లాంచ్‌కు సిద్దమవుతున్న బీఎండబ్ల్యూ కారు ఇదే.. | BMW 2 Series Gran Coupe Facelift Launch Soon | Sakshi
Sakshi News home page

లాంచ్‌కు సిద్దమవుతున్న బీఎండబ్ల్యూ కారు ఇదే..

Oct 18 2024 8:53 PM | Updated on Oct 18 2024 8:54 PM

BMW 2 Series Gran Coupe Facelift Launch Soon

బీఎండబ్ల్యూ కంపెనీ తన 2 సిరీస్ గ్రాన్ కూపే ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే కంపెనీ ఈ కారును అధికారికంగా లాంచ్ చేయడానికి ముందే దీనికి సంబంధించిన వివరాలను, ఫోటోలను విడుదల చేసింది. దీన్ని బట్టి చూస్తే ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత బిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే ఫేస్‌లిఫ్ట్ ఒక పెద్ద ఎయిర్ డ్యామ్ పొందుతుంది. బంపర్ విశాలంగా ఉంటుంది. పరిమాణంలో కూడా ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కొంత పెద్దదిగానే ఉంది. ఇంటీరియర్ స్పేస్‌ కూడా కొంత పెరిగినట్లు తెలుస్తోంది. లోపలి భాగం చాలా వరకు బ్లాక్ అవుట్ ట్రీట్‌మెంట్‌ పొందుతుంది. అంతే కాకుండా ఇక్కడ ఫిజికల్ బటన్ల సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉంటుంది. వెనుక వైపు నెంబర్ ప్లేట్ టెయిల్ ల్యాంప్‌ల మధ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: రూ.80 లక్షల జీతం: సలహా ఇవ్వండి.. టెకీ పోస్ట్ వైరల్

బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే ఫేస్‌లిఫ్ట్ 1.5 లీటర్ త్రి సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 48 వోల్ట్స్ మైల్డ్-హైబ్రిడ్ సెటప్‌తో వస్తుంది. ఈ కారు 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. మొత్తం మీద పనితీరు కూడా దాని మునుపటి మోడల్ కంటే ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు 2025 ప్రారంభంలో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement