Aircraft carrier
-
నేలపై కారు.. గాలిలోనూ షికారు!
చైనీస్ ఆటోమేకర్ ఎక్స్‌పెంగ్ అనుబంధ సంస్థ అయిన ఎక్స్‌పెంగ్ ఏరోహ్ట్ ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ పేరుతో కొత్త మాడ్యులర్ ఫ్లయింగ్ కారును ఆవిష్కరించింది. రెండు మాడ్యూళ్లను కలిగిన ఈ కారును ఇటీవలి 15వ చైనా ఇంటర్నేషనల్ ఏవియేషన్ & ఏరోస్పేస్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించింది.ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లో మదర్షిప్, ఎయిర్‌క్రాఫ్ట్ అనే రెండు మాడ్యూల్స్ ఉన్నాయి. మదర్షిప్ పొడవు 5.5 మీటర్లు, ఎత్తు, వెడల్పు 2 మీటర్లు ఉంటుంది. విద్యుత్‌తో నడిచే ఈ కారు ఇది 1000 కిలోమీటర్లకుపైగా రేంజ్‌ని ఇస్తుందని కంపెనీ చెబుతోంది.ఎయిర్‌క్రాఫ్ట్ ఆరు-రోటర్, డ్యూయల్-డక్ట్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ , తేలికైన మన్నిక కోసం కార్బన్ ఫైబర్‌ను ఉపయోగించి తయారు చేశారు. ఇందులో ఇద్దరు కూర్చునే అవకాశం ఉంది. ఎక్స్‌పెంగ్ ఈ ఫ్లయింగ్ కార్లను ఒక కొత్త ఫ్యాక్టరీలో తయారు చేస్తోంది. ఇది 10,000 యూనిట్ల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ డెలివరీలు 2026లో ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.China’s Xpeng just unveiled a modular flying car called the Land Aircraft Carrier. This vehicle combines a ground module—a fully functional EV—with an air module capable of vertical takeoff and flight. pic.twitter.com/ZpqW7CjSr5— Tansu Yegen (@TansuYegen) November 20, 2024 -
గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్
రోమ్: అట్లాస్ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 747 విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే దాని ల్యాండింగ్ గేర్ టైర్ ఊడిపోయింది. ఈ సంఘటన ఇటలీలోని టరంటో విమానాశ్రయం నుంచి బయలుదేరిన కాసేపటికే జరిగింది. ఈ భారీ విమానాన్ని ప్రధానంగా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ పరికరాలను రవాణా చేసేందుకు ఉపయోగిస్తుంటారు. ఇటలీలోని టరంటో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి అమెరికాలోని చార్లెస్టన్కు చేరుకోవాల్సి ఉంది. విమానం టైర్ ఊడిపోయిన దృశ్యాలు కెమెరాలో నమోదయ్యాయి. భారీ రవాణా విమానం రన్‌వేపై వేగంగా వెళ్తూ గాల్లోకి ఎగిరింది. అయితే, ఆ కాసేపటికే ల్యాండింగ్ గేర్ టైర్ ఊడిపోయింది. రన్‌వేపై పడి కొంత దూరం దొర్లుతూ వెళ్లింది. చక్రం ఊడిపోయిన క్రమంలో నల్లటి పొగ సైతం వచ్చినట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. అయితే, ఎలాంటి ప్రమాదం జరగలేదు. టైర్ ఊడిపోయినప్పటికీ అలాగే అమెరికా చేరిన విమానం.. చార్లెస్టన్ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. టైర్ టరంటో ఎయిర్పోర్ట్ రన్‌వే చివరిలో గుర్తించారు. బోయింగ్ 747 డ్రీమ్‌లిఫ్టర్ రవాణా విమానం. బోయింగ్ 747-400 ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఆధునికీకరించి రవాణా విమానంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం విమాన పరకరాలను రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్నారు. సెప్టెంబర్, 2006లో తొలిసారి గాల్లోకి ఎగిరింది. అయితే, వస్తు రవాణాకు మాత్రమే అనుమతి ఉంది. కేవలం విమాన సిబ్బంది మినహా మానవ రవాణాకు దీనిని ఉపోయోగించేందుకు అనుమతి లేదు. Un Boeing 747 Dreamlifter operat de Atlas Air (N718BA) care a decolat marți dimineață (11OCT22) din Taranto (IT) spre Charleston (SUA) a pierdut o roată a trenului principal de aterizare în timpul decolării. Avionul operează zborul #5Y4231 și transportă componente de Dreamliner. pic.twitter.com/R95UHkLD7V — BoardingPass (@BoardingPassRO) October 11, 2022 ఇదీ చదవండి: Work From Pub Trend: యూకేలో నయా ట్రెండ్ ‘వర్క్ ఫ్రమ్ పబ్’.. ఆడుతూ పాడుతూ పని! -
నేవీ చేతికి విక్రాంత్
న్యూఢిల్లీ: భారత నావికా దళం కొత్త శక్తిని సముపార్జించుకుంది. దేశీయంగా తయారైన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక ‘విక్రాంత్’ను కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ గురువారం నేవీకి అందజేసింది. షెడ్యూల్ ప్రకారం విక్రాంత్‌ను ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేవీ విధుల్లోకి చేర్చుకుంటారు. హిందూ మహా సముద్రంపై ఆధిపత్యం కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ విక్రాంత్ చేరికను కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. రూ.20 వేల కోట్లతో నిర్మించిన విక్రాంత్ నాలుగో, తుది దశ సీ ట్రయల్స్‌ను మూడు వారాల క్రితం విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో, యుద్ధ విమాన వాహక నౌకలను దేశీయంగా డిజైన్ చేసి, నిర్మించుకునే సామర్థ్యం సొంతం చేసుకున్న అరుదైన ఘనతను దేశం సొంతం చేసుకుంది. దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న సమయాన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమాన వాహకనౌక(ఐఏసీ) అందడం చారిత్రక సందర్భమని నేవీ పేర్కొంది. ‘త్వరలో నావికాదళంలోకి ప్రవేశించే ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌తో హిందూ మహాసముద్ర ప్రాంతం (ఐఓఆర్)లో భారతదేశం స్థానం మరింత సుస్థిరం అవుతుంది’అని నేవీ పేర్కొంది. ఐఏసీలో 76% దేశీయంగా తయారు చేసిన సామగ్రినే వినియోగించారు. విక్రాంత్‌లో మెషినరీ ఆపరేషన్, నేవిగేషన్, సర్వైవబిలిటీ గరిష్ట స్థాయి ఆటోమేషన్తో రూపొందాయి. ఫిక్స్డ్ వింగ్, రోటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అనుగుణంగా దీని డిజైన్ ఉందని నేవీ వివరించింది. ఐఏసీ నుంచి మిగ్–29కే యుద్ధ విమానాలతోపాటు కమోవ్–31 హెలికాప్టర్లు, ఎంఐఐ–60ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్లను కలిపి మొత్తం 30 వరకు నిర్వహించవచ్చు. ఐఏసీలో 2,300 కంపార్టుమెంట్లుండగా 1,700 మంది సిబ్బంది పనిచేసేందుకు, ముఖ్యంగా మహిళా అధికారులకు ప్రత్యేక సౌకర్యాలతో డిజైన్ చేశారు. దీని సాధారణ వేగం 18 నాట్స్ కాగా, గరిష్ట వేగం 28 నాట్స్. ఇది 7,500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు. -
ఇండియన్ ఆర్మీలో ప్రైవేటీకరణ షురూ ! పనులు దక్కించుకున్న ప్రముఖ సంస్థ
రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబుడుల ప్రవాహం మొదలైంది. ఇండియన్ ఆర్మీకి అవసరమైన విమానాలు సరఫరా చేసే పనులను టాటా గ్రూపు దక్కించుకుంది. స్పెయిన్‌కి చెందిన ఎయిర్ బస్తో కలిసి టాటా సంస్థ ఇండియన్ ఆర్మీకి విమానాలు తయారు చేసి ఇవ్వనుంది. రక్షణ రంగంలో త్రివిధ దళాలకు వివిధ ఎక్వీప్‌మెంట్స్, భారీ యంత్రాలను తయారు చేయడంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రమేయాన్ని తగ్గించి ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి తగ్గట్టుగా ప్రైవేటు సంస్థల నుంచి సీ- 295 కార్గో విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఆర్మీకి అవసరమైన సీ 295 విమానాలను తయారు చేసే పనిని టాటా గ్రూపు దక్కించుకుంది. స్పెయిన్‌కి చెందిన ఎయిర్‌బస్ సంస్థతో కలిసి టాటా గ్రూపు ఈ విమానాలు తయారు చేస్తుంది. ఇండియన్ ఆర్మీ, టాటా గ్రూపు మధ్య కుదిరిన ఈ ఒప్పందం విలువ రూ. 22,000 కోట్లుగా ఉంది. ఆర్మీకి సంబంధించి ప్రైవేటు ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు ఇదే అత్యంత ఖరీదైనదిగా నమోదైంది. ఆర్మీ నుంచి కాంట్రాక్టు దక్కించుకున్న టాటా సంస్థ విమానాల తయారీ యూనిట్‌ని ఉత్తర్ ప్రదేశ్‌లో స్థాపించబోతున్నట్టు వార్తలు వస్తున్నా.. హైదరాబాద్, బెంగళూరులకు అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఒప్పందం ప్రకారం అందించాల్సిన 56 విమానాల్లో 16 విమానాలను స్పెయిన్‌లో తయారు చేసి రెండేళ్ల వ్యవధిలో ఆర్మీకి అప్పగిస్తారు. మిగిలిన 40 విమానాలను దేశీయంగానే తయారు చేస్తారు. పదేళ్ల వ్యవధిలో టాటా గ్రూపు ఈ విమానాలను ఆర్మీకి అప్పగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్మీలో కార్గో సేవల్లో ఆర్వో విమానాలు సేవలు అందిస్తున్నాయి. త్వరలోనే వీటి కాలపరిమితి తీరిపోనుంది. దీంతో వాటి స్థానంలో సీ 295 విమానాలను ఆర్మీ ప్రవేశపెట్టనుంది. చదవండి : ఎయిరిండియా రేసులో టాటా -
‘విక్రాంత్’ వచ్చేస్తోంది
స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక యుద్ధ నౌక విక్రాంత్ (ఐఏసీ) సేవలందించేందుకు సిద్ధమవుతోంది. బుధవారం నిర్వహించిన సీట్రయల్స్ విజయవంతం కావడంతో.. విమాన వాహక యుద్ధ నౌకలు తయారు చేసిన అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల సరసన భారత్ నిలిచింది. 40 వేల టన్నుల బరువైన విక్రాంత్‌లో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. అన్ని హంగులూ పూర్తి చేసుకొని 2022 మార్చినాటికల్లా తూర్పు నౌకాదళం కేంద్రంగా విక్రాంత్ సేవలందించనుంది. సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో అగ్రశ్రేణి దేశాల సరసన నిలిచిన భారత్.. యుద్ధ విమాన వాహక యుద్ధ నౌకల విషయంలో వెనకబడి ఉందన్న గీతని చెరిపేసేలా ఐఏసీ విక్రాంత్ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారత నౌకాదళంలో యుద్ధ విమానాల కోసం రూపొందించిన మొట్టమొదటి విక్రాంత్ క్లాస్ నౌక ఇది. 1997లో విక్రాంత్ సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అదే పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్ భారత్ పేరుతో విక్రాంత్ యుద్ధ విమాన వాహక నౌక సన్నద్ధమైంది. విక్రాంత్ నిర్మాణం పదేళ్ల కిందటే ప్రారంభమైంది. పూర్తిస్థాయి భారతీయ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌకలో అత్యంత ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. 1999లో ఇండియన్ నేవీకి చెందిన డైరెక్టర్ ఆఫ్ నేవల్ డిజైన్ సంస్థ నౌక డిజైన్ మొదలు పెట్టగా.. కొచ్చి షిప్‌యార్డులో 2009లోనే కీలక భాగాల్ని పూర్తి చేశారు. 2011లో డ్రైడాక్ నుంచి విక్రాంత్‌ని బయటికి తీసుకొచ్చారు. 2015 జూన్ 10న కొచ్చిలో జల ప్రవేశం చేసింది. ఏడాది క్రితం బేసిన్ ట్రయల్స్ పూర్తి చేశారు. తొలిసారిగా సముద్ర విహారం ఓడ నిర్మాణం పూర్తయిన తర్వాత మొదటిసారిగా విక్రాంత్ సీట్రయల్ నిర్వహణ కోసం బుధవారం సముద్రంలోకి తీసుకొచ్చారు. 2 నాటికల్ మైళ్లు ప్రయాణించింది. సముద్రంలో మొదటి ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఎల్ఎం 2500 గ్యాస్ టర్బైన్లు 4, ప్రధాన గేర్ బాక్స్‌లు, షాఫ్టింగ్, పిచ్ ప్రొపైల్లర్ కంట్రోలర్స్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సిస్టమ్, సెంట్రిఫ్యూజన్, 60 క్రిటికల్ పంప్స్, విద్యుత్ ఉత్పత్తి, అంతర్గత కమ్యూనికేషన్ పరికరాలను ఈ ట్రయల్‌రన్‌లో పరిశీలించారు. చరిత్రాత్మక ఘటనగా భారత నావికాదళం అభివర్ణన న్యూఢిల్లీ: భారత్‌లో నిర్మించిన తొలి యుద్దవిమాన వాహక నౌక (ఇండిజినస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్–ఐఏసీ) విక్రాంత్.. సామర్థ్య పరీక్షలు మొదలయ్యాయి. సముద్రంలో ఐఏసీ విక్రాంత్ ట్రయల్స్ ప్రారంభమవడం చరిత్రాత్మకమని భారత నేవీ బుధవారం వ్యాఖ్యానించింది. సొంతంగా యుద్ధవిమాన వాహక నౌకను డిజైన్ చేసి, నౌకను నిర్మించి, సైన్యంలోకి తీసుకునే సత్తా ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచిందని నేవీ ప్రకటించింది. భారీ యుద్ధనౌకకు 50 ఏళ్ల క్రితం 1971లో పాకిస్తాన్‌తో పోరులో అద్భుత సేవలందించిన విక్రాంత్ నౌక పేరునే పెట్టారు. ఈ నౌక అన్ని స్థాయిల్లో సామర్థ్య పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసుకున్నాక వచ్చే ఏడాదిలో భారత నావికాదళంలో చేరనుంది. భారత్‌లో నిర్మించిన అతి పెద్ద, అనేక ప్రత్యేకతలున్న యుద్ధనౌక ఇదేనని నేవీ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మథ్వాల్ చెప్పారు. యుద్ధవిమానాల మోహరింపులో ఐఎన్ఎస్ విక్రమాదిత్య మాత్రమే అవసరాలను తీరుస్తోంది. కీలక బాధ్యతలు నిర్వర్తించనున్న విక్రాంత్ రక్షణపరంగా, రవాణా పరంగా ఎంతో కీలకమైన హిందూ సముద్రంలో ఆధిపత్యం కోసం మనదేశంతో పాటు చైనా, అమెరికా మొదలైన దేశాలన్నీ విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో పైచేయి సాధించేందుకు భారత్ సిద్ధం చేసిన బ్రహ్మాస్త్రమే ఐఏసీ విక్రాంత్. విక్రాంత్ రాకతో రక్షణ పరంగా దుర్భేద్యంగా నిలవనుంది. విక్రాంత్ సేవలు వచ్చే ఏడాది నుంచి మొదలు కానున్నాయని ఆశిస్తున్నాం. పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రాంత్ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. – వైస్ అడ్మిరల్ అజేంద్ర బహుద్దూర్ సింగ్, తూర్పు నౌకాదళాధిపతి -
ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం
ముంబై: భారత విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో మంటలు చెలరేగి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించినట్లు నేవీ ప్రతినిధి తెలిపారు. నౌకలోని సిబ్బంది పొగను గమనించి వెంటనే మంటలను ఆర్పడానికి ప్రయత్నించారని అన్నారు. దీంతో సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారని, పెద్దగా నష్టం జరగలేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ యుద్ద నౌక కర్ణాటకలోని కార్వార్ నౌకాశ్రయంలో ఉందని, ఈ సంఘటనపై దర్యాప్తుకు ఆదేశిస్తున్నామని నేవీ ప్రతినిధి అన్నారు. కీవ్-క్లాస్ అనే యుద్ధ నౌకను భారత్ 2013లో రష్యా నుంచి కొనుగోలు చేసి, దానికి విక్రమాదిత్య చక్రవర్తి పై గౌరవార్థం ఐఎన్ఎస్ విక్రమాదిత్యగా పేరు పెట్టారు. 20 అంతస్తుల ఎత్తు, 22 డెక్స్‌తో సుమారు 1600 మంది సిబ్బంది సామర్ఠ్యం కలిగిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య పొడవు 284 మీటర్లు, 60 మీటర్ల బేస్‌తో మూడు ఫుట్‌బాల్ మైదానాల వైశాల్యం కలిగి ఉంది. -
విరాట్‌పై చిగురించిన ఆశలు
► ప్రాథమిక అంచనాకు నిధులు ► రూ.1.50 లక్షలు చెన్నై సంస్థకు కేటాయింపు విశాఖసిటీ : విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విరాట్ ప్రాజెక్టుపై ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. విశాఖలో ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ.. ప్రభుత్వం ప్రాథమిక పరిశీలన నివేదికకు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో మ్యూజియంతో పాటు స్టార్ హోటల్‌గా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో అతి పెద్ద విమాన యుద్ధ నౌకగా గుర్తింపు పొందిన ఐఎన్ఎస్ విరాట్ నేవీ సేవల నుంచి గతేడాది నిష్క్రమించింది. అప్పటి నుంచి దీన్ని మ్యూజియం, స్టార్ హోటల్‌గా తీర్చిదిద్దాలని భావించారు. ప్రాజెక్టు వ్యయం వెయ్యి కోట్ల రూపాయలు అనుకున్నప్పటికీ అంత వ్యయాన్ని భరించే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడంతో దాన్ని రూ. 300 కోట్లకు కుదించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే అప్పటి నుంచి దీనిపై ఎలాంటి చర్చలూ.. కేంద్ర ప్రభుత్వం, నేవీ అధికారుల నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ప్రాజెక్టు వెనక్కు మళ్లిందని అనుకున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ నౌకను మ్యూజియం, స్టార్ హోటల్‌గా మార్చేందుకు అవసరమైన నివేదికను తయారు చేయాలంటూ చెన్నైకి చెందిన నాటెక్స్ మ్యారీటైమ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.1.50 లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. దీంతో ఈ ప్రాజెక్టుపై కదలిక వచ్చింది. ఈ ప్రాథమిక నివేదిక తయారు చేసేందుకు రూ.1.75 లక్షల వ్యయం అవుతుందని సంస్థ ప్రభుత్వానికి పంపించగా.. ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి.. దీనికి లక్షన్నర రూపాయలు సరిపోతాయని సంస్థకు తేల్చిచెప్పింది. వీలైనంత త్వరలో ప్రాథమిక నివేదికను అందివ్వాలని చెన్నై సంస్థను కోరింది. భీమిలిలో ఏర్పాటుకుసన్నాహాలు విరాట్ మ్యూజియం, స్టార్ హోటల్ ఏర్పాటు కోసం పర్యాటక శాఖ మూడు స్థలాల్ని ఎంపిక చేసింది. చివరికి భీమిలి మండలం మూలకుద్దులో ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద దేశంలో తొలి సబ్‌మెరైన్ మ్యూజియం, ఆసియాలోనే తొలి యుద్ధ విమాన మ్యూజియం ప్రాజెక్టులతో పర్యాటక రంగంలో వన్నెలద్దుకున్న విశాఖ తాజా గా.. విరాట్‌తో ప్రపంచస్థాయి మ్యూజియంగా ఖ్యాతి గడించనుంది. -
‘విరాట్’పై ఆశలు !
►ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్చలు ►రూ.300 కోట్లకు తగ్గనున్న పెట్టుబడి భారం ►మూలకుద్దులో ఏర్పాటుకు నిర్ణయం విశాఖపట్నం: విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్‌పై అడుగంటిపోయిన ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. విరాట్ విశాఖలో ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక యుద్ధనౌకగా గుర్తింపు పొందిన ఈ విరాట్ నేవీ సేవల నుంచి గత ఏడాది నిష్క్రమించింది. దీనిని రాష్ట్రానికి కేటాయించాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతోంది. దీనిని విశాఖ తీరంలో మ్యూజియం కం స్టార్ హోటల్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండడంతో ఆ మొత్తాన్ని భరించలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దీనికవసరమయ్యే నిధులను కేంద్రం భరించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విన్నపానికి అటు నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో విరాట్ విశాఖలో ఏర్పాటు సాధ్యం కాదని తేలిపోయింది. మళ్లీ కదలిక నేవీలో మూడు దశాబ్దాల పాటు సేవలందించి ఇటీవలే విరమణ పొందిన టీయూ–142 యుద్ధ విమానాన్ని మ్యూజియంగా ఏర్పాటుచేయడానికి గత శనివారం విశాఖకు తీసుకొచ్చినప్పుడు మళ్లీ విరాట్‌పై కదలిక వచ్చింది. పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీకాంత్ ఈ విరాట్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబుకు సమగ్రంగా వివరించారు. ప్రస్తుత అంచనాలకంటే మూడు వంతుల నిధులు తగ్గేలా ఈ విరాట్ ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని సీఎంకు వివరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖలో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు గురువారం పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీకాంత్, ప్రాంతీయ డైరెక్టర్ శ్రీరాములునాయుడు, ఇతర అధికారులు ఢిల్లీ పయనమయ్యారు. సాయంత్రం కేంద్ర పర్యాటకశాఖ కార్యదర్శి ఎన్కే సిన్హా నేతృత్వంలోని అధికారులతో సమావేశమయ్యారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తాజా ప్రతిపాదనలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ముందుగా అనుకున్న ప్రకారం కాకుండా కొన్ని మార్పులు చేర్పులు చేయడం, అనవసర వ్యయాన్ని తగ్గించడం వంటì అంశాలను కేంద్ర అధికారులకు వివరించారు. వ్యయం రూ.300 కోట్లకు కుదింపు ఈ ప్రాజెక్టు వ్యయం రూ.300 కోట్లు సరిపోతుందన్న అంచనాకు వచ్చారు. ఇందుకవసరమయ్యే సొమ్ములో కొంత కేంద్ర ప్రభుత్వం భరించాలని కోరారు. దీనిపై అటు నుంచి స్పష్టమైన హామీ రాకపోయినా ప్రతికూలంగా మాత్రం స్పందించలేదు. మరోవైపు రాష్ట్రానికి చెందిన పట్టణాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖల నుంచి కొంత నిధులను సమీకరించాలన్న నిర్ణయానికొచ్చినట్టు తెలిసింది. దీనిపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. త్వరలోనే డీపీఆర్‌లకు సంబంధించి టెండర్లు పిలవనున్నారు. తాజాగా ఈ విరాట్‌ను భీమిలి మండలం మూలకుద్దులో ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికొచ్చారు. అక్కడ సుమారు 500 ఎకారాల్లో స్పెషల్ టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు పర్యాటకాభివృద్ధి సంస్థ ఆర్డీ శ్రీరాములునాయుడు గురువారం రాత్రి ఢిల్లీ నుంచి ‘సాక్షి’కి చెప్పారు. అటు కేంద్రం కొంత ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇటు అంచనా వ్యయం తగ్గించడంతో విరాట్ విశాఖలో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రారంభోత్సవ దృశ్యాలు
తొలిసారి పూర్తి దేశీయంగా రూపొందిన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సోమవారం జాతికి అంకితం చేశారు.కేరళలోని కొచ్చి నౌకాశ్రయంలో ఐఎన్ఎస్ విక్రాంత్‌ను నౌకాయాన మంత్రి జీకే వాసన్, నేవల్ చీఫ్ డీకే జోషీల సమక్షంలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ భార్య ఎలిజబెత్ ప్రారంభించారు. తొలిదశ నిర్మాణం మాత్రమే ఇప్పటికి పూర్తయిందని, మిగతా దశల్లో మొత్తం నిర్మాణం పూర్తిచేయనున్నట్లు నౌకాదళ అధికారులు తెలిపారు. -
ఐఎన్ఎస్ విక్రాంత్ జాతికి అంకితం
తొలిసారి పూర్తి దేశీయంగా రూపొందిన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సోమవారం జాతికి అంకితం చేశారు. కేరళలోని కొచ్చి నౌకాశ్రయంలో ఐఎన్ఎస్ విక్రాంత్‌ను నౌకాయాన మంత్రి జీకే వాసన్, నేవల్ చీఫ్ డీకే జోషీల సమక్షంలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ భార్య ఎలిజబెత్ ప్రారంభించారు. తొలిదశ నిర్మాణం మాత్రమే ఇప్పటికి పూర్తయిందని, మిగతా దశల్లో మొత్తం నిర్మాణం పూర్తిచేయనున్నట్లు నౌకాదళ అధికారులు తెలిపారు. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణం 2016 నాటికి పూర్తయి పరీక్షలకు సిద్ధం కానుందని, 2018 నాటికి నావికాదళంలోకి చేరనుందని చెప్పారు. ప్రస్తుతం ఇలాంటి భారీ యుద్ధనౌకలను నిర్మించే సామర్థ్యం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలకు మాత్రమే ఉండగా.. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణంతో భారత్ కూడా సత్తా చాటినట్లవుతుందని నౌకా దళ ఉప ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఆర్కే ధావన్ అన్నారు. ఈ నౌక నిర్మాణానికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తయారుచేసిన హైగ్రేడ్ స్టీలును, స్వదేశీయ పరికరాలను ఉపయోగించినట్లు తెలిపారు. ఇవీ ప్రత్యేకతలు.. ఐఎన్ఎస్ విక్రాంత్ 260 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇప్పటిదాకా భారత్ 6-7వేల టన్నుల బరువును మోయగల నౌకలను మాత్రమే నిర్మించగా.. ఈ నౌక ఏకంగా 37,500 టన్నుల బరువును మోయగలగడం విశేషం. దీనిపై రెండు టేకాఫ్ పాయింట్లు, ఒక రన్‌వే, ల్యాండింగ్ పాయింట్లు ఉంటాయి. మిగ్-29కే, కమోవ్ 31, తేలికపాటి యుద్ధవిమానాలు ఈ నౌకపై మోహరించనున్నాయి. నౌకపై 24 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 8 డీజిల్ జనరేటర్లు, 4 గ్యాస్ టర్బైన్లు అమర్చారు. దీని డిజైన్‌ను ‘డెరైక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్’ రూపొందించగా, కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్ 2006 నుంచి నిర్మిస్తోంది. -
ఇఎన్ఎస్ విక్రాంత్‌తో సత్తాచాటిన భారత్