అప్రీలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 వచ్చేసింది | Aprilia SXR 160 scooter launched in India | Sakshi
Sakshi News home page

అప్రీలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 వచ్చేసింది

Published Thu, Dec 24 2020 3:35 PM | Last Updated on Thu, Dec 24 2020 3:35 PM

Aprilia SXR 160 scooter launched in India - Sakshi

సాక్షి,   హైదరాబాద్: ఇటాలియన్‌ ప్రీమియం స్కూటర్ల తయారీ సంస్థ పియాజియో.. అప్రీలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 మోడల్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. 2020 ఫిబ్రవరిలో గ్రేటర్‌ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 తళుక్కుమన్నది. భారత మార్కెట్‌ కోసం ఇటలీలో దీనిని డిజైన్‌ చేశారు. హైదరాబాద్‌ ఎక్స్‌షోరూంలో ధర రూ.1.26 లక్షలు. రూ.5,000 చెల్లించి ఆన్‌లైన్‌లోనూ స్కూటర్‌ను బుక్‌ చేసుకోవచ్చు.

అప్రీలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160  ఫీచర్లు

సింగిల్‌ సిలిండర్, 4 స్ట్రోక్‌ ఇంజన్, ఆర్‌పీఎం 7,100, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఉంది. ఇంధన ట్యాంకు సామర్థ్యం 7 లీటర్లు. మొబైల్‌ కనెక్టివిటీ యాక్సెసరీ కూడా పొందుపరిచారు.  ఎల్ఈడి డిఆర్ఎల్‌లతో కూడిన ట్విన్-క్రిస్టల్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్ వంటి డిజైన్ ఎలిమెంట్స్‌ ఎస్ఎక్స్ఆర్ 160 సొంతం. ఇది నాలుగు రంగుల్లో లభిస్తుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement