చూడటానికి మామూలు సైకిలు మాదిరిగా ఉన్న ఈ–బైక్ ఇది. ఇప్పటివరకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈ–బైక్స్ కంటే చాలా తేలికైనది. దీని బరువు దాదాపు 15 కిలోలు మాత్రమే! దీని బ్యాటరీ పూర్తిగా చార్జ్ కావడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది.
పూర్తిగా చార్జ్ అయ్యాక ఇది నిరాటంకంగా 113 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. రోడ్డుపైన ఇది గంటకు 32 కిలోమీటర్ల గరిష్ఠవేగంతో పయనిస్తుంది.ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ సంస్థ ‘ఏసెర్’ ఈ తేలికపాటి ఈ–బైక్‌ను ‘ఈబీ’ పేరిట రూపొందించింది. ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది.
ఇది కృత్రిమ మేధ సాయంతో పనిచేస్తుంది. ప్రయాణించే దారిలోని రోడ్ల పరిస్థితిని బట్టి తనంతట తానే గేర్లు మార్చుకుంటుంది. డ్రైవర్ సౌకర్యానికి, వాహనం నడిపే తీరుకు అనుగుణంగా సర్దుకుంటుంది. దీని ధర 999 డాలర్లు (సుమారు రూ.82 వేలు) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment