సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ మరో కొత్త స్కూటర్‌ను తీసుకొస్తోంది. 3వ తరం 450X స్వదేశీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రేపు(మంగళవారం) ఆవిష్కరించ నుంది. లాంచింగ్ తరువాత బుకింగ్‌లను స్టార్ట్ చేయనుంది. అలాగే ధర ఫీచర్లపై లాంచింగ్ తరువాత మాత్రమే అధికారిక కన్మఫరమేషన్ వస్తుంది.
ప్రస్తుతం అందిస్తున్న 75-80 కిలోమీటర్ల పరిధితో పోలిస్తే ఒక్కచార్జ్‌కి 146 కి.మీ సామర్థ్యమున్న బ్యాటరీని అందించడం కీలకమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
కొత్త ఫీచర్ల అంచనాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుత ఏథోర్ 450ఎక్స్‌లోని 2.8 kWh బ్యాటరీతో పోలిస్తే 19 కిలోల నికెల్ కోబాల్ట్ ఆధారితంగా పెద్ద బ్యాటరీని ఈస్కూటర్లో జోడించింది. ప్రస్తుతమున్న వార్ప్, స్పోర్ట్, రైడ్, ఎకో ,స్మార్ట్ ఎకో రైడింగ్ మోడ్స్‌తో కొత్త 3వ-జెన్ ఏథర్ 450ని తీసుకురానుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏథర్ 450 ప్లస్ ధర రూ.1.58 లక్షలు (ఆన్-రోడ్)గా ఉంది. అయితే 450ఎక్స్ ధర రూ. 1.81 లక్షలుగా ఉంటుందని అంచనా. తన ఉత్పత్తులకు ఎప్పుడూ ప్రీమియం ధరను నిర్ణయించే ఏథర్ ఎనర్జీ ఈ సారి కూడా అదే చేయబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment