Maserati
-
భారత్‌లో మరో మసెరటి కారు లాంచ్: ధర ఎంతో తెలుసా?
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'మసెరటి'.. భారతీయ మార్కెట్లో సెకండ్ జనరేషన్ 'గ్రాన్టూరిస్మో' (GranTurismo) లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధరలు రూ. 2.72 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది మోడెనా, ట్రోఫియో అనే రెండు ట్రిమ్‌లలో లభిస్తుంది.రెండు డోర్స్, నాలుగు సీట్లు కలిగిన ఈ కారు 3.0 లీటర్ వీ6 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 490 హార్స్ పవర్, 600 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 3.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది.మసెరటి గ్రాన్టూరిస్మో 12.2 ఇంచెస్ డిజిటల్ డయల్ డిస్ప్లే, 12.3 ఇంచెస్ సెంట్రల్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉన్నాయి. దానికి కింద భాగంలో క్లైమేట్ కంట్రోల్స్ కోసం 8.8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ కూడా ఉంటుంది. డిజిటల్ క్లాక్, ఆప్షనల్ హెడ్ అప్ డిస్ప్లే, సోనస్ ఫాబ్రే ఆడియో సిస్టమ్ మొదలైనవి కూడా ఇందులో చూడవచ్చు.20 ఇంచెస్ ఫ్రంట్ వీల్, వెనుకవైపు 21 ఇంచెస్ వీల్స్ పొందిన మసెరటి గ్రాన్టూరిస్మో ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న బీఎండబ్ల్యూ ఎం8 కాంపిటీషన్, ఫెరారీ రోమా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఇదో చెత్త కారు.. రూ. 4 కోట్ల మసెరటిపై గౌతమ్ సింఘానియా ట్వీట్
భారతీయ సంపన్నుల జాబితాలో ఒకరుగా ఉన్న రేమండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'గౌతమ్ సింఘానియా' (Gautam Singhania) గత కొన్ని రోజులకు ముందు రూ. 4 కోట్లు విలువైన 'మసెరటి ఎమ్సీ20' కూపే కొనుగోలు చేశారు. అయితే ఈ కారు మీద ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బహుశా నా జీవితంలో నేను నడిపిన చెత్త కారు మసెరటి ఎమ్సీ20. మసెరటి కారును కొనుగోలు చేసే ఎవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి అంటూ గౌతమ్ సింఘానియా ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. నిజానికి మనదేశంలో చాలా మంది ప్రముఖులు ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో మసెరటి బ్రాండ్ ఒకటి. ఇది 3.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 630 హార్స్ పవర్, 730 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 325 కిమీ. ఇదీ చదవండి: అకౌంట్లో డబ్బు లేకున్నా రూ. 80000 విత్‌డ్రా చేసుకోవచ్చు వేగంలో కూడా అద్భుతమైన పనితీరుని కనపరిచే ఈ కారుని ఎందుకు గౌతమ్ సింఘానియా ఇలా అన్నారు, బహుశా ఈయన వద్ద ఉన్న ఇతర కార్ల కంటే బహుశా ఇదే తక్కువ పనితీరుని కనపరించిందా, లేదా ఇంకేమైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఇతని వద్ద రూ. 6.37 కోట్ల విలువైన ఫెరారీ 296 జీటీబీ సూపర్‌కార్, లంబోర్ఘిని, పోర్స్చే, ఆస్టన్ మార్టిన్, రోల్స్ రాయిస్ వంటి హై ఎండ్ మోడల్ కార్లు ఎన్నో ఉన్నాయి. ఇదీ చదవండి: ఇలాంటి మోసాలు జరుగుతున్నాయ్! ఆదమరిస్తే అకౌంట్లో డబ్బు మాయం! The MC20 @Maserati_HQ has probably been the worst car i have driven in my life. Anybody buying a Maserati car should think twice.@aSuperCarDriver @ibvsupercarclub @fmsupercarclub@autovivendi @thedriversunion @prestigecarclub@freedomsupercar @mrchensta #SuperCarClubGarage… — Gautam Singhania (@SinghaniaGautam) August 15, 2023 -
గౌతమ్ సింఘానియా కొత్త కారు - ధర తెలిస్తే షాక్ అవుతారు!
భారతదేశంలోని సంపన్న వ్యక్తులలో ఒకరైన రేమండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'గౌతమ్ సింఘానియా' (Gautam Singhania) ఇటీవల ఖరీదైన స్పోర్ట్స్ కారుని కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మన దేశంలో అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న ప్రముఖుల జాబితాలో గౌతమ్ సింఘానియా ఒకరు. ఇప్పటికే ఈయన వద్ద రూ. 6.37 కోట్ల విలువైన ఫెరారీ 296 జీటీబీ సూపర్‌కార్, లంబోర్ఘిని, పోర్స్చే, ఆస్టన్ మార్టిన్, రోల్స్ రాయిస్ వంటి హై ఎండ్ మోడల్ కార్లు ఎన్నో ఉన్నాయి. కాగా ఇప్పుడు రూ. 4 కోట్ల విలువైన మసెరటి ఎమ్సీ20 కూపే సొంతం చేసుకున్నాడు. ఒక యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోలో గౌతమ్ సింఘానియా తన సరికొత్త మసెరటి ఎమ్సీ20 డ్రైవ్ చేస్తూ ముంబై వీధుల్లో కనిపించినట్లు తెలిసింది. దాని వెనుక టొయోటా ఫార్చ్యూనర్‌లో గార్డ్లు రావడం కూడా గమనించవచ్చు. మసెరటి ఎమ్సీ20.. మసెరటి ఎమ్సీ20 సూపర్ కారు 2020లో గ్లోబల్ అరంగేట్రం చేసింది. కాగా డెలివరీలు 2023 ప్రధమార్ధంలో మొదలయ్యాయి. సింఘానియా ఈ కారు డెలివరీని ముంబైలోని మసెరటి అధికారిక డీలర్షిప్ నుంచి పొందారు. ఇది 3.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 630 హార్స్ పవర్, 730 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. -
Maserati MC20: భారత్‌లో రూ. 3.69 కోట్ల సూపర్‌కార్ విడుదల - పూర్తి వివరాలు
భారతీయ మార్కెట్లో SUV, MPV వంటి కార్లకు మాత్రమే కాకుండా లగ్జరీ కార్లకు, సూపర్ కార్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బెంజ్, ఆడి, మసెరటి కంపెనీలు కొత్త ఉత్పత్తులను కూడా దేశీయ విఫణిలో విరివిగా విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మసెరటి ఇటీవల MC20 సూపర్‌కార్ లాంచ్ చేసింది. ధర: ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త 'మసెరటి ఎమ్‌సి20' సూపర్‌కార్ ధర అక్షరాలా రూ. 3.69 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). 2021 జులై నాటి నుంచి కంపెనీ ఈ ఆధునిక కారుని విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తూనే ఉంది. కాగా ఎట్టకేలకు ఇప్పుడు భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. డెలివరీలు 2023 మేలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. (ఇదీ చదవండి: జీవితాన్ని మార్చేసిన బొమ్మల వ్యాపారం: గార్డు నుంచి బిజినెస్ మ్యాన్‌గా..) డిజైన్: చాలా సంవత్సరాల తరువాత దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త సూపర్‌కార్ అద్భుతమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్షించే విధంగా ఉంది. ఇది దాని మునుపటి MC12 నుంచి ప్రేరణ పొందటం వల్ల ట్రెడిషినల్ స్పోర్ట్స్ కూపే సిల్హౌట్ పొందుతుంది. ఇందులోని ఫ్లోయింగ్ లైన్స్, ఏరోడైనమిక్ డిజైన్ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. డోర్ సీతాకోకచిలుక రెక్కల మాదిరిగా ఉంటాయి. ఇంటీరియర్ ఫీచర్స్: మసెరటి ఎమ్‌సి20 సూపర్‌కార్ లోపలి భాగంలో కార్బన్ ఫైబర్ అల్కాంటారాతో కప్పబడి ఉంటుంది. ఇందులో 10 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే, 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటాయి. అంతే కాకుండా వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ హోల్డర్, ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్, కార్బన్ ఫైబర్-కవర్డ్ సెంట్రల్ కన్సోల్‌లో డ్రైవ్ మోడ్ సెలెక్టర్ మొదలైనవి ఉన్నాయి. (ఇదీ చదవండి: ఎమ్ఆర్పి ధరల్లో జరిగే మోసాలకు ఇలా చెక్ పెట్టండి) ఇంజిన్ & పర్ఫామెన్స్: కొత్త మసెరటి ఎమ్‌సి20 కారు 3 లీటర్ వి6 ఇంజిన్ కలిగి కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఇంజిన్ 630 హెచ్‌పి పవర్, 730 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది, కావున అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఈ సుమారు 1,500 కేజీల బరువు కలిగిన ఈ సూపర్‌కార్ గరిష్ట వేగం గంటకు 325కిమీ. ప్రత్యర్థులు & త్వరలో విడుదలకానున్న మసెరటి కార్లు: భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త మసెరటి ఎమ్‌సి20 కారు పోర్స్చే 911 టర్బో ఎస్, లంబోర్ఘిని హురాకాన్, ఫెరారీ 296 జీటీబీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. రానున్న రోజుల్లో కంపెనీ కన్వర్టిబుల్ వెర్షన్, MC20 సీఏలో కార్లను విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేసుకుంటోంది. కానీ ఇవి ఎప్పుడు విడుదలవుతాయనే దానికి సంబంధించిన అధికారిక సమాచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. -
2021 ప్రపంచ ఆటోమొబైల్ డే: టాప్-5 బెస్ట్ కార్స్
"కార్ల్ బెంజ్" తన మొదటి ఆటోమొబైల్ మూడు చక్రాల మోటర్వ్యాగన్ కోసం సుమారు 135 సంవత్సరాల క్రితం 1886 జనవరి 29న పేటెంట్ దాఖలు చేశారు. ఆటోమొబైల్ రంగానికి మార్గదర్శకత్వం వహించడంలో "కార్ల్ బెంజ్" కీలక పాత్ర పోషించినందున ఈ రోజును 'ప్రపంచ ఆటోమొబైల్ డే'గా జరుపుకుంటారు. ఆటోమొబైల్ చరిత్రలో ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అని ఆటోమొబైల్ ప్రియులు నమ్ముతారు. ప్రపంచ ఆటోమొబైల్ డే సందర్భంగా ప్రస్తుతం మన దేశంలో ఉన్న టాప్-5 ఉత్తమ కార్లను మీకోసం అందిస్తున్నాము. (చదవండి: పాత కారు.. టాప్ గేరు!) ఆడి ఆర్ఎస్ క్యూ8 కూపే ఆడి ఆర్ఎస్ క్యూ8 కూపే ఎస్యూవీ జర్మన్ కార్ల తయారీ కంపెనీ. ప్రస్తుతం ఇది భారతదేశంలో కొనుగోలుకు సిద్ధంగా ఉంది. పనితీరు విషయానికి వస్తే- ఆడి ఆర్ఎస్ క్యూ 8 ఇంగోల్స్టాడ్ ఆధారిత కార్ల తయారీదారు నుంచి వచ్చిన అత్యంత శక్తివంతమైన ఎస్యూవీ. ఇది 592 బిహెచ్పి వి8 ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో తేలికపాటి-హైబ్రిడ్ వ్యవస్థను కలిగి ఉంది. ఐకానిక్ నూర్బర్గింగ్ సర్క్యూట్ ను 7 నిమిషాల 42 సెకన్ల ల్యాప్ టైమ్‌తో తిరిగిన రికార్డు దీని పేరిట ఉంది. ఇది 0 నుంచి 100కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 3.8 సెకన్ల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం వచ్చేసి 250 కి.మీ/గం. లంబోర్ఘిని ఉరుస్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీని మూడేళ్ల క్రితమే భారత్‌లోకి తీసుకొచ్చారు. ఇప్పటికి దీనిని తీసుకోవాలంటే 8-9 నెలల ముందు బుక్ చేసుకోవాల్సిందే. అంత క్రెజ్ ఉంది దీనికి. ఇది ఇటాలియన్ కి చెందిన కంపెనీ. దీనిలో అత్యధిక శక్తినిచ్చే 4.0-లీటర్ ట్విన్ టర్బో వి 8 ఇంజిన్ ఉంది. ఇది 641 బిహెచ్పి, 850ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 3.6 సెకన్ల సమయం తీసుకుంటే 200 కిలోమీటర్ల వేగానికి చేరుకోవడానికి 12.8 సెకెన్ల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం వచ్చేసి 305 కి.మీ/గం.(చదవండి: సరికొత్తగా అమెజాన్ లోగో) మసెరటి లెవాంటే లగ్జరీ కార్ల తయారీ కంపెనీ చరిత్రలో మసెరటి చాలా ప్రసిద్ధి చెందింది. ఇది ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీదారు కంపెనీ. మసెరటి తన మొదటి కారు A6ను 1947సంవత్సరంలో తయారుచేసింది. ఇండియా లగ్జరీ కార్ల పోర్ట్‌ఫోలియోలో ఇది కూడా కనిపిస్తుంది. మన దేశంలో 2018 జనవరిలో విక్రయించిన మొట్టమొదటి మసెరటి ఎస్యూవీ ఇది. ఈ ఎస్యూవీ 3.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 271 బిహెచ్పి పీక్ పవర్, 600ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. లెవాంటే 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 6.9 సెకన్ల సమయం తీసుకుంటుంది. ఇది 230 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళుతుంది. పోర్స్చే 911 టర్బో ఎస్ పోర్స్చే నుంచి వచ్చిన అన్ని కార్ల కంటే 911 టర్బో ఎస్ అందరిని ఎక్కువగా ఆకర్షించింది. భారతదేశంలో ఈ శక్తివంతమైన స్పోర్ట్స్ కారు ధర రూ. 3.08 కోట్లు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది 3.8-లీటర్, 6-సిలిండర్, ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. పోర్స్చే 911 641 బిహెచ్పి, 800 ఎన్ఎమ్ పవర్ ఫిగర్ వల్ల 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కు అనుగుణంగా ఉంటుంది. ఈ స్పోర్ట్స్ కారు 2.7 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. అలాగే 0 నుంచి 200 కిలోమీటర్లు చేరుకోవడానికి 8.9 సెకన్ల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం 330 కిలోమీటర్లు. రోల్స్ రాయిస్ ఘోస్ట్ రోల్స్ రాయిస్ గత సంవత్సరం భారతదేశంలో కొత్త ఘోస్ట్ యొక్క ఎక్స్టెండెడ్ వెర్షన్ ను ప్రవేశపెట్టింది. ఇది బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీదారుల కంపెనీ. దీని డెలివరీలు 2021 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఈ కారు 6.75-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి 12 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ కారు మోటారు 563 బిహెచ్పి, 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రోల్స్ రాయిస్ కారులో సెల్ఫ్ లెవలింగ్ హై-వాల్యూమ్ ఎయిర్ సస్పెన్షన్ టెక్నాలజీతో పాటు ఆల్-వీల్-డ్రైవ్, ఆల్-వీల్ స్టీరింగ్‌ను అందించారు. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 250 కి.మీ. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 4.6 సెకన్ల సమయం తీసుకుంటుంది. -
మాసెరటి ‘లెవాంటె’ వచ్చేసింది..
న్యూఢిల్లీ: ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మాసెరటి’ తాజాగా తన ప్రముఖ ప్రీమియం ఎస్యూవీ ‘లెవాంటె’లో అప్డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. దీని ప్రారంభ ధర రూ.1.45 కోట్లు (ఎక్స్‌షోరూమ్). ఇది గ్రాన్‌లుసో, గ్రాన్స్పోర్ట్ అనే రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ.1.48 కోట్లు, రూ.1.53 కోట్లుగా ఉన్నాయి. మాసెరటి నుంచి మన దేశంలోకి వస్తోన్న తొలి ఎస్యూవీ ఇదే. -
మాసెరటి క్వాట్రోపోర్టే జీటీఎస్ లగ్జరీ కార్..
న్యూఢిల్లీ: ఇటలీ లగ్జరీ కార్ కంపెనీ మాసెరటి కొత్త లగ్జరీ కారును భారత మార్కెట్లోకి తెచ్చింది. ఈ మాసెరటి క్వాట్రోపోర్టే జీటీఎస్ కారు ఖరీదు రూ.2.7 కోట్లు (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ).ఈ లగ్జరీ కారును–గ్రాన్‌లుస్సో, గ్రాన్స్పోర్ట్ ట్రిమ్స్‌ల్లో కంపెనీ అందిస్తోంది. ఈ కారును 3.8 లీటర్ల ట్విన్–టర్బో ఇంజిన్‌తో రూపొందించామని కంపెనీ తెలిపింది. 530 హార్స్ పవర్‌ను ఉత్పత్తి చేసే ఈ ఇంజిన్ వల్ల ఈ కారు సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని 4.7 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 310 కి.మీ. అని పేర్కొంది. వంద కి.మీ. ప్రయాణానికి 10.7లీటర్ల పెట్రోల్ అవసరమని తెలిపింది. ఈ కారులో వాయిస్ కమాండ్స్‌తో కూడా పనిచేసే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్..8.4 అంగుళాల మాసెరటి టచ్ కంట్రోల్ ప్లస్‌ను ఏర్పాటు చేశామని, ఇది యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలతో అనుసంధానమై ఉంటుందని వై–ఫై, ఫోన్ మిర్రరింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయని పేర్కొంది. ఇంకా ఈ కారులో ఎనిమిది గేర్ల జడ్ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, ఆటో అడాప్టివ్ సాఫ్ట్వేర్, 900 వాట్, 10–స్పీకర్ హార్మన్ కార్డన్ప్రీమియమ్ సౌండ్ సిస్టమ్ (స్టాండర్డ్) గ్లేర్ ఉండని అడాప్టివ్ ఫుల్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 20 అంగుళాల మెర్క్యురియో అలాయ్ వీల్స్ తదితర ప్రత్యేకతలున్నాయని వివరించింది. ఆస్టన్ మార్టిన్ రాపిడె, పోర్షే పనమెరా కార్లకు ఈ కారు గట్టిపోటీనిస్తుందని అంచనా. ప్రస్తుతం మాసెరటి కంపెనీ భారత్‌లో క్వాట్రోపోర్టే, స్పోర్టీ సెడాన్ గిబ్లిలతో పాటు గ్రాన్ ట్యురిజ్మో, గ్రాన్‌కాబ్రియో వంటి స్పోర్ట్స్ కార్లను కూడా విక్రయిస్తోంది. త్వరలో ఎస్యూవీ లావంటెను మార్కెట్లోకి తేనున్నది. -
కొత్త కారు కొన్న సన్నిలియోన్
న్యూఢిల్లీ : ఖరీదైన లగ్జరీ కార్లను ఇష్టపడే సన్నీలియోన్ తాజాగా అత్యంత ఖరీదైన మాసెరాటే గిబ్లి నెరిస్సిమో కారును కొనుగోలు చేసింది. రెండేళ్ల కిందట సన్నీకి ఆమె భర్త డేనియల్ వెబర్ ఈకారును బహుమతిగా ఇచ్చారు. నలుగురు కూర్చుని ప్రయాణించే సదుపాయం ఉన్న ఈ లిమిటెడ్ ఎడిషన్ మాసెరాటే గిబ్లీ గ్రాండ్ టూరర్ కారును అమెరికాలో రూ. 53 లక్షలకు సన్ని కొనుగోలు చేశారు. ఇదే కారును మన మార్కెట్లో కొనుగోలు చేయాలంటే రూ.1.36 కోట్లు వెచ్చించాల్చి వచ్చేది. ఇప్పటికే సన్నీ దగ్గర బీఎండబ్ల్యూ-7 సిరీస్ లగ్జరీ కారు కూడా ఉంది. ఈ కారును సదరు సంస్థ అమెరికాచ కెనడాల్లో లిమిటెడ్ ఎడిషన్‌గా కేవలం 450 యూనిట్లను మాత్రమే విక్రయిస్తోంది. కొత్తగా కొన్న కారుతో ఫొటో తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో సన్నీ పోస్ట్ చేసింది. Nothing like being home in my sick a%$ whip!!!! Love @maserati "1 of 450" A post shared by Sunny Leone (@sunnyleone) on Oct 4, 2017 at 12:11pm PDT -
మళ్లీ మాసెరటి లగ్జరీ కార్లు
అందుబాటులోకి నాలుగు మోడళ్లు - ధరలు రూ.1.14 కోట్ల నుంచి రూ.2.2 కోట్లు - త్వరలో హైదరాబాద్‌లో డీలర్షిప్ న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ మాసెరటి మళ్లీ భారత్‌లోకి ప్రవేశిస్తోంది. భారత్‌లో రూ.2.2 కోట్ల వరకూ ధరలున్న నాలుగు కార్ల మోడళ్లను అందించాలని యోచిస్తోంది. సెప్టెంబర్ కల్లా న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేస్తామని మాసెరటి హెడ్(భారత కార్యకలాపాలు) బోజాన్ జన్కులోవ్స్కీ చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నైలకు వీటిని విస్తరిస్తామని వివరించారు. సీబీయూ రూపంలో దిగుమతి... 2011లో భారత్‌లోకి ప్రవేశించిన ఈ కంపెనీ డీలర్ భాగస్వామితో వచ్చిన సమస్యల కారణంగా తన కార్ల విక్రయాలను ఆపేసింది. ఇప్పుడు తాజాగా మళ్లీ భారత్‌లోకి అడుగిడుతోంది. భారత్‌లో ఎక్స్‌క్లూజివ్ లగ్జరీ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని, అందుకే భారత మార్కెట్లోకి మళ్లీ ప్రవేశిస్తున్నామని బోజాన్ పేర్కొన్నారు. భారత్‌లో నాలుగు మోడళ్లు... క్వాట్రోపోర్టే, ఘిబ్లి, గ్రాన్ట్యురిజ్మో, గ్రాన్క్యాబ్రియో అందించాలని యోచిస్తున్నామని చెప్పారు. ఈ మోడళ్ల ధరలు రూ.1.14 కోట్ల నుంచి రూ.2.2 కోట్ల రేంజ్లో ఉన్నాయని వివరించారు. ఇటలీలో పూర్తిగా తయారైన కార్లను కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ల(సీబీయూ)రూపంలో భారత్‌కు దిగుమతి చేసుకొని విక్రయిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ ఎస్‌యూవీని అందుబాటులోకి తెస్తామని చెప్పారు.