Yamaha Motor India
-
భారత్‌లో యమహా డార్క్ నైట్ ఎడిషన్ లాంచ్ - వివరాలు
Yamaha YZF-R15 V4 Dark Knight Edition: భారతదేశంలో యమహా బైకులకున్న ప్రజాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మార్కెట్లో తనదైన రీతిలో దూసుకెళ్తున్న ఈ కంపెనీ తాజాగా మరో బైకుని లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ పేరు 'వైజెడ్ఎఫ్-ఆర్15 వి4' (YZF-R15 V4) డార్క్ నైట్ ఎడిషన్. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & కలర్ ఆప్షన్స్ కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి4 డార్క్ నైట్ ఎడిషన్ నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కలర్ ఆప్షన్ని బతి ధరలు కూడా మారుతూ ఉంటాయి. వైజెడ్ఎఫ్-ఆర్15 రెడ్ కలర్ ధర రూ. 1.18 లక్షలు, డార్క్ నైట్ ధర రూ. 1.82 లక్షలు, బ్లూ అండ్ ఇంటెన్సిటీ వైట్ ధరలు రూ. 1.86 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి4 డార్క్ నైట్ ఎడిషన్ చూడటానికి దాదాపు బ్లాక్ కలర్ పొందుతుంది. అయితే ఇందులో లోగోలు, అల్లాయ్ వీల్స్ వంటివి గోల్డ్ హైలైట్లను పొందుతాయి. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా దాదాపు దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటాయి. (ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన ఆల్ట్రోజ్ సిఎన్జి.. ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్!) ఇంజిన్ ఇంజిన్ కూడా స్టాండర్డ్ ఎడిషన్ బైక్‌తో సమానంగా ఉంటుంది. కావున అదే లిక్విడ్ కూల్డ్ 155 సీసీ సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ కలిగి 18.4 hp పవర్, 14.2 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది. ప్రత్యర్థులు దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి4 డార్క్ నైట్ ఎడిషన్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250, కెటిఎమ్ RC 200 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
కళ్లు చెదిరే బైక్‌లు లాంచ్ చేసిన యమహా.. సూపర్ ఫీచర్స్!
యువత అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు లేటెస్ట్, అధిక సీసీ బైక్‌లను తయారు చేస్తున్న యమహా మోటార్ ఇండియా కంపెనీ 150 సీసీ రేంజ్లో మరికొన్ని వర్షన్లను లాంచ్ చేసింది. యమహా ఆర్15 వీ4, ఎంటీ 15, ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్‌లను విడుదల చేసింది. వీటి ప్రత్యేకతలు.. ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. మిగతా యమహా 150 సీసీ బైక్‌లకు ఉన్న ఇంజిన్ ప్రత్యేకతలన్నీ వీటికీ కొనసాగింపు. బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా కొత్తగా ఆన్‌బోర్డ్ డయాగ్నస్టిక్ డివైజ్(ఓబీడీ). అన్నింటికీ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్. ఎఫ్‌జెడ్-ఎక్స్‌లో 149 సీసీ ఎఫ్ఐ ఇంజిన్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, ఎస్సెమ్మెస్, ఈ-మెయిల్ అలర్ట్స్ వచ్చే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఎంటీ 15లో అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, డిజిటల్ ఎల్సీడీ మీటర్. ఆర్15 వీ4లో ఏబీఎస్ డ్యుయల్ చానల్. యమహా ఎంటీ 15 వీ5లో నాలుగు రంగులు. ధర రూ.1,68,400. ఎఫ్జెడ్ఎస్ ఎఫ్ఐ వీ4 డీలక్స్ మూడు రంగులు. ధర రూ.1,27,400. ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వీ3 డీలక్స్ రెండు రంగులు. ధర రూ.1,15,200. ఎఫ్‌జెడ్-ఎక్స్ మూడు రంగులు. డాక్ట్ మ్యాటీ బ్లూ ధర రూ.1,36,900, మిగతా రెండింటి ధర రూ.1,35,900. ఆర్15 వీ4 ఒకే రంగు. ధర రూ.1,93,900. (ధరలన్నీ ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రైజెస్) -
యమహా గుడ్‌న్యూస్ చెప్పిందిగా!
సాక్షి, ముంబై: పెరుగుతున్న ఇంధన ధరలు, కర్బన ఉద్గారాల కాలుష్యం, ఇథనాల్లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో తన వినియోగ దారులకు మంచి వార్త చెప్పింది.ఎలక్ట్రిక్ వాహనాలు ధరలను చూసి బెంబేలెత్తిపోతున్న రైడర్లకు ఊరట కలిగేలా పెట్రోలు, ఇథనాల్ లేదా రెండిటితో కలిసి పనిచేసి అద్భుతమైన ఇంజీన్‌తో కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. 2023 యమహా ఎఫ్‌జెడ్-15ను బ్రెజిల్లో లాంచ్ చే సింది. కంపెనీ ఈ బైక్‌ను దక్షిణ అమెరికా దేశంలో Fazer FZ-15 పేరుతో విక్రయిస్తోంది. అయితే ఇదే ఇంజీన్‌తో అప్డేట్ చేసి ఇండియాలో ఇథనాల్ ఆధారిత Yamaha FZ V3 బైక్‌ను త్వరలోనే తీసుకురావచ్చని భావిస్తున్నారు. యమహా ఎఫ్‌జెడ్-15ను బ్లూఫ్లెక్స్ సిస్టమ్‌తో కూడిన 150సీసీ ఇంజిన్‌తో వచ్చింది. ఇది పెట్రోల్, ఇథనాల్ లేదా రెండింటిలో ఏది ఎక్కువ పొదుపుగా ఉంటుందో దాన్ని ఎంచుకునేలా సపోర్ట్ చేస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త యమహా బైక్‌లు ప్రొజెక్టర్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ముందు భాగంలో ABS బ్రేక్‌లు, రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, మోనోక్రాస్ సస్పెన్షన్, వైడ్ టైర్లు, క్లాక్, గేర్ ఇండికేటర్, టాకోమీటర్,ఈకో ఫంక్షన్‌గా విడదుల చేసింది.రేసింగ్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ మరియు మాగ్మా రెడ్ అనే మూడు రంగుల ఎంపికలో లభ్యం. ధర సుమారు రూ. 2.69 లక్షలుగా ఉంటుంది. -
హల్చల్ చేస్తోన్న యమహా సరికొత్త బైక్..! ధర ఎంతంటే..?
ప్రముఖ టూవీలర్ దిగ్గజం యహహా మోటార్స్ భారత మార్కెట్లలోకి న్యూ జనరేషన్ యమహా ఎంటీ15 వీ2.0 బైక్‌ను లాంచ్ చేసింది. ఈ బైక్‌ను యమహా ఆర్15 వీ4 బైక్ ఆధారంగా రూపొందించారు. డిజైన్, ఫీచర్స్‌లో కొత్తగా..! 2022 యమహా MT15 వీ2.0 డిజైన్స్‌లో సరికొత్త లుక్స్‌తో రానుంది. 2022 MT-15 సియాన్ స్టార్మ్ , రేసింగ్ బ్లూ , ఐస్ ఫ్లూ-వెర్మిలియన్, మెటాలిక్ బ్లాక్ అనే నాలుగు కలర్ అప్షన్స్‌తో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. సింగిల్-పాడ్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌తో సహా, కనుబొమ్మల ఆకారంలో ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో రానుంది. మస్కులర్ బాడీవర్క్, రైజ్డ్ టెయిల్ సెక్షన్, సైడ్-స్లంగ్ అప్స్వెప్ట్ ఎగ్జాస్ట్ మఫ్లర్స్తో 2022 యమహా MT15 వీ2.0 స్టైలింగ్స్లో హైలైట్‌గా నిలుస్తోంది. ఈ బైక్‌లో పలు స్పెక్ హార్డ్‌వేర్ అప్డేట్స్, కొత్త ఫ్రంట్ ఫోర్క్‌తో రానుంది. బ్రేకింగ్ సిస్టమ్‌లో సింగిల్-ఛానల్ ఏబీఎస్ బదులుగా డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో రానుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా యమహా Y-కనెక్ట్ యాప్‌ను మద్దతు ఇస్తుంది. ఈ బైక్‌లో కొత్తగా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, సైడ్-స్టాండ్ ఇంజిన్ ఇన్హిబిటర్, రెగ్యులర్ క్విక్-షిఫ్టర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇంజిన్ విషయానికి వస్తే..! 2022 యమహా MT15 వీ2.0 బైక్ వీవీఏ టెక్నాలజీతో కూడిన 155cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను పొందింది. ఈ బైక్ 10,000rpm వద్ద 18.4 PS శక్తిని, 7,500rpm వద్ద 14.1 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేయనుంది. స్లిప్పర్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ బైక్ డ్యూక్ 125కు పోటీగా నిలుస్తోందని కంపెనీ ప్రకటించింది. MT15 కొత్త-తరం వెర్షన్‌ను రూ. 1.6 లక్షల ప్రారంభ ధరకు (ఎక్స్-షోరూమ్) లభించనుంది. చదవండి: మారుతి జోరులో టాటా పంచ్‌లు !? -
భారత్‌లో యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్ అప్పుడే.. రేంజ్ ఎంతో తెలుసా?
ప్రముఖ జపనీస్ ఆటో మొబైల్ తయారీ సంస్థ యమహా కొద్ది రోజుల క్రితం యూరోపియన్ మార్కెట్లో ఆవిష్కరించిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మన దేశంలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏప్రిల్ నెలలో ఈ రెండిటిలో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేయలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. రష్లేన్ నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 11న యమహా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. యమహా ఇప్పటికే భారత మార్కెట్లో ఈ01 పేరును జాబితా చేసింది. ఇటీవల యూరోపియన్ మార్కెట్లో లాంఛ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ నియోను కూడా ఇక్కడ లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఆసియాన్ దేశాలలో దశలవారీగా ఈ స్కూటర్‌ను ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే, భారతదేశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఈ01లో మాక్సీ-స్కూటర్ స్టైలింగ్, విండ్ స్క్రీన్ ఫ్రంట్ ఏప్రాన్, ఫ్లోటింగ్ రియర్ సెక్షన్, వైడ్ హ్యాండిల్ బార్లు ఉంటాయి. అయితే, ప్రొడక్షన్ రెడీ మోడల్'లో రీడిజైన్ చేసిన స్టెప్ అప్ సీటు ఉంది. జపనీస్ బ్రాండ్ ఈ01కి చెందిన ఫుల్ స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. అయితే దీనిని సింగిల్ ఛార్జ్ చేస్తే సుమారు 120 కిలోమీటర్ల రేంజ్ అందించే 4 కెడబ్ల్యుహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో రానున్నట్లు సమాచారం. ఈ స్కూటర్ 125సీసీ స్కూటర్ కి సమానంగా దూసుకెళ్లనున్నట్లు సంస్థ తెలిపింది. ఇక టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ గల ఎల్సిడి డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ ఏథర్ 450, ఓలా ఎస్1 ప్రొ వంటి వాటితో పోటీ పడే సామర్ధ్యం కలిగి ఉంది. (చదవండి: వాహన వినియోగదారులకు కేంద్రం భారీ షాక్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్!) -
స్కూటర్ల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన యమహా మోటార్స్..!
ప్రముఖ టూవీలర్ దిగ్గజం యమహా మోటార్ ఇండియా పలు స్కూటర్స్‌పై క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. కాగా ఈ ఆఫర్స్ ఎంపిక చేయబడిన ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండనున్నాయి. ఈ మోడల్స్‌పై..! యమహా మోటార్స్ శ్రేణిలోని హైబ్రిడ్ మోడల్స్‌పై క్యాష్‌బ్యాక్ రానుంది. యమహా ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్, యమహా రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్స్‌పై ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కొనుగోలుదారులకు క్యాష్‌బ్యాక్ రానుంది. ఆయా రాష్ట్రాల వారు ఫిబ్రవరి నెల మొత్తం ఈ ఆఫర్‌ను పొందవచ్చును. యమహా అందిస్తోన్న ఆఫర్స్‌లో భాగంగా... Yamaha Fascino 125 Fi హైబ్రిడ్ స్కూటర్‌పై అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాలు , పశ్చిమ బెంగాల్లో రూ. 2,500 వరకు క్యాష్ బ్యాక్ రానుంది. మహారాష్ట్రలో...Fascino 125 FI హైబ్రిడ్, RayZR 125 FI హైబ్రిడ్ స్కూటర్లపై రూ. 2,500 వరకు క్యాష్ బ్యాక్‌ను అందిస్తోంది. ఈ రెండు స్కూటర్లపై తమిళనాడులో రూ. 5,000 వరకు క్యాష్ బ్యాక్ రానుంది. ఇక విభిన్న రాష్ట్రాల్లో క్యాష్‌బ్యాక్‌ను యమహా అందిస్తోంది. ఈ హైబ్రిడ్ స్కూటర్స్ 125సీసీ ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజిన్‌తో పనిచేయనున్నాయి. ఇది 6,500 rpm వద్ద 8 bhp సామర్థ్యాన్ని, 5,000 rpm వద్ద 10.3 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ స్కూటర్లలో హైబ్రిడ్ పవర్ అసిస్ట్ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG) సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. SMG ఆన్‌బోర్డ్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఇది మెరుగైన పుల్లింగ్ పవర్ కోసం అదనపు టార్క్‌ను అందిస్తోంది. Fascino 125 FI హైబ్రిడ్, అలాగే RayZR FI 125 హైబ్రిడ్ స్కూటర్స్ రెండూ కూడా సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, ఆటోమేటిక్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌తో వస్తాయి.Yamaha Fascino 125 FI, Yamaha Ray ZR 125 FI స్కూటర్స్ రెండూ కూడా ప్రామాణికంగా సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్‌ను కలిగి ఉన్నాయి. చదవండి: మహీంద్రా అండ్ మహీంద్రా కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు!! -
వాహనాల ‘రెంటల్’ బిజినెస్‌లోకి యమహా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ రంగంలో ఉన్న యమహా మోటార్ కో ఆటోమొబైల్ అసెట్ మేనేజ్మెంట్, సర్వీసెస్‌లోకి ప్రవేశించింది. ఇందులో భాగంగా షేర్డ్, రెంటల్ మొబిలిటీ విభాగంలో ఉన్న కంపెనీలకు వాహనాలను సరఫరా చేస్తుంది. ఇందుకోసం కొత్త, పాత వాహనాలను కొనుగోలు చేయనుంది. సర్వీస్, విడిభాగాల కేంద్రాలు సైతం ఏర్పాటవుతాయి. ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఆసరాగా డెలివరీ సేవలు అందిస్తున్న కంపెనీలతో ప్రధానంగా చేతులు కలుపనున్నట్టు యమహా ప్రకటించింది. షేర్డ్, రెంటల్ మొబిలిటీ విభాగంలో వాడకం పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యమని వివరించింది. -
యమహా కొత్త వ్యూహం.. ది కాల్ ఆఫ్ ది బ్లూ..
దేశంలోకి ఎన్ని కంపెనీలు వచ్చినా టూ వీలర్ సెగ్మెంట్లో యమహాది ప్రత్యేక శైలి. ముఖ్యంగా యమహా నుంచి వచ్చే స్పోర్ట్స్‌బైక్స్ అంటూ యూత్‌లో ఫుల్ క్రేజ్. దశాబ్ధాలుగా ఇండియన్ మార్కెట్లో ఉన్నా మార్కెట్‌పై ఆధిపత్యం సాధించలేకపోయింది యహహా. తాజాగా దీన్ని సరి చేసేందుకు సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగుతోంది. న్యూ స్ట్రాటజీ ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో యమహాకు చెందిన ఆర్ఎక్స్, ఎఫ్ జెడ్ సిరీస్ బైకులకు ఫుల్ క్రేజ్ ఉంది. పవర్ఫుల్ బైకులుకు ప్రతీకగా యమహా బ్రాండ్ పేరొందింది. ఇప్పుడా పేరును పూర్తిగా వాడుకుని మార్కెట్లోకి చొచ్చుకుపోయేందుకు ది కాల్ ఆఫ్ ది బ్లూ స్ట్రాటజీని అమలు చేయాలని యమహా నిర్ణయించింది. యూత్ టార్గెట్ ప్రపంచంలోనే అతి పెద్ద టూ వీలర్ మార్కెట్ ఇండియాలో ఉంది. ఇందులో యూత్‌కి యమహా బైకులంటే ఫుల్ క్రేజ్ ఉంది. మరోవైపు స్పోర్ట్స్ సెగ్మెంట్లో మిగిలిన కంపెనీలు దృష్టి సారించాయి. దీంతో ఉన్న మార్కెట్‌ను కాపాడుకోవడంతో పాటు మరింత దూకుడుగా వ్యవహరించాలని యమహా నిర్ణయించింది. ఈ మేరకు చిప్సెట్ల సంక్షోభం ముగియగానే యూత్ టార్గెట్‌గా యాడ్ క్యాంపెయిన్ పెంచడంతో పాటు కొత్త మోడళ్లను తీసుకురానుంది. ఇండియాకి కొత్త చీఫ్ ఇండియన్ మార్కెట్‌పై దృష్టి పెట్టిన యమహా కొత్త స్ట్రాటజీ అమలు చేయడంతో పాటు కొత్త చీఫ్‌ను కూడా నియమించింది. ఇప్పటి వరకు యమహా ఇండియా హెడ్‌గా మోటుఫోమి షితారా ఉండగా తాజాగా ఆయన స్థానాన్ని ఐషిన్ చిహానా భర్తీ చేశారు. యమహా ఇండియా చైర్మన్‌గా నియమితుడైన చిహానా ఇంతకు ముందు యూరప్, నార్త్ అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మార్కెట్లలో పని చేశారు. 1991 నుంచి యమహాలో వివిధ హోదాల్లో పని చేశారు. తాజాగా యమహా ఇండియా చైర్మన్‌గా నియమితులయ్యారు. చదవండి: సరికొత్త లుక్‌తో యమహా ఎమ్టీ 10, ఎమ్టీ 10 ఎస్పీ బైక్స్..! -
యమహా ఆర్15 వీ3 బైక్ న్యూ వెర్షన్ లాంచ్..! ధర ఎంతంటే..!
ప్రముఖ బైక్ తయారీ సంస్థ యమహా మోటార్స్ కొత్త ఆర్15 వీ3 న్యూవెర్షన్‌ను సింగిల్ సీట్‌తో యూనిబాడీ పేరిట సరికొత్త బైక్‌ను లాంఛ్ చేసింది. ఈ బైక్ రూ 1.57 లక్షలకు (ఎక్స్‌షోరూం) అందుబాటులో ఉండనుంది. రేసింగ్ బ్లూ కలర్లో లభించే ఈ బైక్ స్టాండర్డ్ ఆర్15 వీ4 కంటే రూ.13000 తక్కువకే ఈ బైక్‌ను కొనుగోలుదారులకు యమహా అందించనుంది. ఆర్15 వీ3 వేరియంట్ 155సీసీ, 4స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. ఈ బైక్ 10000ఆర్పీఎమ్ వద్ద 18.6పీఎస్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తోంది. 8500 ఆర్పీఎమ్ వద్ద 14.1 ఎన్ఎమ్ టార్క్ అవుట్ పుట్‌ను అందిస్తోంది. యమహా ఆర్15 వీ3 బైకు 6 స్పీడ్ గేర్ బాక్స్‌ను జత చేశారు. చదవండి: జపాన్ తరహా పాడ్ రూమ్స్ ఇప్పుడు భారత్‌లో..! -
బైక్ కొనే వారికి యమహా గుడ్‌న్యూస్...!
కొత్తగా బైక్‌లను కొనే వారికి ప్రముఖ జపానీస్ ఆటోమొబైల్ దిగ్గజం యమహా గుడ్‌న్యూస్‌ను అందించింది. ఫెస్టివల్ సీజన్లో భాగంగా యమహా స్కూటీలపై సుమారు రూ. 4000 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. ఈ ఆఫర్ యమహా 125సీసీ స్కూటీ రేంజ్‌పై అందుబాటులో ఉండనుంది. ఫాసినో 125 ఎఫ్ఐ(హైబ్రిడ్+నాన్ హైబ్రిడ్), రే జెడ్ఆర్ 125ఎఫ్ఐ, రే జెడ్ ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ(హైబ్రిడ్+నాన్ హైబ్రిడ్) మోడల్ స్కూటీలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభించనుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉండనుంది. చదవండి: చైనా బొమ్మల్లో ‘విషం’.. అమెరికా అలర్ట్! యమహా స్కూటీ ధరలు ఇలా..(ఎక్స్‌షోరూమ్ ధరలు) యమహా ఫాసినో 125 ఎఫ్ఐ(హైబ్రిడ్+నాన్ హైబ్రిడ్) ధర రూ. 78,530 రే జెడ్ ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ధర రూ. 79,830 యమహా ఫాసినో 125 ఎఫ్ఐ ఫీచర్స్.. యమహా బ్లూ కోర్ ఇంజన్ టెక్నాలజీతో కొత్త BS-6-మోడల్ ఫాసినో రానుంది, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ (Fi), 125 cc ఇంజిన్‌ను అమర్చారు. 5000 ఆర్పీఎమ్వద్ద 10.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తోంది. ఈ బైక్ సుమారు 66కెఎమ్పీఎల్ మైలేజీను ఇస్తుంది. చదవండి: ‘ఈవీ’ మేకర్స్ ఆశలపై డ్రాగన్ నీళ్లు.. సప్లయ్ అంతా అటు వైపే! -
రాపిడోలో భారీగా ఇన్వెస్ట్‌చేసిన యమహా కంపెనీ..!
జపనీస్ మోటార్‌సైకిల్ తయారీదారు యమహా బెంగుళూరుకు చెందిన బైక్ టాక్సీ ప్లాట్‌ఫాం రాపిడోలో భారీగా పెట్టుబడులను పెట్టింది. సుమారు 52 మిలియన్ డాలర్లను (రూ. 385 కోట్లు) ఫండింగ్‌ను యమహా అందించింది. ఈ నిధులను వచ్చే 18 నెలల్లో 50 మిలియన్ల మంది కొత్త వినియోగదారుల కోసం ఉపయోగించాలని రాపిడో యోచిస్తోంది. యమహా అందించిన నిధుల్లో కొంతభాగం అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణల్లో పెట్టుబడి పెట్టడం కోసం, దేశవ్యాప్తంగా ఉపాధి కల్పన చేయడం కోసం రాపిడో ఉయోగించనుంది. రాపిడోలో ఫండింగ్ చేయడం కోసం నిర్వహించిన రౌండ్స్‌లో షెల్ వెంచర్స్, క్రెడ్ వ్యవస్థాపకులు కునాల్ షా, స్పాటిఫై ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమర్జిత్ సింగ్ బాత్రా, పాజిటివ్ మూవ్స్ కన్సల్టింగ్ కంపెనీలు పాల్గోన్నాయి. ఇప్పటికే రాపిడోలో ఇన్వెస్ట్‌చేసిన హీరో గ్రూప్ పవన్ ముంజల్, వెస్ట్‌బ్రిడ్జ్, నెక్సస్ వెంచర్స్ కూడా పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 100 నగరాల్లో రాపిడో అతి పెద్ద ట్యాక్సీ ప్లేయర్‌గా నిలుస్తోందని కంపెనీ రాపిడో సహ వ్యవస్థాపకుడు అరవింద్ సంకా అన్నారు. రాపిడో ఇప్పటివరకు 130 మిలియన్ డాలర్లను వెస్ట్‌బ్రిడ్జ్ ఏఐఎఫ్, నెక్సస్ వెంచర్స్, సాబెర్ ఇన్వెస్ట్మెంట్, స్కైకాచర్ ఎల్ఎల్సీ, బీఎస్ ఫండ్, ఇంటిగ్రేటెడ్ గ్రోత్ క్యాపిటల్ కంపెనీల నుంచి నిధులను సేకరించింది. రాపిడో బైక్ ట్సాక్సీ సర్వీస్‌లను 2015లో అరవింద్ సంకా, పవన్ గుంటుపల్లి, ఎస్ఆర్ రిషికేశ్ స్థాపించారు. -
టూ వీలర్ తర్వాత వచ్చే కొత్త మోడల్ బైక్స్ ఇవేనా
పెద్ద పెద్ద కంపెనీలు త్రీ–వీలర్ మోటర్సైకిల్స్పై దృష్టి సారించాయి. ‘యమహా’ కూడా ఇదే దారిలో నడుస్తుంది. త్రీ–వీలర్ స్కూటర్ డిజైన్ కోసం ఎప్పుడో పేటెంట్‌ను రిజిస్టర్ చేయించింది. నెక్ట్స్ జెనరేషన్ పర్సనల్ మొబిలిటీ కాన్సెప్ట్‌లో భాగంగా మల్టీ–వీల్ టెక్నాలజీతో రకరకాల మోడల్స్‌కు రూపకల్పన చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నది ‘యమహా ఎండబ్ల్యూ–విజన్’ మోడల్. -
స్టైలిష్ లుక్‌తో కట్టిపడేస్తున్న 'యమహా'
సాక్షి,వెబ్‌డెస్క్: యమహా ఇండియా నియో రెట్రో కమ్యూటర్ కు చెందిన 149సీసీ యమహా ఎఫ్‌జెడ్ సిరీస్ బైక్ విడుదలైంది. స్టైలిష్ లుక్‌తో ‘యమహా ఎఫ్-ఎక్స్’ ఈ బైక్ రెండు వేరియంట్లతో బైక్ లవర్స్‌ను అలరించనుంది. ధర : రెండు వేరియంట్లలోఇది లభ్యం. ప్రారంభ ధర రూ.1,16,800గా ఉండగా, స్మార్ట్‌ఫోన్ సాయంతో కనెక్ట్ చేయగలిగే ఫీచర్ బైక్ ధర రూ.1,19,800గా కంపెనీ నిర్ణయించింది. 'వై కనెక్ట్' యాప్ ద్వారా ఇన్ కమింగ్ కాల్ నోటిఫికేషన్లు, ఎస్ఎంస్ అలెర్ట్, బ్యాటరీ ఛార్జింగ్, ఇంధన వినియోగం, పనిచేయని పక్షంలో అలర్ట్స్ అలాగే పనితీరు, ఆయిల్ మార్చేలా సలహాలతో పాటు మరెన్నో ఫీచర్స్ ఈ బైక్ సొంతం. ఈ కొత్త యమహా ఎఫ్‌జెడ్ -ఎక్స్ అమ్మకాలు జూన్ నుండి ప్రారంభం కానున్నాయి. ఫీచర్ల విషయానికొస్తే ఇంజిన్ బాష్ ప్లేట్‌తో నిటారుగా రైడింగ్ పొజిషన్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఎల్ఈడి టైలైట్లు,149 సీసీ ఇంజిన్, 7,250 ఆర్పీఎం వద్ద 12.4 పవర్‌ను అందిస్తుంది 500 ఆర్‌పిఎమ్ 13.3 ఎన్ఎమ్. ఫ్రేమ్ యమహా ఎఫ్ జెడ్ డిజైన్ లాగే ఉంది. ఇక దీని బరువు 139 కిలోలుగా ఉంది. చదవండి: Tesla: భారత్‌లో రయ్..రయ్ : వైరల్ వీడియో -
భారీగా తగ్గిన యమహా ఎఫ్‌జెడ్ 25 సిరీస్ బైక్ ధరలు
న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా తన ఎఫ్జెడ్ఎస్ 25, ఎఫ్‌జెడ్ 25 బైక్‌ల ఎక్స్‌షోరూమ్ ధరలను భారీగా తగ్గించింది. ఎఫ్జెడ్ఎస్ 25, ఎఫ్‌జెడ్ 25 ధరలు వరుసగా రూ.19.300, రూ.18.800(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) సంస్థ తగ్గించింది. ప్రస్తుతం ఆ కంపెనీ ఎఫ్జెడ్ఎస్ 25, ఎఫ్‌జెడ్ 25 ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు రూ.1,39,300, రూ.1,34,800గా ఉన్నాయి. యమహా మోటార్ భారతదేశంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. గతంలో ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు ఎఫ్జెడ్ఎస్ 25 రూ.1,58,600, ఎఫ్‌జెడ్ 25 రూ.1,53,600గా ఉండేవి. "ఈ మధ్యకాలంలో ఇన్పుట్ ఖర్చులు భారీగా పెరగడంతో బైక్ ధరలను పెంచినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఎఫ్‌జెడ్ 25 సిరీస్ ధరలు పెరిగినట్లు సంస్థ తెలిపింది. చివరకు ఈ ఇన్పుట్ ఖర్చులను తగ్గించడం ద్వారా బైక్ ధరలను తగ్గించినట్లు సంస్థ పేర్కొంది. అత్యంత ప్రజాదరణ గల ఎఫ్‌జెడ్ 25 సిరీస్ ధరలను తగ్గించడం ద్వారా అంతా మొత్తం మా వినియోగదారులకు ఆ ప్రయోజనాన్ని అందించాలనుకున్నట్లు జపనీస్ ద్విచక్ర వాహన మేజర్ చెప్పారు. తగ్గించిన బైక్ ధరలు నేటి నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న అన్నీ షో రూమ్ లకు వర్తిస్తాయని పేర్కొంది. ధర తగ్గించినా బైకులోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అవే ఉంటాయని స్పష్టం చేసింది. చదవండి: అదిరిపోయిన యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ -
యమహా నుంచి 125 సీసీ స్కూటర్లు
చెన్నై: యమహా మోటార్ ఇండియా కంపెనీ 125 సీసీ స్కూటర్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఈ సెగ్మెంట్లో రెండు కొత్త మోడళ్లు– ఫ్యాసినో 125ఎఫ్ఐ, రేజర్125ఎఫ్‌ఐలను అందుబాటులోకి తెచ్చింది. ఫ్యాసినో స్కూటర్ ధరను రూ.67,430(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ గ్రూప్) రవీందర్ సింగ్ తెలిపారు. త్వరలో స్ట్రీట్ ర్యాలీ 125ఎఫ్ఐ మోడల్ స్కూటర్‌ను కూడా మార్కెట్లోకి తెస్తామని చెప్పారు. 110సీసీ స్కూటర్ మోడళ్లను దశలవారీగా మార్కెట్ నుంచి ఉపసంహరిస్తామని, భవిష్యత్తులో 125 సీసీ మోడళ్లను మాత్రమే విక్రయిస్తామని వివరించారు. ఈ ఏడాది 6.24 లక్షల టూవీలర్లను విక్రయిస్తామన్న అంచనాలున్నాయని సింగ్ చెప్పారు. వచ్చే ఏడాది 6.50 లక్షల టూవీలర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న తమ మార్కెట్ వాటాను 2025కల్లా పది శాతానికి పెంచుకోవడం లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలోనే ఎమ్15, ఆర్ 15 బైక్ మోడళ్లలో బీఎస్–సిక్స్ వేరియంట్లను కూడా కంపెనీ ఆవిష్కరించింది. ప్రస్తుత మందగమనం తాత్కాలికమేని, వాహన విక్రయాలు పుంజుకుంటాయని సింగ్ అభిప్రాయపడ్డారు. -
యమహా కొత్త బీఎస్-6 బైక్స్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో త్వరలోనే కొత్త ఉద్గార నిబందనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ద్విచక్ర వాహన తయారీదారులు కూడా ఆ వైపుగా కదులుతున్నాయి. ఇప్పటికే హీరో మోటో బీఎస్ -6 బైక్‌ను విడుదల చేయగా, తాజాగా ఇండియా యమహా మోటార్ (ఐవైఎం)కూడా ఈ కోవలోకి చేరింది. ఇండియా యమహా మోటార్ శుక్రవారం బిఎస్-వి కంప్లైంట్ వేరియంట్లైన ఎఫ్‌జెడ్-ఎఫ్ఐ, ఎఫ్జెడ్ఎస్-ఎఫ్ఐ బైక్‌లను విడుదల చేసింది. వీటి ధరలను రూ .99,200 నుంచి రూ .1.2 లక్షల (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. రానున్న కాలంలో మరిన్ని బీఎస్-6 వాహనాలను తీసుకు రానున్నామని ఐవైఎం ఒక ప్రకటనలో తెలిపింది. తాజాగా లాంచ్ చేసిన ఎఫ్‌జెడ్-ఎఫ్ఐ, ఎఫ్జెడ్ఎస్-ఎఫ్ఐ వెర్షన్ బైక్‌లు ఫ్రంట్ వీల్లో సింగిల్ ఛానల్ ఏబీఎస్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్‌లతో పాటు సింగిల్ పీస్ టూ లెవల్ సీటు తదితర వివిధ ఫీచర్లను పొందుపర్చింది. యమహా తన కొత్త మోటార్ సైకిళ్ళు 2019 నవంబర్ నుంచి దేశవ్యాప్తంగా అన్ని యమహా షోరూమ్‌లలో లభిస్తాయని యమహా మోటార్ ఇండియా చైర్మన్ మోటోఫుమి శితారా చెప్పారు. -
దూసుకొచ్చిన యమహా ‘ఎంటీ–015’
యమహా మోటార్ ఇండియా ఎంటీ సిరీస్‌లో మరో అధునాతన బైక్‌ను శుక్రవారం మార్కెట్లోకి తీసుకువచ్చింది. ‘ఎంటీ–015’ పేరుతో విడుదలైన ఈ 155 సీసీ బైక్ ధర రూ.1.36 లక్షలు. లిక్విడ్ కూల్డ్ 4 స్ట్రోక్ ఇంజిన్, సింగిల్ చానల్ యాంటి–లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), ఫ్యూయల్ ఇంజెక్టడ్ వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ (వీబీఏ) ఫీచర్లుగా కంపెనీ తెలిపింది. ఈ ఏడాదిలో 60,000 యూనిట్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. -
‘ఎఫ్ జెడ్’ సిరీస్‌లో 2 నూతన బైక్‌లు
న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ యమహా మోటార్ ఇండియా తన ఎఫ్ జెడ్ సిరీస్‌లో రెండు సరికొత్త బైక్‌లను సోమవారం మార్కెట్లో విడుదలచేసింది. ఎఫ్ జెడ్–ఎఫ్1, ఎఫ్జెడ్ఎస్–ఎఫ్1 పేర్లతో ఈ బైక్‌లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అధునాతన బ్రేకింగ్ వ్యవస్థ, యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్).. 149 సీసీ 4–స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగిన ఈ బైక్‌ల ధరల శ్రేణి రూ.95,000–రూ.97,000గా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది.ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ మెటొఫుమీ షితార మాట్లాడుతూ.. ‘ఈ 2 నూతన బైక్‌ల విడుదల ద్వారా డీలక్స్ క్లాస్‌లో సంస్థ మార్కెట్ వాటా మరింత పెరగనుందని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
యమహా కొత్త ‘వైజెడ్ఎఫ్–ఆర్3’
గ్రేటర్ నోయిడా: యమహా మోటార్ ఇండియా తాజాగా తన స్పోర్ట్స్ బైక్ ‘వైజెడ్ఎఫ్–ఆర్3’లో అప్డేటెడ్ వెర్షన్‌ని మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.3.48 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ఇందులో 321 సీసీ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ 4 స్ట్రోక్ ఇంజిన్, డ్యూయెల్ చానల్ యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 14వ ఎడిషన్ ఆటో ఎక్స్పో కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్, యమహా బ్రాండ్ అంబాసిడర్ జాన్ అబ్రహం ఈ ‘వైజెడ్ఎఫ్–ఆర్3’ బైక్‌ని ఆవిష్కరించారు. కాగా ఈ స్పోర్ట్స్ బైక్స్ ఎంపిక చేసిన యమహా డీలర్షిప్స్ వద్ద మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. -
యమహా కొత్త బైక్
సాక్షి, న్యూఢిల్లీ: యమహా మోటార్ (ఐఐఎం) కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. ఎఫ్‌జెడ్ సీరిస్‌కు కొనసాగింపుగా మెరుగైన బ్రేకింగ్ సిస్టంతో యమహా ఎఫ్‌జెడ్ 25 పేరుతో శుక్రవారం విడుదల చేసింది. ఫేజర్ 250 ఇంజీన్‌తో దీన్ని రూపొందించింది. అలాగే పాత మోడ్‌లో 5 స్పోక్ అల్లాయ్‌వీల్స్‌తో పోలిస్తే కొత్తగా ప్రారంభించిన బైక్‌లో స్పోర్టీ 10- స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను జోడించింది. ఈ కొత్త వెర్షన్ బైక్‌ను రూ. 86,042 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరకు విడుదల చేసింది. తమ లేటెస్ట్ బైక్ మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థతో మంచి పనితీరు సామర్థ్యాన్ని ఇస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 149 సి.సి. 4-స్ట్రోక్ ఇంజిన్, 220 ఎంఎం హైడ్రాలిక్ సింగిల్ రియర్ డిస్క్ బ్రేక్, 282 మిమీ ఫ్రంట్ బ్రేక్ ఫీచర్ల కారణంగా వాహనం స్టెబిలిటీ, కంట్రోల్ మెరుగుపడుతుందని పేర్కొంది. దాదాపు పది సంవత్సరాల క్రితం భారత్‌లో లక్షలాదిమందికి పైగా వినియోగదారులను ఆకర్షించామని, ఈ కొత్త వెర్షన్ ద్వారా మరింతమంది కస్టమర్లు ఈ కోవలో చేరనున్నారనే విశ్వాసాన్ని యమహా మోటార్ ఇండియా సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాయ్ కురియన్ చెప్పారు. తమ కొత్త బైక్ లుక్, అధునాతనమైన ఇంజీన్ టెక్నాలజీ, ఫ్యూయల్ మేనేజ్ పాత, కొత్త వినియోగదారులకు ఉత్తేజపరుస్తుందన్నారు. -
యమహా నుంచి కొత్త ‘సిగ్నస్ రే-జెడ్ఆర్’ స్కూటర్
ప్రారంభ ధర రూ.52,000 న్యూఢిల్లీ: ప్రముఖ టూవీలర్ల తయారీ కంపెనీ యమహా మోటార్ ఇండియా తాజాగా ‘సిగ్నస్ రే-జెడ్ఆర్’ స్కూటర్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్ వెర్షన్లలో లభ్యంకానున్న వీటి ధరలు వరుసగా రూ.52,000, రూ.54,500గా (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ‘సిగ్నస్ రే-జెడ్ఆర్’లో 113 సీసీ ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ బ్లూకోర్ ఇంజిన్, ఆటోమెటిక్ గేర్ బాక్స్, తక్కువ బరువు, ట్యూబ్‌లెస్ టైర్స్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇది లీటరుకు 66 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని పేర్కొంది. కొత్త స్కూటర్ వచ్చే నెల నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. -
యమహా కొత్త ‘వెజైడ్ఎఫ్-ఆర్3’ స్పోర్ట్స్ బైక్
న్యూఢిల్లీ: పలు రకాల స్పోర్ట్స్ బైక్స్ తయారీ వల్ల తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యమహా మోటార్ ఇండియా గ్రూప్ తాజాగా ‘వెజైడ్ఎఫ్-ఆర్3’ అనే మరో కొత్త స్పోర్ట్స్ బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.3.25 లక్షలు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). ఈ బైక్‌లో 321 సీసీ ఇంజిన్, క్లాసిక్ డిజైన్, గుడ్ లుక్, లైట్ వెయిట్ బాడీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. వెజైడ్ఎఫ్-ఆర్-3 బైక్ ఎంపిక చేసిన యమహా డీలర్షిప్స్ వద్ద బ్లూ, బ్లాక్ రంగుల్లో లభించనుంది. సూపర్ స్పోర్ట్స్ విభాగానికి (250 సీసీ-600 సీసీ) చెందిన బైక్స్ విక్రయాలు నెలకు 1,000గా ఉన్నాయని, ఈ విభాగంలో 20 శాతం వాటాను లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కంపెనీ పేర్కొంది. -
యమహా అమ్మకాలు 17 శాతం అప్
హైదరాబాద్: టూవీలర్ దిగ్గజం యమహా మోటార్ ఇండియా అమ్మకాలు జూలై నెలలో జోరుగా ఉన్నాయి. గత ఏడాది జూలైలో 50,286గా ఉన్న తమ విక్రయాలు ఈ జూలైలో 17 శాతం వృద్ధితో 58,591కు పెరిగాయని యమహా మోటార్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల తాము మార్కెట్లోకి తెచ్చిన 125 సీసీ సాల్యూటో బైక్‌కు , ఫాసినో స్కూటర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్, మార్కెటింగ్) రాయ్ కురియన్ పేర్కొన్నారు. వినియోగారుల అభిరుచులకనుగుణంగా మరిన్ని వినూత్నమైన మోడళ్లను అందిస్తామని కురియన్ పేర్కొన్నారు. అమ్మకాలు మరింత పెరుగుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.