యమహా కొత్త ‘వెజైడ్‌ఎఫ్-ఆర్3’ స్పోర్ట్స్ బైక్
న్యూఢిల్లీ: పలు రకాల స్పోర్ట్స్ బైక్స్ తయారీ వల్ల తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యమహా మోటార్ ఇండియా గ్రూప్ తాజాగా ‘వెజైడ్‌ఎఫ్-ఆర్3’ అనే మరో కొత్త స్పోర్ట్స్ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.3.25 లక్షలు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). ఈ బైక్‌లో 321 సీసీ ఇంజిన్, క్లాసిక్ డిజైన్, గుడ్ లుక్, లైట్ వెయిట్ బాడీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. వెజైడ్‌ఎఫ్-ఆర్-3 బైక్ ఎంపిక చేసిన యమహా డీలర్‌షిప్స్ వద్ద బ్లూ, బ్లాక్ రంగుల్లో లభించనుంది. సూపర్ స్పోర్ట్స్ విభాగానికి (250 సీసీ-600 సీసీ) చెందిన బైక్స్ విక్రయాలు నెలకు 1,000గా ఉన్నాయని, ఈ విభాగంలో 20 శాతం వాటాను లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కంపెనీ పేర్కొంది.