యువతకు స్పోర్ట్స్ బైక్స్ అంటే యమా క్రేజ్. రోడ్లపై రయ్.. రయ్ దూసుకుపోవడం అంటే వారికి భలే సరదా. బైక్స్ కంపెనీలు కూడా కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లో దించుతూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారతదేశంలో అందుబాటులో ఉన్న ఖరీదైన కొన్ని స్పోర్ట్స్ బైక్స్ వివరాలు ఇక్కడ చూద్దాం..
బ్రాండ్ ధోని
మన దేశంలో స్పోర్ట్స్ బైక్స్ లవర్స్ పేర్లు చెప్పాల్సి వస్తే మొదటి గుర్తొచ్చేది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనినే. ఖాళీ సమయాల్లో రాంచీ వీధుల్లో బైక్స్‌పైన చక్కర్లు కొట్టడం ధోనికి ఇష్టం. ఖరీదైన కార్లకు తోడు ఖరీదైన బైక్స్ కూడా అతని గారేజీలో కొలువై ఉంటాయి. కవాసకి నింజా హెచ్2, కాన్ఫిడరేట్ ఎక్స్ 132 హెల్‌క్యాట్, హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్‌బాయ్, డుకాటి 1098, సుజుకి హయబుస తదితర బైక్‌లు ధోని కలెక్షన్‌లో ఉన్నాయి.
(చదవండి: బైక్ కొనుగోలుదారులకు హీరో మోటోకార్ప్ షాక్!)
ఇక బాలీవుడ్ విషయానికి వస్తే జాన్ అబ్రహం పెద్ద బైక్ లవర్ అని చెప్పవచ్చు. అతని వద్ద ఉన్న బైక్స్ విలువ కోటిన్నర రూపాయల వరకూ ఉంటుందని చెబుతారు. కవాసకి నింజా జెడ్‌ఎక్స్-14 ఆర్, అప్రిల్లా ఆర్‌ఎస్‌వీ 4 తదితర బైక్‌లు అతని వద్ద ఉన్నాయి. షాహిద్ కపూర్ కూడా బైక్స్ లవరే. షూటింగ్ లేని సమయాల్లో అతను బైక్స్‌పైనే లాంగ్ డ్రైవ్స్‌కు వెళతాడు. షాహిద్ వద్ద బీఎండబ్ల్యూ 310 ఆర్, హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ లాంటి ఖరీదైన మోటార్‌సైకిల్స్ ఉన్నాయి. ఇక బైక్స్ లవర్స్ లిస్ట్‌లో మాధవన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, సైఫ్ అలీఖాన్ తదితరులు ఉన్నారు.
కవాసకి నింజా హెచ్2ఆర్
- ఇంజిన్ కెపాసిటి : 998 సీసీ
- గేర్లు : 6
- బండి మొత్తం బరువు : 216 కిలోలు
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 17 లీటర్లు
- మాగ్జిమమ్ పవర్ : 305.75 బీహెచ్‌పీ, 14,000 ఆర్‌పీఎం
- మన దేశంలో ధర (సుమారు) : రూ. 79,90,000
బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్‌ఆర్
- ఇంజిన్ కెపాసిటీ : 999 సీసీ
- గేర్లు : 6
- బండి మొత్తం బరువు : 192 కిలోలు
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 16.5 లీటర్లు
- మాగ్జిమమ్ పవర్ : 209.19 బీహెచ్‌పీ, 14,500 ఆర్‌పీఎం
- మన దేశంలో ధర (సుమారు) : రూ. 42,00,000
హోండా గోల్డ్‌వింగ్
- ఇంజిన్ కెపాసిటి : 1,833 సీసీ
- గేర్లు : 6
- బండి మొత్తం బరువు : 385 కేజీలు
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 21.1 లీటర్లు
- మాగ్జిమమ్ పవర్ : 124.7 బీహెచ్‌పీ, 5,500 ఆర్‌పీఎం
- మన దేశంలో ధర (సుమారు) : రూ. 37,75,000
హార్లీడేవిడ్సన్ రోడ్ కింగ్
- ఇంజిన్ కెపాసిటి : 1,746 సీసీ
- గేర్లు : 6
- బండి మొత్తం బరువు : 375 కేజీలు
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 22.7 లీటర్లు
- మాగ్జిమమ్ పవర్ : -
- మన దేశంలో ధర (సుమారు) : రూ. 30,00,000
అప్రిల్లా ఆర్‌ఎస్‌వీ4 1100 ఫ్యాక్టరీ
- ఇంజిన్ కెపాసిటి : 1099 సీసీ
- గేర్లు : 6
- బండి మొత్తం బరువు : 202 కేజీలు
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 17.9 లీటర్లు
- మాగ్జిమమ్ పవర్ : 213.89 బీహెచ్‌పీ, 13,000ఆర్‌పీఎం
- మన దేశంలో ధర (సుమారు) : రూ. 26,50,000
డుకాటీ పనిగేల్ వీ4
- ఇంజిన్ కెపాసిటి : 1,103 సీసీ
- గేర్లు : 6
- బండి మొత్తం బరువు : 198 కేజీలు
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 16 లీటర్లు
- మాగ్జిమమ్ పవర్ : 211.21 బీహెచ్‌పీ, 13,000 ఆర్‌పీఎం
- మన దేశంలో ధర (సుమారు) : రూ. 26,27,000
బీఎండబ్ల్యూ ఆర్ 1250 అడ్వెంచర్
- ఇంజిన్ కెపాసిటి : 1,254 సీసీ
- గేర్లు : 6
- బండి మొత్తం బరువు : 268 కేజీలు
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 30 లీటర్లు
- మాగ్జిమమ్ పవర్ : 134.1 బీహెచ్‌పీ, 7,700 ఆర్‌పీఎం
- మన దేశంలో ధర (సుమారు) : రూ. 25,00,000
ట్రయంప్ రాకెట్ 3
- ఇంజిన్ కెపాసిటి : 2,458 సీసీ
- గేర్లు : 6
- బండి మొత్తం బరువు : 304 కేజీలు
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 18 లీటర్లు
- మాగ్జిమమ్ పవర్ : 165 బీహెచ్‌పీ
- మన దేశంలో ధర (సుమారు) : రూ. 22,27,000
ఇండియన్ చీఫ్ బాబెర్ డార్క్‌హార్స్
- ఇంజిన్ కెపాసిటి : 1890 సీసీ
- గేర్లు : 6
- బండి మొత్తం బరువు : 352 కేజీలు
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 15.1 లీటర్లు
- మన దేశంలో ధర (సుమారు) : రూ. 21,40,000
సుజుకి హయబుస
- ఇంజిన్ కెపాసిటి : 1,340 సీసీ
- గేర్లు : 6
- బండి మొత్తం బరువు : 266 కేజీలు
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 20 లీటర్లు
- మాగ్జిమమ్ పవర్ : 187.3 బీహెచ్‌పీ
- మన దేశంలో ధర (సుమారు) : రూ. 18,47,000
Comments
Please login to add a commentAdd a comment