Sports bikes
-
మార్కెట్లోకి కొత్త స్పోర్ట్స్ బైక్‌లు.. ధరలు, ఫీచర్లు ఇవే..
ట్రయంఫ్ (Triumph) మోటార్‌సైకిల్స్ ఇండియా కొత్త ప్రీమియం బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. 2023 స్ట్రీట్ ట్రిపుల్ 765 ఆర్ఎస్, స్ట్రీట్ ట్రిపుల్ 765 ఆర్ మోడళ్లను పరిచయం చేసింది. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ధర రూ. 10.17 లక్షలు, స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ ధర రూ. 11.81 లక్షలు. (ఎక్స్ షోరూమ్) కలర్స్ ఇవే.. ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ సిల్వర్ ఐస్, క్రిస్టల్ వైట్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. అలాగే ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ సిల్వర్ ఐస్, కార్నివాల్ రెడ్, కాస్మిక్ ఎల్లో అనే మూడు రంగుల్లో లభ్యమవుతుంది. స్పెసిఫికేషన్లు 2023 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ లైనప్‌లో లిక్విడ్-కూల్డ్, 765 సీసీ ఇన్-లైన్ త్రీ-సిలిండర్ ఇంజన్ ఉంది. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ఇంజిన్ 11,500 ఆర్పీఎం వద్ద 118.4 బీహెచ్పీ, 9,500 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 80 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఇక స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ 12,000 ఆర్పీఎం వద్ద 128.2 బీహెచ్పీ అధిక అవుట్‌పుట్‌ను 9,500 ఆర్పీఎం వద్ద 80 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఫీచర్స్ ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్‌లో కార్నరింగ్ ఏబీఎస్, లీన్-యాంగిల్ సెన్సిటివిటీతో ట్రాక్షన్ కంట్రోల్, లింక్డ్ బ్రేకింగ్ సిస్టమ్, వీలీ కంట్రోల్, ఐదు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. మరోవైపు 2023 స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ నాలుగు రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌లో ఎల్సీడీ డిస్ప్లే, ఆర్ఎస్ మోడల్లో బ్లూటూత్ కనెక్టివిటీతో టీఎఫ్టీ స్క్రీన్ ఉన్నాయి. ల్యాప్ టైమర్, క్రూయిజ్ కంట్రోల్‌తో కూడిన ట్రాక్ ఉపయోగం కోసం ఆర్ఎస్ వేరియంట్‌ను మరింత అనుకూలంగా ఉండేలా రూపొందించారు. StreetTriple 765 R-the new definitive street fighter-is priced from INR 10,17,000 Ex-Showroom, and StreetTriple 765 RS-the most powerful #StreetTriple ever-is priced from INR 11,81,000 Ex-Showroom.#StreetTriple765R #StreetTriple765RS #RacePowered #StreetTriple765 #TriumphIndia pic.twitter.com/2sOfixWOSc — TriumphIndiaOfficial (@IndiaTriumph) June 16, 2023 -
అదిరిపోయిన హైస్పీడ్ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైకులు..!
దేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, స్టార్ట్అప్ కంపెనీలు కూడా దిగ్గజ కంపెనీలతో పోటీగా కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేస్తున్నాయి. ఇంధన ధరలు భారీగా పెరగడం, ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటం చేత ప్రజలు ఈవీలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ప్రజలు ఇప్పుడు తక్కువ ధర ట్యాగ్ కాకుండా మంచి పనితీరు కనబరిచే ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రధాన ఎలక్ట్రిక్ ద్విచక్ర కంపెనీలు మంచి పనితీరు గల ఎలక్ట్రిక్ బైకులను తీసుకొచ్చేందుకు సిద్ద పడుతున్నాయి. త్వరలో రానున్న మంచి పనితీరు గల హైపర్ స్పీడ్ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైకుల గురుంచి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 1. ట్రూవ్ మోటార్స్ హైపర్ స్పోర్ట్స్ ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్ బైకును త్వరలో తయారు చేయడం ప్రారంభించనున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ 2023 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. సుమారు 350-500 కిలోమీటర్ల పరిధితో గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునేలా ఈ బైక్ రూపొందించినట్లు ట్రూవ్ మోటార్ కంపెనీ తెలియజేసింది. 2. అల్ట్రావయొలెట్ ఎఫ్77 టీవీసీ కంపెనీ మద్దతు గల అల్ట్రావయొలెట్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ అల్ట్రావయొలెట్ ఎఫ్77ను 2022 తొలి త్రైమాసికంలో భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అల్ట్రావయొలెట్ ఎఫ్77 బైక్ 7.5 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 140 కిలోమీటర్ల వేగం అని ఆటోమేకర్ పేర్కొంది. ఇందులో 3 లిథియం-అయాన్ బ్యాటరీలు ఉన్నాయి, 150 కిలోమీటర్ల రేంజ్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. 3. ఎంఫ్లక్స్ వన్ ఎంఫ్లక్స్ ఈ ఏడాది తన హైపర్ స్పీడ్ ఎలక్ట్రిక్ బైకును లాంఛ్ చేయాలని చూస్తుంది. ఈ బైక్ గంటకు 200 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుందని, 3 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్లు చేరుకొనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ బైక్ 200 కిలోమీటర్ల రేంజ్ కూడా అందిస్తుందని కంపెనీ చెబుతోంది. 4. హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఈ ఈవీ తయారీసంస్థ హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మొదటి స్వదేశీ హైపర్ స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ హాప్ ఆక్సోను అతి త్వరలో లాంఛ్ చేయాలని చూస్తోంది. కంపెనీ ఇటీవల జైపూర్'లో తన తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. రాబోయే హైస్పీడ్ మోటార్ సైకిల్ ఇక్కడ ఉత్పత్తి చేయనుంది. హైపర్ స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ హాప్ ఆక్సో 130-150 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. 10 సెకన్ల కంటే తక్కువ సమయంలో గంటకు 80/90 కిలోమీటర్లకు చేరుకోగలదని కంపెనీ పేర్కొంది. (చదవండి: బంగారం కొనేవారికి షాక్.. భారీగా పెరిగిన ధరలు..!) -
రయ్..రయ్..డుగ్ డుగ్ మంటూ వచ్చేస్తున్నాయ్!
చిరు ఉద్యోగికి జీవితంలో సొంతిల్లు కట్టుకోవాలనేది ఒక అందమైన కల. అదే కుర్ర కారుకి స్పోర్ట్స్ బైక్ కొనాలనేది కల. కొన్న కొత్త బైక్‌తో రయ్..రయ్ అంటూ లేదంటే డుగ్ డుగ్ మంటూ చక్కెర్లు కొట్టడం అంటే మహా పిచ్చి. అందుకే బైక్ రైడ్లతో కిర్రాకు పుట్టించే కుర్రకారు కోసం బైక్స్ కంపెనీలు కొత్త మోడళ్లు, సరికొత్త హంగులతో కొత్త బైక్స్‌ను మార్కెట్‌కు పరిచయం చేస్తున్నాయి.యువతను అట్రాక్ట్ చేయనున్నాయి. అయితే ఎప్పటిలాగే ప్రతి ఏడాది విడుదలయ్యే కొత్త బైక్స్ ఈ ఏడాది విడుదల కానున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాయల్ ఎన్ ఫీల్డ్ స్క్రామ్ 411 రాయల్ ఎన్ ఫీల్డ్ స్క్రామ్ 411. ఈ బైక్ ను రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్ ఇన్స్పిరేషన్తో డిజైన్ చేశారు. 19 అంగుళాలతో చిన్నగా ఫ్రంట్ వీల్ ఉండనుంది. ఈ నెలలో మార్కెట్లో విడుదల కావాల్సి ఉండగా..బైక్ ధర రూ.1.9లక్షలుగా ఉంది. కేటీఎం ఆర్సీ 390 కేటీఎం ఆర్సీ 390 స్పోర్ట్స్ బైక్. బైక్ విండ్‌స్క్రీన్ బ్లాస్ట్‌ను తగ్గిస్తుంది. బైక్ రైడింగ్ సమయంలో అలసట లేకుండా చేస్తుంది. మరో ఆరు నెలలో ఈ బైక్ మార్కెట్లో విడుదల కానుండగా.. ఈ బైక్ ధర రూ.2.5లక్షలుగా ఉంది. కవాసకీ డబ్ల్యూ 175 కవాసకీ డబ్ల్యూ 175 ఈ ఏడాదిలోనే విడుదల కానున్న ఈ బైక్ అత్యంత సరసమైన బైక్‌గా నిలవనుంది. ఇక ఈ బైక్ ధర రూ.1.75లక్షలుగా ఉంది. 2022 హోండా సీబీ300ఆర్ మరో వారంలో 2022 హోండా సీబీ300ఆర్ బైక్ దేశీయ మార్కెట్లో విడుదల కానుంది. బీఎస్ వీఐ ఇంజిన్‌తో వస్తున్న ఈ బైక్ ధర రూ.2.5లక్షలుగా ఉంది. ట్రయంప్ టైగర్ స్పోర్ట్స్ 660 ట్రయంప్ టైగర్ స్పోర్ట్స్ 660 ప్రీమియం బైక్. ట్రిడెంట్ 660 మోడల్‌తో ఆరు నెలల్లో విడుదల కానున్న బైక్ ధర రూ. 12లక్షలుగా ఉంది. husqvarna svartpilen 125 బైక్ husqvarna svartpilen 125 బైక్ 125సీసీ కేటీఎం డ్యూక్ 125బైక్ తరహాలో ఈ బైక్‌లో సైతం సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో మార్కెట్లో విడుదల కానుంది. ఈ బైక్ ధర రూ.1.3లక్షలుగా ఉంది. హీరో ఎక్స్ ట్రీమ్ 160ఎస్ హీరో ఎక్స్ ట్రీమ్ 160ఎస్ స్పోర్ట్స్ బైక్. 163 సీసీ ఇంజిన్‌తో ఈ ఏడాదిలో విడుదల కానున్న బైక్ ధర రూ. 1.1లక్షలుగా ఉంది. టీవీఎస్ జెప్పిలిన్ ఆర్ టీవీఎస్ జెప్పిలిన్ ఆర్ క్రూజర్ బైక్ 2018 ఆటోఎక్స్పోలో కనిపించింది. అయితే ఇన్ని సంవత్సరాల తరువాత ఏడాదిలో ఈ బైక్ విడుదల కానుంది. ఈ బైక్ ధర రూ.1.5లక్షలుగా ఉంది. ఏజిద్ రోడ్ కింగ్ ఏజిద్ రోడ్ కింగ్ బైక్ ఈ ఏడాది మార్కెట్లో విడుదల కానుండగా ఈ బైక్ ధర రూ.1.75లక్షలుగా ఉంది. కవాసకీ నింజా 400 కవాసకీ నింజా 400 బైక్ మరో ఆరు నెలలో విడుదల కానుంది. 399సీసీ తో రెండు ఇంజిన్లతో రానున్న ఈ బైక్ ధర రూ.5లక్షలు చదవండి: సింగిల్ ఛార్జ్‌తో 200 కి.మీ దూసుకెళ్లనున్న ఒకాయా 'ఫాస్ట్' ఎలక్ట్రిక్ స్కూటర్..! -
దేశంలో ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్: ధోని ఫేవరెట్ ఏంటో తెలుసా?
యువతకు స్పోర్ట్స్ బైక్స్ అంటే యమా క్రేజ్. రోడ్లపై రయ్.. రయ్ దూసుకుపోవడం అంటే వారికి భలే సరదా. బైక్స్ కంపెనీలు కూడా కొత్త మోడల్స్‌ను మార్కెట్లో దించుతూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారతదేశంలో అందుబాటులో ఉన్న ఖరీదైన కొన్ని స్పోర్ట్స్ బైక్స్ వివరాలు ఇక్కడ చూద్దాం.. బ్రాండ్ ధోని మన దేశంలో స్పోర్ట్స్ బైక్స్ లవర్స్ పేర్లు చెప్పాల్సి వస్తే మొదటి గుర్తొచ్చేది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనినే. ఖాళీ సమయాల్లో రాంచీ వీధుల్లో బైక్స్పైన చక్కర్లు కొట్టడం ధోనికి ఇష్టం. ఖరీదైన కార్లకు తోడు ఖరీదైన బైక్స్ కూడా అతని గారేజీలో కొలువై ఉంటాయి. కవాసకి నింజా హెచ్2, కాన్ఫిడరేట్ ఎక్స్ 132 హెల్‌క్యాట్, హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్‌బాయ్, డుకాటి 1098, సుజుకి హయబుస తదితర బైక్‌లు ధోని కలెక్షన్లో ఉన్నాయి. (చదవండి: బైక్ కొనుగోలుదారులకు హీరో మోటోకార్ప్ షాక్!) ఇక బాలీవుడ్ విషయానికి వస్తే జాన్ అబ్రహం పెద్ద బైక్ లవర్ అని చెప్పవచ్చు. అతని వద్ద ఉన్న బైక్స్ విలువ కోటిన్నర రూపాయల వరకూ ఉంటుందని చెబుతారు. కవాసకి నింజా జెడ్ఎక్స్-14 ఆర్, అప్రిల్లా ఆర్ఎస్వీ 4 తదితర బైక్‌లు అతని వద్ద ఉన్నాయి. షాహిద్ కపూర్ కూడా బైక్స్ లవరే. షూటింగ్ లేని సమయాల్లో అతను బైక్స్‌పైనే లాంగ్ డ్రైవ్స్‌కు వెళతాడు. షాహిద్ వద్ద బీఎండబ్ల్యూ 310 ఆర్, హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ లాంటి ఖరీదైన మోటార్‌సైకిల్స్ ఉన్నాయి. ఇక బైక్స్ లవర్స్ లిస్ట్‌లో మాధవన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, సైఫ్ అలీఖాన్ తదితరులు ఉన్నారు. కవాసకి నింజా హెచ్2ఆర్ ఇంజిన్ కెపాసిటి : 998 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 216 కిలోలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 17 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 305.75 బీహెచ్పీ, 14,000 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 79,90,000 బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ ఇంజిన్ కెపాసిటీ : 999 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 192 కిలోలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 16.5 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 209.19 బీహెచ్పీ, 14,500 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 42,00,000 హోండా గోల్డ్‌వింగ్ ఇంజిన్ కెపాసిటి : 1,833 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 385 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 21.1 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 124.7 బీహెచ్పీ, 5,500 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 37,75,000 హార్లీడేవిడ్సన్ రోడ్ కింగ్ ఇంజిన్ కెపాసిటి : 1,746 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 375 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 22.7 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : - మన దేశంలో ధర (సుమారు) : రూ. 30,00,000 అప్రిల్లా ఆర్ఎస్వీ4 1100 ఫ్యాక్టరీ ఇంజిన్ కెపాసిటి : 1099 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 202 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 17.9 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 213.89 బీహెచ్పీ, 13,000ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 26,50,000 డుకాటీ పనిగేల్ వీ4 ఇంజిన్ కెపాసిటి : 1,103 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 198 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 16 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 211.21 బీహెచ్పీ, 13,000 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 26,27,000 బీఎండబ్ల్యూ ఆర్ 1250 అడ్వెంచర్ ఇంజిన్ కెపాసిటి : 1,254 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 268 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 30 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 134.1 బీహెచ్పీ, 7,700 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 25,00,000 ట్రయంప్ రాకెట్ 3 ఇంజిన్ కెపాసిటి : 2,458 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 304 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 18 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 165 బీహెచ్పీ మన దేశంలో ధర (సుమారు) : రూ. 22,27,000 ఇండియన్ చీఫ్ బాబెర్ డార్క్‌హార్స్ ఇంజిన్ కెపాసిటి : 1890 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 352 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 15.1 లీటర్లు మన దేశంలో ధర (సుమారు) : రూ. 21,40,000 సుజుకి హయబుస ఇంజిన్ కెపాసిటి : 1,340 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 266 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 20 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 187.3 బీహెచ్పీ మన దేశంలో ధర (సుమారు) : రూ. 18,47,000 -
సిటీలో స్పోర్ట్స్ బైకుల క్రేజు.. అయితే, ఇక్కడో విషయం గమనించాలి..
‘సిటీ రహదారులు స్పోర్ట్స్ బైక్స్ వినియోగానికి అనుకూలంగా లేవు. రోడ్ల విస్తీర్ణం, వాహనాల రాకపోకలు రేసింగ్‌కు ఏ మాత్రం తగవు. కొన్ని ప్రత్యేక నిబంధనలతో కూడిన ప్రాంతాల్లోనే స్పోర్ట్స్ బైక్‌లు, కార్లు వినియోగించాలి. అందుకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన సౌకర్యాలూ ఉండాలి...’ అని చెబుతున్నారు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండురంగా నాయక్. తాజాగా హీరో సాయిధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైకు ప్రమాదానికి గురై..ఆయన గాయపడిన నేపథ్యంలో నగర రహదారులపై స్పోర్ట్స్ బైకుల వినియోగం, రాత్రి వేళల్లో బైకు రేసింగ్‌ల అంశాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. సాక్షి, హైదరాబాద్: నగర రహదారులపై స్పోర్ట్స్ బైకులు గంటకు 120 నుంచి 150 కి.మీ వేగంతో పరుగులు తీస్తున్నాయి. ఇవి ఇప్పుడు యువతలో క్రేజ్‌గా మారాయి. ఏటా వేల కొద్ది హై ఎండ్ కార్లు, బైకులు రోడ్డెక్కుతున్నాయి. వీటి ఖరీదు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటోంది. వీటి సంఖ్య ప్రస్తుతం 10,500 వరకు ఉన్నట్లు ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవలి కాలంలోనే 3 వేలకు పైగా హై ఎండ్ కార్లు ఆర్టీఏలో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. పెరుగుతున్న హై ఎండ్ మోజు.. నగరంలో ఏటేటా హై ఎండ్ వాహనాలు గణనీయంగా పెరుగుతున్నాయి. 500 నుంచి 2000 సీసీల సామర్థ్యం కలిగిన స్పోర్ట్స్ వాహనాలు నగరంలో భారీ సంఖ్యలో వాడుతున్నారు. సినీ తారలు, సంపన్నుల పిల్లలు ఈ బైక్స్‌పై దూసుకెళ్తూ బెంబేలెత్తిస్తున్నారు. ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. కొంత కాలంగా కోవిడ్ దృష్ట్యా బైక్ రేసింగ్‌లు సద్దుమణిగినా ఇటీవలి కాలంలో తిరిగి మొదలయ్యాయని తెలుస్తోంది. జాగ్రత్తలు లేకే.. బైక్ రేసింగ్‌లో పాల్గొనే యువత సరైన జాగ్రత్తలు పాటించడం లేదు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. దీంతోనే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలోనూ బైకు రేసింగ్ ప్రమాదాల్లో పలువురు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అదుపు తప్పి... సినీ హీరో సాయిధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ నడుపుతూ ఐకియా వద్ద ప్రమాదానికి గురైన ఉదంతంలో వేగాన్ని అదుపు చేయలేకపోవడం వల్లనే ఘటన జరిగినట్లు ఆర్టీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. తను వాహనం నడుపుతున్న మార్గంలో ఆటో, మరో కారు కూడా వెళుతున్నట్లు గమనించారు. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఆయన బైకు అదుపుతప్పి కింద పడిపోయింది. ఆ ప్రాంతంలో ఇసుక, మట్టి ఉండడం వల్ల కూడా బైకు అదుపు తప్పినట్లు తెలుస్తోంది. రూ.కోట్లు కుమ్మరించినా... ► గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో బల్దియా కొత్త రోడ్ల నిర్మాణం.. నిర్వహణల కోసం దాదాపు రూ.1100 కోట్లు ఖర్చు చేసింది. అయినా చినుకుపడితే గుంతలతో ప్రమాదాలు తప్పడం లేవు. రోడ్లపై గుంతలున్నా, కంకర ఉ న్నా, ఇసుక ఉన్నా పట్టించుకుంటున్నవారు లేరు. ►జీహెచ్ఎంసీ ఇంజనీర్ల కంటే ప్రైవేటు ఏజెన్సీలైతే ఎప్పటికప్పుడు నిర్వహణ బాగుంటుందని భావించి ప్రధాన రహదారుల్లోని 709 కి.మీ.ల మేర నిర్వహణకు ప్రైవేటుకిచ్చారు. అయినా ఫలితం కన్పించడం లేదు. ప్రధాన రోడ్లయినా, గల్లీ రోడ్లయినా, నిర్వహణ ఎవరిదైనా రోడ్డెక్కితే చాలు ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లే ని పరిస్థితులు నెలకొన్నాయి. వేగంగా వెళ్లే వాహనాలతోపాటు నెమ్మదిగా వెళ్లేవారు సైతం గుంతల్లో పడి ఆస్పత్రుల పాలయ్యే పరిస్థితి ఉంది. ► కొత్త రోడ్లు, రోడ్ల నిర్వహణ పేరిట గడచిన ఐదేళ్లలో రూ.2520 కోట్లు ఖర్చు చేశారు. అయినా అదే దుస్థితి. ఏళ్లు గడుస్తున్నా, కోట్లు ఖర్చవుతునా భాగ్యనగర రహదారుల దుస్థితి మారడం లేదు. ► గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో వెరసి 70 లక్షలకు పైగా వాహనాలుండగా, వీటిల్లో 70 శాతానికి పైగా ద్విచక్రవాహనాలే. వాహనాలు పెరుగుతున్నాయి. కానీ రోడ్లు బాగుపడటం లేవు. ► రోడ్లు అద్దాల్లా ఉంచుతామని స్వీపింగ్ మెషిన్లను వినియోగిస్తూ ఏటా దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. -
డుకాటి పనిగలే V 4, ధర ఎంతో తెలుసా?
వెబ్‌డెస్క్ : బైక్ లవర్స్‌కి శుభవార్త ! డుకాటి ఫ్లాగ్షిప్ మోడల్ డుకాటి ఇండియాలో అడుగు పెట్టింది. సపర్ స్టైలిష్ లుక్‌తో సాటి లేని ఇంజన్ సామర్థ్యంతో భారత్ రోడ్లపై పరుగులు పెట్టేందుకు డుకాటి పనిగలే వీ4, వీ4 ఎస్ మోడళ్లు రెడీ అయ్యాయి. ధర డుకాటి పనిగలే వీ4 ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ ధర రూ.23.50 లక్షలు ఉండగా. దీని తర్వాతి వెర్షన్, మోర్ ప్రీమియం మోడల్ అయిన డుకాటి పనిగలే వీ4 ఎస్ ధర రూ. 28.40 లక్షలుగా ఉంది. లేటెస్ట్ ఫీచర్స్ డుకాటిలో ప్రీమియం మోడలైన పనగలే వీ మోడళ్లకు 2020 చివరిసారి డిజైన్, ఇంజన్లో మార్పులు చేర్పులు చేశారు. దాని ప్రకారం న్యూ ఎయిరోడైనమిక్ ప్యాకేజీ, స్మాల్ ఇంజన్ ట్వీక్స్, హార్డ్‌వేర్ డిజైన్‌లో చేంజేస్ వచ్చాయి. భద్రత ఈ బైక్‌పై రివ్వుమని దూసుకుపోయే రైడర్ భద్రత దృష్ట్యా కార్నరింగ్ ఏబీఎస్, వీలీ కంట్రోల్, ఇంజన్ బ్రేక్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కార్నర్స్‌లో బ్రేక్ హ్యాండ్లింగ్ మరింత మెరుగ్గా డిజైన్ చేశారు. V4 S ప్రత్యేకతలు అల్యుమినియం వీల్స్, లిథియం అయాన్ బ్యాటరీ, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు డుకాటి పనగలే వీ 4 ఎస్‌లో ఉన్నాయి. ఈ ఫీచర్లు పనగలే వీ 4లో లేవు. పవర్ఫుల్ కాటీ పనగలే వీ 4 ఇంజన్ సామర్థ్యం 1103 సీసీ. త్వరలోనే డుకాటి సంస్థ క్రూజర్ బైక్‌ని ఇండియా మార్కెట్లోకి తేనుంది. చదవండి: మార్కెట్ లో లంబోర్గిని కొత్త లగ్జరీ కారు -
స్పోర్ట్స్ బైక్‌లంటే మహా సరదా.. పది చోరీలు
సాక్షి, చాంద్రాయణగుట్ట: స్పోర్ట్స్ బైక్‌లపై తిరిగే సరదా కోసం బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పురానీహవేళీలోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ గుమ్మి చక్రవర్తి వివరాలు వెల్లడించారు. సరూర్‌నగర్‌కు చెందిన ఉత్తమ్ కుమార్(20), సందీప్ కుమార్(20) నాగోల్‌లోని బిగ్ బాస్కెట్లో పనిచేసే సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. వీరిద్దరికీ స్పోర్ట్స్ బైక్‌లు నడపాలంటే మహా సరదా. వీరి సంపాదనతో ఇష్టమైన బైక్‌లు కొనలేకపోయారు. ఈ క్రమంలో ఇళ్ల ఎదుట పార్కు చేసి ఉన్న స్పోర్ట్స్, హైఎండ్ బైక్‌లను చోరీ చేయడం ప్రారంభించారు. ఇలా మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఐదు బైక్‌లు, ఎల్.బి.నగర్ పరిధిలో రెండు, మేడిపల్లి పరిధిలో రెండు, సరూర్‌నగర్ పరిధిలో ఒక వాహ నాన్ని చోరీ చేశారు. చోరీ చేసిన వాహనంపై వెళ్తున్న వీరిని విశ్వసనీయ సమాచారంతో దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలోని ఎస్సైల బృందం వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మహ్మద్ తఖియుద్దీన్, కె.చంద్రమోహన్ మీర్‌పేట పోలీసులతో కలిసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా దొంగతనాల చిట్టా బయటపడింది. వీరి వద్ద నుంచి రూ.15 లక్షల విలువజేసే ఐదు పల్సర్ 220సీసీ, రెండు రాయల్ ఎన్ఫీల్డ్, ఒక కేటీఎం డ్యూక్, ఒక హోండా యాక్టివా, ఒక హోండా షైన్ ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం మీర్‌పేట పోలీసులకు అప్పగించారు. చదవండి: రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ -
ఏడో తరగతి నుంచే చోరీల బాట
లంగర్‌హౌస్: నేపాల్‌కు చెందిన రాంసింగ్ బతుకుదెరువు నిమిత్తం కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చాడు. అయితే అతని కుమారుడు టమాల పవన్ సింగ్(20)కు స్పోర్ట్స్ బైక్‌లపై మోజు వాటిపై తిరిగేందుకు తన ఆర్థికస్థోమత సరిపోకపోవడంతో ఏడో తరగతిలోనే చోరీలకు శ్రీకారం చుట్టాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు 17 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా తన వైఖరి మార్చుకోకుండా రైళ్లలో నిద్రిస్తున్న ప్రయాణికుల నుంచి ఆభరణాలు దోచుకెళుతున్నాడు. సోదరుడితో కలిసి రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న అతడిని లంగర్‌హౌస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి 2 కెటిఎం బైక్‌లు, 3.5 తులాల బంగారు ఆభరణాలు, 750 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. లంగర్‌హౌస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీఐ యాదయ్య గౌడ్లతో కలిసి ఆసిఫ్‌నగర్ ఏసీపీ నరసింహారెడ్డి శుక్రవారం వివరాలు వెల్లడించారు. నేపాల్‌కు చెందిన రాంసింగ్ కుటుంబం వెస్ట్ మారేడ్ పల్లిలో నివాసం ఉంటోంది. అతని కుమారుడు టమాల పవన్ సింగ్(20) పదోతరగతి వరకు చదువుకున్నాడు. స్పోర్ట్స్‌బైక్‌లపై మోజుతో 7 వ తరగతిలోనే చోరీలు మొదలు పెట్టాడు. తొలుత ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే అతను అనంతరం రైలు ప్రయాణికులను టార్గెట్ చేసుకుని ఆభరణాలు చోరీ చేసేవాడు. 2017లో 8 రైళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. కాగా గత నెల 13న కాకతీయనగర్‌కు సతీష్ బైక్ చోరికి గురైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆగస్టు 1న లంగర్‌హౌస్ అలంకార్ థియేటర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న పవన్‌సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా చోరీల విషయం వెలుగులోకి వచ్చింది. రైళ్లలో చోరీలు చేసి 17 సార్లు జైలుకు వెళ్లి వచ్చానని నిందితుడు విచారణలో వెల్లడించారు. కాకతీయనగర్‌లో కెటీఎం బైక్‌తో పాటు వరుసకు సోదరుడైన సంజయ్‌తో కలిసి మేడ్చల్‌లో మరో కేటీఎం బైక్‌ను దొంగిలించినట్లు తెలిపాడు. అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడినట్లు వెల్లడించాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి 3.5 తులాల బంగారు నగలు, 750 గ్రాముల వెండి,, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. 11 కేజీల గంజాయి స్వాధీనం గంజాయి సరఫరా చేస్తున్న పాత నేరస్తుడి అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి 11 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దూల్‌పేట్‌కు చెందిన చందన్ నవీన్ గంజాయి కేసులో జైలుకు వెళ్లివచ్చాడు. శుక్రవారం ఉదయం మొఘల్‌నగర్ రింగ్‌రోడ్డు వద్ద బైక్‌పై వెళుతున్న అతడిని అడ్డుకున్న లంగర్‌హౌస్ పోలీసులు తనిఖీలు చేయగా 11 కిలోల గంజాయి లభ్యమైంది. గత నెల 24న ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి నగరంలో సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడించాడు. గంజాయి స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
బైక్ రేసింగ్‌లపై పోలీసుల స్పెషల్ డ్రైవ్
బైక్ రేసింగ్‌లపై జూబ్లీహిల్స్ పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు ఏకకాలంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి నేతృత్వంలో రెండు ప్లటూన్ల పోలీసు బలగాలు, 20 మంది పోలీసులు పది పికెట్లు ఏర్పాటు చేసి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుతో పాటు కేబీఆర్ పార్కు వరకు బైక్ రేసింగ్‌లపై దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ పోలీసులు అదుపు తప్పిన వేగంతో దూసుకుపోతున్న 35 స్పోర్ట్స్బైక్లను స్వాధీనం చేసుకున్నారు. 50 మంది యువకులపై కేసులు నమోదు చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన యువకులందరికీ ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరంతా పబ్‌లలో, కాఫీ షాప్‌లలో మద్యం సేవించి బయటకు వచ్చి నిర్మానుష్యమైన రోడ్లమీద పందెం కాస్తూ బైక్‌లపై దూసుకుపోతున్నట్లు పోలీసులు తెలిపారు. -
యమహా కొత్త ‘వెజైడ్ఎఫ్-ఆర్3’ స్పోర్ట్స్ బైక్
న్యూఢిల్లీ: పలు రకాల స్పోర్ట్స్ బైక్స్ తయారీ వల్ల తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యమహా మోటార్ ఇండియా గ్రూప్ తాజాగా ‘వెజైడ్ఎఫ్-ఆర్3’ అనే మరో కొత్త స్పోర్ట్స్ బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.3.25 లక్షలు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). ఈ బైక్‌లో 321 సీసీ ఇంజిన్, క్లాసిక్ డిజైన్, గుడ్ లుక్, లైట్ వెయిట్ బాడీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. వెజైడ్ఎఫ్-ఆర్-3 బైక్ ఎంపిక చేసిన యమహా డీలర్షిప్స్ వద్ద బ్లూ, బ్లాక్ రంగుల్లో లభించనుంది. సూపర్ స్పోర్ట్స్ విభాగానికి (250 సీసీ-600 సీసీ) చెందిన బైక్స్ విక్రయాలు నెలకు 1,000గా ఉన్నాయని, ఈ విభాగంలో 20 శాతం వాటాను లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కంపెనీ పేర్కొంది. -
‘ఆరెంజ్ డే’
ఒకరిది చిక్కడపల్లి.. ఇంకొకరిది కూకట్పల్లి.. మరొకరిది నాంపల్లి.. వీరంతా హైదరాబాదీలే అయినా ఒకరి అడ్రస్ ఇంకొకరికి తెలియదు. చేసే ఉద్యోగాలు వేరు.. మనస్తత్వాలూ వేరు.. అయినా వీరందరూ ఏడాదికోసారి కలుస్తారు. సరదాగా కాసేపు మస్తీ మజా చేస్తారు. ఏ రిలేషన్ లేని వీరందరినీ కలిపింది వారి బైకులే. అవును మనసుపడి కొనుక్కున్న కేటీఎం స్పోర్ట్స్ బైకులే వీరి మధ్య అనుబంధాన్ని పెంచాయి. నిత్యం సిటీరోడ్లపై చక్కర్లు కొడుతున్న ఈ బైకువీరులు ఆరెంజ్ డేను ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నారు. మూడేళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయానికి కూకట్పల్లి మెట్రో క్యాష్ అండ్ క్యారీ పార్కింగ్ ప్లేస్ వేదికైంది. స్పోర్ట్స్ బైక్ అనగానే యువతకు పట్టపగ్గాలు ఉండవు. యూత్‌లో ఉన్న ఈ క్రేజ్ చూసే బడా కంపెనీలు రోజుకో కొత్త మోడల్ బైకులను రోడ్డుమీదికి తెస్తున్నాయి. అత్యధిక సీసీ సామర్థ్యంతో వస్తున్న స్పోర్ట్స్ బైక్‌లు యువతకు ఆనందాన్ని పంచడంతో పాటు.. కాస్త అటుఇటు అయితే ప్రమాదాల్లోనూ పడేస్తున్నాయి. బైక్ నడిపే తీరు సరిగా తెలియక కొందరు, మితిమీరిన వేగంతో ఇంకొందరు ప్రమాదాల స్పీడ్ బ్రేకర్స్ దాటలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయా బైక్‌ల కంపెనీలు ‘కస్టమర్ల సంక్షేమమే.. సంస్థకు మహాభాగ్యం’ అంటూ రైడింగ్‌పై అవగాహన కల్పిస్తున్నాయి. కేటీఎం కంపెనీ శనివారం నిర్వహించిన ‘ఆరెంజ్ డే’ ఈవెంట్ అటువంటిదే. రైడింగ్ గైడ్‌లైన్స్.. నగరవ్యాప్తంగా ఆర్సీ 200, 200 డ్యూక్ బైక్ కలిగిన వందలాది మంది వాహన చోదకులు ఒకేచోట చేరి బైక్ రైసింగ్ విన్యాసాలు చేయడం చూపరులను ఆకట్టుకుంది. కొత్తగా బైక్ కొన్న వారికి ట్రాక్‌పై బైక్ ఎలా నడపాలి, ఏ లిమిట్లో ముందుకెళ్లాలి, మైలేజ్ వచ్చేందుకు ఎంత స్పీడ్‌లో వెళ్లాలి, రేసింగ్ పోటీల్లో బైక్‌ను నడిపించాల్సిన తీరు.. తదితర చిట్కాలను ఎక్స్పర్ట్స్ ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. గాలిలో దూసుకె ళ్తూ వెంటనే బ్రేక్ వేసి బైక్‌ను ఆపిన తీరు వహ్వా అనిపించింది. అనుబంధాల వేదిక.. ‘కేటీఎం ఆర్సీ 200 బైక్ ఎంతో ఇష్టపడి తీసుకున్నాను. తొలినాళ్లలో బైక్ నడపడం కాస్త కష్టమయ్యేది. ఇక్కడ ఎక్స్పర్ట్స్ సలహాలు విన్నాక రైడింగ్ ఈజీ అయ్యింది’ అంటూ బైకర్ రమేశ్ తన అనుభవాలు పంచుకున్నారు. మరో రైడర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ఆరెంజ్ డే వల్ల మంచి స్నేహితులు దొరికారు. రైడింగ్ టిప్స్ పంచుకోవడమే కాదు.. మా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకునే స్థాయికి మా స్నేహం పెరిగింది’ అని సంతోషంగా తెలిపారు. ‘మా కస్టమర్ల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ఆరెంజ్ డే ఈవెంట్ ప్లాన్ చేశాం. ఇక్కడికి వచ్చిన రైడర్లంతా కుటుంబసభ్యుల్లా కలిసిపోవడం ఆనందాన్నిస్తోంద’ని కేటీఎం ప్రతినిధి కార్తీక్ అన్నారు. మూడేళ్ల బంధం లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా, మిడిల్ ఈస్ట్, యూరప్, ఆఫ్రికాలలోనూ ఆరేంజ్ డేలు సక్సెస్ కావడంతోనూ ఆసియాలోనూ ఈ ట్రెండ్‌ను పరిచయం చేసింది కేటీఎం. ఇండియాలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లోనూ ‘ఆరెంజ్ డే’ నిర్వహిస్తోంది. ఇందులో బైక్ రేసింగ్‌లో కిటుకుల్ని ఎక్స్పర్ట్స్ చేత నేర్పుతోంది. 2013లో హైదరాబాద్‌లో తొలిసారి ఆరెంజ్ డే పరిచయమైంది. ఏటా ఫిబ్రవరి చివరివారంలో కానీ, మార్చి తొలివారంలో కానీ దీన్ని నిర్వహిస్తోంది. తాజాగా కూకట్‌పల్లిలో జరిగిన ఈ ఈవెంట్లో బైకర్లతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా పాల్గొని ఎంజాయ్ చేశారు.