రయ్‌..రయ్‌..డుగ్‌ డుగ్‌ మంటూ వచ్చేస్తున్నాయ్‌! | Best Upcoming Bikes In India 2022 | Sakshi
Sakshi News home page

రయ్‌..రయ్‌..డుగ్‌ డుగ్‌ మంటూ వచ్చేస్తున్నాయ్‌!

Published Sun, Jan 2 2022 2:53 PM | Last Updated on Sun, Jan 2 2022 10:38 PM

Best Upcoming Bikes In India 2022 - Sakshi

చిరు ఉద్యోగికి జీవితంలో సొంతిల్లు కట్టుకోవాలనేది ఒక అందమైన కల. అదే కుర్ర కారుకి స్పోర్ట్స్‌ బైక్‌  కొనాలనేది కల. కొన్న కొత్త బైక్‌తో రయ్‌..రయ్‌ అంటూ లేదంటే డుగ్‌ డుగ్‌ మంటూ చక్కెర్లు కొట్టడం అంటే మహా పిచ్చి. అందుకే బైక్‌ రైడ్‌లతో కిర్రాకు పుట్టించే కుర్రకారు కోసం బైక్స్‌ కంపెనీలు కొత్త మోడళ్లు, సరికొత్త హంగులతో కొత్త బైక్స్‌ను మార్కెట్‌కు పరిచయం చేస్తున్నాయి.యువతను అట్రాక్ట్‌ చేయనున్నాయి. అయితే ఎప్పటిలాగే ప్రతి ఏడాది విడుదలయ్యే కొత్త బైక్స్‌ ఈ ఏడాది విడుదల కానున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

రాయల్‌ ఎన్‌ ఫీల్డ్‌ స్క్రామ్‌ 411

రాయల్‌ ఎన్‌ ఫీల్డ్‌ స్క్రామ్‌ 411. ఈ బైక్‌ ను రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ బైక్‌ ఇన్స్పిరేషన్‌తో డిజైన్‌ చేశారు. 19 అంగుళాలతో చిన్నగా ఫ్రంట్‌ వీల్‌ ఉండనుంది. ఈ నెలలో మార్కెట్‌లో విడుదల కావాల్సి ఉండగా..బైక్‌ ధర రూ.1.9లక్షలుగా ఉంది. 

కేటీఎం ఆర్సీ 390


కేటీఎం ఆర్సీ 390 స్పోర్ట్స్‌ బైక్‌.  బైక్ విండ్‌స్క్రీన్  బ్లాస్ట్‌ను తగ్గిస్తుంది. బైక్‌ రైడింగ్ సమయంలో అలసట లేకుండా చేస్తుంది. మరో ఆరు నెలలో ఈ బైక్‌ మార్కెట్‌లో విడుదల కానుండగా.. ఈ బైక్‌ ధర రూ.2.5లక్షలుగా ఉంది. 

కవాసకీ డబ్ల్యూ 175


కవాసకీ డబ్ల్యూ 175 ఈ ఏడాదిలోనే విడుదల కానున్న ఈ బైక్‌ అత్యంత సరసమైన బైక్‌గా నిలవనుంది. ఇక ఈ బైక్‌ ధర రూ.1.75లక్షలుగా ఉంది. 

2022 హోండా సీబీ300ఆర్‌


మరో వారంలో 2022 హోండా సీబీ300ఆర్‌ బైక్‌ దేశీయ మార్కెట్‌లో విడుదల కానుంది. బీఎస్ వీఐ ఇంజిన్‌తో వస్తున్న ఈ బైక్‌ ధర రూ.2.5లక్షలుగా ఉంది. 

ట్రయంప్‌ టైగర్‌ స్పోర్ట్స్‌ 660


ట్రయంప్‌ టైగర్‌ స్పోర్ట్స్‌ 660 ప్రీమియం బైక్‌. ట్రిడెంట్‌ 660 మోడల్‌తో ఆరు నెలల్లో విడుదల కానున్న బైక్‌ ధర రూ. 12లక్షలుగా ఉంది.  

husqvarna svartpilen 125 బైక్‌


husqvarna svartpilen 125 బైక్‌ 125సీసీ కేటీఎం డ్యూక్‌ 125బైక్‌ తరహాలో ఈ బైక్‌లో సైతం సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌తో మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ బైక్‌ ధర రూ.1.3లక్షలుగా ఉంది. 

హీరో ఎక్స్‌ ట్రీమ్‌ 160ఎస్‌ 


హీరో ఎక్స్‌ ట్రీమ్‌ 160ఎస్‌ స్పోర్ట్స్‌ బైక్‌. 163 సీసీ ఇంజిన్‌తో ఈ ఏడాదిలో విడుదల కానున్న బైక్‌ ధర రూ. 1.1లక్షలుగా ఉంది. 

టీవీఎస్‌ జెప్పిలిన్‌ ఆర్‌


టీవీఎస్‌ జెప్పిలిన్‌ ఆర్‌ క్రూజర్‌ బైక్‌ 2018 ఆటోఎక్స్‌పోలో కనిపించింది. అయితే ఇన్ని సంవత్సరాల తరువాత ఏడాదిలో ఈ బైక్‌ విడుదల కానుంది. ఈ బైక్‌ ధర రూ.1.5లక్షలుగా ఉంది. 

ఏజిద్‌ రోడ్‌ కింగ్‌     


ఏజిద్‌ రోడ్‌ కింగ్‌ బైక్‌ ఈ ఏడాది మార్కెట్‌లో విడుదల కానుండగా ఈ బైక్‌ ధర రూ.1.75లక్షలుగా ఉంది. 

కవాసకీ నింజా 400


కవాసకీ నింజా 400 బైక్‌ మరో ఆరు నెలలో విడుదల కానుంది. 399సీసీ తో రెండు ఇంజిన్‌లతో రానున్న ఈ బైక్‌ ధర రూ.5లక్షలు

చదవండి: సింగిల్ ఛార్జ్​తో 200 కి.మీ దూసుకెళ్లనున్న ఒకాయా 'ఫాస్ట్​' ఎలక్ట్రిక్ స్కూటర్..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement