పియాజ్జియో కొత్త బైక్‌ లాంచ్‌ | Piaggio launches Aprilia SR125 at Auto Expo | Sakshi
Sakshi News home page

పియాజ్జియో కొత్త బైక్‌ లాంచ్‌

Published Wed, Feb 7 2018 1:39 PM | Last Updated on Wed, Feb 7 2018 4:09 PM

Piaggio launches Aprilia SR125 at Auto Expo - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇటాలియన్‌  ఆటో దిగ్గజం పియాజ్జియో 125 సీసీ బైక్‌ను ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది.   ప్రముఖ వెస్పా స్కూ టర్ల తయారీ సంస్థ పియాజియో.. దేశీయ మార్కెట్లోకి ఏప్రిలియా ఎస్ఆర్ 125ను విడుదల చేసింది. దీనికి ధరను రూ .65,310 (ఎక్స్-షోరూమ్ పూణే) గా నిర్ణయించింది. వీటితో పాటు   వెస్పా  స్కూటర్లను కూడా  ప్రదర్శించింది.  వెస్పాజీటీఎస్‌, ట్యునో 150, ఇ-స్కూటర్‌ ఎలక్ట్రికాలను 2018 ఆటో ఎక్స్‌పోలో షోకేస్‌ చేసింది.  ఈ సందర్భంగా  ఒక కొత్త మొబైల్ కనెక్టివిటీ అప్లికేషన్‌ కూడా  సంస్థ ప్రారంభించింది.

3 వాల్వ్‌ ఇంజీన్‌,  14 అంగుళాల వీల్స్‌, వైడర్‌ టైర్లతో సరసమైన ధరలో దేశవ్యాప్త డీలర్ల ద్వారా భారతీయ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని పియాజియో సీఈఓఅండ్‌ ఎండీ డియాగో గ్రాఫీ వెల్లడించారు. ఈ లాంచింగ్‌లతో  కొత్త  కేటగిరీలలో దేశంలో తమ వారసత్వం కొనసాగుతుందన్నారు.  దీంతోపాటు యూత్‌ను ఆకట్టుకునే లక్ష్యంతో  స్పోర్టి వెర్షన్ ఏప్రిలియా స్టామ్‌ను కూడా పరిచయం చేసింది.  125సీసీ ఇంజీన్‌, వైడ్‌ టెర్రైన్‌ టూర్లు, 12అంగుళాల ప్రధాన ఫీచర్లతో ఈ ఏడాది చివర్లో  కస‍్టమర్లకు అందుబాటులో ఉంటుందని  తెలిపింది.

ఇక మార్కెట్‌ పోటీ విషయానికి వస్తే ఎస్ఆర్ 125  బైక్‌  ఇటీవల కొత్తగా విడుదైలన  టీవీఎస్ ఎన్‌ టార్క్‌ 125 , హోండా గ్రాజియా, సుజుకి యాక్స్‌స్‌ లకుగట్టిపోటీ ఇస్తుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement