అక్కడ పితృదేవత పండుగకి..పెద్ద పొడవాటి పడవలతో.. | Haw Khao Padap Din Is An Annual Festival In Laos | Sakshi
Sakshi News home page

అక్కడ పితృదేవత పండుగకి..పెద్ద పొడవాటి పడవలతో..

Published Mon, Aug 28 2023 6:45 AM | Last Updated on Mon, Aug 28 2023 11:49 AM

Haw Khao Padap Din Is An Annual Festival In Laos - Sakshi

లావోస్‌లో ఏటా జరుపుకొనే ‘హా ఖావో పడప్‌ దిన్‌’ పండుగలో నదుల్లోను, కొలనుల్లోను పడవల జాతర జరుపుతారు. లావోస్‌ సంప్రదాయ కేలండర్‌ ప్రకారం సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నెలలో ఈ పండుగ వస్తుంది. ఈసారి ఆగస్టు 18న జరిగిన ఈ పండుగలో వేలాది మంది పడవల జాతరలో పాల్గొన్నారు. పొడవాటి పడవల్లోకి చేరి, తెడ్లు వేస్తూ పోటా పోటీగా రేసులు నిర్వహించారు.

‘హా ఖావో పడప్‌ దిన్‌’ లావోస్‌ ప్రజల పితృదేవత పండుగ. ఈ పండుగ రోజున ఆలయాల్లోను, ఇళ్లలోను ప్రార్థనలు జరిపి, పితృదేవతలకు సంప్రదాయక వంటకాలను నైవేద్యంగా సమర్పించుకుంటారు. బంధుమిత్రులతో విందు వినోదాలు జరుపుకొంటారు. కొబ్బరిపాలతో బియ్యం ఉడికించి, దానిని అరిటాకుల్లో పొట్లాలుగా చుట్టి పెద్దలకు నైవేద్యం పెడతారు. ఈ వంటకాన్ని ‘ఖావో టోమ్‌’ అంటారు. తర్వాత ఈ వంటకం పొట్లాలను ఇంటి నలుమూలలా పెట్టి ఉంచుతారు. ఇలా చేస్తే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవని వారి విశ్వాసం. 

(చదవండి: ఏడాదికి ఒక్కరోజే ఆ గ్రామంలోకి ఎంట్రీ! ఎందుకంటే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement