బెంజ్ కార్ల ధరలు పెంపు | Mercedes-Benz India to hike car prices by up to 4.5 per cent from September | Sakshi
Sakshi News home page

బెంజ్ కార్ల ధరలు పెంపు

Published Fri, Aug 30 2013 1:47 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM

బెంజ్ కార్ల ధరలు పెంపు

బెంజ్ కార్ల ధరలు పెంపు

న్యూఢిల్లీ: రూపాయి పతనం దెబ్బకి కార్ల కంపెనీలు రేట్లు పెంచక తప్పడం లేదు. తాజాగా లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ వచ్చే నెల 1 నుంచి తమ కార్ల ధరలను 2.5% నుంచి 4.5% దాకా పెంచనున్నట్లు ప్రకటించింది. రూపాయి క్షీణత, అధిక దిగుమతి సుంకాలే ఇందుకు కారణంగా కంపెనీ తెలిపింది. కొత్త మార్పులతో ఏ-క్లాస్ 180 సీడీఐ కారు ధర 4% పెరిగి రూ. 22.05 లక్షలుగాను, బి-క్లాస్ 180 సీడీఐ ధర కూడా 4% పెంపుతో రూ. 23.50 లక్షలుగా ఉండనుంది. 
 
 అలాగే, కొత్తగా ప్రవేశపెట్టిన ఈ-క్లాస్ 200 సీజీఐ ధర 3.5% పెంపుతో రూ. 42.16 లక్షలుగా, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం ఎంఎల్-క్లాస్ 250 సీడీఐ ధర 4% పెరుగుదలతో రూ. 50.98 లక్షలుగాను ఉంటుందని మెర్సిడెస్-బెంజ్ ఇండియా సీఈవో ఎబర్‌హార్డ్ కెర్న్ తెలిపారు. ఇవన్నీ ముంబైలో ఎక్స్ షోరూం ధరలు. మరో కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్... వచ్చే నెల తొలి వారం నుం చి 3 మోడల్స్ రేట్లను రూ. 10,000 దాకా పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. బీఎండబ్ల్యూ 5% దాకా, ఆడి 4% దాకా ధరలు పెంచాయి. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement