certified
-
ఎగిరే కారుకు ఆమోదం.. ఇక త్వరలో గాల్లోకి..
ప్రపంచంలోని మొట్టమొదటి ఎగిరే కారు (Flying Car) ఇప్పుడు ఫ్లైట్ సర్టిఫికెట్ పొందింది. 177 కిలో మీటర్ల రేంజ్‌తో రూపొందించిన ఎలక్ట్రిక్ ఎగిరే కార్లను 2025 చివరి నాటికి కస్టమర్లకు డెలివరీ చేయడం ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. అలెఫ్ ఏరోనాటిక్స్ తయారు చేస్తున్న ఫ్లయింగ్ కారు ఎగరడానికి యూఎస్ ప్రభుత్వం నుంచి చట్టపరమైన ఆమోదం పొందింది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) నుంచి ప్రత్యేకమైన ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికేషన్‌ను పొందినట్లు కార్ కంపెనీ ప్రకటించింది. ఏవియేషన్ న్యాయ సంస్థ ‘ఏరో లా సెంటర్’ ప్రకారం.. ఈ తరహా వాహనం యూఎస్‌లో ఇలాంటి సర్టిఫికెట్ పొందడం ఇదే మొదటిసారి. ఫాక్స్ న్యూస్ ప్రచురించిన కథనం ప్రకారం.. కాలిఫోర్నియాలోని శాన్ మాటియో కేంద్రంగా తయారైన ఈ ఫ్లయింగ్ కారు వంద శాతం పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం. ఒకరు లేదా ఇద్దరు ఇందులో ప్రయాణించవచ్చు. రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు ఈ కారు గాల్లో ప్రయాణించగలదు. దీని ధర సుమారు 3 లక్షల డాలర్లు (రూ. 2.5 కోట్లు) ఉండనుంది. గతేడాది అక్టోబరులో రెండు వర్కింగ్ ఫుల్ సైజ్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ కార్లను ఫుల్ సైజ్ స్పోర్ట్స్ కార్‌తోపాటు కంపెనీ ఆవిష్కరించింది. తమ వాహనాలకు 440కిపైగా వ్యక్తిగత, కార్పొరేట్ కస్టమర్ల నుంచి ముందస్తు ఆర్డర్ల వచ్చినట్లు కంపెనీ గత జనవరిలో పేర్కొంది. నివేదికల ప్రకారం.. 2025 చివరి నాటికి కస్టమర్లకు ఎగిరే కార్లను డెలివరీ చేయడం ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. చరిత్రలో మొట్టమొదటి నిజమైన ఎగిరే కారును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, పెద్ద సంఖ్యలో ముందస్తు ఆర్డర్లు లభించడం ఇలాంటి కార్లకు రానునన్న మార్కెట్ సామర్థ్యాన్ని తెలియజేస్తోందని అలెఫ్ కంపెనీ సీఈవో జిమ్ దుఖోవ్నీ ఈ ఏడాది ప్రారంభంలో ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అలెఫ్ కంపెనీ వెబ్సైట్ ప్రకారం.. సాధారణ పట్టణ, గ్రామీణ రోడ్లపై నడపడానికి ఫ్లయింగ్ కారును అభివృద్ధి చేస్తున్నారు. మామూలు పార్కింగ్ స్థలంలోనే ఈ కారును పార్క్ చేయవచ్చు. ఇది తక్కువ వేగంతో నడిచే వాహనం కాబట్టి రోడ్లపై గంటకు 25 మైళ్లకు మించి వేగంగా వెళ్లదు. కానీ వేగంగా వెళ్లాలనుకుంటే కారును గాల్లోకి లేపి వేగంగా ప్రయాణించవచ్చు. 【空飛ぶカート】 Alef Aeronautics社の一部制限ありで公道走行も可能な電動LSV「モデルA」がFAAから限定的な特別耐空証明を取得。名実共に「空飛ぶカート」(eVTOL)となった模様。#空飛ぶクルマ 《Weird gimballed-cabin eVTOL “flying car” receives limited FAA approval》https://t.co/8wKi2GTqvC pic.twitter.com/lwPSCMDpyk — Iwahori Toshiki (@iw_toshiki) June 29, 2023 -
ప్రీ–ఓన్డ్ విభాగంలోకి భారత్ బెంజ్ సర్టిఫైడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహనాల తయారీలో ఉన్న దైమ్లర్ ఇండియా తాజాగా పాత వాహనాల విక్రయాల్లోకి ప్రవేశించింది. భారత్ బెంజ్ సర్టిఫైడ్ పేరుతో కార్యకలాపాలు సాగించనున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ కేంద్రాల్లో భారత్ బెంజ్ ట్రక్కులను పునరుద్ధరించి విక్రయిస్తారు. ప్రతి వాహనానికి 125 రకాల నాణ్యత పరీక్షలు జరిపి, రిపేర్ చేస్తారు. ఆరు నెలల వారంటీ ఉంటుంది. భారత్ బెంజ్ సర్టిఫైడ్ డిజిటల్ వేదికగా క్రయ విక్రయాలను జరుపుతుంది. కంపెనీ తొలుత బెంగళూరులో ఈ సేవలు ప్రారంభించింది. దశలవారీగా ఇతర నగరాలకు విస్తరిస్తారు. కాగా, ఇతర బ్రాండ్లకు చెందిన వాణిజ్య వాహనాలను మార్పిడి చేసుకుని వినియోగదార్లు భారత్ బెంజ్ వాహనాలను కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. -
రెండేళ్లుగా కరువున్నా నీటికొరత లేదు!
తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి ప్రాంతం రెండున్నరేళ్ల క్రితం తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్నది. ఆ జిల్లా ఉదయంపులి గ్రామంలో సేంద్రియ రైతు కె.జయచంద్రన్కు చెందిన 200 ఎకరాల సర్టిఫైడ్ సేంద్రియ (బయోడైనమిక్) వ్యవసాయ క్షేత్రంలో అప్పట్లో తీవ్ర నీటికొరత ఏర్పడింది. ఆ దశలో గుంటూరుకు చెందిన తన మిత్రుడు, సేంద్రియ రైతు ప్రకాశ్‌రెడ్డి సలహా మేరకు.. జయచంద్రన్ తన ఉద్యాన తోటల మధ్యలో వాలుకు అడ్డంగా కందకాలు తవ్వించారు. అప్పుడు కందకాలు తవ్వటం వల్ల గత రెండు సంవత్సరాలుగా పెద్దగా వర్షాలు లేకపోయినా.. తోటల సాగుకు ఎటువంటి నీటి కొరతా లేకుండా సజావుగా దిగుబడులను అందుకోగలుగుతున్నానని జయచంద్రన్ ‘సాగుబడి’తో చెప్పారు. 200 వ్యవసాయ క్షేత్రంలో 5–6 ఎకరాలకు ఒక క్లస్టర్‌గా విభజించుకున్న జయచంద్రన్.. వేర్వేరు క్లస్టర్లలో ఉసిరి, మామిడి, కొబ్బరి, సపోట, బొప్పాయి, నిమ్మ, అరటి, మునగ తోటలను బయోడైనమిక్ సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. వీటితోపాటు 5 నుంచి 25 సంవత్సరాల్లో కోతకు వచ్చే అనేక జాతుల కలప చెట్లను వేలాదిగా పెంచుతున్నారు. వీటికి బిందు సేద్యం ద్వారా నీరందిస్తున్నారు. క్లస్టర్ల మధ్యలో మట్టి కట్టల వెంట 9 అడుగుల వెడల్పు, 6–7 అడుగుల లోతున కందకాలు తవ్వించారు. కందకాలలో ప్రతి వంద మీటర్లకు ఒక చోట చెక్ వాల్స్ నిర్మించారు. స్వల్ప ఖర్చుతో నిర్మించిన కందకాల ద్వారా వాన నీరంతా భూమిలోకి ఇంకడం వల్ల 27 బోర్లు, 6 పెద్ద వ్యవసాయ బావుల్లో నీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చింది. గత రెండేళ్లుగా నీటి కొరత సమస్యే లేదని జయచంద్రన్(96772 20020) తెలిపారు. సాక్షి, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం సంయుక్తంగా ‘చేను కిందే చెరువు’ పేరిట ఐదేళ్ల క్రితం నుంచి నిర్వహిస్తున్న ప్రచారోద్యమ స్ఫూర్తితోనే తన మిత్రుడు జయచంద్రన్కు కందకాల గురించి సూచించానని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. -
పెళ్లికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ధ్రువీకరణ పత్రంతో లాభాలెన్నో.. నెట్వర్క్ : వివాహానికి చట్టబద్ధత కల్పించడం కోసేమే రిజిస్ట్రేషన్. గతంలో పెళ్లి పత్రికలు, ఫొటోలు మాత్రమే వివాహాలకు ఆధారంగా ఉండేవి. అలాకాకుండా వివాహాలు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రభుత్వం చట్టం తీసుకు వచ్చింది. జరిగిన వివాహాన్ని అధికారికంగా ధ్రువీకరిస్తూ ఇచ్చే పెళ్లి నమోదు పత్రం భవిష్యత్‌లో ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్టాన్ని 2002 మే లో రాష్ట్ర గవర్నర్ ఆమోదించగా 2006 నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని కూలాలు, మతాలు, వర్గాలకు వర్తించనుంది. ఈ చట్టంలోని సెక్షన్ -8 ప్రకారం రాష్ట్రంలో జరిగే ప్రతి వివాహం తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించాలని స్పష్టం చేసింది. ఈ చట్టం అమలుకు రాష్ట్రస్థాయిలో వివాహాల రిజిస్ట్రార్ ఉంటారు. అన్ని జిల్లాలకు జిల్లా రిజిస్ట్రార్ ఉంటారు. వివాహాల రిజిస్ట్రార్ జనరల్‌కు లోబడి జిల్లాలో అమలు చేసే బాధ్యత సంబంధిత సబ్ రిజిస్ట్రార్లపైనే ఉంటుంది. వివాహం నమోదు ఇలా.. వివాహం జరిగిన రోజు నుంచి 30 రోజుల్లోపు వధువు లేదా వరుడు ఇద్దరిలో ఎవరి తల్లితండ్రులు, సంరక్షకులైనా వివాహం నమోదు కోసం నిర్దేశించిన దరఖాస్తు ఫారం నింపి అధికారికి అందించాలి. దరఖాస్తులు వధూవరుల వయస్సు తెలియజేసే ధ్రువపత్రాలు మరియు ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు. వీటిని ఏదైనా గెజిటెడ్ అధికారితో ఎటాస్టడ్ చేయించుకోవాల్సి ఉంది. వీటితోపాటు శుభలేక, ఒక ఫొటో, కల్యాణ మండపంలో జరిగితే అద్దె రసీదు, దేవాలయంలో జరిగితే ఫీజు రసీదులు జత చెయ్యాలి. వధూవరులు తరుపున ముగ్గురు సాక్షులు రిజిస్ట్రార్ సమక్షంలో సంతకాలు చెయ్యాల్సి ఉంటుంది. సాక్షుల ఆధార్ లేదా గుర్తింపు కార్డులు జత చెయ్యాలి. రిజిస్ట్రార్ ఈ సమాచారాన్ని రిజిస్ట్రర్‌లో నమోదు చేసి అందరి సంతకాలు తీసుకుంటారు. పెళ్లి జరిగే ప్రదేశంలోను, మన ఇంటి వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అయితే ముందుగా దరఖాస్తు చేసుకుని ఆ ప్రాంతం రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీని కోసం నిర్దేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వివాహ నమోదు పత్రం (సర్టిఫికెట్)పై ధ్రువీకరణ అధికారి సంతకం సీలు వేసి దంపతులకు అందిస్తారు. ఆ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రూ.210 ఫీజు చెల్లించి నమోదు చేసుకోవచ్చు. గతంలో ఏడాది దాటితే జిల్లా రిజిస్ట్రార్ అనుమతి కోసం పంపేవారమని నేడు స్థానిక సబ్ రిజిస్ట్రార్‌లోనే వివాహ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు గుణదల సబ్ రిజిస్ట్రేషన్ అధికారి కృష్ణప్రసాద్ తెలిపారు. ఎందుకు నమోదు చేసుకోవాలంటే.. ⇒ఈ విధంగా నమోదు చేసుకుంటే జరిగిన వివాహానికి చట్టబద్ధత ఉంటుంది. ⇒కుటుంబానికి సంబంధించి ప్రభుత్వ పథకాలన్నీ వర్తించేందుకు ఉపయోగపడుతుంది. ⇒భర్త నుంచి విడిపోయినా, దూరంగా ఉన్నా భరణం కోరేందుకు ఆధారంగా ఉపయోగపడుతుంది. ⇒వరకట్నం కేసులో నేరం రుజువు కావడానికి ముఖ్య ఆధారంగా ఈ ధ్రువీకరణ పత్రం ఉపయోగపడుతుంది. ⇒విడాకులుకోరే భార్య లేదా భర్త కూడా వివాహం జరిగినట్టు ఆధారం చూపించాల్సి ఉంటుంది. ⇒రెండవ వివాహాలను అడ్డుకోవాడనికి మహిళలు లేదా పురుషులకు ఇది ముఖ్యమైన సాక్షంగా ఉపయోగపడుతుంది. తప్పుడు సమాచారమిస్తే శిక్ష వివాహ నమోదు పత్రంలో మోసపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినట్టు రుజువైతే ఏడాది జైలు శిక్ష లేదా వెయ్యి జరిమానా, లేదా ఈ రెండు అమలు చేస్తారు. ఉద్దేశ పూర్వకరంగా అధికారి వివాహ నమోదు చెయ్యలేదని దరఖాస్తు దారుని ఫిర్యాదు రుజువైతే ఆఅధికారికి మూడు నెలల జైలు శిక్ష, రూ.500 జరిమానా, లేదా రెండు శిక్షలు అమలు చేస్తారు. -
నిలువు దోపిడీ
బద్వేలు: వేగంగా.. సులభంగా అంటూ ప్రజలకు సేవ చేయాల్సిన మీసేవా కేంద్రాలు నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. సామాన్యులు ఏదైనా సర్టిఫికేట్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అధిక రుసుం చెల్లించాల్సిందే. నియోజకవర్గ కేంద్రమైన బద్వేలులో మూడు, పోరుమామిళ్లలో ఐదు, కాశినాయన, కలసపాడులో నాలుగేసి వంతున, బి.కోడూరులో మూడు, అట్లూరులో రెండు మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఏదైనా సర్టిఫికేట్ దరఖాస్తు చేసేందుకు వెళితే జేబుల్లో ఉన్నదంతా సమర్పించుకోవాల్సిందే. ప్రతి సర్టిఫికేట్కు అదనంగా రూ.15 నుంచి రూ.25 వరకు వసూలు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రెన్యూవల్స్ కోసం కుల, ఆదాయ, ఈబీసీ, నేటీవిటి, రెసిడెన్సీ వంటి సర్టిఫికేట్లు ప్రతి విద్యార్థికి అవసరం. నియోజకవర్గంలో దాదాపు 10 వేల మందికి పైగా విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పరిధిలో ఉన్నారు. ఓటర్‌కార్డుకు రూ.10, రెసెడెన్సీ, నేటివిటీ, కుల, ఆదాయ ధృవపత్రాలకు రూ.35 వసూలు చేయాల్సి ఉండగా రూ.50 వరకు తీసుకుంటున్నారు. ఇలా ప్రతి పత్రానికి అదనంగా రూ.15 వరకు తీసుకుంటున్నారు. దీంతో పాటు బర్త్ సర్టిఫికేట్ ప్రింట్ తీసివ్వాలన్నా అదనంగా రూ.20 సమర్పించుకోవాల్సిందే. ఆధార్‌కు ఆగచాట్లు నియోజకవర్గంలో దాదాపు 2 శాతం మందికి ఆధార్ కార్డులు లేవు. ప్రస్తుతం రుణమాఫీ, పీజు రీయింబర్స్మెంట్, ఇతర వివరాల కోసం తప్పనిసరి కావడంతో మీ సేవా కేంద్రాల్లో ఆధార్ తీయించుకునేందుకు పరుగులు తీస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని మీ సేవా కేంద్రం నిర్వాహకులు దోపిడీ చేస్తున్నారు. ఆధార్ కార్డు తీసేందుకు మండలానికి ఒక కేంద్రానికి అనుమతి ఇచ్చారు. ఉచితంగా తీయాల్సిన కార్డుకు రూ.వంద వరకు వసూలు చేస్తున్నారు. అత్యవసరమంటే రూ.200 వరకు రాబడుతున్నారు. అదే దారిలో రిజిస్ట్రేషన్ స్టాంపులు బద్వేలు రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయనల్లో దాదాపు 15 మంది వరకు స్టాంపు వెండర్లు ఉన్నారు. వీరంతా కూడా అమ్మాల్సిన ధరకంటే అదనంగా రూ.10 నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. రూ.10 స్టాంపునకు రూ.20, రూ.100 స్టాంపునకు రూ.130, రూ. 2 రెవెన్యూ స్టాంపునకు రూ.5 వసూలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి ప్రతి రోజు వందమంది వరకు వివిధ రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లు కోసం వస్తుంటారు. త్వరగా పని జరగాలంటే వీరందరూ స్టాంపువెండర్లు అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. దీంతో పాటు రెవెన్యూ కార్యాలయం సమీపంలో వివిధ రకాల పత్రాలను కొందరు విక్రయిస్తున్నారు. ఒక్కొక్క పత్రం కనీసం 50 పైసలు కూడా పడదు. కానీ రూ.5 వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతి పని దగ్గర సామాన్యుడు దోపిడీకి గురవుతున్నాడు. చర్యలు తీసుకుంటాం మీ సేవా కేంద్రాలలో అధిక రుసుం వసూలు చేస్తున్నారనే విషయమై జిల్లా కో ఆర్డినేటర్ ఖలీల్ ఆహ్మద్‌ను వివరణ కోరగా కేంద్రాల్లో ఫీజు ఛార్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇలా ఏర్పాటు చేయని కేంద్రాలపై చర్యలు చేపడతామన్నారు. అధిక రుసుం విషయమై చాలామంది ఫోన్లలో ఫిర్యాదు చేస్తున్నారని, ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.