బెంజ్‌లో గం‘జాయ్‌’! | marijuana cought benz car in drunk and drive | Sakshi
Sakshi News home page

బెంజ్‌లో గం‘జాయ్‌’!

Published Sun, Feb 19 2017 1:05 AM | Last Updated on Wed, Apr 3 2019 4:59 PM

దెబ్బతిన్న బీఎండబ్ల్యూ  ,బెంజ్‌ కారులో లభ్యమైన గంజాయి - Sakshi

దెబ్బతిన్న బీఎండబ్ల్యూ ,బెంజ్‌ కారులో లభ్యమైన గంజాయి

మంత్రుల కుమారుల డ్రంకన్‌ డ్రైవ్‌?
కారులో మాజీ సీఎం తనయుడు?
నిలిపిఉన్న బీఎండబ్ల్యూను ఢీకొట్టిన వైనం
తానే కారు నడిపానంటూ వేరే వ్యక్తి ఒప్పుకోలు
కేసు తప్పుదోవ పడుతోందంటున్న ప్రత్యక్ష సాక్షులు  


హైదరాబాద్‌: ఆగిఉన్న బీఎండబ్ల్యూ కారును వేగంగా వచ్చిన బెంజ్‌ వెనుక నుంచి ఢీకొట్ట డంతో అది ధ్వంసమైంది. ప్రమాదానికి కార ణమైన కారును మద్యం మత్తులో ఉన్న మంత్రుల కుమారులు నడుపుతున్నారని తెలి సింది. పోలీసులు మాత్రం అనామకుడిపై కేసు నమోదు చేసి తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 31కి చెందిన ఎన్‌. అనిల్‌కుమార్‌రెడ్డి వాకింగ్‌ కోసం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం 1లోని గేట్‌ నం.2 వద్ద ప్రధాన రోడ్డుపై తన బీఎం డబ్ల్యూ కారు (ఏపీ 09 సీఎస్‌ 9293)ను నిలిపి వాకింగ్‌కు వెళ్లారు. అదే సమయంలో జూబ్లీ హిల్స్‌ నుంచి ఫిలింనగర్‌ వైపు వేగంగా వెళ్తు న్న బెంజ్‌ (టీఎస్‌ 09 ఏఆర్‌ టీఆర్‌1051) బీఎండబ్ల్యూను వెనుక భాగంలో ఢీకొట్టింది. దీంతో అది తీవ్రంగా దెబ్బతింది.

ఆ సమ యంలో సంఘటనా స్థలంలో ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమా దానికి కారణమైన బెంజ్‌ కారును నడుపు తున్న యువకుడితో పాటు అందులో కూర్చు న్న మరో ఇద్దరు యువకులు ఎయిర్‌బెలూన్లు ఓపెన్‌ కావడంతో బతికి బయటపడ్డారు. అదే సమయంలో వాకర్లు కొందరు యాక్సిడెంట్‌ అయిన విషయాన్ని గుర్తించి బెంజ్‌ కారు డోర్‌ తెరిచారు. గంజాయి పొగతో పాటు మద్యం వాసన, మద్యం సీసాలు అందులో కనిపించాయని వారు తెలిపారు. అందులో కూర్చున్న ముగ్గురు యువ కులు మత్తులో ఉండి ఇదేమి గమనించకపోవ డంతో వారిని దించే ప్రయ త్నం చేస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన మరో కారు వారిని తమ కారులోకి ఎక్కించుకొని వెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

బెంజ్‌లో ఉన్నవారంతా వీవీఐపీలే..
బెంజ్‌ కారు నడిపిన యువకుడు ఓ మంత్రి కొడుకు కాగా, అందులో ఓ మాజీ సీఎం కొడుకు, తాజా మంత్రి కొడుకు కూడా ఉన్న ట్లు సమాచారం. వెనకాల కారులో వచ్చిన ఇద్దరు యువకులూ మంత్రుల కొడుకులేనని తెలిసింది. వాకింగ్‌ చేసి బయటకు వచ్చిన అనిల్‌కుమార్‌రెడ్డి తన కారు ధ్వంసంపై జూబ్లీ హిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకొని, దెబ్బతిన్న కార్లను స్టేషన్‌కు తరలించారు. కాగా తానే కారు నడిపానంటూ సైదాబాద్‌కు చెందిన రాఘవేందర్‌రెడ్డి పోలీసులకు లొంగిపోవడం తో ఆయనపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనకు బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మంత్రుల కొడుకులే పోలీసులను బురిడి కొట్టించి కేసులో ఓ అనామకుడిని చేర్చినట్లు తెలుస్తోంది.

ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షులు కూడా కారులో ముగ్గురు వ్యక్తులు కూర్చురన్నారని.. కారు నిండా గంజాయి పొగ కమ్ముకుందని, మద్యం సీసాలూ ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు వారు ఫొటోలూ తీశారు. వెనకాల వచ్చిన మరో కారులో వ్యక్తులు ఈ ముగ్గురిని తరలించినట్లు కూడా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఓ మాజీ ముఖ్యమంత్రి కుమారుడితో పాటు ఓ మంత్రి బంధువులు అక్కడికి వచ్చారని.. కేసుతో వారికి సంబంధముందని చెప్పడానికి ఇదే నిదర్శనమని వారు చెబుతున్నారు. ప్రమాదానికి కారకులైన వారు మంత్రులకు సంబంధించిన వారు కావడంతో కేసును పక్కదోవ పట్టిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ప్రమాదానికి కారణమైన కారు బార్‌ ఎస్టేట్‌ పేరు మీద ఉందని పోలీసులు తెలిపారు. వాహనంలో మద్యం సీసా మాత్రమే దొరికిందని, వాహనాన్ని నడుపు తున్న వ్యక్తి ఎలాంటి మద్యం సేవించలేదని పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement