జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'ఆడి' కొత్త తరం 'క్యూ5' కారును ఆవిష్కరించింది. ఇది ప్రీమియం ప్లాట్‌ఫారమ్ కంబస్షన్ (PPC) ఆధారంగా తయారైన బ్రాండ్ మొదటి వెహికల్. ఈ కారు వచ్చే ఏడాది దేశీయ విఫణిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
కొత్త ఆడి క్యూ5 మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, అప్డేటెడ్ ఫ్రంట్ బంపర్, చిన్న గ్రిల్, వెనుకవైపు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ బంపర్ వంటివి పొందుతుంది. ఇంటీరియర్ డిజైన్ ఆడి క్యూ6 ఈ-ట్రాన్ మాదిరిగా ఉంటుంది.
కొత్త తరం ఆడి క్యూ5 11.9 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 14.5 ఇంచెస్ టచ్‌స్క్రీన్, త్రీ-స్పోక్ స్టీరింగ్ వంటివి కలిగి ఉంటుంది. ఇది మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. అవి 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్, 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్, 3.0 లీటర్ వీ6 టర్బో పెట్రోల్ ఇంజిన్స్.
ఆడి క్యూ5 కారు ఈ నెల చివరినాటికి జర్మనీలో, ఆ తరువాత యూరప్‌లోని ఇతర దేశాలలో లాంచ్ అవుతుంది. 2025 మొదటి త్రైమాసికంలో డెలివరీలు ప్రారంభమవుతాయి. ఇది భారతీయ మార్కెట్లో వచ్చే ఏడాది లాంచ్ అవుతుందని సమాచారం. కంపెనీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడించాల్సి ఉంది.
భారతదేశంలో లాంచ్ అయిన తరువాత, ఆడి క్యూ5 కారు ఇప్పటికే విక్రయానికి ఉన్న మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ, వోల్వో ఎక్స్సీ60 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారు ధర రూ. 65 లక్షల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అధికారిక ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment