భారతీయ మార్కెట్లో SUV, MPV వంటి కార్లకు మాత్రమే కాకుండా లగ్జరీ కార్లకు, సూపర్ కార్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బెంజ్, ఆడి, మసెరటి కంపెనీలు కొత్త ఉత్పత్తులను కూడా దేశీయ విఫణిలో విరివిగా విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మసెరటి ఇటీవల MC20 సూపర్‌కార్ లాంచ్ చేసింది.
ధర:
ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త 'మసెరటి ఎమ్‌సి20' సూపర్‌కార్ ధర అక్షరాలా రూ. 3.69 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). 2021 జులై నాటి నుంచి కంపెనీ ఈ ఆధునిక కారుని విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తూనే ఉంది. కాగా ఎట్టకేలకు ఇప్పుడు భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. డెలివరీలు 2023 మేలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.
(ఇదీ చదవండి: జీవితాన్ని మార్చేసిన బొమ్మల వ్యాపారం: గార్డు నుంచి బిజినెస్ మ్యాన్‌గా..)
డిజైన్:
చాలా సంవత్సరాల తరువాత దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త సూపర్‌కార్ అద్భుతమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్షించే విధంగా ఉంది. ఇది దాని మునుపటి MC12 నుంచి ప్రేరణ పొందటం వల్ల ట్రెడిషినల్ స్పోర్ట్స్ కూపే సిల్హౌట్ పొందుతుంది. ఇందులోని ఫ్లోయింగ్ లైన్స్, ఏరోడైనమిక్ డిజైన్ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. డోర్ సీతాకోకచిలుక రెక్కల మాదిరిగా ఉంటాయి.
ఇంటీరియర్ ఫీచర్స్:
మసెరటి ఎమ్‌సి20 సూపర్‌కార్ లోపలి భాగంలో కార్బన్ ఫైబర్ అల్కాంటారాతో కప్పబడి ఉంటుంది. ఇందులో 10 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటాయి. అంతే కాకుండా వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ హోల్డర్, ఇన్ఫోటైన్‌మెంట్ కంట్రోల్స్, కార్బన్ ఫైబర్-కవర్డ్ సెంట్రల్ కన్సోల్‌లో డ్రైవ్ మోడ్ సెలెక్టర్ మొదలైనవి ఉన్నాయి.
(ఇదీ చదవండి: ఎమ్‌ఆర్‌పి ధరల్లో జరిగే మోసాలకు ఇలా చెక్ పెట్టండి)
ఇంజిన్ & పర్ఫామెన్స్:
కొత్త మసెరటి ఎమ్‌సి20 కారు 3 లీటర్ వి6 ఇంజిన్ కలిగి కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఇంజిన్ 630 హెచ్‌పి పవర్, 730 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది, కావున అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఈ సుమారు 1,500 కేజీల బరువు కలిగిన ఈ సూపర్‌కార్ గరిష్ట వేగం గంటకు 325కిమీ.
ప్రత్యర్థులు & త్వరలో విడుదలకానున్న మసెరటి కార్లు:
భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త మసెరటి ఎమ్‌సి20 కారు పోర్స్చే 911 టర్బో ఎస్, లంబోర్ఘిని హురాకాన్, ఫెరారీ 296 జీటీబీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. రానున్న రోజుల్లో కంపెనీ కన్వర్టిబుల్ వెర్షన్, MC20 సీఏలో కార్లను విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేసుకుంటోంది. కానీ ఇవి ఎప్పుడు విడుదలవుతాయనే దానికి సంబంధించిన అధికారిక సమాచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదు.
Comments
Please login to add a commentAdd a comment