డుగ్..డుగ్ బండి రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు శుభవార్త. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీవీఎస్, హీరో, అథేర్, బీఎండబ్ల్యూ వంటి ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలు మే నెలలో ఎలక్ట్రిక్ బైక్స్‌ను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఆ కంపెనీల వెహికల్స్‌తో పోటీపడుతూ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైందని రాయల్ ఎన్‌ఫీల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ లాల్ తెలిపారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ విడుదలపై కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ రిపోర్ట్‌ల ప్రకారం..చెన్నై కేంద్రంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ద్విచక్రవాహన ఆటోమొబైల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం ప్రోటోటైప్‌లను సిద్ధం చేస్తుందని, త్వరలో ఈవీ బైక్స్ తయారీని ప్రారంభించనుందని రిపోర్ట్‌లు హైలెట్ చేస్తున్నాయి.
స్పెసిఫికేషన్‌ల విషయానికొస్తే!
ఇండియా కార్ న్యూస్ నివేదికల ప్రకారం బైక్ 8కేడ్ల్యూహెచ్ నుండి 10కేడబ్ల్యూహెచ్ వరకు బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించవచ్చు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ల ప్రకారం బైక్‌ల శక్తి, గరిష్ట టార్క్ 40బీహెచ్‌పీ, 100ఎన్‌ఎం ఉందని అంచనా. ఇక ఈబైక్ ప్రస్తుతం ఈ బైక్ ప్రోటోటైప్‌లు యూకేలో డిజైన్ చేస్తుండగా వచ్చే ఏడాది మార్కెట్‌లో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment