పండుగ సీజన్ వచ్చేస్తోంది. ఈ తరుణంలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కావడానికి కొన్ని కార్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో కొరియన్ బ్రాండ్, చైనా బ్రాండ్, జర్మనీ బ్రాండ్స్ మొదలైనవి ఉన్నాయి. వచ్చే నెలలో (అక్టోబర్ 2024) లాంచ్ అయ్యే కార్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
2024 కియా కార్నివాల్
కొత్త తరం కియా కార్నివాల్ 2023 అక్టోబర్ 3న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందనుంది. 2+2+3 సీటింగ్ లేఅవుట్‌తో 7-సీటర్ కాన్ఫిగరేషన్‌తో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ కారు 2.2 లీటర్ డీజిల్ కలిగి 193 పీఎస్ పవర్, 441 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రానున్నట్లు సమాచారం.
కియా ఈవీ9
ఎప్పటి నుంచో లాంచ్‌కు సిద్దమవుతున్న కియా ఈవీ9 వచ్చే నెలలో దేశీయ విఫణిలో లాంచ్ అవుతుందని సమాచారం. దీని ధర రూ. 90 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ధర ఎక్కువగా ఉండటానికి కారణం.. ఇది సీబీయూ మార్గం ద్వారా దేశానికి దిగుమతి కావడమనే తెలుస్తోంది.
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్
భారతీయ విఫణిలో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న నిస్సాన్ మాగ్నైట్.. అక్టోబర్ 4న ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అవుతుంది. ఇది అప్డేటెడ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం. పరిమాణం పరంగా స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. రీడిజైన్డ్ ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్‌లు, అప్డేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్, అల్లాయ్ వీల్స్, టెయిల్‌లైట్ మొదలైనవి ఉంటాయి.
బీవైడీ ఈమ్యాక్స్7
దేశీయ విఫణిలో అతి తక్కువ కాలంలోనేఅధిక ప్రజాదరణ పొందిన చైనా బ్రాండ్ బీవైడీ అక్టోబర్ 8న ఈమ్యాక్స్7పేరుతో ఓ కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. మొదటి 1000 మంది కస్టమర్లకు రూ. 51000 విలువైన ప్రయోజనాలను అందించనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: తక్కువ ధర.. ఎక్కువ రేంజ్: ఇదిగో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు
2024 మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ ఎల్‌డబ్ల్యుబీ
మెర్సిడెస్ బెంజ్ తన 2024 ఈ క్లాస్ ఎల్‌డబ్ల్యుబీ కారును అక్టోబర్ 9న ఆవిష్కరించనుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఎంపికలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారు కోసం కంపెనీ ఇప్పటికీ ఫ్రీ బుకింగ్స్ స్వీకరిస్తున్నట్లు సమాచారం. డెలివరీలు లాంచ్ అయిన తరువాత ప్రారంభమవుతాయి. ధర, వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment