మార్కెట్లోకి రెండు శక్తివంతమైన స్కూటర్లు లాంఛ్ చేసిన పియాజియో | 2022 Aprilia SR 160, SR 125 Scooters Launched In India | Sakshi

మార్కెట్లోకి రెండు శక్తివంతమైన స్కూటర్లు లాంఛ్ చేసిన పియాజియో

Nov 16 2021 8:41 PM | Updated on Nov 16 2021 9:30 PM

2022 Aprilia SR 160, SR 125 Scooters Launched In India - Sakshi

ప్రముఖ వాహన తయారీ సంస్థ పియాజియో ఇండియా భార‌త్‌లో అప్ డేట్ చేసిన అప్రిలియా న్యూ ఎస్ఆర్ 160, ఎస్ఆర్ 125 స్కూటర్లను లాంఛ్ చేసింది. న్యూ ఎస్ఆర్ 160 మోడల్ ధర ₹.1,17,494(ఎక్స్ షోరూమ్ పూణే)గా ఉంటే, ఎస్ఆర్ 125 మోడల్ ధర ₹1,07,595(ఎక్స్ షోరూమ్ పూణే)గా ఉంది. డిజైన్ స‌హా ప‌లు ఫీచ‌ర్ల‌ను అప్‌డేట్ చేయ‌డంతో పాటు నూత‌న శ్రేణి వాహ‌నాలు బీఎస్6 ప్ర‌మాణాల‌తో క‌స్ట‌మ‌ర్ల ముందుకు వ‌చ్చాయి. రూ 5000 టోకెన్ అమౌంట్‌తో న్యూ ఎస్ఆర్ రేంజ్ బైక్‌ల‌ను బుక్ చేసుకోవ‌చ్చ‌ని కంపెనీ వెల్ల‌డించింది.

కొత్త ఎస్ఆర్ 160 రేంజ్ వైట్, బ్లూ, గ్రే, రెడ్, మాట్ బ్లాక్ రంగులలో లభ్యం కానుంది. అప్రిలియా ఎస్ఆర్ 160 కొత్త హెడ్ ల్యాంప్, కొత్త ఎల్ఈడి హెడ్ లైట్ తో వస్తుంది. ఎస్ఆర్ 160 స్కూటర్లో ఎబిఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), 160 సీసీ 3వీ టెక్ ఎఫ్ఐ, హైటెక్, హై-పెర్ఫార్మెన్స్ ఇంజిన్ తో వస్తుంది. ఇందులో 160 సీసీ ఎయిర్ కూల్డ్ త్రీ వాల్వ్ ఇంజిన్ సహాయం చేత పనిచేస్తుంది. ఇది 7600 ఆర్ పిఎమ్ వద్ద 10.84 బిహెచ్ పఈ పవర్, 6000 ఆర్ పిఎమ్ వద్ద 11.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 

(చదవండి: భారీగా పడిపోయిన బిట్‌కాయిన్‌ ధర)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement