flying car
-
నేలపై కారు.. గాలిలోనూ షికారు!
చైనీస్ ఆటోమేకర్ ఎక్స్‌పెంగ్ అనుబంధ సంస్థ అయిన ఎక్స్‌పెంగ్ ఏరోహ్ట్ ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ పేరుతో కొత్త మాడ్యులర్ ఫ్లయింగ్ కారును ఆవిష్కరించింది. రెండు మాడ్యూళ్లను కలిగిన ఈ కారును ఇటీవలి 15వ చైనా ఇంటర్నేషనల్ ఏవియేషన్ & ఏరోస్పేస్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించింది.ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లో మదర్షిప్, ఎయిర్‌క్రాఫ్ట్ అనే రెండు మాడ్యూల్స్ ఉన్నాయి. మదర్షిప్ పొడవు 5.5 మీటర్లు, ఎత్తు, వెడల్పు 2 మీటర్లు ఉంటుంది. విద్యుత్‌తో నడిచే ఈ కారు ఇది 1000 కిలోమీటర్లకుపైగా రేంజ్‌ని ఇస్తుందని కంపెనీ చెబుతోంది.ఎయిర్‌క్రాఫ్ట్ ఆరు-రోటర్, డ్యూయల్-డక్ట్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ , తేలికైన మన్నిక కోసం కార్బన్ ఫైబర్‌ను ఉపయోగించి తయారు చేశారు. ఇందులో ఇద్దరు కూర్చునే అవకాశం ఉంది. ఎక్స్‌పెంగ్ ఈ ఫ్లయింగ్ కార్లను ఒక కొత్త ఫ్యాక్టరీలో తయారు చేస్తోంది. ఇది 10,000 యూనిట్ల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ డెలివరీలు 2026లో ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.China’s Xpeng just unveiled a modular flying car called the Land Aircraft Carrier. This vehicle combines a ground module—a fully functional EV—with an air module capable of vertical takeoff and flight. pic.twitter.com/ZpqW7CjSr5— Tansu Yegen (@TansuYegen) November 20, 2024 -
14 సంవత్సరాల కృషి.. నిజమవుతున్న ఎగిరే కారు కల - వీడియో
ఇప్పటివరకు డీజిల్, పెట్రోల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయ్ అంటూ గత కొన్ని రోజులుగా చాలా కంపెనీలు చెబుతూనే ఉన్నాయి. కొన్ని సంస్థలు చెప్పినట్లుగానే ఎగిరే కార్లను విడుదల చేసే పనిలో ఉంటే. మరి కొన్ని సైలెంట్‌గా ఉన్నాయి. అయితే 'సామ్సన్ స్కై' (Samson Sky) కంపెనీ ఎట్టకేలకు ఓ ఫ్లైయింగ్ కారుని తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వాషింగ్టన్‌లోని మోసెస్ లేక్‌లోని గ్రాంట్ కంట్రీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 'సామ్సన్ స్విచ్‌బ్లేడ్' (Samson Switchblade) ఆకాశానికి ఎగిరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది దాదాపు ఆరు నిముషాలు 500 అడుగులు ఎత్తులో ఎగిరింది. సుమారు 14 సంవత్సరాల తరువాత కంపెనీ తన మొదటి ఫ్లైయింగ్ కారు తయారైందని సంస్థ సీఈఓ, స్విచ్‌బ్లేడ్ రూపకర్త 'సామ్ బౌస్ఫీల్డ్' తెలిపాడు. ఇప్పటికే సుమారు 57 దేశాల నుంచి 170000 డాలర్ల అంచనా ధరతో 2300 రిజర్వేషన్స్ తీసుకున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. రెండు సీట్లు కలిగిన ఈ ఫ్లైయింగ్ కారు స్ట్రీట్ మోడ్‌లో గంటకు 200 కిమీ, ఫ్లైట్ మోడ్‌లో 322 కిమీ/గం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదని కంపెనీ ధ్రువీకరించింది. ఈ కారులోని వింగ్స్, టెయిల్ వంటివి పార్కింగ్స్ సమయంలో ముడుచుకుని ఉంటాయి. కాబట్టి పార్కింగ్ కోసం ఎక్కువ స్థలం కేటాయించాల్సిన అవసరం లేదు. ఇదీ చదవండి: రెండు హోటల్స్ నుంచి ఏడు దేశాలకు.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన ఒబెరాయ్ సామ్సన్ స్విచ్‌బ్లేడ్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 125 లీటర్లు వరకు ఉంటుంది. కాబట్టి ఒక ఫుల్ ట్యాంక్‌లో 805కిమీ పరిధిని అందిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ కారు ఎప్పుడు అధికారికంగా మార్కెట్లో విడుదలవుతుందనే సమాచారం కంపెనీ స్పష్టంగా వెల్లడించలేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
ఏమో! కారు ఎగరావచ్చు.. కానీ!
నగరాల్లో విపరీతమైన వాహనాల రద్దీ, అధ్వాన్నమైన రహదారుల వల్ల సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రయాణికులు విసుగెత్తిపోతుంటారు. ట్రాఫిక్ జంఝాటం లేకుండా హాయిగా ఆకాశంలో విహరిస్తూ వేగంగా దూసుకెళ్తే బాగుంటుందని అనుకోనివారు ఉండరు. అలాంటివారి కోసం అమెరికాలోని కాలిఫోరి్నయాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ సంస్థ ఎగిరే కారును(ఫ్లైయింగ్ కారు) అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. 2015లో మొదలైన ఈ ఆలోచనకు పదునుపెట్టిన అలెఫ్ కంపెనీ 2019 నాటికి ఎగిరే కారును తయారు చేసింది. మోడల్–ఎ ఫ్లైయింగ్ కారును ఆవిష్కరించింది. కొన్ని రకాల పరీక్షల తర్వాత ఈ ఏడాది జూన్ 12న అమెరికా ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్(ఎఫ్ఏఏ) ఈ కారుకు స్పెషల్ ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికెట్ అందజేసింది. అంటే పరిమిత ప్రాంతాల్లో ఫ్లైయింగ్ కారును ప్రదర్శించడానికి, దీనిపై పరిశోధన–అభివృద్ధి వంటి కార్యకలాపాల కోసం అనుమతి మంజూరు చేసింది. ఇదొక టరి్నంగ్ పాయింట్ అని చెప్పాలి. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఎగిరే కారు ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి రావడానికి సాంకేతికపరమైన, చట్టపరమైన ఎన్నో అవరోధాలు, సవాళ్లు ఉన్నాయి. వాటిని అధిగమిస్తేనే కారులో ఆకాశంలో స్వేచ్ఛగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. విడిభాగాల లభ్యత ఎలా ఎక్కువ సంఖ్యలో ఎగిరే కార్లను తయారు చేయడానికి కొన్ని విడిభాగాలు విస్తృతంగా అందుబాటులో లేవని అలెఫ్ ఏరోనాటిక్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జిమ్ డుఖోవ్నీ చెప్పారు. వాటిని సమకూర్చుకోవడం చాలా కష్టమని అన్నారు. ఉదాహరణకు ఫ్లైయింగ్ కారుకు ప్రయాణంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడానికి హైలీ స్పెషలైజ్డ్ ప్రొపెల్లర్ మోటార్ సిస్టమ్స్ అవసరమని, అలాంటివి తయారు చేసుకోవడం శ్రమ, ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని తెలిపారు. ఎగిరే కారు ఎంత త్వరగా క్షేత్రస్థాయిలోకి వస్తుందన్నది దాని పరిమాణం, బరువు, ధర, అది ఎంతవరకు సురక్షితం అనేదానిపైనా ఆధారపడి ఉంటుందన్నారు. సేఫ్టీ ఫీచర్ల మాటేమిటి అలెఫ్ కంపెనీ మోడల్–ఎ కార్ల విక్రయాల కోసం ఇప్పటికే ప్రి–ఆర్డర్లను స్వీకరిస్తోంది. ఒక్కో కారు ధరను 3 లక్షల డాలర్లుగా (రూ.2.46 కోట్లు) నిర్ధారించింది. మోడల్–ఎ అనేది అ్రల్టాలైట్, లో స్పీడ్ వెహికల్. చట్టప్రకారం ఈ మోడల్ కారు గోల్ఫ్ కార్ట్లు, చిన్నపాటి విద్యుత్ వాహనాల విభాగంలోకి వస్తుంది. ఫ్లైయింగ్ కారు కేవలం గాల్లో ఎగరడమే కాదు, రోడ్లపై కూడా సాధారణ వాహనాల్లాగే ప్రయాణిస్తుంది. దానికి అనుమతి రావాలంటే ‘నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్’ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అంటే సాధారణ కార్లలో ఉండే సేఫ్టీ ఫీచర్లన్నీ ఉండాలి. అలెఫ్ సంస్థ అభివృద్ధి చేసిన మోడల్–ఎ కారు రోడ్లపై ప్రయాణానికి అంతగా సురక్షితం కాదన్న వాదన వినిపిస్తోంది. భారీ శబ్ధాలు, కాలుష్యం ఫ్లైయింగ్ కార్లు పరిమితమైన ఎత్తులోనే ఎగురుతాయి. భారీ శబ్ధాలు, కాలుష్యం ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల కొత్త సమస్యలు తప్పవు. ప్రజల్లో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. ఏమాత్రం శబ్ధం వెలువడని ఫ్లైయింగ్ కార్లు డిజైన్ చేయడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అంటున్నారు. రోడ్లపై వాహనాలు ఢీకొంటున్నట్లుగానే గగనతలంలో వేగంగా దూసుకెళ్లే ఫ్లైయింగ్ కార్లు పరస్పరం ఢీకొనే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఎగిరే కార్లు భవనాలను ఢీకొని నేలకూలడానికి ఆస్కారం ఉంది. అదే జరిగితే నష్టం భారీగానే ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఆకాశంలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తరహాలో ఎగిరే కార్ల రాకపోకల కోసం శాస్త్రీయమైన మార్గసూచిని రూపొందించాలి. ధనవంతులకే సాధ్యమా? ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే ఎగరే కార్ల ధరలను సంపన్నులే భరించగలరు. కోట్లాది రూపాయలు వెచ్చించి ఇలాంటివి కొనేసే స్తోమత కొందరికే ఉంటుంది. నిర్వహణ ఖర్చులు, లైసెన్స్ ఫీజులు కూడా తక్కువేమీ కాదు. విమాన ప్రయాణం ప్రారంభమైన తొలి రోజుల్లో ధనవంతులకే పరిమితం అన్నట్లుగా ఉండేది. కానీ, ఇప్పుడు దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఫ్లైయింగ్ కార్ల విషయంలోనూ అలాంటి పరిణామం సాధ్యపడొచ్చు. ప్రభుత్వాలే ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా ఈ కార్లను ప్రవేశపెడితే సామాన్య ప్రజలు సైతం ఆకాశయానం చేయొచ్చు. నడపడానికి లైసెన్స్ ఎవరిస్తారు? కార్లు నడపాలన్నా, విమానాలు నడపాలన్నా కచ్చితంగా లైసెన్స్ ఉండాల్సిందే. ఫ్లైయింగ్ కార్లు నడపడానికి కూడా లైసెన్స్ అవసరం. డ్రైవింగ్ శిక్షణ ఎవరిస్తారు? లైసెన్స్‌లు ఎవరు జారీ చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వాలదే తుది నిర్ణయం. నేలపై, గాలిలో నడపడానికి డ్రైవర్లు శిక్షణ తీసుకోవాలి. ఫ్లైయింగ్ కార్ల డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేయడానికి రవాణా , పౌర విమానయాన శాఖ సమన్వయంతో పని చేయాల్సి రావొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎగిరే కారుకు ఆమోదం.. ఇక త్వరలో గాల్లోకి..
ప్రపంచంలోని మొట్టమొదటి ఎగిరే కారు (Flying Car) ఇప్పుడు ఫ్లైట్ సర్టిఫికెట్ పొందింది. 177 కిలో మీటర్ల రేంజ్‌తో రూపొందించిన ఎలక్ట్రిక్ ఎగిరే కార్లను 2025 చివరి నాటికి కస్టమర్లకు డెలివరీ చేయడం ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. అలెఫ్ ఏరోనాటిక్స్ తయారు చేస్తున్న ఫ్లయింగ్ కారు ఎగరడానికి యూఎస్ ప్రభుత్వం నుంచి చట్టపరమైన ఆమోదం పొందింది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) నుంచి ప్రత్యేకమైన ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికేషన్‌ను పొందినట్లు కార్ కంపెనీ ప్రకటించింది. ఏవియేషన్ న్యాయ సంస్థ ‘ఏరో లా సెంటర్’ ప్రకారం.. ఈ తరహా వాహనం యూఎస్‌లో ఇలాంటి సర్టిఫికెట్ పొందడం ఇదే మొదటిసారి. ఫాక్స్ న్యూస్ ప్రచురించిన కథనం ప్రకారం.. కాలిఫోర్నియాలోని శాన్ మాటియో కేంద్రంగా తయారైన ఈ ఫ్లయింగ్ కారు వంద శాతం పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం. ఒకరు లేదా ఇద్దరు ఇందులో ప్రయాణించవచ్చు. రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు ఈ కారు గాల్లో ప్రయాణించగలదు. దీని ధర సుమారు 3 లక్షల డాలర్లు (రూ. 2.5 కోట్లు) ఉండనుంది. గతేడాది అక్టోబరులో రెండు వర్కింగ్ ఫుల్ సైజ్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ కార్లను ఫుల్ సైజ్ స్పోర్ట్స్ కార్‌తోపాటు కంపెనీ ఆవిష్కరించింది. తమ వాహనాలకు 440కిపైగా వ్యక్తిగత, కార్పొరేట్ కస్టమర్ల నుంచి ముందస్తు ఆర్డర్ల వచ్చినట్లు కంపెనీ గత జనవరిలో పేర్కొంది. నివేదికల ప్రకారం.. 2025 చివరి నాటికి కస్టమర్లకు ఎగిరే కార్లను డెలివరీ చేయడం ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. చరిత్రలో మొట్టమొదటి నిజమైన ఎగిరే కారును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, పెద్ద సంఖ్యలో ముందస్తు ఆర్డర్లు లభించడం ఇలాంటి కార్లకు రానునన్న మార్కెట్ సామర్థ్యాన్ని తెలియజేస్తోందని అలెఫ్ కంపెనీ సీఈవో జిమ్ దుఖోవ్నీ ఈ ఏడాది ప్రారంభంలో ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అలెఫ్ కంపెనీ వెబ్సైట్ ప్రకారం.. సాధారణ పట్టణ, గ్రామీణ రోడ్లపై నడపడానికి ఫ్లయింగ్ కారును అభివృద్ధి చేస్తున్నారు. మామూలు పార్కింగ్ స్థలంలోనే ఈ కారును పార్క్ చేయవచ్చు. ఇది తక్కువ వేగంతో నడిచే వాహనం కాబట్టి రోడ్లపై గంటకు 25 మైళ్లకు మించి వేగంగా వెళ్లదు. కానీ వేగంగా వెళ్లాలనుకుంటే కారును గాల్లోకి లేపి వేగంగా ప్రయాణించవచ్చు. 【空飛ぶカート】 Alef Aeronautics社の一部制限ありで公道走行も可能な電動LSV「モデルA」がFAAから限定的な特別耐空証明を取得。名実共に「空飛ぶカート」(eVTOL)となった模様。#空飛ぶクルマ 《Weird gimballed-cabin eVTOL “flying car” receives limited FAA approval》https://t.co/8wKi2GTqvC pic.twitter.com/lwPSCMDpyk — Iwahori Toshiki (@iw_toshiki) June 29, 2023 -
ఎగిరే కారు వచ్చేసిందండోయ్! రూ. 6.5 లక్షలతో ఇంటికి తీసుకెళ్లొచ్చు..
గత కొంతకాలంగా ఎగిరే కార్లు వినియోగంలోకి వస్తాయన్న చాలామంది కలలు కంటూనే ఉన్నారు. అయితే ఈ కల ఎట్టకేలకు ఇప్పుడు నిజమయ్యింది. స్వీడన్ స్టార్టప్ కంపెనీ 'జెట్సన్ వన్' అనే ఫ్లైయింగ్ కారుని విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. డ్రోన్ మాదిరిగా గాలిలో ఎగిరే ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 98,000 డాలర్లు (సుమారు 80.19 లక్షల రూపాయలు). అయితే కస్టమర్ ఇప్పుడు కేవలం 8,000 డాలర్లు (దాదాపు 6.5 లక్షల రూపాయలు) చెల్లించి ఈ కారును ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఇది చూడటానికి హెలికాఫ్టర్ మాదిరిగా ఉంటుంది. చూడటానికి హెలికాఫ్టర్ మాదిరిగా ఉన్నప్పటికీ ఒక డ్రోన్ మోడల్ ఆధారంగా తయారైంది. ఈ ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ కారు టేకాఫ్, ల్యాండింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి గాలిలో ఎగురుతూ సురక్షితంగా ప్రయాణిస్తుంది. అయితే ఈ కారుని నడపడానికి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. దీని బరువు 86 కేజీలు మాత్రమే ఉంటుంది. ఇది eVTOL అల్ట్రాలైట్ వాహనాల కోసం US ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనలకు అనుగుణంగా ఉండటం వల్ల ఆపరేట్ చేయడానికి లైసెన్స్ అవసరం లేదు. ఈ నియమాలు కేవలం అమెరికాలో మాత్రమే వర్తిస్తాయి. (ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!) జెట్సన్ వన్ అనే ఫ్లైయింగ్ కారు ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులోని కాక్‌పిట్‌లో రెండు జాయ్‌స్టిక్‌లు ఉంటాయి. ఒకటి ఎత్తుని కంట్రోల్ చేయడానికి కాగా, మరొకటి దిశను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. కొత్త వారు కూడా చాలా తక్కువ సమయంలో ఆపరేటింగ్ నేర్చుకోవచ్చని కంపెనీ తెలిపింది. జెట్సన్ వన్ 88 కేజీల బ్యాటరీ కలిగి సుమారు 1,500 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. ఇందులో ఉన్న ప్రొపెల్లర్లు గంటకు 101 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి అనుమతిస్తాయి. ల్యాండింగ్ చేయడానికి సెన్సర్లను ఉపయోగించి సులభంగా ల్యాండ్ చేయవచ్చు. ఈ కారు ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయాన్ని గురించి కంపెనీ వెల్లడించలేదు. (ఇదీ చదవండి: రూ. 5వేలు పెట్టుబడితో రూ. 750 కోట్ల వ్యాపార సామ్రాజ్యం - తయారైందిలా..!) మార్కెట్లో విడుదలైన కొత్త జెట్సన్ వన్ ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో పారాచూట్ వంటివి అందుబాటులో ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇందులో హ్యాండ్స్-ఫ్రీ హోవర్ ఫంక్షన్లు ఉండటం వల్ల మోటార్ చెడిపోయినప్పుడు కూడా సురక్షితంగా ఎగురుతూ ఉంటుందని చెబుతున్నారు. (ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్‌లో ఇవి గమనించారా? లేకుంటే పేలిపోతాయ్..) ఈ ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ కారు కావాలనుకున్న వారు కంపెనీ అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలో త్వరలోనే ప్రారంభమవుతాయి. టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు ఇప్పటికే వందల సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించినట్లు కంపెనీ తెలిపింది. అంతే కాకుండా ఇది కేవలం యుఎస్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. -
గాలి ద్వారా పుట్టిన విద్యుత్తునే ఉపయోగిస్తూ..
గాలిలో ఎగిరే కార్లను ఇప్పటికే కొందరు తయారు చేశారు. ఇవి విస్తృతంగా ఇంకా వాడుకలోకి రాలేదు గాని, వీటి తయారీలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు తయారైన ఎగిరే కార్లు పెట్రోల్, డీజిల్ లేదా లిథియం అయాన్ బ్యాటరీల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తును ఇంధనంగా ఉపయోగించుకునే రకాలకు చెందినవే. ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న ఎగిరే కారు తీరు మాత్రం మిగిలిన వాటన్నింటికీ పూర్తిగా భిన్నం. గాలి ద్వారా పుట్టిన విద్యుత్తునే ఉపయోగించుకుని, గాలిలో షికారు కొట్టడం దీని ప్రత్యేకత. కీటకం ఆకారంలో రూపొందించిన ఈ కారుకు ‘ఇన్సెక్టా’ అని పేరు పెట్టారు. సెర్బియన్ ఆటోమొబైల్ డిజైనర్ మార్కో పెట్రోవిక్ దీనిని రూపొందించారు. -
హైడ్రోజన్ కారు 484 కి.మీ మైలేజీ.. గరిష్ట వేగం 353 కి.మీ
ఎలక్ట్రిక్ కార్ల హవా ఇప్పుడిప్పుడే మొదలవుతుంటే వాటికి పోటీగా మార్కెట్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి హైడ్రోజన్ కార్లు. మైలేజీ, స్పీడ్, మెయింటనెన్స్ విషయంలో ఎలక్ట్రిక్ కార్లతో పోటీ పడుతున్నాయి. అంతేకాదు లేటేస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని రోడ్డు, వాయు మార్గంలో ప్రయాణించేలా కొత్త రకం డిజైన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వెనుకున్నది మన సత్యనే భారతీయ అమెరికన్ సంత సత్య లుఫ్ట్‌కారు పేరుతో స్టార్టప్ నెలకొల్పారు. హైడ్రోజన్ ఫ్యూయల్‌తో నడిచేలా ఫ్లైయింగ్కారును తయారు చేస్తున్నారు. ఈ కారుకు సంబంధించిన ప్రాథమిక డిజైన్లు పూర్తయ్యాయి. 20213లో మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఆటో ఎక్స్‌ప్లోలో ఈ కారుకు సంబంధించిన విశేషాలు దుబాయ్ షేక్‌లను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్కెట్లోకి రాకముందే ఈ కారుని కొనుగోలు చేసేందుకు దుబాయ్ షేక్‌లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ హైడ్రోజన్ కారు విశేషాలు ఏంటో ఓసారి చూద్దాం. ప్లేన్‌లోనే కారు సంత్సత్య రూపొందించిన లుఫ్ట్‌కారు భూమి మీద, ఆకాశంలో ప్రయాణం చేయగలదు. అటాచబుల్, డిటాచబుల్ పద్దతిలో ఈ కారును డిజైన్ చేయడం వల్ల ఈ కారు రెండు విధాలుగా ప్రయాణం చేయగలదు. ఈ కారు ఎగిరేందుకు వీలుగా నాలుగు ప్రొపెల్లర్లతో చేసిన డిజైన్ విమానం, హెలికాప్టర్ల నమూనాను పోలీ ఉంటుంది. ఇందులో మనుషులు ప్రయాణించేందుకు వీలుగా క్యాబిన్ ఉంటుంది. ఈ క్యాబిన్ డిటాచ్ చేస్తే రెగ్యులర్ కారు తరహాలో రోడ్డుపై ప్రయాణం చేయవచ్చు. మ్యాగ్జిమమ్ స్పీడ్ 354 కి.మీ లుఫ్ట్‌కారు గరిష్టంగా 4,000 అడుగుల ఎత్తు వరకు పైకి ప్రయాణం చేయగలదు. వాయు ఒక్కసారి హైడ్రోజన్ ఫ్యూయల్ నింపుకుంటే వాయు మార్గంలో గరిష్టంగా 484 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఇక రోడ్డు మార్గంలో అయితే 241 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. వాయు మార్గంలో గరిష్ట వేగం గంటకి 354 కిలోమీటర్లు. ఈ కారులో గరిష్టంగా ఐదుగురు ప్రయాణం చేయవచ్చు. వర్టికల్‌గా ల్యాండింగ్ టేకాఫ్ తీసుకోగలదు. ధర ఎంతంటే యూఎస్, యూరప్‌లతో పాటు సంపన్నులు ఎక్కువగా ఉండే దుబాయ్ లాంటి ప్రాంతాల్లో సంపన్నులు, నగరాల మధ్య నిత్యం ప్రయాణం చేసే బిజినెస్ పీపుల్ అవసరాలకు తగ్గట్టుగా ఈ కారుని డిజైన్ చేశారు. ఇంటి నుంచి ఎయిర్‌పోర్టు, ఎస్టేట్ తదితర ప్రదేశాల వరకు ట్రాఫిక్ చిక్కులు లేకుండా వాయు మార్గంలో ప్రయాణించవచ్చు. అత్యవసర సమయంలో రోడ్డు మార్గంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ హైడ్రోజను కారు ధర 3.50,000 డాలర్లుగా ఉంది. చిన్న ప్లేన్‌తో పాటు కారు లుఫ్ట్కారును కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులకు ఒకేసారి ఒక చిన్న ప్లేను, కారుని కొనుగోలు చేసినట్టు అవుతుంది. ట్రాఫిక్ చిక్కులు లేకుండా కుటుంబంతో సహా ప్రయాణించేందుకు వీలు ఏర్పడుతుందని లుప్ట్కార సీఈవో సంత్ సత్య అంటున్నారు. -
ఈ ఎగిరే ఎలక్ట్రిక్ కారు ధర మరి ఇంత తక్కువ!
ప్రముఖ చైనీస్ ఎలక్ట్రిక్-వేహికల్ తయారీ సంస్థ ఎక్స్ పెంగ్ ఎగిరే కారును ఆవిష్కరించింది. ఈ ఎగిరే కారును 2024 నాటికి మార్కెట్లోకి తీసుకొనిరానున్నట్లు పేర్కొంది. గత వారం ఫండింగ్ సేకరణలో భాగంగా 500 మిలియన్ డాలర్లకు పైగా నిధులను సంస్థ సేకరించింది. ఎక్స్ పెంగ్ గత కొంత కాలంగా ఎక్స్2 కారును అభివృద్ధి చేస్తోంది. ఈ టూ సిటర్ ఎలక్ట్రిక్ కారును పరిమిత సంఖ్యలో తయారు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. చైనాలో టెస్లాకు బలమైన పోటీదారులలో ఒకరైన ఎక్స్ పెంగ్ టెస్లా కంటే మూడు చౌకైన ఎలక్ట్రిక్ సెడాన్ కార్లను ప్రారంభించింది. 2021 మొదటి అరునెలల్లో ఈ చైనా సంస్థ 3,000కు పైగా ఏలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేశారు. ఇది గత ఏడాదితో పోలిస్తే వార్షికంగా 459% పెరుగుదల కనబరిచింది. ఎక్స్ పెంగ్ ఎక్స్2 కారులో ఇద్దరు వ్యక్తులు కూర్చోవచ్చు. ఎక్స్ పెంగ్ ఎగిరే కారు విమానాశ్రయం నుంచి పని చేసే కార్యాలయానికి చేరువకోవడం కోసం అనువుగా ఉంటుంది అని సంస్థ తెలిపింది. వాహనం ఒకేసారి 35 నిమిషాల వరకు ఎగరగలదు. నాస్ డాక్ లిస్టెడ్ ఎలక్ట్రిక్ వాహన కంపెనీ ఈ కారును 1.18 కోట్ల రూపాయల కంటే తక్కువ(1 మిలియన్ చైనీస్ యువాన్ ఆఫ్ యుఎస్ 157,000 డాలర్లు) అందించాలని చూస్తుంది. మిగతా వాటితో పోలిస్తే దీని ధర చాలా తక్కువ. జనరల్ మోటార్స్, టయోటా, హ్యుందాయ్ వంటి దిగ్గజ కంపెనీలతో ఈ సంస్థ పోటీ పడుతుంది. XPeng X2 unveils a new dimension of future city commute. #FlyingCars #eVTOL pic.twitter.com/TvPH5UNNy6 — XPeng Motors (@XPengMotors) September 24, 2021 (చదవండి: తిరుగులేని టెస్లా.. రూ.75 లక్షల కోట్ల విలువైన కంపెనీగా రికార్డు) -
ఇండియా నుంచే ఏషియా తొలి ఫ్లయింగ్ కారు! మంత్రి కీలక ప్రకటన
స్టార్టప్‌ల రాకతో టెక్నాలజీ పరంగా సరికొత్త ఆవిష్కరణలు ఇండియాలో వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఏషియాలో మిగిలిన దేశాలను వెనక్కి నెడుతు తొలి ఫ్లయింగ్ కారును మార్కెట్లోకి తెచ్చేందుకు మన వాళ్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వినత నుంచి మేకిన్ ఇండియా స్ఫూర్తితో ఇండియా దూసుకుపోతుంది. మరోవైపు రెండుమూడేళ్ల కిందట స్టార్టప్‌లుగా మొదలైన కంపెనీలు ప్రస్తుతం యూనికార్న్‌లు మారుతున్నాయి. ఈ పరంపరలో మరో మైలురాయి దాటేందుకు ఇండియాకు చెందిన వినత స్టార్టప్ ప్రయత్నిస్తోంది, ఏషియాలోనే తొలిసారి చెన్నైకి చెందిన వినత స్టార్టప్ రూపొందించిన ఫ్లైయింగ్ కారుకు సంబంధించిన ప్రోటోటైప్‌ను కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింథియా పరిశీలించారు. ఫ్లైయింగ్ కారుకి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రికి కంపెనీ ప్రతినిధులు వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏషియా నుంచి తొలి ఫ్లైయింగ్ కారు మన దేశం నుంచి వచ్చే అవకాశం ఉందంటూ ప్రశంసించారు. ఇప్పటికే కొరియాకు చెందిన హ్యుందాయ్ కంపెనీ సైతం ఏషియా నుంచి ఫ్లైయింగ్ కారు తయారీ పనిలో ఉంది. Delighted to have been introduced to the concept model of the soon-to-become Asia’s First Hybrid flying car by the young team of VINATA AeroMobility: Civil Aviation Minister Jyotiraditya Scindia (1/2) pic.twitter.com/Jqtz9gbikk — ANI (@ANI) September 20, 2021 గరిష్టంగా 60 నిమిషాలు వినత రూపొందించిన ఫ్లైయింగ్ కారు రోడ్డు, వాయు మార్గంలో ప్రయాణించగలదు. ఇందులో ఒకే సారి ఇద్దరు ప్రయాణించే వీలుంది. గరిష్టంగా 1300ల కేజీల బరువును మోసుకెళ్లగలదు. గాలిలో గరిష్టంగా 60 నిమిషాల వరకు ఎగురగలదు. గరిష్ట వేగం గంటలకు 120 కిలోమీటర్లు. భూమి నుంచి 3000 అడుగుల ఎత్తులో ఈ ఫ్లైయింగ్ కారు ప్రయాణిస్తుంది. వాలుగా కాకుండా నిట్టనిలువుగా ల్యాండింగ్, టేకాఫ్ అవడం ఈ కారు ప్రత్యేకత. బయో ఫ్యూయల్ ఈ హైబ్రిడ్ ఫ్లైయింగ్ కారులో బ్యాటరీలతో పాటు ఇంధనంగా బయో ఫ్యూయల్‌ను ఉపయోగిస్తారు. కో యాక్సియల్ క్వాడ్ రోటార్ సిస్టమ్ ఆధారంగా ఈ కారు గాలిలో పైకి లేస్తుంది. ఎనిమిది రోటార్లలో ఒకటి చెడిపోయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేలపైకి సురక్షితంగా ఈ ఫ్లైయింగ్ కారుని ల్యాండ్ చేయోచ్చని వినత కంపెనీ చెబుతోంది. మెడికల్ ఎమర్జెన్సీలో ఫ్లైయింగ్‌కారు కాన్సెప్టు అందుబాటులోకి వస్తే మెడికల్ ఎమర్జెన్సీలో వైద్య సేవలు సత్వరమే అందించే వీలు ఉంటుందని మంత్రి జ్యోతిరాదిత్య అన్నారు. మరోవైపు రోడ్ ట్రాన్స్‌పోర్టులో ట్రాఫిక్ సమస్యలు నిత్యకృత్యం కావడంతో ఉబర్ లాంటి సంస్థలు ఫ్లైయింగ్ కారు కాన్సెప్టు పట్ల ఆసక్తిగా ఉన్నాయి. లండన్‌లో 2021 అక్టోబరు 5న లండన్ వేదికగా జరగనున్న హెలిటెక్ ఎగ్జిబిషన్లో తొలిసారిగా ఈ ఫ్లైయింగ్ కారుని ప్రదర్శించనున్నారు. చదవండి: ఓలా కార్స్.. నడిపి చూడండి .. నచ్చితేనే కొనండి ! -
ఇండియాలో ఫ్లైయింగ్ కారు... వచ్చేది ఎప్పుడంటే ?
సాక్షి, వెబ్‌డెస్క్: దేశమంతటా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంటే అందుకు భిన్నంగా ఏకంగా ఆకాశంలో ఎగిరే కారు తయారీలో బిజీగా ఉన్నాయి స్టార్టప్ కంపెనీలు. అందులో ఇండియాకి చెందిన ఓ కంపెనీ అయితే అక్టోబరులో తమ తొలి మోడల్ కారును ప్రదర్శనకు సిద్ధం చేస్తోంది. అక్టోబరు 5 కల్లా సిద్ధం చెన్నై బేస్డ్ వినత ఎయిరో మొబిలిటీ కంపెనీ ఎగిరే కార్ల తయారీలో మరో కీలక ఘట్టాన్ని దాటేసింది. ఎగిరే కారు కాన్సెప్టుకు సంబంధించి పూర్తి డిజైన్ని పూర్తి చేసింది. ఇప్పుడు కారు నిర్మాణ పనుల్లో బిజీగా ఉంది. అన్నీ అనుకూలిస్తే 2021 అక్టోబరు 5న లండన్‌లో జరిగే హెలిటెక్ ఎగ్జిబిషన్లో ఈ కారు దర్శనం ఇవ్వనుంది. ఇద్దరు ప్యాసింజర్లు వినత ఎయిరో మొబిలిటీ రూపొందిస్తోన్న ఫ్లైయింగ్ కారు బరువు 1100 కేజీలు ఉంటుంది. మొత్తంగా 1300 కేజీల బరువును మోయగలదు. ఇందులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించే వీలుంటుంది. వర్టికల్‌గా టేకాఫ్ ల్యాండింగ్ అవడం ఈ ఫ్లైయింగ్ కారు ప్రత్యేకత. ఈ కారులో హైబ్రిడ్ ఇంజన్ ఏర్పాటు చేస్తున్నారు. కారు ఎగిరేందుకు బయో ప్యూయల్ని ఉపయోగించుకుంటుంది. అదే విధంగా సందర్భాన్ని బట్టి ఎలక్ట్రిక్ ఎనర్జీని కూడా వాడుకుంటుంది. 3,000 అడుగుల వరకు ఈ కారు పైకి ఎగిరేందుకు కో యాక్సియల్ క్వాడ రోటర్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కారు ప్యానెల్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నట్టు కంపెనీ చెబుతోంది. ఈ కారు నేల నుంచి 3,000 అడుగుల ఎత్తు వరకు ప్రయాణించగలదు. ఒక్క సారి ఫ్యూయల్ నింపితే వంద కిలోమీటర్లు లేదా గంట సేపు ప్రయాణం చేయగలదు. అత్యధిక వేగం గంటకు 120 కిలోమీటర్లుగా ఉంది. ఫస్ట్ ఏషియన్ ఇప్పటి వరకు ఫ్లైయింగ్ కార్లకు సంబంధించి యూరప్, అమెరికా కంపెనీలదే పై చేయిగా ఉంది. ఏషియా నుంచి హ్యుందాయ్ సంస్థ కూడా ఫ్లైయింగ్ కారు టెక్నాలజీపై పరిశోధనలు చేస్తోంది. అయితే డిజైన్ పూర్తి చేసి అక్టోబరు కల్లా ప్రోటోటైప్ సిద్ధం చేసిన మొదటి ఏషియా కంపెనీగా రికార్డు సృష్టించేందుకు వినత సిద్ధమవుతోంది. -
ఎగిరే కారు వచ్చేసిందోచ్..!
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఎగిరే కారు వచ్చేసిందోచ్.. నెదర్లాండ్‌కు చెందిన పాల్–వీ అనే కంపెనీ తొలి కారును సిద్ధం చేసింది. యూరప్‌లో అన్ని రకాల ప్రభుత్వ అనుమతులను పొందింది. ఇప్పుడు ఎవరైనా ఈ కారు కొనుక్కుని ఎంచక్కా ఎగిరేయొచ్చు. ఎగిరే కారు ఆలోచనలు ఇప్పటివి కావు. కానీ ఈ కల సాకారం కాలేదు. అంతెందుకు ఈ పాల్–వీ కారు తయారీకి కూడా 20 ఏళ్లు పట్టింది. ఈ ఎగిరే కారు పేరు ‘ది లిబర్టీ’. వాహనం బరువు తగ్గించేందుకు మూడు చక్రాలతో తయారు చేశారు. నాలుగు చక్రాల వాహనాలతో పోలిస్తే 3 చక్రాల వాహనానికి లైసెన్సు కూడా సులువుగా లభిస్తుందట. రోడ్డుపై వెళ్లేటప్పుడు ద లిబర్టీ రెక్కలు పైభాగంలో ముడుచుకుని ఉంటాయి. విమానంగా మారేటప్పుడు రెక్కలు విచ్చుకుంటాయి. 100 హెచ్‌పీ గల ఇంజిన్‌తో ఇది తొమ్మిది సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు 180 కి.మీ. వేగంతో.. రెండు సీట్లు మాత్రమే ఈ కారులో ఉంటాయి. గాలిలో ఇది గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. టేకాఫ్ కోసం వెయ్యి అడుగుల రన్‌వే అవసరం కాగా.. ల్యాండ్ అయ్యేందుకు వంద అడుగుల దారి సరిపోతుంది. ఇంధన ట్యాంకులో వంద లీటర్ల ఇంధనాన్ని నింపుకొంటే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. అదనంగా మరో అరగంట పాటు నడిచేందుకు రిజర్వ్ ట్యాంకు కూడా ఉంది. రోడ్డుపై వెళ్లేటప్పుడు మైలేజీ లీటర్‌కు 13 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడే దీన్ని కొని గాల్లో ఎగిరేందుకు తహతహలాడకండి. ఎందు కంటే ఈ కారు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేందుకు 2022 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. ఈలోపు విమానంగా ఉపయోగించేందుకు అవసరమైన అనుమతులు సాధించే ప్రయత్నాల్లో కంపెనీ ఉంది. చదవండి: చైనాకి మరిన్ని వందేభారత్ విమానాలు -
2023కల్లా ఎగిరే కారు!
ట్రాఫిక్ జామ్‌లు, గతుకుల రోడ్ల గొడవలు లేకుండా ఎంచక్కా గాలిలో ఎగిరిపోయే కారొస్తే ఎంత బాగుంటుంది! ప్రపంచవ్యాప్తంగా ఎగిరే కార్లను తయారు చేసే ప్రాజెక్టులు 100పైగా కొనసాగుతున్నాయి. అందులో ఒకటే ఈ ఫోటోలో కనిపించే కారు. జపాన్‌కు చెందిన స్కై డ్రైవ్ సంస్థ శుక్రవారం ఎగురుతున్న తమ కారుకు సంబంధించి వీడియోను విడుదల చేసింది. చుట్టూ అన్ని వైపులా.. పైన కూడా నెట్ కట్టి... అందులో టెస్ట్ డ్రైవ్ చేపట్టింది. ఒక మనిషి కూర్చొని ఉన్న ఈ కారు ఒకటి నుంచి రెండు మీటర్ల ఎత్తులో నాలుగు నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టింది. 2023కల్లా పూర్తిస్థాయి ఎగిరే కారును అందుబాటులోకి తేగలమని స్కై డ్రైవ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. -
ఎగిరేకారు వచ్చేస్తోంది..!
టోక్యో : ఎగిరే విమానకారును 2030 సంవత్సరం నాటిని తీసుకొస్తామని జపాన్ దిగ్గజ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎన్ఈసీ ప్రకటించింది. తాజాగా డ్రోన్ ఆకారంలో ఉన్న విమానాన్ని టోక్యోలో పరీక్షించింది. నాలుగు ప్రొపెల్లర్లు, మూడు చక్రాలు గల ఈ విమానకారును రిమోట్ సహాయంతో భూమి నుంచి పది అడుగుల ఎత్తు వరకు ఎగిరించి గాలిలో నిమిషం పాటు నిలిపి కిందికి దించారు. ఈ ప్రయోగాన్ని అత్యంత పకడ్బందీగా పెద్ద లోహపు పంజరంలో నిర్వహించారు. దేశంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఫ్లయింగ్ కార్లను అభివృద్ధి చేయాలని జపాన్ ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి అనుగుణంగానే ఎన్ఈసీ కంపెనీ విమానకారు తయారీలో నిమగ్నమైంది. తాజాగా చేపట్టిన ట్రయల్‌రన్ విజయవంతమైందని కంపెనీ ప్రకటించింది. జపాన్ ఈశాన్య ప్రాంతమైన ఫుకుషిమాలో 2011లో వచ్చిన సునామీ, అణు విపత్తుల నుంచి ఇంకా తేరుకోని జపాన్ త్వరితగతిన ప్రజలను సురక్షిత స్థావరాలకు చేర్చడానికి ఎగిరే కార్లపై దృష్టి సారించిందని అనాడే వార్తలు వెలువడ్డాయి. అలాగే జపాన్‌లోని అనేక చిన్న ద్వీపాలను అనుసంధానించడానికి వీటిని ఉపయోగించాలని భావిస్తోంది. కాగా ఎన్ఈసీ కంపెనీ ఎగురుతున్న కారును 2017లోనే పరీక్షించగా నేలపై కూలిపోయి విఫలమైంది. ఇప్పుడు విజయవంతం అవడంతో త్వరగా వీటిని తయారుచేయాలని నిశ్చయించుకుంది. అమెరికాలో సైతం ఉబెర్ కంపెనీ ఎగిరేకార్ల తయారీలో బిజీగా ఉంది. విమానకార్లకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటంతో ఎలాగైనా ఈ మార్కెట్‌ను చేజిక్కించుకోవాలని రెండు కంపెనీలు ఇప్పటినుంచే పోటీపడుతున్నాయి. -
ఎగిరే కారు వచ్చేస్తోంది!
చికాగో: ఇటీవల శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎన్నో అద్భుత ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గత కొన్ని నెలలుగా ఎగిరే కార్ల ప్రస్తావన ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం రోడ్లపై కార్లు ఏ విధంగానైతే పరుగులు పెడుతున్నాయో ఇంకొన్నేళ్లలోనే గాల్లో ఎగిరే కార్లనూ చూడనున్నామనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని నిజం చేసే దిశగా తొలి అడుగు పడింది. ప్రముఖ విమానయాన సంస్థ బోయింగ్.. గాల్లో ఎగిరే కారును తొలిసారి తయారుచేసింది. అంతేకాదు, బోయింగ్ ప్రోటోటైప్ అనే ఈ ఎగిరే కారును విజయవంతంగా పరీక్షించింది కూడా. దీంతో ఇకపై పట్టణాల్లో రవాణా, డెలివరీ సేవలు మరింత వేగమవుతాయని బోయింగ్ ప్రతినిధులు చెబుతున్నారు. -
ప్లయింగ్ కారు
నేల మీద కార్ల తరహాలో తిరుగుతూ.. నడవడానికి అసాధ్యమయ్యే ప్రాంతాల్లో పక్షిలా ఎగిరే వాహనాల గురించి సినిమాల్లోనో.. కార్టూన్లలోనో చూసుంటాం. కానీ పీఏఎల్–వి సంస్థ అచ్చం అలాంటి వాహనాలనే తయారు చేసింది. ఇవి నేల మీద ప్రయాణించడంతోపాటు అవసరమైనప్పుడు గాల్లో కూడా ఎగరగలవు. ఈ ఎగిరే కారులోని ప్రత్యేకతలు.. ప్రత్యేక ఫీచర్లు ఇద్దరు కూర్చుని ప్రయాణించే ఈ వాహనాన్ని హైబ్రిడ్ కారు లేదా గైరో ప్లేన్ అంటారు. డచ్‌కు చెందిన పీఏఎల్–వి, యూరోప్ ఎన్వి సంస్థలు ఈ మూడు చక్రాల ఫ్లయింగ్ కారును అభివృద్ధి చేశాయి. ఇది చూడటానికి బైక్ తరహాలో ఉన్నప్పటికీ సౌకర్యం పరంగా కారును పోలి ఉంటుంది. నేల మీద నడవడానికి, గాల్లో ఎగరడానికి అనుకూలంగా ‘టిల్టింగ్’ వ్యవస్థ ఉంటుంది. ఇది నేల మీద ప్రయాణిస్తున్నప్పుడు గాల్లోకి ఎగరాలంటే విమానం తరహాలో కొద్ది దూరం సమతలం మీద ప్రయాణిస్తే నిర్దిష్ట వేగం పొందిన తర్వాత గాల్లోకి ఎగురుతుంది. అయితే టేకాఫ్ కోసం టచ్ ప్యాడ్ మీదున్న టేకాఫ్ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్లయింగ్ కారులో ఉన్న సింగిల్ రోటార్, ప్రొపెల్లర్ కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే విచ్చుకుంటుంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో గాల్లో ఎగరడానికి అనుకూలంగా సిద్ధమవుతుంది. ఈ వాహనం గరిష్టంగా 4000 అడుగుల ఎత్తు వరకు గాల్లో ఎగరగలదు. ఇది ఎయిర్ అన్ కంట్రోల్డ్ (వాయు అనియంత్రిత) విజువల్ ఫ్లైట్ రూల్స్ ట్రాఫిక్ విభాగంలోకి రావడం వల్ల వాణిజ్య విమానం తరహాలో అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇందులో ఫ్లైట్ సర్టిఫైడ్ ఎయిర్ క్రాఫ్ట్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది నేల మీద, వాయు మార్గాల్లో గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆకృతి పరంగా హెలికాఫ్టర్‌ని పోలి ఉన్నప్పటికీ హెలికాఫ్టర్లోని మెయిన్ రోటార్తో పోల్చితే.. ఇందులోని మెయిన్ రోటార్ వేగం తక్కువగా ఉంటుంది. ఇందులో ఇంజన్ ఫెయిలయితే దిగులు చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇందులోని గైరోప్లేన్ టెక్నాలజీ రోటార్‌ను తిప్పడానికి సహాయపడుతుంది. తద్వారా తక్కువ వేగం వద్ద ప్రమాదానికి గురికాకుండా సురక్షితంగా ల్యాండ్ చేయవచ్చు. ఈ ప్లయింగ్ కారులో సీసం, మిశ్రమ రహిత పెట్రోల్‌ను వినియోగిస్తారు. ఇది గగన తలంలో ఉన్నప్పుడు లీటర్‌కు 28 కి.మీల మైలేజ్, నేల మీద ప్రయాణిస్తున్నప్పుడు లీటర్‌కు 12 కి.మీల మైలేజ్ ఇస్తుంది. -
ఎగిరే కారు
కార్లకు రెక్కలు వచ్చేందుకు... నిలువుగా పైకెగరి గమ్యంవైపు దూసుకెళ్లేందుకు ఇంక ఎక్కువ రోజులు పట్టదు. ఎందుకంటారా? ఇప్పటికే కొన్ని ఎగిరే కార్లు మార్కెట్లోకి వచ్చేసేందుకు సిద్ధమవుతూండగా.. జెట్ప్యాక్ ఏవియేషన్ అనే సంస్థ తాజాగా ఫొటోలో చూపినట్టు ఇంకో దాన్ని సిద్ధం చేస్తోంది మరి. మనుషులు నిలువుగా పైకి ఎగరేలా చేసేందుకు జెట్‌ప్యాక్‌ను సిద్ధం చేసింది ఈ కంపెనీనే. విషయం ఏమిటంటే.. ఒకవైపు బ్యాటరీల సామర్థ్యం పెరిగిపోతోంది. ఇంకోవైపు సెన్సర్లు, ఎలక్ట్రిక్ మోటర్ల ఖరీదు తగ్గిపోతోంది. ఒకప్పుడు అందుబాటులో లేని అనేక టెక్నాలజీలు ఇప్పుడు అందరికీ చేరువయ్యాయి. ఈ నేపథ్యంలో జెట్ ఏవియేషన్స్ ఎగిరే కారు తయారీకి నడుం బిగించింది. మొత్తం ఆరు రోటర్లతో కూడిన ఈ ఎగిరే కారులో ప్రస్తుతానికి ఒక్కరు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. ఇది పూర్తిగా విద్యుత్తుతోనే పనిచేస్తుంది. గంటకు దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా దీన్ని తయారు చేస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగితే మరో ఐదేళ్లలో ఈ సరికొత్త ఎగిరే కారు అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. -
నాలుగు కోట్లకు ‘ఫ్లైయింగ్ కారు’
న్యూఢిల్లీ:నెదర్లాండ్స్ చెందిన ‘పాల్-వి యూరప్ ఎన్వీ’అనే కంపెనీ ఫ్లైయింగ్ కారుకు భారత్‌లో పేటెంట్ హక్కులు పొందింది. రోడ్డుపైనా పరుగులు తీయడంతోపాటు గాల్లో హెలికాప్టర్లా ప్రయాణించే ఈ కారును ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాది మొదట్లోగానీ యూరప్ మార్కెట్లో విడుదల చేయనుంది. విమానయాన అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున భారతీయ మార్కెట్లో దీన్ని విడుదల చేసేందుకు మరికొంత సమయం పట్టవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న పర్సనల్ ల్యాండ్ అండ్ ఎయిర్ వెహికిల్ (పీఏఎల్-వి)గా పిలిచే ఈ ఫ్లైయింగ్ కారు రోడ్డుపైనా గంటకు గరిష్టంగా 170 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందని, పది సెకండ్లలో గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుందని, ఇంధనం లీటరుకు 12 కిలోమీటర్లు వస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అదే ఆకాశంలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందని, గంటకు 28 లీటర్ల ఇంధనం ఖర్చవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇద్దరు వ్యక్తులు కూర్చుని ప్రయాణించే సౌకర్యం గల ఈ ఫ్లైయింగ్ కారు ధరను 3.80 కోట్ల రూపాయలుగా నిర్ణయించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఫ్లైయింగ్ కార్లను తయారు చేయాలనే ఆలోచన అమెరికా ఏవియేషన్ అథారిటీ 1917లోనే ఆలోచన చేసినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. స్లొవేకియాకు చెందిన ఎరోమొబైల్ కంపెనీ 2015లోనే రెక్కలుగల ప్లైయింగ్ కారు ప్రొటోటైప్‌ను తయారు చేసింది. అయితే అది ట్రయల్ రన్లో క్రాష్ అయింది. ఆ తర్వాత రెక్కలుగల ప్లైయింగ్ కార్లను తయారు చేస్తున్నామని ఎన్నో కంపెనీలు ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఏవీ విజయం సాధించలేదు. ఇప్పుడు ఈ పాల్-వీ ఫ్లైయింగ్ కారుకు రెక్కలకు బదులుగా హెలికాప్టర్లలా రోటర్‌ను ఏర్పాటు చేశారు.