న్యూఢిల్లీ : ఖరీదైన లగ్జరీ కార్లను ఇష్టపడే సన్నీలియోన్ తాజాగా అత్యంత ఖరీదైన మాసెరాటే గిబ్లి నెరిస్సిమో కారును కొనుగోలు చేసింది. రెండేళ్ల కిందట సన్నీకి ఆమె భర్త డేనియల్ వెబర్ ఈకారును బహుమతిగా ఇచ్చారు. నలుగురు కూర్చుని ప్రయాణించే సదుపాయం ఉన్న ఈ లిమిటెడ్ ఎడిషన్ మాసెరాటే గిబ్లీ గ్రాండ్ టూరర్ కారును అమెరికాలో రూ. 53 లక్షలకు సన్ని కొనుగోలు చేశారు. ఇదే కారును మన మార్కెట్లో కొనుగోలు చేయాలంటే రూ.1.36 కోట్లు వెచ్చించాల్చి వచ్చేది. ఇప్పటికే సన్నీ దగ్గర బీఎండబ్ల్యూ-7 సిరీస్ లగ్జరీ కారు కూడా ఉంది. ఈ కారును సదరు సంస్థ అమెరికాచ కెనడాల్లో లిమిటెడ్ ఎడిషన్‌గా కేవలం 450 యూనిట్లను మాత్రమే విక్రయిస్తోంది. కొత్తగా కొన్న కారుతో ఫొటో తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో సన్నీ పోస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment