
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహనాల తయారీలో ఉన్న దైమ్లర్ ఇండియా తాజాగా పాత వాహనాల విక్రయాల్లోకి ప్రవేశించింది. భారత్ బెంజ్ సర్టిఫైడ్ పేరుతో కార్యకలాపాలు సాగించనున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ కేంద్రాల్లో భారత్ బెంజ్ ట్రక్కులను పునరుద్ధరించి విక్రయిస్తారు. ప్రతి వాహనానికి 125 రకాల నాణ్యత పరీక్షలు జరిపి, రిపేర్ చేస్తారు. ఆరు నెలల వారంటీ ఉంటుంది.
భారత్ బెంజ్ సర్టిఫైడ్ డిజిటల్ వేదికగా క్రయ విక్రయాలను జరుపుతుంది. కంపెనీ తొలుత బెంగళూరులో ఈ సేవలు ప్రారంభించింది. దశలవారీగా ఇతర నగరాలకు విస్తరిస్తారు. కాగా, ఇతర బ్రాండ్లకు చెందిన వాణిజ్య వాహనాలను మార్పిడి చేసుకుని వినియోగదార్లు భారత్ బెంజ్ వాహనాలను కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment