భారతదేశంలోని సంపన్న వ్యక్తులలో ఒకరైన రేమండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'గౌతమ్ సింఘానియా' (Gautam Singhania) ఇటీవల ఖరీదైన స్పోర్ట్స్ కారుని కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మన దేశంలో అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న ప్రముఖుల జాబితాలో గౌతమ్ సింఘానియా ఒకరు. ఇప్పటికే ఈయన వద్ద రూ. 6.37 కోట్ల విలువైన ఫెరారీ 296 జీటీబీ సూపర్‌కార్, లంబోర్ఘిని, పోర్స్చే, ఆస్టన్ మార్టిన్, రోల్స్ రాయిస్ వంటి హై ఎండ్ మోడల్ కార్లు ఎన్నో ఉన్నాయి. కాగా ఇప్పుడు రూ. 4 కోట్ల విలువైన మసెరటి ఎమ్‌సీ20 కూపే సొంతం చేసుకున్నాడు.
ఒక యూట్యూబ్ ఛానల్ అప్‌లోడ్ చేసిన వీడియోలో గౌతమ్ సింఘానియా తన సరికొత్త మసెరటి ఎమ్‌సీ20 డ్రైవ్ చేస్తూ ముంబై వీధుల్లో కనిపించినట్లు తెలిసింది. దాని వెనుక టొయోటా ఫార్చ్యూనర్‌లో గార్డ్‌లు రావడం కూడా గమనించవచ్చు.
మసెరటి ఎమ్‌సీ20..
మసెరటి ఎమ్‌సీ20 సూపర్ కారు 2020లో గ్లోబల్ అరంగేట్రం చేసింది. కాగా డెలివరీలు 2023 ప్రధమార్ధంలో మొదలయ్యాయి. సింఘానియా ఈ కారు డెలివరీని ముంబైలోని మసెరటి అధికారిక డీలర్‌షిప్ నుంచి పొందారు. ఇది 3.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 630 హార్స్ పవర్, 730 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment