గూగుల్ సంస్థలో ఉద్యోగం చేయాలని చాలామంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కలలు కంటారు. అయితే కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలంటే.. ఎలాంటి స్కిల్స్ ఉండాలనే విషయాన్ని సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు.
ది డేవిడ్ రూబెన్‌స్టెయిన్ షో, పీర్ టు పీర్ కన్వర్జేషన్స్‌లో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. గూగుల్ కంపెనీలో జాబ్ కావాలంటే మారుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని కావలసిన నైపుణ్యం, అడాప్టబుల్ వంటివి పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు వేగంగా.. టెక్నాలజీకి అనుకూలంగా మారే సూపర్ స్టార్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కోసం కంపెనీ ఎప్పుడూ అన్వేషిస్తూ ఉంటుందని అన్నారు.
క్రియేటివిటీ, ఇనోవేషన్స్ వంటి వాటిని పెంపొందించడంలో గూగుల్ కంపెనీ కీలక పాత్ర పోషిస్తుంది. ఉచిత భోజనాన్ని అందించే కంపెనీ సంప్రదాయాన్ని గురించి పిచాయ్ వివరిస్తూ.. ఇది సమాజాన్ని నిర్మించడంలో, కొత్త ఆలోచనలను రేకెత్తించడంలో సహాయపడుతుందని అన్నారు.
గూగుల్ కంపెనీలో సుందర్ పిచాయ్ ప్రారంభ రోజులను గురించి కూడా వెల్లడించారు. కేఫ్‌లో ఊహించని సంభాషణలు ఎలా ఉత్తేజకరమైన ప్రాజెక్ట్‌లకు దారితీస్తాయో గుర్తుచేసుకున్నారు. టెక్ ప్రపంచం సవాళ్లతో కూడుకున్నదిగా ఉన్నప్పటికీ.. ప్రతిభావంతులకు గూగుల్ గమ్యస్థానంగా నిలుస్తుందని పిచాయ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సూరత్‌లో వజ్రాల పరిశ్రమకు ఏమైంది? కార్మికుల ఆత్మహత్యలకు కారణం ఇదేనా..
2024 జూన్ నాటికి గూగుల్ కంపెనీలో 1,79,000 మంది ఉన్నట్లు వెల్లడించారు. టెక్ పరిశ్రమ అంతటా ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో గూగుల్‌లో ఉద్యోగం పొందటం కొంత కష్టమని అన్నారు. మాజీ గూగుల్ రిక్రూటర్ నోలన్ చర్చ్ కూడా నియామక ప్రక్రియపై గురించి వివరించారు. గూగుల్ సంస్థ విలువలను, మిషన్‌ను అర్థం చేసుకోవడానికి సంబంధించిన ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ.. ఇంటర్వ్యూలకు బాగా సిద్ధం కావాలని అభ్యర్థులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment