భారతీయ సంపన్నుల జాబితాలో ఒకరుగా ఉన్న రేమండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'గౌతమ్ సింఘానియా' (Gautam Singhania) గత కొన్ని రోజులకు ముందు రూ. 4 కోట్లు విలువైన 'మసెరటి ఎమ్‌సీ20' కూపే కొనుగోలు చేశారు. అయితే ఈ కారు మీద ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
బహుశా నా జీవితంలో నేను నడిపిన చెత్త కారు మసెరటి ఎమ్‌సీ20. మసెరటి కారును కొనుగోలు చేసే ఎవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి అంటూ గౌతమ్ సింఘానియా ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.
నిజానికి మనదేశంలో చాలా మంది ప్రముఖులు ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో మసెరటి బ్రాండ్ ఒకటి. ఇది 3.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 630 హార్స్ పవర్, 730 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 325 కిమీ.
ఇదీ చదవండి: అకౌంట్‌లో డబ్బు లేకున్నా రూ. 80000 విత్‌డ్రా చేసుకోవచ్చు
వేగంలో కూడా అద్భుతమైన పనితీరుని కనపరిచే ఈ కారుని ఎందుకు గౌతమ్ సింఘానియా ఇలా అన్నారు, బహుశా ఈయన వద్ద ఉన్న ఇతర కార్ల కంటే బహుశా ఇదే తక్కువ పనితీరుని కనపరించిందా, లేదా ఇంకేమైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఇతని వద్ద రూ. 6.37 కోట్ల విలువైన ఫెరారీ 296 జీటీబీ సూపర్‌కార్, లంబోర్ఘిని, పోర్స్చే, ఆస్టన్ మార్టిన్, రోల్స్ రాయిస్ వంటి హై ఎండ్ మోడల్ కార్లు ఎన్నో ఉన్నాయి.
ఇదీ చదవండి: ఇలాంటి మోసాలు జరుగుతున్నాయ్! ఆదమరిస్తే అకౌంట్‌లో డబ్బు మాయం!
The MC20 @Maserati_HQ has probably been the worst car i have driven in my life. Anybody buying a Maserati car should think twice.@aSuperCarDriver @ibvsupercarclub @fmsupercarclub@autovivendi @thedriversunion @prestigecarclub@freedomsupercar @mrchensta #SuperCarClubGarage…
— Gautam Singhania (@SinghaniaGautam) August 15, 2023
Comments
Please login to add a commentAdd a comment