ఒక ఉద్యోగంలో చేరితే.. అప్పటికే ఉన్న ఉద్యోగంలో లభించే జీతం కంటే ఎక్కువ శాలరీ వచ్చినప్పుడు ఆ జాబ్‌కు రాజీమానా చేస్తారు, లేదా ఆరోగ్య సమస్యల కారణంగా జాబ్‌కు రాజీమానా చేస్తారు. కానీ ఇటీవల ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా చేసి, ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రెడిట్‌లో వెల్లడైన ఒక పోస్ట్ ప్రకారం, అసోసియేట్ ప్రొడక్ట్ డిజైనర్‌గా ఉద్యోగంలో చేరిన మొదటి రోజే.. తన మేనేజర్ ప్రవర్తన నచ్చకపోవడం వల్ల ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. తన రాజీనామా లేఖను సైతం రెడిట్‌లో షేర్ చేశారు. తన డ్యూటీ ముగిసిన తరువాత కూడా పనిచేయాలని మేనేజర్ ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. అయితే ఓవర్ టైం పనికి డబ్బు ఇచ్చే ప్రసక్తే లేదని మేనేజర్ చెప్పినట్లు ఉద్యోగి వెల్లడించారు.
అదనపు వేతనం లేకుండానే రోజుకు 12 నుంచి 14 గంటలు పనిచేయాలని మేనేజర్ చెప్పడంతో ఉద్యోగి తీవ్ర నిరాశకు లోనయ్యారు. వ్యక్తిగత జీవితానికి విలువ ఇవ్వాలని తాను చెప్పాలనున్నప్పటికీ.. తన మాటలను మేనేజర్ లెక్క చేయలేకపోవడం మాత్రమే కాకుండా.. తనను కించపరిచే విధంగా మాట్లాడినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: గూగుల్‌లో జాబ్ కోసం ఇవి తప్పనిసరి: సుందర్ పిచాయ్
ఉద్యోగి పంపిన రాజీనామా లేఖకు, మేనేజర్ ప్రత్యుత్తరం పంపిస్తూ.. తాను ఒకటి చెప్పదలచుకుంటే, మరొక రకంగా అర్థమైనదని విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగం విషయంలో ఇద్దరి అంచనాలు వేరు వేరుగా ఉన్నతలు వెల్లడించారు.
ప్రస్తుతం ఉద్యోగి చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆఫీసులో పని వాతావరణం నచ్చకుంటే రాజీనామా చేయడం చాలా ఉత్తమం అని కొందరు చెబుతుంటే.. మరికొందరు చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నావని అంటున్నారు. ఇలా ఎవరికి తోచిన విధంగా.. వారు కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment