తొలిసారి పూర్తి దేశీయంగా రూపొందిన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ను సోమవారం జాతికి అంకితం చేశారు.కేరళలోని కొచ్చి నౌకాశ్రయంలో ఐఎన్ఎస్ విక్రాంత్‌ను నౌకాయాన మంత్రి జీకే వాసన్, నేవల్ చీఫ్ డీకే జోషీల సమక్షంలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ భార్య ఎలిజబెత్ ప్రారంభించారు. తొలిదశ నిర్మాణం మాత్రమే ఇప్పటికి పూర్తయిందని, మిగతా దశల్లో మొత్తం నిర్మాణం పూర్తిచేయనున్నట్లు నౌకాదళ అధికారులు తెలిపారు.