చైనీస్ ఆటోమేకర్ ఎక్స్‌పెంగ్ అనుబంధ సంస్థ అయిన ఎక్స్‌పెంగ్ ఏరోహ్ట్ ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ పేరుతో కొత్త మాడ్యులర్ ఫ్లయింగ్ కారును ఆవిష్కరించింది. రెండు మాడ్యూళ్లను కలిగిన ఈ కారును ఇటీవలి 15వ చైనా ఇంటర్నేషనల్ ఏవియేషన్ & ఏరోస్పేస్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించింది.
ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లో మదర్‌షిప్, ఎయిర్‌క్రాఫ్ట్ అనే రెండు మాడ్యూల్స్ ఉన్నాయి. మదర్‌షిప్ పొడవు 5.5 మీటర్లు, ఎత్తు, వెడల్పు 2 మీటర్లు ఉంటుంది. విద్యుత్‌తో నడిచే ఈ కారు ఇది 1000 కిలోమీటర్లకుపైగా రేంజ్‌ని ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
ఎయిర్‌క్రాఫ్ట్ ఆరు-రోటర్, డ్యూయల్-డక్ట్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ , తేలికైన మన్నిక కోసం కార్బన్ ఫైబర్‌ను ఉపయోగించి తయారు చేశారు. ఇందులో ఇద్దరు కూర్చునే అవకాశం ఉంది. ఎక్స్‌పెంగ్ ఈ ఫ్లయింగ్ కార్లను ఒక కొత్త ఫ్యాక్టరీలో తయారు చేస్తోంది. ఇది 10,000 యూనిట్ల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ డెలివరీలు 2026లో ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.
China’s Xpeng just unveiled a modular flying car called the Land Aircraft Carrier. This vehicle combines a ground module—a fully functional EV—with an air module capable of vertical takeoff and flight. pic.twitter.com/ZpqW7CjSr5
— Tansu Yegen (@TansuYegen) November 20, 2024
Comments
Please login to add a commentAdd a comment