బీఎండబ్ల్యూ స్కైటాప్ వీ8 రోడ్‌స్టర్ ఈ సంవత్సరం ప్రారంభంలో కాంకోర్సో డి'ఎలెగాంజా విల్లా డి'ఎస్టేలో ఒక కాన్సెప్ట్‌గా మొదటిసారిగా కనిపించింది. అయితే ఇప్పుడు ఉత్పత్తి దశకు చేరుకుంది. కానీ ఇది కేవలం 50 యూనిట్లకు మాత్రమే పరిమితమైనట్లు సమాచారం.
బీఎండబ్ల్యూ స్కైటాప్ వీ8 రోడ్‌స్టర్ 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజన్ పొందుతుంది. ఇది 617 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ రోడ్‌స్టర్ 8 స్పీడ్ స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.
రెండు సీట్లు కలిగిన ఈ కారు షార్ప్ అండ్ యాంగ్యులర్ ఫ్రంట్ ఎండ్, ఎల్ఈడీ హెడ్‌లైట్ పొందుతుంది. ఇందులో డోర్ హ్యాండిల్స్ లేకపోవడాన్ని గమనించవచ్చు. లోపలి భాగం మొత్తం ఎరుపు-గోధుమ రంగులో ఉండటం చూడవచ్చు. గేర్ సెలెక్టర్‌కు క్రిస్టల్ లాంటి రూపాన్ని అందించారు.
ఇదీ చదవండి: ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా: ఎందుకంటే..
బీఎండబ్ల్యూ స్కైటాప్ వీ8 రోడ్‌స్టర్ క్యాబిన్‌లో ప్రీమియం బోవర్స్ & విల్కిన్స్ సౌండ్ సిస్టమ్ ఉంది. మిగిలిన అన్ని ఫీచర్స్ దాదాపు 8 సిరీస్ మోడల్‌లో మాదిరిగానే ఉన్నట్లు సమాచారం. ఈ కారు ధర, ఇతర వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. లాంచ్ డేట్, డెలివరీ డీటైల్స్ కూడా తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment