new vehicle
-
మొదటిసారి కారు కొన్నవారు ఇంతమందా?
కరోనా మహమ్మారి తరువాత చాలామంది సొంత వాహనం కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆటోమొబైల్ మార్కెట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. మొదటిసారి కార్లను కొనుగోలు చేసినవారు 67 శాతం మంది ఉన్నట్లు రిటైల్ ప్లాట్‌ఫారమ్ స్పిన్నీ ఒక నివేదికలో వెల్లడించింది.మొదటిసారి వాహనం కొనుగోలు చేసిన మొత్తం 67 శాతం మందిలో 30 శాతం మహిళలే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో కూడా 80 శాతం మంది పెట్రోల్ కార్లను కొనుగోలు చేశారు. డీజిల్ కార్ల కొనుగోలుకు కేవలం 12 శాతం మంది మాత్రమే ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఐదు శాతం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) మోడల్ ఎంచుకున్నారు.కొత్త వాహనాలను కొనుగోలు చేసినవారిలో చాలామంది వైట్, రెడ్, గ్రే కలర్స్ ఎంచుకున్నారు. సుమారు 60 శాతంమంది ఫైనాన్సింగ్ ద్వారా కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. డెలివరీల విషయానికి వస్తే.. 82 శాతం మంది డీలర్షిప్స్ నుంచి డెలివరీ తీసుకున్నట్లు, 18 శాతం మంది హోమ్ డెలివరీ ద్వారా డెలివరీ తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: కోటి మంది కొన్న హోండా స్కూటర్ ఇదే..ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 76 శాతం మంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కలిగిన కార్లను కొనుగోలు చేశారు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ వాహనాలను కొనుగోలు చేసినవారు 24 శాతం మంది మాత్రమే. దీన్ని బట్టి చూస్తే.. టెక్నాలజీ పెరిగినప్పటికీ.. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వాహనాలనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.కొత్త వాహనాల అమ్మకాలు ఢిల్లీలో ఎక్కువగా ఉన్నాయి. ఆ తరువాత స్థానంలో బెంగళూరు, ముంబై ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ ఆటోమొబైల్ భారత్ మూడో స్థానంలో ఉంది. నేడు మన దేశంలో చైనా, జపాన్, జర్మన్ వంటి అనేక దేశాల బ్రాండ్స్ కూడా గొప్ప అమ్మకాలను పొందుతున్నాయి. -
మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్‌న్యూస్, ఇంట్రస్టింగ్ అప్డేట్స్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో మార్కెట్లోకి రానున్న జిమ్నీ మోడల్ చేరిక సంస్థ అమ్మకాలు గణనీయంగా పెరిగేందుకు దోహదం చేస్తుందని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) వెల్లడించింది. అంతేగాక వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) విభాగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి స్థానాన్ని లక్ష్యంగా చేసుకున్న కంపెనీకి ఇది బలమైన మోడల్‌గా నిలుస్తుందని ఆశిస్తోంది. ఎస్యూవీ సెగ్మెంట్లో అగ్రస్థానంలో నిలిచేందుకు బ్రెజ్జా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా వంటి ఇతర మోడళ్లతో పాటు జిమ్నీ కీలక పాత్ర పోషించాలని సంస్థ భావిస్తోంది. ప్యాసింజర్ కార్ల రంగంలో భారత్‌లో ఎస్‌యూవీల వాటా ప్రస్తుతం 45 శాతం ఉంది. ఎస్‌యూవీల్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలు సగానికిపైగా వాటాను కైవసం చేసుకున్నాయి. 2022–23లో దేశంలో 39 లక్షల యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. ఇందులో కాంపాక్ట్ ఎస్‌యూవీలు 8.7 లక్షల యూనిట్లు ఉన్నాయి. లైఫ్‌స్టైల్ ఎస్యూవీ సెగ్మెంట్ కొత్తగా ప్రాచుర్యంలోకి వస్తోంది. (మంటల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700: వీడియో వైరల్, స్పందించిన కంపెనీ) కంపెనీ వృద్ధిలో సాయం.. సంస్థ మొత్తం బ్రాండ్ విలువపై జిమ్నీ సానుకూల ప్రభావం చూపుతుందని మారుతీ సుజుకీ ఇండియా సేల్స్, మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ‘ఒక నిష్ణాత ఎస్‌యూవీగా వారసత్వాన్ని జిమ్నీ కలిగి ఉంది. ఈ విభాగంలో కంపెనీ వృద్ధికి ఇది ఖచ్చితంగా సహాయం చేస్తుంది’ అని అన్నారు. అయిదు డోర్లు కలిగిన జిమ్నీ ఎస్యూవీ అభివృద్ధి కోసం ఎంఎస్ఐ రూ.960 కోట్లు వెచ్చించింది. ప్రపంచవ్యాప్తంగా 199 దేశాలు, ప్రాంతాల్లో సుజుకీ ఇప్పటి వరకు 32 లక్షల యూనిట్ల జిమ్నీ వాహనాలను విక్రయించింది. విదేశాల్లో ఇది మూడు డోర్లతో లభిస్తోంది. తొలిసారిగా అయిదు డోర్లతో భారత్‌లో రంగప్రవేశం చేస్తోంది. ఆల్-టెరైన్ కాంపాక్ట్ లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీగా స్థానం సంపాదించింది. ఈ ఫోర్-వీల్-డ్రైవ్ ఆఫ్-రోడర్ కఠినమైన భూభాగాల్లో కూడా పరుగెత్తగలదు. (e-Sprinto Amery: మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్లు..) జిమ్నీకి 30 వేల బుకింగ్స్.. ఇప్పటికే జిమ్నీ కోసం సుమారు 30,000 బుకింగ్స్ నమోదయ్యాయని శ్రీవాస్తవ వెల్లడించారు. వచ్చే నెల నుంచి డెలివరీలు ఉంటాయన్నారు. ఏటా దాదాపు 48,000 యూనిట్ల విక్రయాలు నమోదయ్యే లైఫ్‌స్టైల్ ఎస్యూవీ సెగ్మెంట్ రాబోయే కొద్ది సంవత్సరాల్లో త్వరగా విస్తరిస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. జిమ్నీతో అమ్మకాలు తక్కువ సమయంలో రెట్టింపు అవుతాయని శ్రీవాస్తవ చెప్పారు. బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, జిమ్నీలతో కంపెనీ 2022–23లో దేశీయ ఎస్యూవీ విభాగంలో 25 శాతం మార్కెట్ వాటాను ఆశిస్తోంది. ఎస్యూవీ సెగ్మెంట్లో కంపెనీ వాటా 2022 ఏప్రిల్‌లో 12 శాతం ఉంటే.. గత నెలలో ఇది 19 శాతానికి ఎగసిందన్నారు. (నైజిరియన్ చెఫ్ రికార్డ్: ఏకంగా 100 గంటలు వంట, ఎందుకో తెలుసా?) సాయుధ దళాలకు.. జిప్సీ మాదిరిగా సాయుధ దళాలకు జిమ్నీ వాహనాలను అందించాలని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు శ్రీవాస్తవ స్పందిస్తూ.. ఈ మోడల్‌ను పరిచయం చేసిన తర్వాత ఏదైనా నిర్దిష్ట అవసరం ఉంటే కచ్చితంగా పరిశీలిస్తాం. గతంలో సాయుధ దళాలకు 6–10 వేల యూనిట్ల జిప్సీ వాహనాలను సరఫరా చేసేవాళ్లం. ప్రస్తుతం జిప్సీ తయారీని నిలిపివేశాం అని తెలిపారు. మరిన్ని బిజినెస్ వార్తలు, ఇంట్రస్టింగ్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
ఓలాకి ధీటుగా ఏథర్ సరసమైన స్కూటర్ - త్వరలో..
బెంగళూరు బేస్డ్ కంపెనీ అయిన 'ఏథర్ ఎనర్జీ' (Ather Energy) ఇప్పటికే ఏథర్ 450, 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే వీటి ధరలు రూ. లక్ష కంటే ఎక్కువ కావడం వల్ల చాలా మంది కొనుగోలు చేయడానికి కొంత వెనుకాడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ మార్కెట్లో మరో సరికొత్త సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఏథర్ ఎనర్జీ మార్కెట్లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు '450ఎస్' (450S) అని తెలుస్తోంది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంపెనీ స్కూటర్ల కంటే తక్కువ ధరకే లభిస్తాయి. అంతే కాకుండా ఈ స్కూటర్ మార్కెట్లో 'ఓలా ఎస్1 ఎయిర్'కి ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఏథర్ 450S ఎలక్ట్రిక్ స్కూటర్ 2023 చివరి నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాకుండా ట్రేడ్‌మార్క్ కోసం కంపెనీ గత మార్చిలో అప్లై కూడా చేసింది. ఈ స్కూటర్ డిజైన్, ఫీచర్స్, ఇతర వివరాలను గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. కానీ ఇది చూడటానికి దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుందని భావించవచ్చు. (ఇదీ చదవండి: దీపికా పదుకొణె ట్విటర్ అకౌంట్ పోతుందా? ఎలాన్ మస్క్ కొత్త రూల్ ఏం చెబుతోందంటే?) త్వరలో విడుదల కానున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ దాని మునుపటి మోడల్స్ కంటే తక్కువ ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉంది. కావున ఇందులో 7 ఇంచెస్TFT టచ్‌స్క్రీన్, ఆటో హోల్డ్, రైడింగ్ మోడ్ వంటి ఫీచర్స్ బహుశా లభించకపోవచ్చు. అంతే కాకుండా రేంజ్ కూడా కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఈ స్కూటర్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఎగిరే కారు వచ్చేసిందండోయ్! రూ. 6.5 లక్షలతో ఇంటికి తీసుకెళ్లొచ్చు..
గత కొంతకాలంగా ఎగిరే కార్లు వినియోగంలోకి వస్తాయన్న చాలామంది కలలు కంటూనే ఉన్నారు. అయితే ఈ కల ఎట్టకేలకు ఇప్పుడు నిజమయ్యింది. స్వీడన్ స్టార్టప్ కంపెనీ 'జెట్సన్ వన్' అనే ఫ్లైయింగ్ కారుని విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. డ్రోన్ మాదిరిగా గాలిలో ఎగిరే ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 98,000 డాలర్లు (సుమారు 80.19 లక్షల రూపాయలు). అయితే కస్టమర్ ఇప్పుడు కేవలం 8,000 డాలర్లు (దాదాపు 6.5 లక్షల రూపాయలు) చెల్లించి ఈ కారును ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఇది చూడటానికి హెలికాఫ్టర్ మాదిరిగా ఉంటుంది. చూడటానికి హెలికాఫ్టర్ మాదిరిగా ఉన్నప్పటికీ ఒక డ్రోన్ మోడల్ ఆధారంగా తయారైంది. ఈ ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ కారు టేకాఫ్, ల్యాండింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి గాలిలో ఎగురుతూ సురక్షితంగా ప్రయాణిస్తుంది. అయితే ఈ కారుని నడపడానికి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. దీని బరువు 86 కేజీలు మాత్రమే ఉంటుంది. ఇది eVTOL అల్ట్రాలైట్ వాహనాల కోసం US ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనలకు అనుగుణంగా ఉండటం వల్ల ఆపరేట్ చేయడానికి లైసెన్స్ అవసరం లేదు. ఈ నియమాలు కేవలం అమెరికాలో మాత్రమే వర్తిస్తాయి. (ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!) జెట్సన్ వన్ అనే ఫ్లైయింగ్ కారు ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులోని కాక్‌పిట్‌లో రెండు జాయ్‌స్టిక్‌లు ఉంటాయి. ఒకటి ఎత్తుని కంట్రోల్ చేయడానికి కాగా, మరొకటి దిశను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. కొత్త వారు కూడా చాలా తక్కువ సమయంలో ఆపరేటింగ్ నేర్చుకోవచ్చని కంపెనీ తెలిపింది. జెట్సన్ వన్ 88 కేజీల బ్యాటరీ కలిగి సుమారు 1,500 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. ఇందులో ఉన్న ప్రొపెల్లర్లు గంటకు 101 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి అనుమతిస్తాయి. ల్యాండింగ్ చేయడానికి సెన్సర్లను ఉపయోగించి సులభంగా ల్యాండ్ చేయవచ్చు. ఈ కారు ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయాన్ని గురించి కంపెనీ వెల్లడించలేదు. (ఇదీ చదవండి: రూ. 5వేలు పెట్టుబడితో రూ. 750 కోట్ల వ్యాపార సామ్రాజ్యం - తయారైందిలా..!) మార్కెట్లో విడుదలైన కొత్త జెట్సన్ వన్ ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో పారాచూట్ వంటివి అందుబాటులో ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇందులో హ్యాండ్స్-ఫ్రీ హోవర్ ఫంక్షన్లు ఉండటం వల్ల మోటార్ చెడిపోయినప్పుడు కూడా సురక్షితంగా ఎగురుతూ ఉంటుందని చెబుతున్నారు. (ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్‌లో ఇవి గమనించారా? లేకుంటే పేలిపోతాయ్..) ఈ ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ కారు కావాలనుకున్న వారు కంపెనీ అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలో త్వరలోనే ప్రారంభమవుతాయి. టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు ఇప్పటికే వందల సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించినట్లు కంపెనీ తెలిపింది. అంతే కాకుండా ఇది కేవలం యుఎస్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. -
కొత్త హంగులతో ముస్తాబైన కొత్త యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ - వివరాలు
ప్రముఖ బైక్ అండ్ స్కూటర్ తయారీ సంస్థ యమహా తన నియో ఎలక్ట్రిక్ స్కూటర్ని అప్డేట్ చేసింది. ఈ 2023 మోడల్ అంతర్జాతీయ మార్కెట్లో అధికారికంగా అరంగేట్రం చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ గురించి మరిన్ని అప్డేటెడ్ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యమహా కంపెనీ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు కొత్త కలర్ స్కీమ్ పొందుతుంది, కావున చూడటానికి దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. ఇందులోని స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డిఆర్ఎల్ వంటివి అద్భుతంగా పనిచేస్తాయి. అయితే వెనుక భాగంలో టెయిల్ లాంప్ మాత్రం నెంబర్ ప్లేట్ మీద అమర్చి ఉండటం చూడవచ్చు. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో అందుబాటులో ఉన్న స్కూటర్ల మాదిరిగానే మంచి పనితీరుని అందిస్తుంది. ఇందులో రెండు రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీలు ఉంటాయి. అంతే కాకుండా 2.03 కిలోవాట్ మోటార్ ఇందులో అమర్చబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 40 కిలోమీటర్ల మాత్రమే. ఇది పూర్తి ఛార్జ్ చేసుకోవడానికి గరిష్టంగా 8 గంటల సమయం తీసుకుంటుంది. (ఇదీ చదవండి: ఒకప్పుడు ఆసియాలో అత్యంత ధనవంతుడు! ఇప్పుడు ఆస్తులు సున్నా అంటున్నాడు..) ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన LCD డిస్ప్లే లభిస్తుంది. ఇది బ్యాటరీ స్టేటస్, రూట్ ట్రాకింగ్, కాల్స్ అండ్ మెసేజస్ వంటి వాటిని యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది బైక్ రైడర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంపిక చేసిన కొన్ని డీలర్‌షిప్‌లలో ప్రదర్శించారు. ఇది ఈ సంవత్సరం చివరినాటికి లేదా 2024 ప్రారంభంలో భారతదేశంలో విక్రయానికి రానున్నట్లు భావిస్తున్నారు. -
త్వరలో విడుదలకానున్న కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇదే
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేవారు రోజురోజుకి ఎక్కువవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పాపులర్ కంపెనీల దగ్గర నుంచి, చిన్న కంపెనీల వరకు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'హీరో ఎలక్ట్రిక్' ఒక కొత్త స్కూటర్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. హీరో ఎలక్ట్రిక్ త్వరలో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్‌ను కంపెనీ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇందులో హీరో కొత్త స్కూటర్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న ఆప్టిమాను పోలి ఉందని తెలుస్తోంది. ఇది ఈ నెల 15న (2023 మార్చి 15) విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ విషయానికి వస్తే, దీని ఫ్రంట్ కౌల్ టాప్ పొజిషన్లో ఎల్ఈడీ హెచ్ల్యాంప్, సెంటర్లో ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు ఉన్నాయి. అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, కర్వీ సీట్, గ్రాబ్ రెయిల్, బ్లూ పెయింట్ థీమ్‌తో ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రానున్న ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది. (ఇదీ చదవండి: కొత్త కారు కొనేవారికి శుభవార్త.. మారుతి కార్లపై అదిరిపోయే ఆఫర్స్) కనెక్టెడ్ టెక్నాలజీ కూడా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇంకా చాలా విషయాలను వెల్లడించాల్సి ఉంది. ఇవన్నీ లాంచ్ సమయంలో కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది. ఇప్పటికే కంపెనీ ఏడు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ విక్రయిస్తోంది. ఇప్పుడు రాబోయే మోడల్ 8 వ స్థానంలో ఉంటుంది. A new era of intelligent and sustainable mobility is all set to dawn! Are you ready to experience the newest electrifying ride from Hero Electric? Watch this space to know more 🛵⚡#TheSmartMove pic.twitter.com/0nH6eSvFkO — Hero Electric (@Hero_Electric) March 12, 2023 -
Ampere Zeal EX: సింగిల్ ఛార్జ్ 120 కి.మీ రేంజ్.. ధర కూడా తక్కువే!
భారతీయ మార్కెట్లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 'ఆంపియర్ జీల్ ఈఎక్స్' ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ స్కూటర్ ధర రూ. 69,900 (ఎక్స్-షోరూమ్). ఈ ధర కేవలం మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో ఈ స్కూటర్ ధర రూ. 75,000 (ఎక్స్-షోరూమ్). 2023 మార్చి 31 లోపు కొనుగోలు చేసే కస్టమర్లు ఆంపియర్ జీల్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద రూ.6,000 బెనిఫీట్స్ పొందవచ్చు. ఇది స్టోన్ గ్రే, ఐవరీ వైట్, ఇండిగో బ్లూ అనే డ్యూయెల్ టోన్ కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ఆంపియర్ జీల్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ లెవల్ మోడల్, కావున 2.3 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ కలిగి 1.8kW ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా గంటకు 120 కి.మీ కంటే ఎక్కువ పరిధి అందిస్తుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎంట్రీ లెవెల్ స్కూటర్ కేవలం 5 గంటలలో పూర్తిగా ఛార్జ్ చేసుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లు. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్స్ అందుబాటులో ఉంటాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్లతో సమానంగా ఉంటుంది. -
యమహా త్రీ వీల్ స్కూటర్.. కొత్త లుక్ & అదిరిపోయే ఫీచర్స్
అంతర్జాతీయ మార్కెట్లో మూడు చక్రాల స్కూటర్లు చాలా అరుదు, అయితే ప్రపంచం ప్రగతి మార్గంలో పరుగులు పెడుతున్న తరుణంలో ఆధునిక వాహనాల ఉత్పత్తి, వినియోగం చాలా అవసరం. ఇందులో భాగంగా యమహా కంపెనీ ఇప్పుడు జపనీస్ మార్కెట్లో ట్రైసిటీ స్కూటర్ విడుదల చేసింది. యమహా విడుదల చేసిన ట్రైసిటీ స్కూటర్ 125 సీసీ, 155 సీసీ విభాగంలో అందుబాటులో ఉన్నాయి. నిజానికి కంపెనీ ఇలాంటి స్కూటర్ 2014 లో గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసినప్పటికీ భారతీయ మార్కెట్లో అందుబాటులోకి తీసుకురాలేదు. ఇది సాధారణ స్కూటర్ మాదిరిగా ఉన్నప్పటికీ ముందు భాగంలో రెండు చక్రాలు, వెనుక ఒక చక్రం పొందుతుంది. ట్రైసిటీ స్కూటర్ LED డేటైమ్ రన్నింగ్ లైట్స్, సెంటర్ సెట్ LED హెడ్‌లైట్, LCD సెంటర్ కన్సోల్ వంటి వాటితో పాటు సింగిల్ సీట్‌తో ఇంటిగ్రేటెడ్ గ్రాబ్ రైల్ పొందుతుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్స్, రెండు వైపులా డిస్క్ బ్రేకులు, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక డ్యూయెల్ షాక్ అబ్జార్బర్ కలిగి ఉంటుంది. ట్రైసిటీ స్కూటర్లోని 125 సీసీ ఇంజిన్ 12.06 బిహెచ్పి పవర్, 11.2 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది, అదే సమయంలో 155 సీసీ ఇంజిన్ 14.88 బిహెచ్పి పవర్ మరియు 14 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. జపనీస్ మార్కెట్లో విడుదలైన ట్రైసిటీ 125 స్కూటర్ 125 ధర రూ. 4,95,000 యెన్లు (సుమారు రూ. 3.10 లక్షలు) 155 స్కూటర్ ధర 5,56,500 యెన్లు (సుమారు రూ. 3.54 లక్షలు). డెలివరీలు ఫిబ్రవరి, ఏప్రిల్ సమయంలో మొదలవుతాయి. ఈ మోడల్ స్కూటర్ మన దేశంలో విడుదలవుతుందా.. లేదా అనే విషయాన్నీ యమహా ధ్రువీకరించలేదు. -
3వ తరం ఏథర్ 450ఎక్స్ త్వరలోనే: అద్భుతమైన బ్యాటరీతో
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ మరో కొత్త స్కూటర్‌ను తీసుకొస్తోంది. 3వ తరం 450X స్వదేశీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రేపు(మంగళవారం) ఆవిష్కరించ నుంది. లాంచింగ్ తరువాత బుకింగ్‌లను స్టార్ట్ చేయనుంది. అలాగే ధర ఫీచర్లపై లాంచింగ్ తరువాత మాత్రమే అధికారిక కన్మఫరమేషన్ వస్తుంది. ప్రస్తుతం అందిస్తున్న 75-80 కిలోమీటర్ల పరిధితో పోలిస్తే ఒక్కచార్జ్కి 146 కి.మీ సామర్థ్యమున్న బ్యాటరీని అందించడం కీలకమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త ఫీచర్ల అంచనాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుత ఏథోర్ 450ఎక్స్‌లోని 2.8 kWh బ్యాటరీతో పోలిస్తే 19 కిలోల నికెల్ కోబాల్ట్ ఆధారితంగా పెద్ద బ్యాటరీని ఈస్కూటర్లో జోడించింది. ప్రస్తుతమున్న వార్ప్, స్పోర్ట్, రైడ్, ఎకో ,స్మార్ట్ ఎకో రైడింగ్ మోడ్స్‌తో కొత్త 3వ-జెన్ ఏథర్ 450ని తీసుకురానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏథర్ 450 ప్లస్ ధర రూ.1.58 లక్షలు (ఆన్-రోడ్)గా ఉంది. అయితే 450ఎక్స్ ధర రూ. 1.81 లక్షలుగా ఉంటుందని అంచనా. తన ఉత్పత్తులకు ఎప్పుడూ ప్రీమియం ధరను నిర్ణయించే ఏథర్ ఎనర్జీ ఈ సారి కూడా అదే చేయబోతోంది. -
మారుతి కొత్త S-ప్రెస్సో, మోర్ ఫీచర్స్, మోర్ మైలేజీ, రూ.4.25 లక్షలు
సాక్షి, ముంబై: మారుతి సుజుకి ఇండియా కొత్త ఎస్-ప్రెస్సోను లాంచ్ చేసింది. 1.0 లీటర్ల నెక్స్ట్ జెన్ K-సిరీస్‌లో 2022ఎస్-ప్రెస్సోను విడుదల చేస్తున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. సుమారు 1.44 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపింది. పాత ఎస్-ప్రెస్సోతో పోలిస్తే, ఫీచర్లనుఅప్డేట్ చేసి, ధరను సుమారు 71,వేల రూపాయలు పెంచింది. అత్యాధునిక ఇంజీన్, ఎక్కువ మైలేజీతో మైక్రో-SUVగా తీసుకొచ్చింది. స్టార్ట్-స్ట్రాప్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ వీవీటీ ఇంజన్, మెరుగైన ఇంధన-సామర్థ్యం, అదనపు ఫీచర్లు కస్టమర్లకు ఆకర్షణీయమైన డ్రైవ్ అనుభవాన్ని అందిస్తుందని నమ్ముతున్నామని మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఫీచర్లు, మైలేజీ, ధర 1.0L డ్యూయల్ జెట్, ఐడిల్-స్టార్ట్-స్టాప్ టెక్నాలజీతో డ్యూయల్ వీవీటి ఇంజన్‌తో కొత్త S-ప్రెస్సోను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త మోడల్ 4 ట్రిమ్స్‌లో అందుబాటులో ఉంది. సరికొత్త భద్రతా ఫీచర్లతో స్టాండర్ట్, LXi, Vxi Vxi వేరియంట్లలో వస్తుంది. దీని ధర రూ. 4.25 లక్షల నుంచి రూ. 5.99 లక్షల మధ్య ఉంటుంది. దీని ఇంజీన్ 5,500rpm వద్ద 65bhp శక్తిని, 3,500rpm వద్ద 89Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. సర్టిఫైడ్ ఫ్యూయల్ ఎకానమీ 25.30 కిలోమీటర్ల మైలేజీ, అందిస్తుందని, అయితే మాన్యువల్ వెర్షన్ 24.76kmplని ఆఫర్ చేస్తుందని మారుతి వెల్లడించింది. స్టాండర్డ్, Lxi, Vxi Vxi+. మాన్యువల్ శ్రేణి ప్రారంభ ధర రూ. 4.25 లక్షలు రూ. 5.49 లక్షల వరకు ఉంటుంది. మరోవైపు, ఏజీఎస్ గేర్‌బాక్స్ వరుసగా రూ. 5.65 లక్షలు ,రూ. 5.99 లక్షల ధర కలిగిన Vxi , Vxi+ వేరియంట్లతో మాత్రమే అందుబాటులో ఉంది. Image source: Maruti Suzuki 5-స్పీడ్ మాన్యువల్, AGS(ఆటో-గేర్ షిఫ్ట్), ఎంట్రీ-లెవల్ టాల్-బాయ్ హ్యాచ్‌బ్యాక్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ప్రీ-టెన్షనర్లు, ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్ ఫోర్స్ లిమిటర్ ఫ్రంట్ సీట్‌బెల్ట్‌లు, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ తోపాటు, హ్యాచ్‌బ్యాక్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, వాయిస్ కన్సోల్, ట్విన్ ఛాంబర్ హెడ్‌ల్యాంప్‌లు , డైనమిక్ సెంటర్ కన్సోల్ స్మార్ట్ ప్లే స్టూడియో లాంటివి ప్రధాన ఫీచర్లు. -
మహీంద్రా థార్‌కు పోటీ..! సరికొత్తగా రానున్న ఫోర్స్ గుర్ఖా..!
ఆఫ్ రోడ్ కార్లలో మహీంద్రా థార్ అత్యంత ఆదరణను పొందింది. ఈ సెగ్మెంట్లో మహీంద్రా థార్, మారుతి సుజుకీ జిమ్నీ కార్లకు పోటీగా ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్స్ మోటార్స్ గుర్ఖా ఎస్యూవీను లాంచ్ చేసింది. తాజాగా గుర్ఖాను సరికొత్తగా తెచ్చేందుకు ఫోర్స్ సన్నాహాలను చేస్తోంది. 5 డోర్ వెర్షన్లో సరికొత్తగా..! గత ఏడాది ఫోర్స్ మోటార్స్ ఆఫ్ రోడ్ సెగ్మెంట్లో గుర్ఖాను తీసుకొచ్చింది.తొలుత 3 డోర్ వెర్షన్ గుర్ఖాను ఫోర్స్ మోటార్స్ లాంచ్ చేసింది. దీనికి అదనంగా మరిన్నీ సీట్లను యాడ్ చేస్తూ 5 డోర్ వెర్షన్ గుర్ఖాను త్వరలోనే లాంచ్ చేస్తామని ఫోర్స్ తెలియజేసింది. ఇప్పుడు తాజాగా 5 డోర్ వెర్షన్ గుర్ఖా టెస్టింగ్ మోడల్‌కు సంబంధించిన చిత్రాలు ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. ఈ ఎస్యూవీను త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు సమాచారం. నయా ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీలో 6-7 సీట్ల సదుపాయం ఉండనుంది. అదే డిజైన్..ఇంజిన్‌తో..! ఫోర్స్ గుర్ఖా ఎస్యూవీ 5-డోర్ వెర్షన్ కారు అదే డిజైన్ , ఇంజిన్‌తో వచ్చే అవకాశాలున్నాయి. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్, టూఐర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్పీడ్ అలెర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం బ్లాక్ థీమ్‌తో ఇంటీరియర్ రూపొందించారు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేలు వర్క్ చేస్తాయి. డ్రైవర్ డిస్ప్లేను సెమి డిజిటల్‌గా అందించారు. 2.6 ఫోర్ సిలిండర్ బీఎస్ 6 ప్రమాణాలు కలిగిన డీజిల్ ఇంజన్ అమర్చారు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. గూర్ఖా ఇంజన్ 90 బీహెచ్పీతో 250 ఎన్ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది. చదవండి: అలా చేస్తే సగం ధరకే పెట్రోల్, డీజిల్..! -
Toyota Tocozilla: ఇది ట్రక్కు కాదు నడిచే ఇల్లు.. అచ్చంగా హీరోల తరహాలో
టాలీవుడ్ మొదలు హాలీవుడ్ వరకు అవుట్డోర్ షూటింగ్లకి వెళ్లే హీరోలు వ్యానిటీ కార్లు ఉపయోగిస్తుంటారు. అచ్చం ఇంటిలాగే బెడ్, డైనింగ్, కిచెన్, బాత్రూమ్ ఇలా సకల సౌకర్యాలు ఆ వ్యానిటీ వెహికల్లో ఉంటాయి. సినిమా హీరోల తరహాలో ఆ తర్వాత కొందరు రాజకీయ నాయకులు కూడా ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చేసుకున్నారు. హీరోలు, పొలిటీషియన్లకే కాదు ఇప్పుడు అడ్వెంచరిస్టులు, క్యాంపర్లతో పాటు ఈ తరహా వాహనాలపై ఆసక్తి ఉన్న సామాన్యులకు వ్యానిటీ వెహికల్‌ను అందుబాటులోకి తెస్తోంది టయోటా. సెమా షోలో పూర్తి ఆఫ్‌రోడ్ వెహికల్‌గా టయోటా సంస్థ టోకోజిల్లాను రూపొందించింది. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరుగుతున్న సెమా షో 2021లో ఈ ట్రక్‌ను టయోటా ప్రదర్శించింది. త్వరలోనే మార్కెట్లోకి తెస్తామని తెలిపింది. కదిలే ఇళ్లు టయోటా టోకోజిల్లాలో ఇద్దరు వ్యక్తులు ఇందులో ప్రయాణించడమే కాదు ఇంటిగా మార్చుకుని బతికేందుకు అవసరమైనన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. కిచెన్ అందులో స్టవ్, సింక్, డిష్ వాషర్, ఫ్రిడ్జ్ వంటివి ఉన్నాయి. బాత్రూమ్ కమ్ టాయిలెట్, టీవీ, డైనింగ్ ఏరియా, రెండు సోఫాలు, ఇద్దరు వ్యక్తులు పడుకునేందుకు వీలుగా స్లీపింగ్ ఏరియాతో పాటు సన్‌రూఫ్ సౌకర్యాన్ని కూడా అమర్చారు. ఈ ట్రక్కులో లివింగ్ ఏరియా 1.83 మీటర్ల ఎత్తుతో డిజైన్ చేశారు. క్యాంపింగ్‌కి అనుకూలం టయోటా నుంచి 70, 80వ దశకాల్లో వచ్చిన ట్రక్ మోడల్లను అనుసరించి పూర్తి రెట్రో స్టైల్లో టాకోజిల్లాను తయారు చేశారు. క్యాంపింగ్ని ఇష్టపడే వారికి ఈ ట్రక్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని టయోటా అంటోంది. వచ్చే ఏడాదిలో ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ధరకు సంబంధించి టయోటా నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. ఇంజన్ సామర్థ్యం 3.5 లీటర్ వీ6 ఇంజన్‌తో 6 మాన్యువల్ గేర్ షిప్ట్ పద్దతి 4 వీల్ డ్రైవ్ మోడ్‌లో ఈ కారుని డిజైన్ చేశారు. ఈ కారు ఇంజన్ 278 హెచ్పీతో 6,000 ఆర్పీఎమ్ ఇవ్వగలదు. -
ఫోర్స్ గూర్ఖా... ప్రత్యేకతలు ఇవే
ఆఫ్‌రోడ్ రైడింగ్‌లో స్పెషల్ వెహికల్‌గా ఫోర్స్ సంస్థ నుంచి వస్తున్న గూర్ఖా సెప్టెంబరు 27 నుంచి బుకింగ్స్ మొదలతువున్నాయి. మహీంద్రా థార్‌కి పోటీగా వస్తున్న గూర్ఖా ఫీచర్లు ఇలా ఉన్నాయి. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్, టూఐర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్పీడ్ అలెర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం బ్లాక్ థీమ్‌తో ఇంటీరియర్ రూపొందించారు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేలు వర్క్ చేస్తాయి. డ్రైవర్ డిస్ప్లేను సెమి డిజిటల్‌గా అందించారు 2.6 ఫోర్ సిలిండర్ బీఎస్ 6 ప్రమాణాలు కలిగిన డీజిల్ ఇంజన్ అమర్చారు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. గూర్ఖా ఇంజన్ 90 బీహెచ్పీతో 250 ఎన్ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది రెడ్, గ్రీన్, వైట్ , ఆరెంజ్, గ్రే రంగుల్లో లభిస్తుంది చదవండి : టెస్లా ఎలక్ట్రిక్ కారుకి ఇండియాలో అడ్డం పడుతున్న ‘స్పీడ్ బ్రేకర్’ -
అప్రీలియా ఎస్ఎక్స్ఆర్ 160 వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: ఇటాలియన్ ప్రీమియం స్కూటర్ల తయారీ సంస్థ పియాజియో.. అప్రీలియా ఎస్ఎక్స్ఆర్ 160 మోడల్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. 2020 ఫిబ్రవరిలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఎస్ఎక్స్ఆర్ 160 తళుక్కుమన్నది. భారత మార్కెట్ కోసం ఇటలీలో దీనిని డిజైన్ చేశారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.1.26 లక్షలు. రూ.5,000 చెల్లించి ఆన్‌లైన్‌లోనూ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. అప్రీలియా ఎస్ఎక్స్ఆర్ 160 ఫీచర్లు సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్ ఇంజన్, ఆర్పీఎం 7,100, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఇంధన ట్యాంకు సామర్థ్యం 7 లీటర్లు. మొబైల్ కనెక్టివిటీ యాక్సెసరీ కూడా పొందుపరిచారు. ఎల్ఈడి డిఆర్ఎల్లతో కూడిన ట్విన్-క్రిస్టల్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఎస్ఎక్స్ఆర్ 160 సొంతం. ఇది నాలుగు రంగుల్లో లభిస్తుంది. -
పార్కింగ్ స్థలం ఉంటేనే ఇక కొత్త వాహనం
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో వాహనం కొనడం ఒకెత్తయితే, దాని పార్కింగ్‌కు స్థలం దొరకడం మరొక ఎత్తు. ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ స్థలం కొరతతో నగరవాసులు విలవిలలాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ సిటీలో అస్తవ్యస్తంగా ఉన్న పార్కింగ్ వ్యవస్థపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇకపై ప్రజలు కొత్తవాహనాలను కొనే ముందు వాటిని పార్కింగ్‌కు సొంత స్థలం ఉందని ప్రమాణపత్రం ఇవ్వాలని తీర్మానించింది. స్మార్ట్‌పార్కింగ్ వ్యవస్థను అమలు చేయనుంది. చదవండి: (రెడ్ అలర్ట్: రాష్ట్రానికి బురేవి తుపాన్ భయం) నగరమంతటా పార్కింగ్ ఫీజులు సీఎం విధానసౌధలో ఉన్నతాధికారులతో పార్కింగ్ సమస్యపై చర్చించారు. విధానాల రూపకల్పన కోసం కమిటీని వేశారు. ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు మాదిరిగా నగరమంతటా ప్రధాన స్థలాల్లో వాహనాల పార్కింగ్‌కు నిర్ణీత ఫీజులను వసూలు చేయాలని నిర్ణయించారు. ఇళ్ల పక్కన ఉండే ఖాళీ స్థలాలను పార్కింగ్ ప్రదేశాలుగా వాడుకోవాలని చర్చించారు. కమిటీ నివేదిక వచ్చాక పార్కింగ్ ప్రదేశాలను ఖరారు చేస్తారు. -
బుకింగ్స్ లో మహీంద్ర థార్ దూకుడు
సాక్షి, ముంబై : మహీంద్ర అండ్ మహీంద్ర కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఎస్యూవీ 2020 మహీంద్రా థార్ బుకింగ్స్ లో దూసుకుపోతోంది. కరోనా సంక్షోభంలో వాహన విక్రయాలు భారీగా పడిపోయాయి. లాక్ డౌన్ నిబంధనల సడలింపు అనంతరం డిమాండ్ స్వల్పంగా పుంజుకున్నప్పటికీ, ఆటో కంపెనీలు ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో సరికొత్త మహీంద్రా థార్‌కు భారత మార్కెట్ నుంచి భారీ స్పందన లభిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 9 వేల బుకింగ్స్ ను సాధించామని కంపెనీ తాజాగా ప్రకటించింది. (కొత్త మహీంద్రా థార్ వచ్చేసింది) అక్టోబర్ 2 న న్యూ-జెన్ థార్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 9000కి పైగా బుకింగ్‌లు అందుకున్నట్లు కంపెనీ తెలిపింది. 18 నగరాల్లో మాత్రమే టెస్ట్ డ్రైవ్ అందుబాటులో ఉన్నప్పటికీ స్పందన బావుందంటూ మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీజయ్ నక్రా సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా టెస్ట్ డ్రైవ్‌లు లభించేలా చూస్తున్నామని తెలిపారు. -
సరికొత్తగా మహీంద్రా "థార్''
సాక్షి,న్యూఢిల్లీ: మహీంద్ర అండ్ మహీంద్ర ఎట్టకేలకు సరికొత్త థార్‌ను ఆవిష్కరించింది. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ప్రతిష్టాత్మ ఎస్యూవీ "థార్'' ను దేశీయంగా తీసుకొచ్చింది. రెండు, మూడు సంవత్సరాల సుదీర్ఘ పరీక్షల అనంతరం ఐకానిక్ డిజైన్, కొత్త భద్రతా ఫీచర్లతో శనివారం పరిచయం చేసింది. ఫ్రీడమ్ డ్రైవ్‌లో భాగంగా ఈ వాహనాన్ని తీసుకొస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.బీఎస్ -6 నిబంధనలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులోఉండనుందని తెలిపింది. ఫస్ట్-జెన్ మోడల్ కంటే పెద్ద వాహనంగా తీసుకొస్తున్న ఈ కొత్త థార్ 2020 అక్టోబర్ 2న లాంచ్ చేయనుంది. ధర, ప్రీ బుకింగ్ వివరాలు కూడా అక్టోబర్ 2 న ప్రకటిస్తామని ఎంఅండ్ఎం వెల్లడించింది. సెకండ్ జెనరేషన్ థార్ వాహనంలో ప్రతీ కొత్తదిగానే ఉంటుందని ఎం అండ్ ఎం ప్రకటించింది. శక్తివంతమైన ఇంజీన్, టచ్‌స్క్రీన్ సామర్థ్యాలతో కొత్త 18 సెం.మీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్‌ను, ఫార్వర్డ్ ఫేసింగ్ సీట్లు, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 650 మిమీ వాటర్ వాడింగ్ సామర్ధ్యంలాంటి ఫీచర్లను అమర్చింది. ఇంకా డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్, సెంట్రల్ లాకింగ్, రియర్ పార్కింగ్ అసిస్ట్, సెకండ్ జనరేషన్ థార్ టైట్రానిక్స్, టైర్ డైరెక్షన్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, హిల్ హోల్డ్, హిల్ డీసెంట్ కంట్రోల్‌ను కూడా జోడించింది. కొత్త మహీంద్రా థార్ ఏఎక్స్, ఎల్ ఎక్స్ సిరీస్ లో రెండు రంగుల్లో ఇది లభించనుంది. 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 150 హెచ్‌పీ, 320ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజీన్ 130హెచ్‌పి, 320 ఎన్ ఎం టార్క్ ను ఇస్తుంది. -
మార్కెట్లోకి పియాజియో ‘ఏప్ ఈ–సిటీ’
న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన దిగ్గజ వాహన తయారీ కంపెనీ పియాజియో.. భారత ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. ‘ఏప్ ఈ–సిటీ’ పేరిట ఎలక్ట్రిక్ త్రీ–వీలర్‌ను బుధవారం విడుదల చేసింది. లిథియం– అయాన్ బ్యాటరీ కలిగిన దీని ధర రూ. 1.97 లక్షలుగా(ఎక్స్–షోరూం) ప్రకటించింది. మూడేళ్ల వారెంటీతో వస్తున్న ఈ వాహనాన్ని సన్ మొబిలిటీ భాగస్వామ్యంతో మొదటి దశలో చండీగఢ్, మొహాలి, గురుగ్రామ్‌లలో అందుబాటులోకి తెస్తోంది. -
108 సేవలకు 432 కొత్త వాహనాలు
-
మహీంద్ర ఎక్స్‌యూవీ 300 (ఏఎంటీ) లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: మహీంద్ర అండ్ మహీంద్ర కొత్త వెహికల్‌ను లాంచ్ చేసింది. ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్( ఏఎంటీ) వెర్షన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని మంగళవారం ఆవిష్కరించించింది. ఎఎమ్‌టి టెక్నాలజీ డబ్ల్యూ 8 (డీజిల్) ఎక్స్‌యూవీ 300 ధర ను రూ. 11. 5లక్షలు ( ఎక్స్-షో రూం, ఢిల్లీ)గా నిర్ణయించింది. అలాగే డబ్ల్యూ 8 (ఆప్షనల్) ట్రిమ్‌ను రూ.12.7 లక్షలుగా ఉంచింది. 1.5-లీటర్ టర్బో ఇంజిన్, ఎలక్ట్రానిక్ వేరియబుల్ జామెట్రీ టర్బోచార్జర్, 116.6 పీఎస్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. 2019 ఫిబ్రవరిలో తీసుకొచ్చిన మాన్యువల్ వెర్షన్‌కు భారీ స్పందన రావడంతో తమ తాజా ఎక్స్‌యూవీ 300 వెహికల్‌కు కూడా అదే ఆదరణ లభించనుందనే ఆశాభావాన్ని ఎం అండ్ ఎం చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ (ఆటోమోటివ్ డివిజన్) వీజయ్ రామ్ నక్రా వ్యక్తం చేశారు. -
మహీంద్ర కొత్త ఎక్స్‌యూవీ300 లాంచ్
సాక్షి, ముంబై: మహీంద్ర అండ్ మహీంద్ర మరో సరికొత్త వాహనాన్ని లాంచ్ చేసింది. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఎక్స్‌యూవీ 300 పేరుతో ఈ వెహికల్‌ను లాంచ్ చేసింది. పెట్రోల్, డీజిల్ రెండు ఇంజీన్ల ఆప్షన్లలో ఆవిష్కరించింది. రూ. 7.90 లక్షలు ప్రారంభధరగా నిర్ణయించగా, టాప్ వేరియంట్ ధరను రూ.11.99లక్షలుగా ఉంచింది. 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజీన్ వెహికల్ 115 బీహెచ్పీ వద్ద 3750ఆర్పీఎం తో 300 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. 1.2 లీటర్ త్రి సిలిండర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజీన్ 110 బీహెచ్పీ వద్ద 200 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, కార్ ప్లే, లాంటి ఫీచర్లను జోడించింది. అలాగే టాప్ ఎండ్ వేరియంట్లో7 ఎయిర్బాగ్స్, డ్యుయల్‌ఎల్‌ఈడీ డే టైం ల్యాంప్స్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, రియర్ పార్కింగ్ అస్టిస్ట్ కెమెరా, 17 అంగుళాల డైమండ్ అల్లాయ్ వీల్స్ లాంటి టాప్ ఎండ్ ఫీచర్లను అందిస్తోంది. కాగా మారుతి సుజుకి బ్రెజ్జా, ఫోర్డ్ ఇకో స్పోర్ట్, టాటా నెక్సాన్‌కు గట్టిపోటీ ఇవ్వనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
కార్లు, బైక్ ధరలకు రెక్కలు!
న్యూఢిల్లీ: కార్లు, ద్విచక్ర వాహనదారులు థర్డ్ పార్టీ బీమా రూపంలో శనివారం నుంచి అదనపు భారం మోయాల్సిన పరిస్థితి. ఇకపై కార్ల కొనుగోలు సమయంలో ఏడాది బీమా కాకుండా మూడేళ్ల కాలానికి బీమా పాలసీని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అదే ద్విచక్ర వాహనాలు అయితే కొనుగోలు సమయంలోనే ఐదేళ్ల బీమా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వాహనాల కొనుగోలు వ్యయం ఒక్కసారిగా పెరిగిపోనుంది. ఇది వాహనదారులకు కాస్తంత రుచించనిదే. అయితే, ఏటా రెన్యువల్ చేసుకోవాల్సిన ఇబ్బంది అయితే తప్పనుంది. ఈ భారం ఏ స్థాయిలో ఉంటుందంటే... 1500సీసీ సామర్థ్యంపైన ఉన్న కార్లకు ఏడాది బీమా పాలసీ ప్రీమియం ప్రస్తుతం రూ.7,890 స్థాయిలో ఉండగా, మూడేళ్లకు తీసుకోవాలంటే ఇక మీదట ఒకేసారి రూ.24,305ను జేబు నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. అదే 350సీసీ సామర్థ్యంపైన ఉన్న బైకులకు ఏడాది ప్రీమియం రూ.2,323గా ఉంటే, ఇక మీదట ఐదేళ్ల పాలసీ కోసం రూ.13,034 ఖర్చు చేయాల్సి వస్తుంది. వివిధ సామర్థ్యం కలిగిన మోడళ్ల ఆధారంగా ఈ ప్రీమియంలో మార్పులు ఉంటాయి. ఇదంతా సుప్రీంకోర్టు ఆదేశాల పర్యవసానమే. కొత్త కార్లకు మూడేళ్లు, ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల థర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయాలంటూ ఈ ఏడాది జూలై 20న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. థర్డ్ పార్టీ కవరేజీ తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో, దీర్ఘకాల పాలసీలను వాహనాలను కొన్నప్పుడే తీసుకునే విధంగా సుప్రీం ఆదేశించింది. నిబంధనల ప్రకారం మన దేశంలో వాహనాలకు బీమా తప్పనిసరి. థర్డ్ పార్టీ బీమా అనేది, వాహనదారుడు, అతని వాహనం కారణంగా మూడో పార్టీకి కలిగిన నష్టానికి పరిహారం చెల్లించేది. దీన్ని వాహనదారులు అందరూ తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు కలిగే నష్టానికి పరిహారం లభిస్తుంది. ప్రాణ నష్టానికి బాధిత కుటుంబాలు పెద్ద మొత్తంలో పరిహారం అందుకోగలవు. ఆస్తి నష్టానికి కూడా పరిహారం లభిస్తుంది. బీమా విస్తరణకు దోహదం వాహనం వయసు పెరుగుతున్న కొద్దీ దానికి బీమా కవరేజీ విలువ తగ్గుతూ వెళుతుంది. పైగా ప్రీమియం పెరుగుతూ వెళుతుండడం గమనించొచ్చు. ముఖ్యంగా థర్డ్ పార్టీ బీమా విషయంలో పరిహార చెల్లింపులు పెరుగుతుండటంతో, ప్రీమియంలను బీమా కంపెనీలు ఏటా సవరిస్తుండటం వల్ల భారం అధికం అవుతోంది. దీంతో చాలా మంది వాహనదారులు బీమా పాలసీని రెన్యువల్ చేయించుకోకుండా వదిలిపెట్డడం, రిస్క్‌ను పూర్తిగా కవర్ చేయని పాలసీలను కొనుగోలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ‘‘దీర్ఘకాలిక పాలసీల కారణంగా బీమా ఉత్పత్తుల విస్తరణ పెరుగుతుంది. మరిన్ని వాహనాలు కవరేజీ పరిధిలోకి వస్తాయి’’ అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండర్‌రైటింగ్ హెడ్ సంజయ్ దత్తా వివరించారు. బీమా పరిధిలో ఉన్నవి, పరిధిలో లేనివి అన్న ప్రశ్నకు తావుండదని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీ పెద్ద మొత్తంలో, మెరుగ్గా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం 2015లో ప్రతిరోజూ 1,374 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 400 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధితులు క్లెయిమ్ దాఖలకు సమయ పరిమితి కూడా లేదు. ప్రమాదం జరిగిన ప్రాంత పరిధిలో లేదా తన నివాస ప్రాంత పరిధిలోనూ క్లెయిమ్ దాఖలకు అవకాశం ఉంటుంది. టూవీలర్ల డిమాండ్‌కు దెబ్బ! నూతన నిబంధనలు ద్విచక్ర వాహన కొనుగోళ్ల డిమాండ్‌పై ప్రభావం చూపిస్తుందంటున్నారు ఈ రంగానికి చెందిన నిపుణులు. ఇప్పటి వరకు బీమా కోసం వెచ్చించిన మొత్తానికి ఇకపై నాలుగు రెట్లు అదనంగా (ఐదేళ్ల పాలసీ) ప్రీమియంను భరించాల్సి రావడమే ఇందుకు కారణం. కానీ, కార్లపై పెద్దగా ప్రభావం ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది. 100సీసీ ఇంజిన్ల విభాగంపై ఎక్కువ ప్రభావం పడనుంది. ఎందుకంటే తక్కువ ధర కారణంగానే వీటిని ఎక్కువ మంది కొనుగోలు చేస్తుంటారు. కానీ, ఇప్పుడు ఈ విభాగంలోని బైక్‌లపై రూ.720గా ఉన్న ప్రీమియం కాస్తా ఇకపై రూ.3,285 అవుతోంది. అంటే మూడున్నరరెట్లు పెరిగినట్టు. ప్రతీ5 మోటారుసైకిళ్ల అమ్మకాల్లో మూడు 100సీసీ విభాగంలోనివే. ఇక 150సీసీ ఆపైన 350సీసీ సామర్థ్యంలోపు బైకులకు నాలుగున్నర రెట్లు పెరిగి రూ.5,453 కానుంది. ఇక ఈ పెరిగే మొత్తంపై జీఎస్టీ భారం అదనం. రెండు రకాల పాలసీలు సుప్రీం ఆదేశాలతో కొత్త కార్లకు మూడేళ్లు, ్జకొత్త ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల థర్డ్ పార్టీ బీమా ప్రీమియంను కొనుగోలు సమయంలోనే వాహనదారుల నుంచి వసూలు చేయాలని బీమా కంపెనీల ను బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆదేశించింది. దీంతో బీమా సంస్థలు ఓన్ డ్యామేజ్, థర్డ్ పార్టీ కవరేజ్‌ను దీర్ఘకాలానికి లేదా ఏడాది కాలానికి ఓన్ డ్యామేజీ కవర్, దీర్ఘకాలానికి థర్డ్ పార్టీ బీమాతోనూ పాలసీలను ఆఫర్ చేసే అవకాశం ఉంది. థర్డ్ పార్టీ బీమానే దీర్ఘకాలానికి తీసుకోవడం తప్పనిసరి. చోరీ, ఇతర నష్టాలకు కూడా కవరేజీ ఇచ్చే పాలసీని ఏడాది లేదా ఐదేళ్ల కోసం ఎంచుకునే స్వేచ్ఛ వాహనదారులకు ఉంటుంది. బిల్లులో మాత్రం ఒక్కో ఏడాదికి విడిగా కవరేజీని పేర్కొనడం జరుగుతుంది. రెండో ఏడాది, ఆ తర్వాత కాలానికి ప్రీమియంను ‘ముందస్తు ప్రీమియం’గా పేర్కొటాయి. పాలసీ కాల వ్యవధి మధ్యలో సాధారణంగా థర్డ్ పార్టీ కవర్‌ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉండదు. వాహనం ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకపోవడం, అమ్మేయడం, బదిలీ వంటి సందర్భాల్లో మినహాయింపు ఉంటుంది. -
టాటా ఏస్ గోల్డ్.. ధర ఎంతంటే.
సాక్షి, ముంబై: దేశీయ ఆటోదిగ్గజం టాటా మోటార్స్ టన్ను మినీ ట్రక్ విభాగంలో కొత్త వాహనాన్ని లాంచ్ చేసింది. టన్ను కెపాసిటీ మినీ ట్రక్కు విభాగంలో మేజర్ వాటాను దక్కించుకున్న సంస్థ తాజాగా తొలి నాలుగు చక్రాల మినీ ట్రక్కును విడుదల చేసింది. టాటా మోటర్స్ అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా త్వరలోనే అమ్మకానికి అందుబాటులోకి వస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. టాటా ఏస్ గోల్డ్ పేరుతో లాంచ్ చేసిన దీని ధరను 3.75లక్షల రూపాయలుగా నిర్ణయించింది. టాటా ఏస్ గోల్డ్ వాహనంలో మెరుగుపర్చిన ఫీచర్లను ప్రవేశపెడుతున్నామని టాటా మోటార్స్ వాణిజ్య వాహన వ్యాపార శాఖ అధ్యక్షుడు గిరీష్ వాగ్ చెప్పారు. తద్వారా తమ వినియోగదారులను మరింత ఆకట్టుకోనున్నట్టు అందిస్తున్నట్టు చెప్పారు. దీంతో పాటు 24గంటలూ మరమ్మత్తు సేవలను , ఉచిత బీమా, సమయానికి రిపేర్ కమిట్మెంట్ లాంటి ఇతర విలువైన సేవలను ఏస్ గోల్డ్ కస్టమర్లకు అందించ నున్నామని పేర్కొన్నారు. కాగా 2005 లో విడుదల చేసిన టాటా ఏస్ 'ఛోటా హాథీ' గా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. మిని ట్రక్ సెగ్మెంట్లో 68 శాతం వాటాతో గత13 ఏళ్లుగా 20లక్షల యూనిట్లను విక్రయించినట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. -
జాగ్వార్ రేంజ్ రోవర్ ఎవోక్ కొత్త ఎడిషన్
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ సరికొత్త వాహనాన్ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. రేంజ్ రోవర్ ఎవోక్ లాండ్మార్క్ కొత్త ఎడిషన్‌ను ప్రారంభించింది.. దీని ధరను రూ. 50.20 లక్షల (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది. ఇండియాలో ఎవాక్ మోడల్ లాంచ్ చేసి ఆరేళ్లయిన సందర్భంగా ఈ కొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చినట్టు చెప్పింది. ఆకర్షణీయమైన మెరైన్ బ్లూ షేడ్‌తో మూడురంగుల్లో ఇది లభిస్తుదని జాగ్వార్ ప్రకటించింది. పాత రేండ్ రోవర్ మాదిరిగానే ఉన్నప్పటికీ డిజైన్ 2.0 లీటర్ ఇంజినియం డీజిల్ ఇంజిన్ ప్రధాన ఆకర్షణగా ఉంది. అలాగే 'ల్యాండ్‌మార్క్’ లెటర్స్‌ను, గ్రాఫైట్ అట్లాస్ , ముందు భాగంలో ఫెండెర్ వెంట్స్ విజువల్ మార్పులను చేసింది. ఇది 180సీఎస్ పవర్ , 430 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లను అమర్చింది. అలాగు తన స్టాండర్డ్ వైఫై హాట్ స్పాట్, ప్రో సేవలు, కీలేస్ ఎంట్రీ , గెశ్చర్ ఓరియెంటెడ్ టెయిల్ గేటు లాంటి ఆఫర్లు కూడా లభ్యం. మరోవైపు జాగ్వార్ స్పెషల్ వేరియంట్లో పోలిస్తే ఎవాక్ ఎల్ఈ 25వేల రూపాయలకు లభిస్తోంది. -
ఆ కారు ఓన్లీ ఫర్ లేడీస్..
చిన్నగా... పర్ఫుల్ కలర్లో కనిపించే ఈ కారు చూడానికి భళే ఉందికదా! ఎప్పుడూ మగవారికోసమే కార్లు, బైక్స్ ఏం తయారుచేస్తాంలే అని భావించిన ఓ రెండు కంపెనీలు జతకట్టి మహిళల కోసం ప్రత్యేకంగా ఓ కారును డిజైన్ చేశాయి. స్పానిస్ కారు తయారీదారి సీట్, లేడిస్ లైఫ్ స్టైల్ పబ్లికేషన్ కాస్మోపాలిటన్ కలిసి కేవలం మహిళల కోసం ఓ కొత్త కారు రూపొందించి లండన్ కాస్మోపాలిటన్స్ ఫ్యాస్ఫెస్ట్ ఈవెంట్లో లాంచ్ చేశాయి. మహిళలు ఎలాగైతే మేకప్ చేసుకుంటారో అదేమాదిరి కారును డిజైన్ చేశారు. జ్యువెల్ ఎఫెక్ట్ రిమ్స్, హ్యాండ్ బ్యాగ్ హుక్, ఐలైనర్ హెడ్‌లైట్స్ తో సీట్ మి కారు మార్కెట్లోకి వచ్చింది. సీట్ కారు తయారీదారి, లేడీస్ మ్యాగజైన్ రెండేళ్ల రీసెర్చ్, డెవలప్మెంట్తో మహిళల అభిరుచులకు అనుగుణంగా దీన్ని ఎక్స్‌క్లూజివ్‌గా డిజైన్ చేసినట్టు కంపెనీ చెబుతోంది. అయితే ఓ వైపు ఈ కారు రూపొందించినందుకు కృతజ్క్షతలు చెబుతూనే మరోవైపు సెటైర్లు కూడా వేస్తున్నారు. తమ సుతిమెత్తని చేతుల మాదిరి స్టీరింగ్ వీల్ చిన్నదిగా ఉందా అంటూ ట్వీట్లు వస్తున్నాయి. మహిళల డిజైన్‌తో ఈ కారు రూపొందించడం గుడ్ ఐడియానా అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఈ ట్వీట్లపై స్పందించిన సీట్ కారు తయారీదారు ఈ కారు కేవలం కాస్మోపాలిటన్ రీడర్స్ కోసమే తయారుచేసినట్టు చెబుతోంది. కాస్మోపాలిటన్ రీడర్స్, ఎడిటర్స్, మ్యాగజైన్ క్రియేటివ్ టీమ్ సహకారంతో కేవలం పరిమిత టార్గెట్‌తోనే వచ్చినట్టు పేర్కొంది. మహిళల అందరికోసమేమీ ఈ కారు తయారుచేయలేదని పేర్కొంది. కానీ లాంచ్ చేసిన కొన్నిరోజులకే ఈ బ్రాండెడ్ న్యూ కారుపై ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. Wow, thanks @SEAT_cars_UK & @Cosmopolitan for designing a car just for women. Is the steering wheel small for my delicate hands?! #its2016!! How did ANYONE think making a #carforwomen would be a good idea? #ThisisMii https://t.co/yQ6eRrAe9G — Bethany Hill (@andbethanysays) 21 September 2016 — Hannah Walker (@bananhan) 16 September 2016