దేశంలోకి ఎన్ని కంపెనీలు వచ్చినా టూ వీలర్ సెగ్మెంట్‌లో యమహాది ప్రత్యేక శైలి. ముఖ్యంగా యమహా నుంచి వచ్చే స్పోర్ట్స్‌బైక్స్ అంటూ యూత్‌లో ఫుల్ క్రేజ్. దశాబ్ధాలుగా ఇండియన్ మార్కెట్‌లో ఉన్నా మార్కెట్‌పై ఆధిపత్యం సాధించలేకపోయింది యహహా. తాజాగా దీన్ని సరి చేసేందుకు సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగుతోంది.
న్యూ స్ట్రాటజీ
ఇండియన్ టూ వీలర్ మార్కెట్‌లో యమహాకు చెందిన ఆర్ఎక్స్, ఎఫ్ జెడ్ సిరీస్ బైకులకు ఫుల్ క్రేజ్ ఉంది. పవర్‌ఫుల్ బైకులుకు ప్రతీకగా యమహా బ్రాండ్ పేరొందింది. ఇప్పుడా పేరును పూర్తిగా వాడుకుని మార్కెట్‌లోకి చొచ్చుకుపోయేందుకు ది కాల్ ఆఫ్ ది బ్లూ స్ట్రాటజీని అమలు చేయాలని యమహా నిర్ణయించింది.
యూత్ టార్గెట్
ప్రపంచంలోనే అతి పెద్ద టూ వీలర్ మార్కెట్ ఇండియాలో ఉంది. ఇందులో యూత్‌కి యమహా బైకులంటే ఫుల్ క్రేజ్ ఉంది. మరోవైపు స్పోర్ట్స్ సెగ్మెంట్‌లో మిగిలిన కంపెనీలు దృష్టి సారించాయి. దీంతో ఉన్న మార్కెట్‌ను కాపాడుకోవడంతో పాటు మరింత దూకుడుగా వ్యవహరించాలని యమహా నిర్ణయించింది. ఈ మేరకు చిప్‌సెట్ల సంక్షోభం ముగియగానే యూత్ టార్గెట్‌గా యాడ్ క్యాంపెయిన్ పెంచడంతో పాటు కొత్త మోడళ్లను తీసుకురానుంది.
ఇండియాకి కొత్త చీఫ్
ఇండియన్ మార్కెట్‌పై దృష్టి పెట్టిన యమహా కొత్త స్ట్రాటజీ అమలు చేయడంతో పాటు కొత్త చీఫ్‌ను కూడా నియమించింది. ఇప్పటి వరకు యమహా ఇండియా హెడ్‌గా మోటుఫోమి షితారా ఉండగా తాజాగా ఆయన స్థానాన్ని ఐషిన్ చిహానా భర్తీ చేశారు. యమహా ఇండియా చైర్మన్‌గా నియమితుడైన చిహానా ఇంతకు ముందు యూరప్, నార్త్ అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మార్కెట్‌లలో పని చేశారు. 1991 నుంచి యమహాలో వివిధ హోదాల్లో పని చేశారు. తాజాగా యమహా ఇండియా చైర్మన్‌గా నియమితులయ్యారు.
చదవండి: సరికొత్త లుక్‌తో యమహా ఎమ్‌టీ 10, ఎమ్‌టీ 10 ఎస్పీ బైక్స్..!
Comments
Please login to add a commentAdd a comment