గత కొంతకాలంగా ఎగిరే కార్లు వినియోగంలోకి వస్తాయన్న చాలామంది కలలు కంటూనే ఉన్నారు. అయితే ఈ కల ఎట్టకేలకు ఇప్పుడు నిజమయ్యింది. స్వీడన్ స్టార్టప్ కంపెనీ 'జెట్సన్ వన్' అనే ఫ్లైయింగ్ కారుని విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
డ్రోన్ మాదిరిగా గాలిలో ఎగిరే ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 98,000 డాలర్లు (సుమారు 80.19 లక్షల రూపాయలు). అయితే కస్టమర్ ఇప్పుడు కేవలం 8,000 డాలర్లు (దాదాపు 6.5 లక్షల రూపాయలు) చెల్లించి ఈ కారును ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఇది చూడటానికి హెలికాఫ్టర్ మాదిరిగా ఉంటుంది.
చూడటానికి హెలికాఫ్టర్ మాదిరిగా ఉన్నప్పటికీ ఒక డ్రోన్ మోడల్ ఆధారంగా తయారైంది. ఈ ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ కారు టేకాఫ్, ల్యాండింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి గాలిలో ఎగురుతూ సురక్షితంగా ప్రయాణిస్తుంది. అయితే ఈ కారుని నడపడానికి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. దీని బరువు 86 కేజీలు మాత్రమే ఉంటుంది. ఇది eVTOL అల్ట్రాలైట్ వాహనాల కోసం US ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనలకు అనుగుణంగా ఉండటం వల్ల ఆపరేట్ చేయడానికి లైసెన్స్ అవసరం లేదు. ఈ నియమాలు కేవలం అమెరికాలో మాత్రమే వర్తిస్తాయి.
(ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!)
జెట్సన్ వన్ అనే ఫ్లైయింగ్ కారు ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులోని కాక్‌పిట్‌లో రెండు జాయ్‌స్టిక్‌లు ఉంటాయి. ఒకటి ఎత్తుని కంట్రోల్ చేయడానికి కాగా, మరొకటి దిశను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. కొత్త వారు కూడా చాలా తక్కువ సమయంలో ఆపరేటింగ్ నేర్చుకోవచ్చని కంపెనీ తెలిపింది.
జెట్సన్ వన్ 88 కేజీల బ్యాటరీ కలిగి సుమారు 1,500 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. ఇందులో ఉన్న ప్రొపెల్లర్లు గంటకు 101 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి అనుమతిస్తాయి. ల్యాండింగ్ చేయడానికి సెన్సర్లను ఉపయోగించి సులభంగా ల్యాండ్ చేయవచ్చు. ఈ కారు ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయాన్ని గురించి కంపెనీ వెల్లడించలేదు.
(ఇదీ చదవండి: రూ. 5వేలు పెట్టుబడితో రూ. 750 కోట్ల వ్యాపార సామ్రాజ్యం - తయారైందిలా..!)
మార్కెట్లో విడుదలైన కొత్త జెట్సన్ వన్ ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో పారాచూట్ వంటివి అందుబాటులో ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇందులో హ్యాండ్స్-ఫ్రీ హోవర్ ఫంక్షన్లు ఉండటం వల్ల మోటార్ చెడిపోయినప్పుడు కూడా సురక్షితంగా ఎగురుతూ ఉంటుందని చెబుతున్నారు.
(ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్‌లో ఇవి గమనించారా? లేకుంటే పేలిపోతాయ్..)
ఈ ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ కారు కావాలనుకున్న వారు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలో త్వరలోనే ప్రారంభమవుతాయి. టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు ఇప్పటికే వందల సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించినట్లు కంపెనీ తెలిపింది. అంతే కాకుండా ఇది కేవలం యుఎస్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment