ప్రముఖ వాహన తయారీ సంస్థ 'మసెరటి'.. భారతీయ మార్కెట్లో సెకండ్ జనరేషన్ 'గ్రాన్‌టూరిస్మో' (GranTurismo) లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధరలు రూ. 2.72 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది మోడెనా, ట్రోఫియో అనే రెండు ట్రిమ్‌లలో లభిస్తుంది.
రెండు డోర్స్, నాలుగు సీట్లు కలిగిన ఈ కారు 3.0 లీటర్ వీ6 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 490 హార్స్ పవర్, 600 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 3.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది.
మసెరటి గ్రాన్‌టూరిస్మో 12.2 ఇంచెస్ డిజిటల్ డయల్ డిస్‌ప్లే, 12.3 ఇంచెస్ సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉన్నాయి. దానికి కింద భాగంలో క్లైమేట్ కంట్రోల్స్ కోసం 8.8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ కూడా ఉంటుంది. డిజిటల్ క్లాక్, ఆప్షనల్ హెడ్ అప్ డిస్ప్లే, సోనస్ ఫాబ్రే ఆడియో సిస్టమ్ మొదలైనవి కూడా ఇందులో చూడవచ్చు.
20 ఇంచెస్ ఫ్రంట్ వీల్, వెనుకవైపు 21 ఇంచెస్ వీల్స్ పొందిన మసెరటి గ్రాన్‌టూరిస్మో ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న బీఎండబ్ల్యూ ఎం8 కాంపిటీషన్, ఫెరారీ రోమా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment