కావడం, స్పెషల్ ముస్తాబుతో మురిసిపోవడం చాలా సాధారణం. అందుకే ఫెస్టివల్ లుక్‌లో ఎలా మెరిసి పోవాలో చూద్దాం.శరీరాన్ని తేమగా ఉంచుకోవాలి. చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటేనే మెరుస్తూ ఉంటుంది. ఇందుకోసం తగినన్ని నీళ్లు తాగాలి. అలాగే ఫ్యాటీఫుడ్స్కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన ఆహారం, ఆకుకూరలు, పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉపవాసాల సమయంలో తేలికపాటి ఆహారం తీసుకోవాలి. పల్చటి మజ్జిగ, పండ్ల రసాలు మెనూలో చేర్చుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. రోజూ వాకింగ్, యోగా లాంటి వ్యాయామం చేస్తే ఫేస్‌లో చక్కటి గ్లో వస్తుంది. అలాగే ముఖానికి ఇంట్లోనే తయారు చేసుకునేలా ఫేస్ ప్యాక్, జుట్టు అందం కోసం ప్యాక్‌లు వేసుకోవడం మర్చిపోవద్దు. ఫేస్ ప్యాక్బంగాళాదుంపను మిక్సిలో వేసి రసం తీసి పక్కన పెట్టుకోండి. ఇందులో కొద్దిగా శనగపిండి, నాలుగు చుక్కల బాదం నూనె, కొద్దిగా తేనె వేసి బాగా కలపండి. ముఖాన్ని ముందుగా శుభ్రం చేసుకున్న తరువాత దీన్ని అప్లయ్ చేసి, పూర్తిగా ఆరడానికి 10-15 నిమిషాలు ఆగి చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ఆ తరువాత సబ్బు, ఫేస్ వాష్ లాంటివి వాడకండి. మీ ఫేస్‌లోని మెరుపు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ మిశ్రమాన్ని శుభ్రపర్చిన గాజు సీసాలో దాచుకోవచ్చు. చర్మం ముడతలు లేకుండా,కాంతిమంతంగా ఉండాలంటే..: టేబుల్ స్పూన్ మినప్పప్పు, 6 బాదాంపప్పులు కలిపి నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ రెండింటినీ మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి, మృదువుగా రుద్దాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది.∙టేబుల్ స్పూన్ చొప్పున ఆరెంజ్ జ్యూస్, నిమ్మరసం తీసుకొని కప్పు పెరుగులో కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి, ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి.జుట్టుకు బలమైన చూర్ణంఅరకప్పు డ్రైఫ్రూట్స్... బాదం, పల్లీలు, పొద్దుతిరుగుడు గింజలు, వాల్నట్స్; అరకప్పు ఓట్స్, పచ్చి శనగపప్పు, పెసరపప్పు కలిపి అరకప్పు, సబ్జా గింజలు అరకప్పు, అవిసె గింజలు అరకప్పు చొప్పున తీసుకుని దోరగా వేయించి చూర్ణం చేసుకుని డబ్బాలో నిల్వ చేయాలి. ఈ పొడిని టేబుల్ స్పూన్ తీసుకుని టీ లేదా స్మూతీలో వేసుకుని తాగాలి. టీ అలవాటు లేని వాళ్లు వేడినీళ్లలో కలుపుకొని రోజూ ఉదయాన్నే తాగితే రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ పొడి జుట్టు సంరక్షణకే గాక ఆరోగ్యాన్నీ మెరుగు పరుస్తుంది.ఫ్యాషన్ అండ్ మ్యాజిక్మంచి కలర్‌ఫుల్ డ్రెస్‌లను ఎంచుకోండి. పండుగ సీజన్లో ప్యాషన్ ,లేదా సంప్రదాయ దుస్తులు ఏదైనా సరే మన శరీరానికి నప్పేలా ఉండాలి. డ్రెస్‌కు సరిపడా సింపుల్, లేదా హెవీ జ్యుయలరీ ఉంటే అద్భుతమైన ఫెస్టివ్ లుక్ మీసొంతం అవుతుంది. -
నిత్య పూజలు అందుకుంటున్న కేతకీ పార్వతీ పరమేశ్వరులు
సంగారెడ్డి: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం అంకురార్పణ, ధ్వజారోహణం, శిఖర పూజా కార్యక్రమాలతో జాతర ప్రారంభమైంది. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు నిత్య పూజలతో పాటు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి మహా నైవేద్యం సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శశిధర్, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు రుద్రప్ప పాటిల్, నాయకులు సంతోష్ కుమార్ పాటిల్, రుద్రయ్య స్వామి, గాలప్ప పాటిల్, నరేందర్ రెడ్డి, దత్తు పాల్గొన్నారు. ఇవి చదవండి: ఆకాశం నుంచి పడిన మంత్రపు పెట్టె.. రూ.50కోట్లంటూ.. -
అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన: డల్లాస్‌లో పండుగ వాతావరణం!
అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నూతనంగా నిర్మించిన రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా అమెరికాలో పండుగ వాతవరణం నెలకొంది. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ వేళ డల్లాస్‌లోని ఇస్కాన్ ఆలయంలో వేడుకలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలను నిర్వహించారు. ప్రవాసులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రాధా కళాచంద్ జీ ఆలయం రామ నామ జపంతో మార్మోగింది. ఇక భారతీయ సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రామ భజనలు, కీర్తనలతో ప్రవాసులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక ఆలయంలో నెయ్యి దీపాలు వెలిగించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు భక్తి శ్రద్ధలతో దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. డల్లాస్ ఇస్కాన్ టెంపులలో దీపావళిని తలపించే విధంగా దీపోత్సవాల సంబరం అంబరాన్ని తాకింది. (చదవండి: ఆఫ్రికాలో ఉద్యోగం.. ఎక్కడున్నా పండగకు ఇంటికొస్తే ఆ ఆనందమే వేరు) -
పండుగ సీజన్లో అమెజాన్ జోష్.. 13 ఏళ్లలో ఇదే బెస్ట్!
కోల్‌కత: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా పండుగల సీజన్‌తో జోష్ మీద ఉంది. దేశంలో తన 13 సంవత్సరాల కార్యకలాపాలలో ప్రస్తుత సీజన్ అత్యుత్తమంగా ఉందని కంపెనీ వెల్లడించింది. ప్రతి విభాగంలోనూ ఇదే అత్యుత్తమ సంవత్సరమని అమెజాన్ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, పర్సనల్ కంప్యూటింగ్, లార్జ్ అప్లయాన్సెస్ డైరెక్టర్ నిశాంత్ సర్దానా తెలిపారు. ‘కోవిడ్ తర్వాత గ్రామీణ ప్రాంతాలు మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే డిమాండ్‌లో పునరుద్ధరణను సూచించే గ్రామీణ కొనుగోళ్లలో అమెజాన్ ఎలాంటి మందగమనాన్ని చూడలేదు. 80 శాతం ఆర్డర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి, నాల్గవ తరగతి మార్కెట్ల నుంచి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు బలమైన వృద్ధిని కనబరిచాయి. పండుగల సీజన్ కోసం దేశవ్యాప్తంగా 1,00,000 పైచిలుకు తాత్కాలిక ఉద్యోగావకాశాలు కల్పించాం’ అని వివరించారు. ప్రస్తుత పండుగల సీజన్లో ఈ–కామర్స్ కంపెనీల వ్యాపారం 18–20 శాతం వృద్ధితో రూ.90,000 కోట్లు నమోదు చేయవచ్చని రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ అంచనా వేస్తోంది. -
ఆన్లైన్ + ఆఫ్‌లైన్ పండుగలకు ‘హైబ్రిడ్ షాపింగ్’
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత పండుగల సీజన్లో... ‘హైబ్రిడ్ షాపింగ్’నకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ‘రాఖీ బంధన్’తో మొదలై వచ్చే ఏడాది ప్రథమార్థం దాకా ఈ ఫెస్టివల్ సీజన్ సుదీర్ఘంగా సాగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదలైన ఈ సీజన్లో హైబ్రిడ్ షాపింగ్నకే అధికశాతం మొగ్గుచూపుతున్నట్టు వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత వినియోగదారులు మరీ ముఖ్యంగా నవ, యువతరం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు డిజిటల్ టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో...ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ షాపింగ్‌కు కస్టమర్లు సిద్ధమవుతున్నారు. కోవిడ్ తెచ్చి న మార్పుచేర్పులతో... షాపింగ్, ఇతర విషయాల్లో కొత్త కొత్త విధానాలు, పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. గతేడాదితో పోల్చితే ఈసారి 84 శాతం వినియోగదారులు తమ షాపింగ్ బడ్జెట్‌ను గణనీయంగా పెంచినట్టు అడ్వర్టయిజ్మెంట్ యూనికార్న్ సంస్థ ‘ఇన్మోబీ’తాజా నివేదికలో వెల్లడైంది. నివేదికలో ఏముందంటే... చేతిలో ఇమిడిపోయే మొబైల్ ఫోన్లతోనే షాపింగ్ చేయడం, సంస్థల సైట్లను ఆన్లైన్లోనే వీక్షించి, సమీక్షించుకునే సౌలభ్యం ఉన్నందున పలువురు ఆన్లైన్ కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఐతే...ఆన్‌లైన్‌తో పాటు స్వయంగా షాప్‌లకు వెళ్లి వివిధరకాల వస్తువులు, ఇతరత్రా సామగ్రి కొనేందుకు ఇష్టపడుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉన్నట్టుగా... అ రెండింటిని సమ్మిళితం చేసి హైబ్రిడ్ షాపింగ్ చేసే వారు 54 శాతం ఉన్నట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొబైల్ఫోన్లను వినియోగించే వారి నుంచి వివిధ అంశాల వారీగా ఈ సంస్థ సమాచారాన్ని సేకరించింది. ఆఫర్ల సమాచారం ఎలా తెలుసుకుంటున్నారు? మొబైల్లో సెర్చింగ్, ప్రకటనల ద్వారా.. 46% బ్రాండ్ వెబ్సైట్లు/ వివిధ యాప్‌ల ద్వారా.. 15% ప్రత్యక్షంగా షాపులకు వెళ్లి తెలుసుకునేవారు.. 11% కుటుంబం, స్నేహితుల ద్వారా.. 7% టీవీ ప్రకటనలు, ఇతర రూపాల్లో.. 7% వార్తాపత్రికలు, మ్యాగజైన్ల ద్వారా.. 6% ఈమెయిళ్లు, బ్రాండ్ల నుంచి న్యూస్లెటర్లతో.. 4% వాట్సాప్‌లో బ్రాండ్ల ద్వారా వచ్చే సమాచారంతో.. 3% తదనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలు... ‘తమ స్మార్ట్ఫోన్ల ద్వారానే షాపింగ్ చేయాలని 78 శాతం మంది భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా వివిధ కంపెనీలు, సంస్థలు కూడా తమ మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ప్రస్తుత పండుగల సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు, వారు కోరుకున్న విధంగా ఆయా వస్తువులను అందించేందుకు, వారితో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాము’ - వసుత అగర్వాల్,చీఫ్ బిజినెస్ ఆఫీసర్, కన్జ్యూమర్ అడ్వర్టయిజింగ్ ప్లాట్‌ఫామ్, ఇన్మోబీ -
అక్కడ పితృదేవత పండుగకి..పెద్ద పొడవాటి పడవలతో..
లావోస్‌లో ఏటా జరుపుకొనే ‘హా ఖావో పడప్ దిన్’ పండుగలో నదుల్లోను, కొలనుల్లోను పడవల జాతర జరుపుతారు. లావోస్ సంప్రదాయ కేలండర్ ప్రకారం సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఈ పండుగ వస్తుంది. ఈసారి ఆగస్టు 18న జరిగిన ఈ పండుగలో వేలాది మంది పడవల జాతరలో పాల్గొన్నారు. పొడవాటి పడవల్లోకి చేరి, తెడ్లు వేస్తూ పోటా పోటీగా రేసులు నిర్వహించారు. ‘హా ఖావో పడప్ దిన్’ లావోస్ ప్రజల పితృదేవత పండుగ. ఈ పండుగ రోజున ఆలయాల్లోను, ఇళ్లలోను ప్రార్థనలు జరిపి, పితృదేవతలకు సంప్రదాయక వంటకాలను నైవేద్యంగా సమర్పించుకుంటారు. బంధుమిత్రులతో విందు వినోదాలు జరుపుకొంటారు. కొబ్బరిపాలతో బియ్యం ఉడికించి, దానిని అరిటాకుల్లో పొట్లాలుగా చుట్టి పెద్దలకు నైవేద్యం పెడతారు. ఈ వంటకాన్ని ‘ఖావో టోమ్’ అంటారు. తర్వాత ఈ వంటకం పొట్లాలను ఇంటి నలుమూలలా పెట్టి ఉంచుతారు. ఇలా చేస్తే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవని వారి విశ్వాసం. (చదవండి: ఏడాదికి ఒక్కరోజే ఆ గ్రామంలోకి ఎంట్రీ! ఎందుకంటే..) -
సంబరం శుభారంభం
అమ్మ పండగ ఆరంభమైంది. తొలేళ్లతో ఉత్సవానికి శంఖారావం పూరించినట్టయింది. సోమవారం వేకువఝాము నుంచే వివిధ వేషధారణలు... డప్పులు... ఘటాలు... మొక్కుబడులతో వచ్చిన భక్తజనంతో అమ్మవారి ఆలయం పోటెత్తింది. పూసపాటి వంశీయుల నుంచి సంప్రదాయ బద్ధంగా పట్టువస్త్రాలు వచ్చాయి. ప్రతి ఒక్కరికీ దర్శనం నిరాటంకంగా సాగేలా... ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా... చేపట్టిన ముందస్తు ఏర్పాట్లు సత్ఫలితాన్నిస్తున్నాయి. ఇక మంగళవారం జరిగే సిరిమానోత్సవానికి యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. సాక్షి, విజయనగరం టౌన్: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన తొలేళ్ల ఉత్సవం సోమవారం అంగరంగవైభవంగా జరిగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అమ్మ వారి జాతర మహోత్సవాలు ఈ ఏడాది నుంచి రాష్ట్ర పండగగా గుర్తింపునివ్వడం కొత్త ఉత్సాహం నెలకొంది. అమ్మ జాతర ను తొలేళ్ల ఉత్సవంతో శ్రీకారం చుట్టారు. వేకువఝాము నుంచే అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజాదికాలు నిర్వహించారు. పూసపాటి వంశీయులైన అశోక్ గజపతిరా జు కుమార్తె అదితి గజపతిరాజు అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించారు. వేదపండితులు వేదమంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తంగా ఆలయ సం ప్రదాయం ప్రకారం పూజలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజలందరిపైనా ఉండాలన్నారు. తన తండ్రి అశోక్ గజపతిరాజు ప్రస్తుతం ఐసీయులో ఉన్నారని, మరికొద్దిరోజుల్లో కోలుకుంటారన్నారు. అనంతరం దివంగత ఆనందగజపతిరాజు సతీమణి సుధాగజపతి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఘటాలతో నివేదన అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం నగరంలోని పలువురు భక్తులు వివిధ వేషధారణలతో... డప్పు ల మోతలతో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకున్నా రు. మహిళలు, పురుషులు సైతం అమ్మవారికి ప్రీతిపాత్రమైన.. ఆమె ప్రతిరూపమైన ఘటాలను నెత్తిన పెట్టుకుని అమ్మవారికి నివేదించి తరించారు. తొలేళ్ల ఉత్సవం రోజున ఉదయం నుంచి రాత్రి వరకూ సు మారు 20వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉచిత సేవలు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం పలు స్వచ్చంద సంస్థలు, మంచినీరు, మజ్జిగ ఉచితంగా అందించారు. మరికొందరు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఎన్సీసీ, రెడ్‌క్రాస్, క్యాడెట్లు, పోలీస్ సేవాదళ్‌తో పాటు పలు సంస్ధలకు చెందిన ప్రతినిధులు భక్తులకు సేవలందించారు. పండగ నేపథ్యంలో నగరానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకోగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ బి.రాజకుమారి సారధ్యంలో పోలీస్ యంత్రాంగం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. ఎస్పీ సోమవారం ఆలయ పరిసరాలను సందర్శించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు. సంప్రదాయబద్దంగా ఉత్సవం సోమవారం రాత్రి అమ్మవారి చదురుగుడి నుంచి ఘటాలతో నడుచుకుంటూ పూజారి వెంకటరావుతో పాటు పలువురు పెద్దలు, దీక్షాపరులు కోటలో ఉన్న కోటశక్తికి పూజలు చేశారు. ఆరు ఘటాలను కోట వద్ద నుంచి తిరిగి చదురుగుడికి తీసుకెళ్లి అమ్మవారి చదురువద్ద పెట్టారు. సిరిమానుపూజారి వెంకటరావు అమ్మవారి కథను భక్తులకు వినిపించారు. అనంతరం రైతులకు విత్తనాలను అందజేసి, ఆశీర్వచనాలను అందజేశారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. -
కెల్వినేటర్ ఫెస్టివ్ బొనంజా కన్సూమర్ ఆఫర్
హైదరాబాద్: ప్రముఖ హోమ్ అప్లయెన్సెస్ బ్రాండ్ కెల్వినేటర్ పండగ సీజన్ సందర్భంగా ఫెస్టివ్ బొనంజా ఆఫర్‌ను అందిస్తోంది. ఈ నెల 31వరకూ ఉండే ఈ ఆఫర్లో భాగంగా కెల్వినేటర్ ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారికి ఆకర్షణీయమైన బహుమతులనిస్తున్నామని కెల్వినేటర్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ ధరల రేంజ్‌ల్లో ఫ్రిజ్‌లు, వాషింగ్మెషీన్లు అందిస్తున్నామని కెల్వినేటర్ మార్కెటింగ్ హెడ్ హరీశ్ మరాతే పేర్కొన్నారు. ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు. గత ఏడాది ఈ తరహా ఆఫర్‌తోనే పండుగ సీజన్లో అమ్మకాల్లో 40 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు. 190 లీటర్లకు మించిన ఫ్రిజ్‌ల కొనుగోళ్లపై రూ.1,900 విలువైన ఫ్లోర్ మాప్‌ను, సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ల కొనుగోళ్లపై రూ.1,399 విలువైన స్టీమ్ ఐరన్‌ను అందిస్తున్నామని వివరించారు. -
కళకళలాడుతున్న జెమ్స్ అండ్ జ్యుయలరీ షేర్లు
ముంబై: రానున్న దసరా, దీపావళి పండుగల సందర్భంగా మార్కెట్ లో బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలకు చెందిన షేర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. మదుపర్ల కొనుగోళ్లతో ఈ పలు కంపెనీల షేర్లు ధగధగ లాడుతున్నాయి. పండుగ ఉత్సాహంతో నెలకొన్న బైయింగ్ సపోర్ట్ తో దాదాపు అన్ని జెమ్స్ అండ్ జ్యుయలరీ స్టాక్స్ మెరుపులు మెరిపిస్తున్నాయి. ముఖ్యంగా గోల్డియం ఇంటర్నేషన్ లిమిటెడ్ 15శాతం, తారా జ్యుయలరీ 9శాతం, గీతాంజలి జెమ్స్ 11 శాతం, పీసీ జ్యుయలరీ 6 శాతం, త్రిభువన్ దాస్ భీమ్ జీ జవేరీ లిమిటెడ్ 5 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. అలాగే టైటాన్ కో లిమిటెడ్ , రాజేష్ లిమిటెడ్ కూడా లాభాలను ఆర్జిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలతో స్పెక్యులేటర్లు కొనుగోళ్లవైపు మొగ్గు చూపుతున్నారని ఎనలిస్టుల అంచనా. అటు బులియన్ మార్కెట్లో గత కొన్ని సెషన్లు గా నీరసంగా ఉన్న పసిడి ధరలు కూడా పుంజుకున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో ఉదయం నుంచీ జోరుమీదున్న పుత్తడి200 రూపాయల లాభంతో 29,780 వద్ద ఉంది. ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రా. బంగారం ధరలు Gold 193రూపాయలు ఎగిసి రూ. 29,850 వద్ద ఉంది. ఇది ఇలా ఉండగా స్టాక్ మార్కెట్లు స్వల్పలాభనష్టాల మధ్య ఊగిసలాడుతో స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి.