న్యూఢిల్లీ: ఇటలీ లగ్జరీ కార్ కంపెనీ మాసెరటి కొత్త లగ్జరీ కారును భారత మార్కెట్లోకి తెచ్చింది. ఈ మాసెరటి క్వాట్రోపోర్టే జీటీఎస్ కారు ఖరీదు రూ.2.7 కోట్లు (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ).ఈ లగ్జరీ కారును–గ్రాన్‌లుస్సో, గ్రాన్‌స్పోర్ట్ ట్రిమ్స్‌ల్లో కంపెనీ అందిస్తోంది. ఈ కారును 3.8 లీటర్ల ట్విన్–టర్బో ఇంజిన్‌తో రూపొందించామని కంపెనీ తెలిపింది. 530 హార్స్ పవర్‌ను ఉత్పత్తి చేసే ఈ ఇంజిన్ వల్ల ఈ కారు సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని 4.7 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 310 కి.మీ. అని పేర్కొంది. వంద కి.మీ. ప్రయాణానికి 10.7లీటర్ల పెట్రోల్ అవసరమని తెలిపింది.
ఈ కారులో వాయిస్ కమాండ్స్‌తో కూడా పనిచేసే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్..8.4 అంగుళాల మాసెరటి టచ్ కంట్రోల్ ప్లస్‌ను ఏర్పాటు చేశామని, ఇది యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలతో అనుసంధానమై ఉంటుందని వై–ఫై, ఫోన్ మిర్రరింగ్ ఆప్షన్‌లు కూడా ఉన్నాయని పేర్కొంది. ఇంకా ఈ కారులో ఎనిమిది గేర్ల జడ్‌ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, ఆటో అడాప్టివ్ సాఫ్ట్‌వేర్, 900 వాట్, 10–స్పీకర్ హార్మన్ కార్డన్‌ప్రీమియమ్ సౌండ్ సిస్టమ్ (స్టాండర్డ్) గ్లేర్ ఉండని అడాప్టివ్ ఫుల్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 20 అంగుళాల మెర్క్యురియో అలాయ్ వీల్స్ తదితర ప్రత్యేకతలున్నాయని వివరించింది.
ఆస్టన్ మార్టిన్ రాపిడె, పోర్షే పనమెరా కార్లకు ఈ కారు గట్టిపోటీనిస్తుందని అంచనా. ప్రస్తుతం మాసెరటి కంపెనీ భారత్‌లో క్వాట్రోపోర్టే, స్పోర్టీ సెడాన్ గిబ్లిలతో పాటు గ్రాన్ ట్యురిజ్మో, గ్రాన్‌కాబ్రియో వంటి స్పోర్ట్స్ కార్లను కూడా విక్రయిస్తోంది. త్వరలో ఎస్‌యూవీ లావంటెను మార్కెట్లోకి తేనున్నది.
Comments
Please login to add a commentAdd a comment