aprilia SR
-
అప్రీలియా ఎస్ఆర్ కొత్త వెర్షన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న పియాజియో ఇండియా అప్రీలియా ఎస్ఆర్ 125, ఎస్ఆర్ 160 స్కూటర్స్ కొత్త వర్షన్స్ విడుదల చేసింది. పుణే ఎక్స్‌షోరూంలో ఎస్ఆర్ 160 ధర రూ.1.17 లక్షలు, ఎస్ఆర్ 125 ధర రూ.1.07 లక్షలు ఉంది. ఫీచర్స్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్, సింగిల్ చానెల్ ఏబీఎస్‌తో డిస్క్, డ్రమ్ బేక్స్, డ్యూయల్ సీట్స్, నకిల్ గార్డ్స్, అలాయ్ వీల్స్, వి–షేప్డ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎక్స్–షేప్డ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్ పొందుపరిచారు. ఎస్ఆర్ 160 స్కూటర్ 160 సీసీ 3వీ టెక్ ఈఎఫ్ఐ ఎయిర్‌కూల్డ్ ఇంజన్‌తో తయారైంది. -
మార్కెట్లోకి రెండు శక్తివంతమైన స్కూటర్లు లాంఛ్ చేసిన పియాజియో
ప్రముఖ వాహన తయారీ సంస్థ పియాజియో ఇండియా భారత్‌లో అప్ డేట్ చేసిన అప్రిలియా న్యూ ఎస్ఆర్ 160, ఎస్ఆర్ 125 స్కూటర్లను లాంఛ్ చేసింది. న్యూ ఎస్ఆర్ 160 మోడల్ ధర ₹.1,17,494(ఎక్స్ షోరూమ్ పూణే)గా ఉంటే, ఎస్ఆర్ 125 మోడల్ ధర ₹1,07,595(ఎక్స్ షోరూమ్ పూణే)గా ఉంది. డిజైన్ సహా పలు ఫీచర్లను అప్డేట్ చేయడంతో పాటు నూతన శ్రేణి వాహనాలు బీఎస్6 ప్రమాణాలతో కస్టమర్ల ముందుకు వచ్చాయి. రూ 5000 టోకెన్ అమౌంట్‌తో న్యూ ఎస్ఆర్ రేంజ్ బైక్‌లను బుక్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. కొత్త ఎస్ఆర్ 160 రేంజ్ వైట్, బ్లూ, గ్రే, రెడ్, మాట్ బ్లాక్ రంగులలో లభ్యం కానుంది. అప్రిలియా ఎస్ఆర్ 160 కొత్త హెడ్ ల్యాంప్, కొత్త ఎల్ఈడి హెడ్ లైట్ తో వస్తుంది. ఎస్ఆర్ 160 స్కూటర్లో ఎబిఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), 160 సీసీ 3వీ టెక్ ఎఫ్ఐ, హైటెక్, హై-పెర్ఫార్మెన్స్ ఇంజిన్ తో వస్తుంది. ఇందులో 160 సీసీ ఎయిర్ కూల్డ్ త్రీ వాల్వ్ ఇంజిన్ సహాయం చేత పనిచేస్తుంది. ఇది 7600 ఆర్ పిఎమ్ వద్ద 10.84 బిహెచ్ పఈ పవర్, 6000 ఆర్ పిఎమ్ వద్ద 11.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. (చదవండి: భారీగా పడిపోయిన బిట్‌కాయిన్ ధర) -
దేశంలో ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్: ధోని ఫేవరెట్ ఏంటో తెలుసా?
యువతకు స్పోర్ట్స్ బైక్స్ అంటే యమా క్రేజ్. రోడ్లపై రయ్.. రయ్ దూసుకుపోవడం అంటే వారికి భలే సరదా. బైక్స్ కంపెనీలు కూడా కొత్త మోడల్స్‌ను మార్కెట్లో దించుతూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారతదేశంలో అందుబాటులో ఉన్న ఖరీదైన కొన్ని స్పోర్ట్స్ బైక్స్ వివరాలు ఇక్కడ చూద్దాం.. బ్రాండ్ ధోని మన దేశంలో స్పోర్ట్స్ బైక్స్ లవర్స్ పేర్లు చెప్పాల్సి వస్తే మొదటి గుర్తొచ్చేది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనినే. ఖాళీ సమయాల్లో రాంచీ వీధుల్లో బైక్స్పైన చక్కర్లు కొట్టడం ధోనికి ఇష్టం. ఖరీదైన కార్లకు తోడు ఖరీదైన బైక్స్ కూడా అతని గారేజీలో కొలువై ఉంటాయి. కవాసకి నింజా హెచ్2, కాన్ఫిడరేట్ ఎక్స్ 132 హెల్‌క్యాట్, హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్‌బాయ్, డుకాటి 1098, సుజుకి హయబుస తదితర బైక్‌లు ధోని కలెక్షన్లో ఉన్నాయి. (చదవండి: బైక్ కొనుగోలుదారులకు హీరో మోటోకార్ప్ షాక్!) ఇక బాలీవుడ్ విషయానికి వస్తే జాన్ అబ్రహం పెద్ద బైక్ లవర్ అని చెప్పవచ్చు. అతని వద్ద ఉన్న బైక్స్ విలువ కోటిన్నర రూపాయల వరకూ ఉంటుందని చెబుతారు. కవాసకి నింజా జెడ్ఎక్స్-14 ఆర్, అప్రిల్లా ఆర్ఎస్వీ 4 తదితర బైక్‌లు అతని వద్ద ఉన్నాయి. షాహిద్ కపూర్ కూడా బైక్స్ లవరే. షూటింగ్ లేని సమయాల్లో అతను బైక్స్‌పైనే లాంగ్ డ్రైవ్స్‌కు వెళతాడు. షాహిద్ వద్ద బీఎండబ్ల్యూ 310 ఆర్, హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ లాంటి ఖరీదైన మోటార్‌సైకిల్స్ ఉన్నాయి. ఇక బైక్స్ లవర్స్ లిస్ట్‌లో మాధవన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, సైఫ్ అలీఖాన్ తదితరులు ఉన్నారు. కవాసకి నింజా హెచ్2ఆర్ ఇంజిన్ కెపాసిటి : 998 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 216 కిలోలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 17 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 305.75 బీహెచ్పీ, 14,000 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 79,90,000 బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ ఇంజిన్ కెపాసిటీ : 999 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 192 కిలోలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 16.5 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 209.19 బీహెచ్పీ, 14,500 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 42,00,000 హోండా గోల్డ్‌వింగ్ ఇంజిన్ కెపాసిటి : 1,833 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 385 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 21.1 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 124.7 బీహెచ్పీ, 5,500 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 37,75,000 హార్లీడేవిడ్సన్ రోడ్ కింగ్ ఇంజిన్ కెపాసిటి : 1,746 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 375 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 22.7 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : - మన దేశంలో ధర (సుమారు) : రూ. 30,00,000 అప్రిల్లా ఆర్ఎస్వీ4 1100 ఫ్యాక్టరీ ఇంజిన్ కెపాసిటి : 1099 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 202 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 17.9 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 213.89 బీహెచ్పీ, 13,000ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 26,50,000 డుకాటీ పనిగేల్ వీ4 ఇంజిన్ కెపాసిటి : 1,103 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 198 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 16 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 211.21 బీహెచ్పీ, 13,000 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 26,27,000 బీఎండబ్ల్యూ ఆర్ 1250 అడ్వెంచర్ ఇంజిన్ కెపాసిటి : 1,254 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 268 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 30 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 134.1 బీహెచ్పీ, 7,700 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 25,00,000 ట్రయంప్ రాకెట్ 3 ఇంజిన్ కెపాసిటి : 2,458 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 304 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 18 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 165 బీహెచ్పీ మన దేశంలో ధర (సుమారు) : రూ. 22,27,000 ఇండియన్ చీఫ్ బాబెర్ డార్క్‌హార్స్ ఇంజిన్ కెపాసిటి : 1890 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 352 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 15.1 లీటర్లు మన దేశంలో ధర (సుమారు) : రూ. 21,40,000 సుజుకి హయబుస ఇంజిన్ కెపాసిటి : 1,340 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 266 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 20 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 187.3 బీహెచ్పీ మన దేశంలో ధర (సుమారు) : రూ. 18,47,000 -
ఏప్రిలియా బుకింగ్స్ షురూ...!
ముంబై: ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం పియాజియో ఇండియా ఇటీవల ఆవిష్కరించిన ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 ప్రీ – బుకింగ్స్ శుక్రవారం ప్రారంభమయ్యాయి. పియాజియో డీలర్ల వద్ద, ఆన్లైన్లో ముందస్తుగా రూ.5,000 చెల్లించి ఈ మోడల్‌ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. సరికొత్త ఎస్ఎక్స్ఆర్ 125 గతేడాది డిసెంబర్లో విడుదల చేసిన ఎస్ఎక్స్ఆర్160 మోడల్‌కు అప్డేట్ వెర్షెన్‌గా వస్తుంది. ఇందులో బీఎస్–6 ప్రమాణాలు కలిగిన 125సీసీ త్రీ వాల్వ్ ఫ్యూయల్ ఎజెక్టెడ్ ఇంజిన్‌ను అమర్చారు. అలాగే ఎల్ఈడీ హెడ్‌లైట్స్, ఎల్ఈడీ టైల్ లైట్స్, ఫ్యూయల్ డిజిటల్ క్లస్టర్, బ్లూటూత్ మొబైల్ కనెక్టివిటీ సదుపాయం, అనువైన సీటింగ్ వ్యవస్థ, అడ్జెస్టబుల్ రేర్ సస్పెన్షన్, సీబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్‌తో డిస్క్ బ్రేక్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. చదవండి: డబ్ల్యూఎల్‌పీకి రెండో హబ్‌గా హైదరాబాద్ -
అప్రీలియా ఎస్ఎక్స్ఆర్ 160 వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: ఇటాలియన్ ప్రీమియం స్కూటర్ల తయారీ సంస్థ పియాజియో.. అప్రీలియా ఎస్ఎక్స్ఆర్ 160 మోడల్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. 2020 ఫిబ్రవరిలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఎస్ఎక్స్ఆర్ 160 తళుక్కుమన్నది. భారత మార్కెట్ కోసం ఇటలీలో దీనిని డిజైన్ చేశారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.1.26 లక్షలు. రూ.5,000 చెల్లించి ఆన్‌లైన్‌లోనూ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. అప్రీలియా ఎస్ఎక్స్ఆర్ 160 ఫీచర్లు సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్ ఇంజన్, ఆర్పీఎం 7,100, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఇంధన ట్యాంకు సామర్థ్యం 7 లీటర్లు. మొబైల్ కనెక్టివిటీ యాక్సెసరీ కూడా పొందుపరిచారు. ఎల్ఈడి డిఆర్ఎల్లతో కూడిన ట్విన్-క్రిస్టల్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఎస్ఎక్స్ఆర్ 160 సొంతం. ఇది నాలుగు రంగుల్లో లభిస్తుంది. -
ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 బుకింగ్ షురూ
న్యూఢిల్లీ, సాక్షి: మ్యాక్సి స్కూటర్.. ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160కు బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు పియాజియో ఇండియా తాజాగా పేర్కొంది. విడుదలకు ముందు (ప్రీలాంచ్) బుకింగ్‌కు తెరతీసినట్లు తెలియజేసింది. రూ. 5,000 చెల్లించడం ద్వారా స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ప్రీమియం స్కూటర్‌ను ప్రస్తుతం బారామతి ప్లాంటులో తయారు చేస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది. బీఎస్-6 ప్రమాణాలతోపాటు.. లెడ్ స్ప్లిట్ హెడ్లైట్లు, మొబైల్ కనెక్టివిటీ, సర్దుబాటుకు వీలయ్యే వెనుక సస్పెన్షన్, డిస్క్ బ్రేకులు తదితర ఫీచర్స్‌ను పొందుపరచినట్లు పియాజియో ఇండియా ఒక ప్రకటనలో వివరించింది. కంపెనీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో లేదా డీలర్ల ద్వారా దేశవ్యాప్తంగా బుకింగ్స్‌కు వీలున్నట్లు తెలియజేసింది. (హెల్మెట్ వాయిస్ కమాండ్స్‌తో ఇక బైకులు!) సవాళ్లున్నప్పటికీ 2020లో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ దేశీయంగా ప్రీమియం స్కూటర్ ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ఉత్పత్తిని చేపట్టగలిగినట్లు పియాజియో ఇండియా చైర్మన్ డీగో గ్రాఫీ పేర్కొన్నారు. వీలైనంత త్వరగా మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. ఆధునిక ఫీచర్లు, తరువాతి తరం డిజైన్‌తో రానున్న ప్రీమియం స్కూటర్ వినియోగదారులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది(2020) ఫిబ్రవరిలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారి క్యాండీ రెడ్ కలర్లో మ్యాక్సి స్కూటర్‌ను పియాజియో ప్రదర్శించింది. దేశీయంగా జపనీస్ దిగ్గజం సుజుకీ తయారీ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 వాహనానికి ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ ప్రత్యక్ష 160 పోటీనివ్వగలదని ఆటో రంగ నిపుణులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. (కొత్త ఏడాదిలో ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ) ఎల్సీడీ క్లస్టర్ దేశీ మార్కెట్‌కు అనుగుణంగా ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160ను పియాజియో ఇటలీలో రూపొందించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. మూడు వాల్వ్‌ల ఫ్యూయల్ ఇంజక్ట్‌డ్ మోటార్‌తో కూడిన 160 సీసీ ఇంజిన్‌ను ఆధునీకరించి మ్యాక్సీ స్కూటర్లో వినియోగించినట్లు ఆటో రంగ నిపుణులు తెలియజేశారు. ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, డిస్క్ బ్రేకులు తదితర ఫీచర్స్‌తో స్కూటర్ వెలువడనున్నట్లు చెబుతున్నారు. ట్విన్ క్రిస్టల్ హెడ్‌లైట్స్, 3 కోట్ హెచ్డీ బాడీ పెయింట్ ఫినిష్‌తో రూపొందుతున్నట్లు వివరించారు. ఎప్రిలియా ప్రీమియం స్కూటర్.. గ్లాసీ రెడ్, మ్యాట్ బ్లూ, గ్లాసీ వైట్ అండ్ మ్యాట్ బ్లాక్ కలర్స్‌లో లభ్యంకానున్నట్లు తెలియజేశారు. ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.10-1.2 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. -
కొత్త ఏడాదిలో ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160
ముంబై, సాక్షి: మ్యాక్సి స్కూటర్.. ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160ను వచ్చే ఏడాది(2021) తొలినాళ్లలో విడుదల చేసేందుకు పియాజియో ఇండియా ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది. ఇటాలియన్ కంపెనీ దేశీయంగా విడుదల చేయనున్న ఈ ప్రధాన వాహనాన్ని రెండు ప్రత్యేక కలర్స్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. కంపెనీ బారామతిలో్ ఏర్పాటు చేసిన ప్లాంటులో మ్యాక్సి స్కూటర్ తయారీకి సన్నాహాలు చేసినట్లు పియాజియో ఇటీవల తెలియజేసింది. ఈ ఏడాది(2020) ఫిబ్రవరిలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారి క్యాండీ రెడ్ కలర్లో మ్యాక్సి స్కూటర్‌ను పియాజియో ప్రదర్శించింది. తాజాగా బ్లూకలర్‌పైనా కంపెనీ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. దేశీయంగా జపనీస్ దిగ్గజం సుజుకీ తయారీ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 వాహనానికి ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ ప్రత్యక్ష 160 పోటీనివ్వగలదని ఆటో రంగ నిపుణులు పేర్కొంటున్నారు. చదవండి: (కార్లయిల్ చేతికి గ్రాన్సూల్స్ ఇండియా!) ఎల్సీడీ క్లస్టర్ దేశీ మార్కెట్‌కు అనుగుణంగా ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160ను పియాజియో ఇటలీలో రూపొందించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. తద్వారా ఈ విభాగంలో విలువైన బ్రాండ్లకు డిమాండ్ ఉన్నట్లు చెబుతున్నాయి. మూడు వాల్వ్‌ల ఫ్యూయల్ ఇంజక్ట్‌డ్ మోటార్‌తో కూడిన 160 సీసీ ఇంజిన్‌ను ఆధునీకరించి మ్యాక్సీ స్కూటర్లో వినియోగించినట్లు ఆటో రంగ నిపుణులు తెలియజేశారు. ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, డిస్క్ బ్రేకులు తదితర ఫీచర్స్‌తో స్కూటర్ వెలువడనున్నట్లు చెబుతున్నారు. ట్విన్ క్రిస్టల్ హెడ్‌లైట్స్, 3 కోట్ హెచ్డీ బాడీ పెయింట్ ఫినిష్‌తో రూపొందుతున్నట్లు వివరించారు. అధికారిక సమాచారం లేకున్నప్పటికీ బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా రూపొందిన ఎప్రిలియా స్కూటర్ ఖరీదు రూ. 1.1-1.2 లక్షల స్థాయిలో ఉండొచ్చని ఆటో వర్గాల అంచనా. -
పియాజ్జియో కొత్త బైక్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: ఇటాలియన్ ఆటో దిగ్గజం పియాజ్జియో 125 సీసీ బైక్‌ను ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ప్రముఖ వెస్పా స్కూ టర్ల తయారీ సంస్థ పియాజియో.. దేశీయ మార్కెట్లోకి ఏప్రిలియా ఎస్ఆర్ 125ను విడుదల చేసింది. దీనికి ధరను రూ .65,310 (ఎక్స్-షోరూమ్ పూణే) గా నిర్ణయించింది. వీటితో పాటు వెస్పా స్కూటర్లను కూడా ప్రదర్శించింది. వెస్పాజీటీఎస్, ట్యునో 150, ఇ-స్కూటర్ ఎలక్ట్రికాలను 2018 ఆటో ఎక్స్‌పోలో షోకేస్ చేసింది. ఈ సందర్భంగా ఒక కొత్త మొబైల్ కనెక్టివిటీ అప్లికేషన్ కూడా సంస్థ ప్రారంభించింది. 3 వాల్వ్ ఇంజీన్, 14 అంగుళాల వీల్స్, వైడర్ టైర్లతో సరసమైన ధరలో దేశవ్యాప్త డీలర్ల ద్వారా భారతీయ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని పియాజియో సీఈఓఅండ్ ఎండీ డియాగో గ్రాఫీ వెల్లడించారు. ఈ లాంచింగ్‌లతో కొత్త కేటగిరీలలో దేశంలో తమ వారసత్వం కొనసాగుతుందన్నారు. దీంతోపాటు యూత్‌ను ఆకట్టుకునే లక్ష్యంతో స్పోర్టి వెర్షన్ ఏప్రిలియా స్టామ్ను కూడా పరిచయం చేసింది. 125సీసీ ఇంజీన్, వైడ్ టెర్రైన్ టూర్లు, 12అంగుళాల ప్రధాన ఫీచర్లతో ఈ ఏడాది చివర్లో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇక మార్కెట్ పోటీ విషయానికి వస్తే ఎస్ఆర్ 125 బైక్ ఇటీవల కొత్తగా విడుదైలన టీవీఎస్ ఎన్ టార్క్ 125 , హోండా గ్రాజియా, సుజుకి యాక్స్‌స్ లకుగట్టిపోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
రూ.15 లక్షల స్కూటర్ తెస్తాం!
♦ పియాజియో వెహికల్స్ ఎండీ స్టెఫానో పెలె ♦ త్వరలో మార్కెట్లోకి వెస్పా 946 ఎంపోరియం ♦ ఈ ఏడాది మరిన్ని నూతన మోడళ్లు ప్రవేశపెడతాం... పియాజియో.. ప్రీమియం ద్విచక్ర వాహనాల తయారీలో ఉన్న ఈ ఇటాలియన్ కంపెనీ భారత మార్కెట్లో దూసుకెళ్తోంది. రెండేళ్లుగా డీలర్షిప్ కేంద్రాలను పెంచడమేగాక మార్కెట్ పరంగా ఉనికిని చాటుకుంటోంది. తయారీ కేంద్రం సామర్థ్యాన్ని పెంచుతోంది. 18-28 ఏళ్ల యువ కస్టమర్లు లక్ష్యంగా వెస్పా ఫ్లాగ్షిప్ మోడల్‌తో స్కూటర్ల విపణిలో తనకంటూ ప్రత్యేకతను సాధించింది. 125 సీసీ స్కూటర్లతో భారత్‌లో 2012లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. మార్కెట్ తీరుకు అనుగుణంగా ఇప్పుడు 150 సీసీ సామర్థ్యమున్న మోడళ్లను విస్తృతం చేస్తున్నట్టు పియాజియో వెహికల్స్ ఎండీ స్టెఫానో పెలె తెలిపారు. ప్రతి మోడల్ ఒక కొత్త విభాగాన్ని సృష్టిస్తుందని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. విశేషాలివీ.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : భారత్‌లో వేగం పెంచినట్టు ఉన్నారు.. అవును. రెండేళ్లుగా బ్రాండ్ ఉనికిని పెంచాం. ఈ ఏడాది మరింత విస్తరిస్తున్నాం. చిన్న పట్టణాల్లోనూ వినియోగదారులు వెస్పా స్కూటర్లు కొంటున్నారు. పుణేకు 200 కిలోమీటర్ల దూరంలో ఓ మారుమూల పల్లెలో వెస్పా పరుగు తీయడం కంటపడింది. స్కూటర్ యజమానితో మాట్లాడాను. వాహనం గురించి అడిగాను. తనకు బాగా నచ్చిందన్నది ఆయన సమాధానం. ఇదే మాకు స్ఫూర్తి కలిగిస్తోంది. పల్లెల్లోనూ మాకు కస్టమర్లున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 90 డీలర్షిప్ కేంద్రాలున్నాయి. డిసెంబర్‌కల్లా మరో 25 రానున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నాం. 2016లో విస్తరణతో ఈ నగరాల్లోని ఔట్లెట్ల సంఖ్య 20 శాతానికి చేరుతుంది. ఏ లక్ష్యంతో ఇక్కడ అడుగుపెట్టారు? స్కూటర్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అందుకే మా ఫోకస్ అంతా ప్రీమియం స్కూటర్లపైనే. దేశంలో బైక్‌ల కంటే వీటి వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. తొలుత 125 సీసీ మోడళ్లను ప్రవేశపెట్టాం. ఇప్పుడు దేశంలో 150 సీసీ మోడళ్లు పాపులర్ అవుతున్నాయి. దీంతో ఈ శ్రేణిని పెంచుతున్నాం. 100 రకాల వాహనాలున్నా వెస్పా తన ఉనికిని చాటుకుంటోంది. ఆ స్థాయిలో డిజైన్‌తో ప్రవేశపెట్టాం. రంగులూ ఆకట్టుకునే రీతిలో ఎంపిక చేశాం. ప్రతి మోడల్ మార్కెట్లో ఒక నూతన విభాగాన్ని సృష్టించాలన్నదే మా లక్ష్యం. ఇప్పటి వరకు వచ్చిన మోడళ్లు దీనిని నిరూపించాయి కూడా. ఆటో షోలలో పలు మోడళ్లను ప్రదర్శించారు. భారత్‌కు వేటిని తీసుకొస్తున్నారు? స్పోర్టీ, స్టైలిష్ స్కూటర్ అప్రీలియా ఎస్ఆర్ 150 ఆగస్టుకల్లా రోడ్డెక్కనుంది. స్కూటర్‌లాంటి సౌకర్యం, బైక్‌లాంటి పవర్‌తో ఇది వస్తోంది. కొత్త విభాగాన్ని క్రియేట్ చేయడం ఖాయం. మోటో గుజ్జి బ్రాండ్‌లో రోమర్, బాబర్ బైక్‌లను మూడో త్రైమాసికంలో ప్రవేశపెడుతున్నాం. వెస్పా 300 జీటీఎస్ స్కూటర్, వెస్పా 946 ఎంపోరియో అర్మాణీ స్కూటర్ ఈ ఏడాదే రానున్నాయి. భారత్‌లో 946 మోడల్ ధర ఇంకా నిర్ణయించలేదు. రూ.12లక్షలు-15 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. విభిన్న కాన్సెప్ట్స్‌తో ఈ స్కూటర్‌ను రూపొందించాం. పియాజియో మెడ్లీ 150, పియాజియో లిబర్టీ 125 స్కూటర్లు ప్రస్తుతానికి విదేశీ మార్కెట్లలోనే విక్రయిస్తాం. ఆ తర్వాత భారత్‌కు పరిచయం చేయాలని ఉంది. మరి కొత్త మోడళ్ల రాకతో తయారీ సామర్థ్యం పెంచాల్సి వస్తుందా? అమ్మకాల్లో విలువ పరంగా రెండింతల వృద్ధి నమోదు చేశాం. మహారాష్ట్రలోని తారామతి వద్ద ఉన్న ప్లాంటు వార్షిక సామర్థ్యం 1,00,000 యూనిట్లు. కొత్త మోడళ్లు పరుగు తీయనుండడంతో వచ్చే ఏడాది సామర్థ్యం పెంచాల్సి వస్తుంది. నేపాల్, మాల్దీవులకు ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేస్తున్నాం. దక్షిణాసియా దేశాలు, లాటిన్ అమెరికా మార్కెట్లకు ఎగుమతులను కొద్ది రోజుల్లో మొదలు పెడతాం. హైదరాబాద్ మార్కెట్ గురించి కాస్త వివరించండి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వెస్పా స్కూటర్ మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది. కంపెనీకి భారత్‌లో టాప్-5 నగరాల్లో భాగ్యనగరి నిలిచింది. అందుకే మోటోప్లెక్స్ ఔట్‌లెట్‌ను ఇక్కడ ప్రారంభించాం. పియాజియోకు చెం దిన ప్రీమియం ఇటాలియన్ బ్రాండ్స్ అయిన అప్రీలియా, మోటో గుజ్జి, వెస్పా బ్రాండ్ ద్విచక్ర వాహనాలన్నింటికీ వన్ స్టాప్ స్టోర్‌గా మోటోప్లెక్స్ ఉంటుంది. ప్రస్తుతం దేశంలో పుణే తర్వాత ఈ స్టోర్ ఉన్నది హైదరాబాద్‌లోనే. ప్రపంచ వ్యాప్తంగా 1946 నుంచి ఇప్పటి వరకు 1.80 కోట్ల వెస్పా స్కూటర్లు అమ్ముడయ్యాయి.