ప్రపంచంలోని మొట్టమొదటి ఎగిరే కారు (Flying Car) ఇప్పుడు ఫ్లైట్ సర్టిఫికెట్ పొందింది. 177 కిలో మీటర్ల రేంజ్‌తో రూపొందించిన ఎలక్ట్రిక్ ఎగిరే కార్లను 2025 చివరి నాటికి కస్టమర్లకు డెలివరీ చేయడం ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది.
అలెఫ్ ఏరోనాటిక్స్ తయారు చేస్తున్న ఫ్లయింగ్ కారు ఎగరడానికి యూఎస్ ప్రభుత్వం నుంచి చట్టపరమైన ఆమోదం పొందింది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) నుంచి ప్రత్యేకమైన ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికేషన్‌ను పొందినట్లు కార్ కంపెనీ ప్రకటించింది. ఏవియేషన్ న్యాయ సంస్థ ‘ఏరో లా సెంటర్’ ప్రకారం.. ఈ తరహా వాహనం యూఎస్‌లో ఇలాంటి సర్టిఫికెట్ పొందడం ఇదే మొదటిసారి.
ఫాక్స్ న్యూస్ ప్రచురించిన కథనం ప్రకారం.. కాలిఫోర్నియాలోని శాన్ మాటియో కేంద్రంగా తయారైన ఈ ఫ్లయింగ్ కారు వంద శాతం పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం. ఒకరు లేదా ఇద్దరు ఇందులో ప్రయాణించవచ్చు. రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు ఈ కారు గాల్లో ప్రయాణించగలదు. దీని ధర సుమారు 3 లక్షల డాలర్లు (రూ. 2.5 కోట్లు) ఉండనుంది.
గతేడాది అక్టోబరులో రెండు వర్కింగ్ ఫుల్ సైజ్ టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్ కార్లను ఫుల్ సైజ్ స్పోర్ట్స్ కార్‌తోపాటు కంపెనీ ఆవిష్కరించింది. తమ వాహనాలకు 440కిపైగా వ్యక్తిగత, కార్పొరేట్ కస్టమర్ల నుంచి ముందస్తు ఆర్డర్ల వచ్చినట్లు కంపెనీ గత జనవరిలో పేర్కొంది.
నివేదికల ప్రకారం.. 2025 చివరి నాటికి కస్టమర్లకు ఎగిరే కార్లను డెలివరీ చేయడం ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. చరిత్రలో మొట్టమొదటి నిజమైన ఎగిరే కారును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, పెద్ద సంఖ్యలో ముందస్తు ఆర్డర్‌లు లభించడం ఇలాంటి కార్లకు రానునన్న మార్కెట్ సామర్థ్యాన్ని తెలియజేస్తోందని అలెఫ్ కంపెనీ సీఈవో జిమ్ దుఖోవ్నీ ఈ ఏడాది ప్రారంభంలో ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
అలెఫ్ కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. సాధారణ పట్టణ, గ్రామీణ రోడ్లపై నడపడానికి ఫ్లయింగ్ కారును అభివృద్ధి చేస్తున్నారు. మామూలు పార్కింగ్ స్థలంలోనే ఈ కారును పార్క్ చేయవచ్చు. ఇది తక్కువ వేగంతో నడిచే వాహనం కాబట్టి రోడ్లపై గంటకు 25 మైళ్లకు మించి వేగంగా వెళ్లదు. కానీ వేగంగా వెళ్లాలనుకుంటే కారును గాల్లోకి లేపి వేగంగా ప్రయాణించవచ్చు.
【空飛ぶカート】
— Iwahori Toshiki (@iw_toshiki) June 29, 2023
Alef Aeronautics社の一部制限ありで公道走行も可能な電動LSV「モデルA」がFAAから限定的な特別耐空証明を取得。名実共に「空飛ぶカート」(eVTOL)となった模様。#空飛ぶクルマ
《Weird gimballed-cabin eVTOL “flying car” receives limited FAA approval》https://t.co/8wKi2GTqvC pic.twitter.com/lwPSCMDpyk
Comments
Please login to add a commentAdd a comment