విజయవాడ కేంద్రంగా..అవేరా నుంచి రెండు ఎలక్ట్రిక్‌ బైక్స్‌ విడుదల | Vijayawada Based Avera Launches Electric Scooter Vincero | Sakshi
Sakshi News home page

విజయవాడ కేంద్రంగా..అవేరా నుంచి రెండు ఎలక్ట్రిక్‌ బైక్స్‌ విడుదల

Aug 16 2022 8:42 AM | Updated on Aug 16 2022 2:17 PM

Vijayawada Based Avera Launches Electric Scooter Vincero - Sakshi

సాక్షి, అమరావతి: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రెండు సరికొత్త ఎలక్ట్రికల్‌ స్కూటర్లను అవేరా సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. 

విజయవాడ సమీపంలోని తయారీ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో విన్సిరో పేరుతో ప్రీమియం, రెట్రోసా లైట్‌ పేరుతో ఎకానమీ స్కూటర్‌ను విడుదల చేసింది. పూర్తి భద్రతా ప్రమాణాలతో ఉండే ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీతో రూపొందించిన ‘విన్సిరో’ గరిష్టంగా గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణించడమే కాకుండా ఒకసారి చార్జింగ్‌ చేస్తే 236 కి.మీ. ప్రయాణం చేస్తుందని అవేరా ఫౌండర్‌ సీఈవో వెంకట రమణ పేర్కొన్నారు. 

సబ్సిడీలు పోను ఈ స్కూటర్‌ ధరను రూ. 1.40 లక్షలుగా నిర్ణయించారు. అలాగే విన్సిరో లైట్‌ గంటకు 60 కి.మీ. వేగంతో ఒకసారి చార్జింగ్‌చేస్తే 100 కి.మీ. ప్రయాణం చేయనుంది. విన్సిరో లైట్‌ ధరను రూ.99,000 గా నిర్ణయించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement