దీపావళి ఆఫర్: కొత్త కారు కొనడానికే ఇదే మంచి సమయం! | Up To Rs 10 lakh Discounts From Mercedes Benz To Kia | Sakshi
Sakshi News home page

దీపావళి ఆఫర్: కొత్త కారు కొనడానికే ఇదే మంచి సమయం!

Oct 24 2024 6:24 PM | Updated on Oct 24 2024 6:59 PM

Up To Rs 10 lakh Discounts From Mercedes Benz To Kia

అసలే పండుగ సీజన్.. కొత్త కారు కొనాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు దిగ్గజ కంపెనీలు సైతం భారీ డిస్కౌంట్స్ ప్రకటించాయి. ఇందులో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కంపెనీలు ఉన్నాయి. ఒక్కో కంపెనీ ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ రూ.10 లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.

కార్లు, వాటిపై లభించే డిస్కౌంట్స్
ఆడి క్యూ3: రూ. 5 లక్షలు
మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ: రూ. 5 లక్షలు
ఆడి క్యూ5: రూ. 5.5 లక్షలు
బీఎండబ్ల్యూ ఐ4: రూ. 8 లక్షలు
మెర్సిడెస్ బెంజ్ సీ200: రూ. 9 లక్షలు
ఆడి క్యూ8 ఈ ట్రాన్: రూ. 10 లక్షలు
ఆడి ఏ6: రూ. 10 లక్షలు
బీఎండబ్ల్యూ ఎక్స్5: రూ. 10 లక్షలు
కియా ఈవీ6 ఆల్ వీల్ డ్రైవ్: రూ. 12 లక్షలు

కార్లపైన కంపెనీలు ఇస్తున్న ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ తగ్గింపులు ఎంచుకునే మోడల్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement