Benz
-
భర్తకు తెలియకుండా చేసిన పని.. బెంజ్ కంపెనీ బతికేలా చేసింది
మెర్సిడెస్ బెంజ్.. ప్రపంచ మార్కెట్లో పరిచయం అవసరంలేని బ్రాండ్. ఈ రోజు లగ్జరీ కార్ల విభాగంలో అగ్రగామిగా దూసుకెళ్తున్న ఈ కంపెనీ ఒకప్పుడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నట్లు, బహుశా చాలా మందికి తెలిసుండకపోవచ్చు. అయితే ఓ మహిళ తీసుకున్న నిర్ణయమే కంపెనీ నేడు ఈ స్థాయిలో ఉండటానికి కారణం అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..మెర్సిడెస్ బెంజ్ ఈ రోజు ఆటోమోటివ్ పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన సంస్థగా గుర్తింపు పొందింది అంటే.. దానికి కారణం 'బెర్తా బెంజ్' అనే చెప్పాలి. మొదటిసారిగా ప్రపంచానికి కార్లను పరిచయం చేసిన ఘనత కూడా ఈమె సొంతమే. ఈమె మరెవరో కాదు.. కార్ల్ ఫ్రెడరిక్ బెంజ్ భార్య.కార్ల్ ఫ్రెడరిక్ బెంజ్.. జర్మనీకి చెందిన ప్రొఫెషనల్ ఆటోమోటివ్ ఇంజనీర్, ఇంజన్ డిజైనర్ కూడా. ఈయన 1885లో బెంజ్ పేటెంట్ మోటర్‌వాగన్‌ను సృష్టించారు. ఇదే అతని మొదటి ఆటోమొబైల్. అయితే ఇది రోడ్డుపై ఎలా పనిచేస్తుందనే విషయం మీద కొంత అనుమానం మాత్రం కార్ల్ బెంజ్ మనసులో ఉండేది. కానీ బెర్తా బెంజ్ మాత్రం ఆ వాహనం మీద పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. ఈ కారణంగానే భర్తకు తెలియకుండానే ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది.1888లో ఒకరోజు ఉదయం.. బెర్తా నిద్రలేచి, కార్ల్ బెంజ్‌కి తెలియజేయకుండా తన ఇద్దరు కుమారులు యూజెన్, రిచర్డ్‌లతో కలిసి కారులో ప్రయాణాన్ని ప్రారంభించింది. రోడ్డుపై వస్తున్న ఆ వాహనం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే దాన్ని మహిళ నడపడం చూసి చాలామంది మరింత ఆశ్చర్యపోయారు.నిజానికి కార్ల్ బెంజ్ తన మొదటి వాహనాన్ని రూపొందించినప్పుడు, దానిని విక్రయించడానికి చాలా కష్టపడ్డాడు. దాదాపు మూడేళ్ళ పాటు దాని అమ్మకాలు జరగలేదు. ఈ వాహనంలో బెర్తా 106 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత.. పేటెంట్ మోటర్‌వాగన్‌ను ప్రపంచం గుర్తించింది. ఆ తరువాత కంపెనీ అమ్మకాలు మొదలయ్యాయి.ఇదీ చదవండి: పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..బెంజ్ పేటెంట్ మోటర్వాగన్ అమ్మకాలు మొదలైన తరువాత కూడా కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిని కంపెనీ విజయవంతంగా పరిష్కరించింది. బెర్తా తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే.. బెంజ్ కారును ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా చేసింది. నేడు ఈ కంపెనీ ఏ స్థాయిలో ఉందో.. ఎంతలా ఎదిగిందో అందరికీ తెలుసు. -
దీపావళి ఆఫర్: కొత్త కారు కొనడానికే ఇదే మంచి సమయం!
అసలే పండుగ సీజన్.. కొత్త కారు కొనాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు దిగ్గజ కంపెనీలు సైతం భారీ డిస్కౌంట్స్ ప్రకటించాయి. ఇందులో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కంపెనీలు ఉన్నాయి. ఒక్కో కంపెనీ ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ రూ.10 లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.కార్లు, వాటిపై లభించే డిస్కౌంట్స్ఆడి క్యూ3: రూ. 5 లక్షలుమెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ: రూ. 5 లక్షలుఆడి క్యూ5: రూ. 5.5 లక్షలుబీఎండబ్ల్యూ ఐ4: రూ. 8 లక్షలుమెర్సిడెస్ బెంజ్ సీ200: రూ. 9 లక్షలుఆడి క్యూ8 ఈ ట్రాన్: రూ. 10 లక్షలుఆడి ఏ6: రూ. 10 లక్షలుబీఎండబ్ల్యూ ఎక్స్5: రూ. 10 లక్షలుకియా ఈవీ6 ఆల్ వీల్ డ్రైవ్: రూ. 12 లక్షలుకార్లపైన కంపెనీలు ఇస్తున్న ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ తగ్గింపులు ఎంచుకునే మోడల్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
ప్రీ–ఓన్డ్ విభాగంలోకి భారత్ బెంజ్ సర్టిఫైడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహనాల తయారీలో ఉన్న దైమ్లర్ ఇండియా తాజాగా పాత వాహనాల విక్రయాల్లోకి ప్రవేశించింది. భారత్ బెంజ్ సర్టిఫైడ్ పేరుతో కార్యకలాపాలు సాగించనున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ కేంద్రాల్లో భారత్ బెంజ్ ట్రక్కులను పునరుద్ధరించి విక్రయిస్తారు. ప్రతి వాహనానికి 125 రకాల నాణ్యత పరీక్షలు జరిపి, రిపేర్ చేస్తారు. ఆరు నెలల వారంటీ ఉంటుంది. భారత్ బెంజ్ సర్టిఫైడ్ డిజిటల్ వేదికగా క్రయ విక్రయాలను జరుపుతుంది. కంపెనీ తొలుత బెంగళూరులో ఈ సేవలు ప్రారంభించింది. దశలవారీగా ఇతర నగరాలకు విస్తరిస్తారు. కాగా, ఇతర బ్రాండ్లకు చెందిన వాణిజ్య వాహనాలను మార్పిడి చేసుకుని వినియోగదార్లు భారత్ బెంజ్ వాహనాలను కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. -
స్పీడు పెరుగుతుందా?
వాహన రంగానికి జీఎస్టీ రేటు 28 శాతం ♦ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి లగ్జరీ కార్ల ధరలు తగ్గే అవకాశం ♦ మారుతీ, క్విడ్, సెలేరియో, ఐ20 వంటి చిన్న కార్లు యథాతథం ♦ లగ్జరీ, సెడాన్ కార్లపై అదనంగా 1–15 శాతం వరకు సెస్సు ♦ 350 సీసీ కంటే ఎక్కువ బైకులకూ జీఎస్టీతో పాటూ సెస్సు ♦ ఎలక్ట్రిక్ కార్లు కాస్త చౌక– చుక్కల్లోకి హైబ్రిడ్ వాహనాలు (సాక్షి, బిజినెస్ విభాగం) వాహన రంగానికి సంబంధించి ప్రపంచంలో అతిపెద్ద దేశం మనదే. పైపెచ్చు మన జీడీపీలో 7.1 శాతం వాటా ఈ రంగానిదే. అంతేకాదు! ఏటా దేశంలో వ్యక్తిగత, వాణిజ్య, ద్విచక్ర అన్ని రకాల వాహనాలు కలిపి రెండు కోట్లకు పైనే తయారవుతున్నాయి. ఇదీ ఇక్కడ వాహన రంగానికున్న ప్రాధాన్యం. నిజం చెప్పొద్దూ!! ఇపుడు దేశంలో వాహనాలపై పరోక్ష పన్నులు, వ్యాట్, ఇతరత్రా అన్నీ కలిపి 32 నుంచి 55 శాతం వరకూ ఉన్నాయి. జీఎస్టీలో మాత్రం ఎలక్ట్రిక్ కార్లు, బైకులు, ట్రాక్టర్లను మినహాయిస్తే అన్ని రకాల వాహనాలనూ 28 శాతం పన్ను పరిధిలోకి తెచ్చారు. సెడాన్, లగ్జరీ కార్లకు మాత్రం జీఎస్టీకి అదనంగా 1–15 శాతం వరకు సెస్సు జత చేశారు. మరి జీఎస్టీ రాకతో వాహన ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? దీనికి పలువురు నిపుణులు చెప్పిన వివరాల సమాహారమే ఈ కథనం. చిన్న కార్ల తయారీలో మనమే టాప్. దేశంలోని మొత్తం కార్ల అమ్మకాల్లో 45 శాతానికి పైగా అమ్మకాలు చిన్న కార్లవే. ప్రస్తుతం ఈ విభాగంపై 25–27.5 శాతం వరకూ పన్నులున్నాయి. తాజా జీఎస్టీలో సెస్సుతో సహా కలిపి ఇవి 29 శాతానికి చేరుతున్నాయి. అంటే 1.5 నుంచి 2 శాతం పెరుగుతున్నట్లే. అంటే జీఎస్టీతో చిన్న కార్ల ధరలు స్వల్పంగా పెరుగుతాయన్న మాట. హోండా సిటీ, క్రెటా, సియాజ్, డస్టర్ వంటి సెడాన్, ఎస్యూవీ వాహనాల పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే ప్రస్తుతమున్న పరోక్ష పన్నులు, వ్యాట్, ఇతరత్రా పన్నులు 43 శాతం. జీఎస్టీలో 28 శాతానికి అదనంగా 15 శాతం సెస్సును విధించారు. ఎలా చూసినా 43 శాతమే కనక ధరల్లో మార్పుండదు. లగ్జరీ కార్ల ధరలు తగ్గుతాయ్.. ప్రస్తుతం మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్, వోల్వో వంటì లగ్జరీ కార్లకు ఎక్సైజ్, వ్యాట్, ఇన్ఫ్రా సెస్ కలిపి 55 శాతం వరకూ పన్నులున్నాయి. జీఎస్టీ 28 శాతానికి 15 శాతం సెస్సు కలపాల్సి ఉంది. అంటే పన్నులు 43 శాతానికి దిగి వస్తాయి. అంటే జీఎస్టీతో వీటి ధరలు దాదాపు 10–12 శాతం తగ్గుతాయన్న మాట. అయితే లగ్జరీ కార్లు కొనేవారు ఈ స్థాయి తగ్గింపుల్ని పట్టించుకోరన్నది పరిశ్రమ వర్గాల అభిప్రాయం. అందుకని జీఎస్టీ ప్రభావం వాహన రంగంపై మరీ ఎక్కువగా ఏమీ ఉండబోదని వారు చెబుతున్నారు. హైబ్రిడ్ వాహనాలకు షాక్.. పర్యావరణాన్ని ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. కానీ, తాజా జీఎస్టీలో పర్యావరణ అనుకూలమైన హైబ్రిడ్ వాహనాలకు మాత్రం ఎలాంటి మినహాయింపులూ ఇవ్వలేదు. పైపెచ్చు ఎస్‌యూవీలను, హైబ్రిడ్ వాహనాలను ఒకే గాటన కట్టేశారు. దీంతో వీటిక్కూడా 43 శాతం పన్ను వర్తిస్తుంది. కార్లలో పెట్రోల్, డీజిల్ వాహనాల పన్ను రేట్లు పరిశీలించినా 29–31 శాతానికి పరిమితం కావటం గమనార్హం. హైబ్రిడ్ వాహనాలంటే రెండు రకాల ఇంధనాలతో నడిచేవి. అంటే పెట్రోల్ లేదా డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ ఆప్షన్ కూడా ఉండేవి. ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రం శుభవార్తే.. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్రం 6 శాతం పన్ను విధిస్తోంది. ఇక రాష్ట్రాల విషయానికొస్తే కొన్ని మినహాయిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు 12 నుంచి 21 వరకూ వ్యాట్‌ను వసూలు చేస్తున్నాయి. జీఎస్టీలో 12 శాతం పన్ను విధిస్తుండటం వల్ల కొన్ని రాష్ట్రాల్లో ధరలు స్వల్పంగా పెరిగినా... చాలా రాష్ట్రాల్లో బాగా తగ్గుతుందన్నది నిపుణుల మాట. ఎందుకంటే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై వ్యాట్ లేదు. జీఎస్టీలో 12 శాతం పన్ను విధింపుతో వీటికి నిరాశే. పన్నులెక్కువగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ (ప్రస్తుతం 20.5 శాతం), తమిళనాడు (20.5), గుజరాత్ (21) రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గే అవకాశముంది. అధిక సామర్థ్యం ఉంటే పెంపు! 350 సీసీ ఇంజిన్ కెపాసిటీ కంటే ఎక్కువుండే ద్విచక్ర వాహనాలకు 28 శాతం జీఎస్టీ రేటుతో పాటు అదనంగా 3 శాతం సెస్సునూ జత చేశారు. మొత్తంగా 31 శాతానికి చేర్చారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలకు 13 రకాల పన్నులు కలిపి సుమారుగా ఇది 28–35 శాతంగా ఉంది. అంటే దీనర్థం జీఎస్టీతో ప్రభావం ద్విచక్ర వాహనాలపై పెద్దగా ఉండకపోవచ్చు. ట్రాక్టర్లపై పన్ను తగ్గింది వ్యవసాయంలో రైతుకు కుడి భుజంలా ఉపయోగపడే ట్రాక్టర్లపై పన్ను రేటు తగ్గించి రైతుకు భరోసానిచ్చారు. జీఎస్టీలో ట్రాక్టర్లకు 12 శాతం రేటును ఖరారు చేశారు. ప్రస్తుతం ట్రాక్టర్లపై వ్యాట్ (5–5.5 శాతం), సీఎస్టీ (2 శాతం), విడిభాగాలు, పరికరాలపై సెంట్రల్ వ్యాట్ (12.5 శాతం)గా ఉంది. దీనర్థం ట్రాక్టర్ల ధరలు కొంత దిగిరావచ్చు. దేశంలో 2015–16లో 4,93,764 ట్రాక్టర్లు అమ్ముడుపోగా.. 2016–17 నాటికి 5,82,844 యూనిట్లకు చేరిందని ట్రాక్టర్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ గణాంకాలు చెబుతున్నాయి. 10 నుంచి 13 సీట్ల సామర్థ్యం ఉండే ప్రజా రవాణా వాహనాలను కూడా లగ్జరీ కార్ల మాదిరే చూడటం సరికాదు. రెండింటికీ ఒకే తరహా పన్ను వేయటం ఇబ్బందికరమే. – ఆర్సీ భార్గవ, మారుతీ సుజుకీ చైర్మన్ వాహన రంగంపై జీఎస్టీ ప్రభావం పూర్తి పట్టిక...www.sakshibusiness.com లో చూడండి -
బెంజ్‌లో గం‘జాయ్’!
• మంత్రుల కుమారుల డ్రంకన్ డ్రైవ్? • కారులో మాజీ సీఎం తనయుడు? • నిలిపిఉన్న బీఎండబ్ల్యూను ఢీకొట్టిన వైనం • తానే కారు నడిపానంటూ వేరే వ్యక్తి ఒప్పుకోలు • కేసు తప్పుదోవ పడుతోందంటున్న ప్రత్యక్ష సాక్షులు హైదరాబాద్: ఆగిఉన్న బీఎండబ్ల్యూ కారును వేగంగా వచ్చిన బెంజ్ వెనుక నుంచి ఢీకొట్ట డంతో అది ధ్వంసమైంది. ప్రమాదానికి కార ణమైన కారును మద్యం మత్తులో ఉన్న మంత్రుల కుమారులు నడుపుతున్నారని తెలి సింది. పోలీసులు మాత్రం అనామకుడిపై కేసు నమోదు చేసి తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 31కి చెందిన ఎన్. అనిల్‌కుమార్‌రెడ్డి వాకింగ్ కోసం జూబ్లీహిల్స్ రోడ్ నెం 1లోని గేట్ నం.2 వద్ద ప్రధాన రోడ్డుపై తన బీఎం డబ్ల్యూ కారు (ఏపీ 09 సీఎస్ 9293)ను నిలిపి వాకింగ్‌కు వెళ్లారు. అదే సమయంలో జూబ్లీ హిల్స్ నుంచి ఫిలింనగర్ వైపు వేగంగా వెళ్తు న్న బెంజ్ (టీఎస్ 09 ఏఆర్ టీఆర్1051) బీఎండబ్ల్యూను వెనుక భాగంలో ఢీకొట్టింది. దీంతో అది తీవ్రంగా దెబ్బతింది. ఆ సమ యంలో సంఘటనా స్థలంలో ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమా దానికి కారణమైన బెంజ్ కారును నడుపు తున్న యువకుడితో పాటు అందులో కూర్చు న్న మరో ఇద్దరు యువకులు ఎయిర్బెలూన్లు ఓపెన్ కావడంతో బతికి బయటపడ్డారు. అదే సమయంలో వాకర్లు కొందరు యాక్సిడెంట్ అయిన విషయాన్ని గుర్తించి బెంజ్ కారు డోర్ తెరిచారు. గంజాయి పొగతో పాటు మద్యం వాసన, మద్యం సీసాలు అందులో కనిపించాయని వారు తెలిపారు. అందులో కూర్చున్న ముగ్గురు యువ కులు మత్తులో ఉండి ఇదేమి గమనించకపోవ డంతో వారిని దించే ప్రయ త్నం చేస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన మరో కారు వారిని తమ కారులోకి ఎక్కించుకొని వెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బెంజ్‌లో ఉన్నవారంతా వీవీఐపీలే.. బెంజ్ కారు నడిపిన యువకుడు ఓ మంత్రి కొడుకు కాగా, అందులో ఓ మాజీ సీఎం కొడుకు, తాజా మంత్రి కొడుకు కూడా ఉన్న ట్లు సమాచారం. వెనకాల కారులో వచ్చిన ఇద్దరు యువకులూ మంత్రుల కొడుకులేనని తెలిసింది. వాకింగ్ చేసి బయటకు వచ్చిన అనిల్‌కుమార్‌రెడ్డి తన కారు ధ్వంసంపై జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకొని, దెబ్బతిన్న కార్లను స్టేషన్‌కు తరలించారు. కాగా తానే కారు నడిపానంటూ సైదాబాద్‌కు చెందిన రాఘవేందర్‌రెడ్డి పోలీసులకు లొంగిపోవడం తో ఆయనపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మంత్రుల కొడుకులే పోలీసులను బురిడి కొట్టించి కేసులో ఓ అనామకుడిని చేర్చినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షులు కూడా కారులో ముగ్గురు వ్యక్తులు కూర్చురన్నారని.. కారు నిండా గంజాయి పొగ కమ్ముకుందని, మద్యం సీసాలూ ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు వారు ఫొటోలూ తీశారు. వెనకాల వచ్చిన మరో కారులో వ్యక్తులు ఈ ముగ్గురిని తరలించినట్లు కూడా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఓ మాజీ ముఖ్యమంత్రి కుమారుడితో పాటు ఓ మంత్రి బంధువులు అక్కడికి వచ్చారని.. కేసుతో వారికి సంబంధముందని చెప్పడానికి ఇదే నిదర్శనమని వారు చెబుతున్నారు. ప్రమాదానికి కారకులైన వారు మంత్రులకు సంబంధించిన వారు కావడంతో కేసును పక్కదోవ పట్టిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ప్రమాదానికి కారణమైన కారు బార్ ఎస్టేట్ పేరు మీద ఉందని పోలీసులు తెలిపారు. వాహనంలో మద్యం సీసా మాత్రమే దొరికిందని, వాహనాన్ని నడుపు తున్న వ్యక్తి ఎలాంటి మద్యం సేవించలేదని పేర్కొన్నారు. -
బెంజ్ న్యూ ఎస్యూవీ లాంచ్
న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ బుధవారం తన కొత్త అప్ గ్రేడెడ్ వెర్షన్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఏడు సీట్ల స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం జీఎల్ఎస్ 350 డీని భారత మార్కెట్ లో విడుదల చేసింది. పుణే లో దీని ఎక్స్ - షోరూమ్ ధర రూ. 80.38 లక్షలుగా ప్రకటించింది. భారతదేశం ఎస్‌యూవీలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో మరింత మెరుగైన సౌకర్యాలపై దృష్టిపెట్టినట్టు తెలిపింది. 2015 సం.రం లో 100 శాతం వృద్ధి సాధించామని, మెర్సిడెస్ బెంజ్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో రోలాండ్ ఫోల్గేర్ మీడియాకు చెప్పారు. భారత మార్కెట్ తమకు హైయ్యెస్ట్ గ్రోయింగ్ సెగ్మెంట్ అని పేర్కొన్నారు. ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, హెడ్ ల్యాంప్ , లోగో ప్లేస్ మెంట్ తదితర మార్పులతో జీఎల్ఎస్ 350 డీని కంపెనీ రిమోడలింగ్ చేసింది. దీంతోపాటు కొత్త కలర్ ఆప్షన్స్ తో బ్రాండ్ న్యూ అవతారంలో కార్ లవర్స్ ను అలరించేందకు సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం నిర్దేశించుకున్న 12 మోడల్స్ లో ఇది తమకు నాలుగవది అని తెలిపారు. అయితే 2,000 సిసి డీజిల్ వాహనాలపై సుప్పీంకోర్టు నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో దీన్ని ఢిల్లీ -ఎన్‌సిఆర్ ప్రాంతంలో అమ్మకాలు జరపడం లేదని తెలిపారు. త్వరలోనే పెట్రోల్ వెర్షన్ తీసుకురానున్నట్టు తెలిపింది. 3073 ఎంఎం వీల్ బేస్ , 5130ఎంఎం పొడవు, 2141ఎం.ఎం వెడల్పు 1,849ఎంఎ ఎత్తు డైమెన్షన్,3.0 డీజిల్ ఇంజీన్, 8 అంగుళాల స్టాండలోన్ ట్యాబ్ లెట్ స్క్రీన్ విత్ టచ్ పాడ్ కంట్రోల్, నప్పా వెదర్ తో తయారుచేసిన 3 స్పోక్ స్టీరింగ్, 21 ఏఏంజీ లైట్ ఎలోయ్ వీల్స్ తదితర ఫీచర్స్ తో రిలీజ్ అయిన ఈ జీఎల్ ఎస్ వాహనం, ఆడి క్యూ 7, వోల్పో ఎక్స్ డీ 90, రేంజ్ రోవర్ కార్లకు ప్రధాన పోటీగా నిలవనుందని మార్కెట్ నిపుణుల అంచనా. -
ముంబైలో హిట్ అండ్ రన్
-
హైదరాబాద్ మార్కెట్లో కొత్త సి-క్లాస్ బెంజ్!
-
లగ్జరీ కార్లు దిగొస్తున్నాయ్!
-
బెంజ్ కార్ల ధరలు పెంపు
న్యూఢిల్లీ: రూపాయి పతనం దెబ్బకి కార్ల కంపెనీలు రేట్లు పెంచక తప్పడం లేదు. తాజాగా లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ వచ్చే నెల 1 నుంచి తమ కార్ల ధరలను 2.5% నుంచి 4.5% దాకా పెంచనున్నట్లు ప్రకటించింది. రూపాయి క్షీణత, అధిక దిగుమతి సుంకాలే ఇందుకు కారణంగా కంపెనీ తెలిపింది. కొత్త మార్పులతో ఏ-క్లాస్ 180 సీడీఐ కారు ధర 4% పెరిగి రూ. 22.05 లక్షలుగాను, బి-క్లాస్ 180 సీడీఐ ధర కూడా 4% పెంపుతో రూ. 23.50 లక్షలుగా ఉండనుంది. అలాగే, కొత్తగా ప్రవేశపెట్టిన ఈ-క్లాస్ 200 సీజీఐ ధర 3.5% పెంపుతో రూ. 42.16 లక్షలుగా, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం ఎంఎల్-క్లాస్ 250 సీడీఐ ధర 4% పెరుగుదలతో రూ. 50.98 లక్షలుగాను ఉంటుందని మెర్సిడెస్-బెంజ్ ఇండియా సీఈవో ఎబర్‌హార్డ్ కెర్న్ తెలిపారు. ఇవన్నీ ముంబైలో ఎక్స్ షోరూం ధరలు. మరో కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్... వచ్చే నెల తొలి వారం నుం చి 3 మోడల్స్ రేట్లను రూ. 10,000 దాకా పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. బీఎండబ్ల్యూ 5% దాకా, ఆడి 4% దాకా ధరలు పెంచాయి.