స్కూటర్ల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన యమహా మోటార్స్‌..! | Yamaha India Announces Special Offers On Hybrid Scooter Models | Sakshi
Sakshi News home page

Yamaha India: స్కూటర్ల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన యమహా మోటార్స్‌..!

Published Tue, Feb 15 2022 8:10 AM | Last Updated on Tue, Feb 15 2022 4:03 PM

Yamaha India Announces Special Offers On Hybrid Scooter Models - Sakshi

ప్రముఖ టూవీలర్‌ దిగ్గజం యమహా మోటార్‌ ఇండియా పలు స్కూటర్స్‌పై  క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. కాగా ఈ ఆఫర్స్‌ ఎంపిక చేయబడిన ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండనున్నాయి.

ఈ మోడల్స్‌పై..!
యమహా మోటార్స్‌ శ్రేణిలోని హైబ్రిడ్‌ మోడల్స్‌పై క్యాష్‌బ్యాక్‌ రానుంది.  యమహా ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్, యమహా రేజెడ్ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ స్కూటర్స్‌పై ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కొనుగోలుదారులకు క్యాష్‌బ్యాక్‌ రానుంది. ఆయా రాష్ట్రాల వారు ఫిబ్రవరి నెల మొత్తం ఈ ఆఫర్‌ను పొందవచ్చును.



యమహా అందిస్తోన్న ఆఫర్స్‌లో భాగంగా... Yamaha Fascino 125 Fi హైబ్రిడ్  స్కూటర్‌పై అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాలు , పశ్చిమ బెంగాల్‌లో రూ. 2,500 వరకు క్యాష్ బ్యాక్ రానుంది. మహారాష్ట్రలో...Fascino 125 FI హైబ్రిడ్, RayZR 125 FI హైబ్రిడ్‌ స్కూటర్లపై రూ. 2,500 వరకు క్యాష్ బ్యాక్‌ను అందిస్తోంది. ఈ రెండు స్కూటర్లపై తమిళనాడులో రూ. 5,000 వరకు క్యాష్ బ్యాక్ రానుంది. ఇక విభిన్న రాష్ట్రాల్లో క్యాష్‌బ్యాక్‌ను యమహా అందిస్తోంది. 



ఈ హైబ్రిడ్ స్కూటర్స్‌ 125సీసీ ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజిన్‌తో పనిచేయనున్నాయి. ఇది 6,500 rpm వద్ద 8 bhp సామర్థ్యాన్ని,  5,000 rpm వద్ద 10.3 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ స్కూటర్లలో హైబ్రిడ్ పవర్ అసిస్ట్ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG) సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. SMG ఆన్‌బోర్డ్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఇది మెరుగైన పుల్లింగ్ పవర్ కోసం అదనపు టార్క్‌ను అందిస్తోంది. Fascino 125 FI హైబ్రిడ్, అలాగే RayZR FI 125 హైబ్రిడ్ స్కూటర్స్‌ రెండూ కూడా సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, ఆటోమేటిక్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌తో వస్తాయి.Yamaha Fascino 125 FI, Yamaha Ray ZR 125 FI స్కూటర్స్‌ రెండూ కూడా ప్రామాణికంగా సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్‌ను కలిగి ఉన్నాయి. 



చదవండి: మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల‌పై అదిరిపోయే డిస్కౌంట్లు!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement