strategy
-
భారత్ వృద్ధికి 3i స్ట్రాటజీ!.. వరల్డ్ బ్యాంక్ సూచన
భారత్, చైనా వంటి సుమారు 106 దేశాలు మధ్య ఆదాయ ఉచ్చు (మిడిల్ ఇన్కమ్ ట్రాప్)లో పడే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. దీని నుంచి తప్పించుకోవడానికి పెట్టుబడులు, ఆవిష్కరణలతో పాటు.. కొత్త టెక్నాలజీలను కూడా అభివృద్ధి చేయడం మీద దృష్టి సారించే 3i (ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్, ఇన్ఫ్యూజన్) విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ.. ప్రస్తుత ట్రెండ్ ఇలంగో కొనసాగితే దేశ తలసరి ఆదాయం అమెరికా ఆదయ స్థాయిలలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి దాదాపు 75 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో స్పష్టం చేసింది.2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను ప్రపంచ బ్యాంక్ తన 'వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024'లో.. స్వాతంత్య్ర శతాబ్దిగా ప్రస్తావించింది. భారతదేశం ఆర్థిక వ్యవస్థలో పరివర్తన సాధించాలని ఆశిస్తున్నప్పటికీ.. అది కొంత క్లిష్టంగా కనిపిస్తున్నట్లు వెల్లడించింది.ఇప్పటికి కూడా అనేక దేశాలు గత శతాబ్దానికి చెందిన ప్లేబుక్‌ను ఉపయోగిస్తున్నాయి. ప్రధానంగా పెట్టుబడులను విస్తరించేందుకు రూపొందించిన విధానాలపై ఆధారపడుతూ ఉన్నయని.. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ ఇండెర్మిట్ గిల్ పేర్కొన్నారు. ఇది మొదటి గేర్‌లోనే కారు నడుపుతూ వేగంగా ముందుకు వెళ్లాలనుకోవడంలాంటిదని అన్నారు.ఇది ఇలాగే కొనసాగితే.. అమెరికా తలసరి ఆదాయంలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి ఇండియాకు 75 ఏళ్ళు, చైనాకు 10 సంవత్సరాలు, ఇండోనేషియా దాదాపు 70 సంవత్సరాలు పడుతుందని గిల్ అన్నారు. చైనా, ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు రాబోయే కొన్ని దశాబ్దాల్లో తీవ్రమైన అడ్డంకులను ఎదుర్కునే అవకాశం ఉందని ఆయన అన్నారు. 1990 నుంచి కేవలం 34 దేశాలు మాత్రమే మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నుంచి తప్పించుకోగలిగాయని ఆయన అన్నారు. -
వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
ఐదో దశ నామినేషన్ల చివరి రోజు వరకు యూపీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే ఉత్కంఠను ఆ పార్టీ కొనసాగించింది. అయితే చివరికి ఆయన రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నట్లు పార్టీ వెల్లడించింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ మరో సస్పెన్స్‌కు తెరలేపింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఒకవేళ రాహుల్ అటు కేరళలోని వయనాడ్, ఇటు యూపీలోని రాయ్‌బరేలీలలో గెలిస్తే ఏ సీటును వదులుకుంటారనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది.గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నుంచి మే 3న రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్‌కు ముందు ఆయన తల్లి సోనియా గాంధీ ఈ స్థానానికి వరుసగా 20 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆమె రాజ్యసభ సభ్యురాలు. ఇదిలా ఉండగా వయనాడ్, రాయ్‌బరేలీలలో గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు? అనే ప్రశ్నకు లక్నో యూనివర్శిటీ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ సంజయ్ గుప్తా విశ్లేషణ చేశారు.తల్లి రాజకీయ వారసత్వం కోసం రాహుల్ గాంధీ అమేథీని వదిలి, రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నిర్ణయం ద్వారా రాహుల్ గాంధీ సురక్షితమైన పందెం ఆడారు. మొదటిది బీజేపీ మహిళా నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పోటీపడితే గతంలో మాదిరిగా పరాభవం ఎదురుకాకుండా చూసుకున్నారు. మరోవైపు తన తల్లి గతంలో పోటీ చేసి, విజయం సాధించిన రాయ్‌బరేలీ స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చేశారు.ఇక వయనాడ్ విషయానికొస్తే ముస్లిం, క్రైస్తవ ఓటర్లు అధికంగా ఉన్న ఈ లోక్‌సభ స్థానం సురక్షితమని రాహుల్ గాంధీ భావించారు. అలాగే అమేథీలో కన్నా రాయ్‌బరేలీలో పోటీ చేయడమే సరైనదని రాహుల్ నిర్ణయించుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌లో రాహుల్‌కు 7 లక్షల 6,000 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థికి కేవలం రెండు లక్షల నాలుగు వేల ఓట్లు మాత్రమే దక్కాయి.అయితే ఈసారి వయనాడ్‌లో పరిస్థితులు మారాయి. రాష్ట్రంలోని అధికార వామపక్ష కూటమి ఈసారి అభ్యర్థిని మార్చింది. ఈసారి బీజేపీ ప్రధాన కార్యదర్శి డి.రాజా భార్య అన్నే రాజాపై రాహుల్ ఎన్నికల బరిలోకి దిగారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రాహుల్‌కు ఇండియన్ ముస్లిం లీగ్ మద్దతు ఉంది. అయితే ఇక్కడ బీజేపీ కూడా తన సత్తాను చాటుకునే ప్రయత్నంలో ఉంది. ఒకవేళ రాహుల్ అటు వయనాడ్, ఇటు రాయ్‌బరేలీ రెండింటిలో గెలిస్తే రాయ్‌బరేలీని వదులుకుని, వయనాడ్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాలున్నాయని ప్రొఫెసర్ సంజయ్ గుప్తా అన్నారు. అయితే అటువంటి సందర్భం ఏర్పడినప్పుడు రాయ్‌బరేలీకి జరిగే ఉప ఎన్నికలో రాహుల్ సోదరి ప్రియాంక పోటీ చేసి, గాంధీ కుటుంబపు కంచుకోటకు కాపాడే ప్రయత్నిం చేస్తారని ఆయన తన అభిప్రాయం తెలిపారు. -
కమలదళం.. వికేంద్రీకరణం!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలదళం ఇందుకోసం వికేంద్రీకరణ వ్యూహాన్ని అమలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో పోలింగ్ బూత్‌లు కేంద్రంగా ప్రణాళికలు రచించింది. గత నెల ఎల్బీ స్టేడియంలో రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది పోలింగ్ బూత్ కమిటీల అధ్యక్షులు, ఆపై మండల, జిల్లా స్థాయి అధ్యక్షులకు పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన దిశానిర్దేశానికి అనుగుణంగా ముందుకు సాగనుంది. పోలింగ్ బూత్‌ల కేంద్రంగా కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరిస్తోంది. వికేంద్రీకరణ పద్ధతిలో క్షేత్రస్థాయికి ప్రాధాన్యతనిస్తూ వివిధ స్థాయిల్లో వివిధ రకాల ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. ఓటర్లను పలుమార్లు కలిసేలా.. వచ్చేనెల 13న పోలింగ్ జరిగేలోగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్ పరిధిలోని ప్రతి ఇంటి తలుపు మూడుమార్లు తట్టి ఓటర్లను కలుసుకుని బీజేపీకి మద్దతు కోరాలని ఇప్పటికే నిర్ణయించారు. దీనితో పాటు ఒక్కో లోక్‌సభ సీటు పరిధిలో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసుకుని బూత్ కమిటీలను పరవేక్షించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారుల నుంచి క్రమం తప్పకుండా ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం, తమ వద్దనున్న డేటాతో సరి చూసుకోవడం లాంటివి చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 15, 16, 17 తేదీల్లో తొలివిడత కార్యక్రమం ముగిసింది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో రెండో విడత, సరిగ్గా పోలింగ్‌కు ముందు మే 9, 10, 11 తేదీల్లో మూడోవిడతలో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఓటర్ను కలిసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. బూత్ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులను కలిసి పూర్తిస్థాయిలో మద్దతు కూడగట్టాలని, ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించారు. నామినేషన్ కార్యక్రమాలకు కేంద్ర మంత్రులు ఈ నెల 25 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా 22 నుంచి బీజేపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాల సమర్పణ ఊపందుకోనుంది. తొలి రెండురోజుల్లో సికింద్రాబాద్ (కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి) సహా ఐదుచోట్ల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇక 22న జహీరాబాద్‌లో బీబీ పాటిల్, చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి, నల్లగొండలో సైదిరెడ్డి, మహబుబాబాద్‌లో సీతారాం నాయక్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 23న భువనగిరిలో బూర నర్సయ్య, 24న పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్, ఆదిలాబాద్‌లో నగేష్, హైదరాబాద్ మాధవీలత, వరంగల్‌లో ఆరూరి రమేష్, చివరిరోజు 25న కరీంనగర్లో బండి సంజయ్, నిజామాబాద్‌లో అర్వింద్, నాగర్‌కర్నూల్‌లో భరత్ ప్రసాద్ నామినేషన్లు వేస్తారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, జైశంకర్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, గుజరాత్, ఉత్తరాఖండ్ సీఎంలు భూపేంద్ర పటేల్, పుష్కర్సింగ్లు పాల్గొననున్నారు. మే మొదటి వారంలో కార్నర్ మీటింగులు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయడంలో భాగంగా మే 1 నుంచి 8 దాకా కార్నర్ మీటింగులు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. మూడు, నాలుగు పోలింగ్ బూత్‌లకు కలిపి ఓ కార్నర్ మీట్‌ను నిర్వహించి ఓటర్లను స్వయంగా కలుసుకోవడం ద్వారా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మరోసారి అప్పీల్ చేయనున్నారు. పోలింగ్‌కు ముందు పదిరోజులు అభ్యర్థులు పూర్తిగా క్షేత్రస్థాయి సమావేశాలు, బూత్ పర్యటనల్లో పాల్గొనేలా వ్యూహ రచన చేస్తున్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో కేడర్‌తో ప్రచారం, ఓటర్ ఔట్ రీచ్ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే 17 ఎంపీ స్థానాలకు పార్లమెంట్ కన్వినర్లు, ఇన్చార్జిలు, పొలిటికల్ ఇన్చార్జిల నియామకం పూర్తికావడంతో వారంతా తమకు అప్పగించిన విధుల్లో నిమగ్నమయ్యారు. మే మొదటి వారం నుంచి 11వ తేదీ మధ్య మోదీ, అమిత్‌షా, నడ్డా, ఇతర ముఖ్యనేతలు ఎన్నికల ప్రచారానికి రానున్నారు. వారు వచ్చినప్పుడే పెద్ద బహిరంగ సభలు ఉంటాయి. వికేంద్రీకరణ వ్యూహంలో భాగంగా మిగతా ప్రచారమంతా పలుమార్లు క్షేత్రస్థాయిలో ఓటర్లను కలుసుకోవడం, చిన్న చిన్న సభలు, సమావేశాలు, వీధి చివర మీటింగ్‌లు లాంటి వాటిపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి నిర్వహించనున్నారు. -
BJP: టార్గెట్ 50 శాతం
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగానే 370కి పైగా స్థానాలను లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుని దాన్ని సాధించేలా వ్యూహరచన చేస్తోంది. మోదీ కరిష్మాకు తోడు పదేళ్ల పాలన, అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. గతంలో కాస్త తేడాతో ఓడిన స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కఠిన సవాలే స్వతంత్ర భారత చరిత్రలో 17 లోక్‌సభ ఎన్నికల్లో ఏడుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు బీజేపీ, ఒకసారి జనతాపార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించాయి. కానీ ఏ పారీ్టకీ 50 శాతం ఓట్లు రాలేదు! 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన 48.1 శాతమే ఇప్పటిదాకా రికార్డు. ఆ తర్వాత ఏ లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు మెజారిటీ కానీ, 40 శాతం ఓట్లు కానీ రాలేదు. ఇక బీజేపీ 2014లో 31.4 శాతం ఓట్లతో 282 సీట్లు, 2019లో 37.7 శాతం ఓట్లతో 303 స్థానాలు సాధించింది. ఈసారి మరో 12 శాతం ఓట్ల కోసం చిన్నా పెద్దా పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఆ 100 స్థానాలపై గురి 50 శాతం ఓట్లు, 370 ప్లస్ సీట్ల సాధనకు బీజేపీ రెండంచెల వ్యూహం పన్నింది. 2014లో నెగ్గి 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిన 35 స్థానాలపై ఫోకస్ పెంచింది. వీటిలో ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌లోనే 14 స్థానాలున్నాయి. బిహార్‌లో 6, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో రెండేసి చొప్పున ఉన్నాయి. వీటిని తిరిగి కైవసం చేసుకునేందుకు స్థానిక పారీ్టలతో పొత్తులు పెట్టుకుంది. అక్కడ బలమైన అభ్యర్థులను బరిలొ దింపుతోంది. ఇక కేవలం 2 నుంచి 3 శాతం ఓట్ల తేడాతో ఓడిన మరో 72 స్థానాలనూ బీజేపీ గుర్తించింది. అక్కడ సొతంగా బలం పెంచుకునే యత్నాలకు పదును పెట్టడంతో పాటు జేడీ(ఎస్), జేడీ(యూ), ఎల్జేపీ, పీఎంకే, ఆరెడ్డీ, తమిళ మానిల కాంగ్రెస్ వంటివాటితో పొత్తులు పెట్టుకుంది. పైరవీలు, సీనియార్టీలను పక్కన పెట్టి గెలుపు అవకాశాలున్న వారికే టికెట్లిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఏకంగా 103 మందికి పైగా సిట్టింగులను తప్పించింది. వారిలో కేంద్ర మంత్రులు మీనాక్షి లేఖీ, అశి్వనీకుమార్ చౌబే తదితరులు, హర్షవర్ధన్, సదానందగౌడ వంటి మాజీలున్నారు. వరుణ్‌గాంధీ వంటి నేతను కూడా మొహమాటం లేకుండా పక్కన పెట్టేశారు. అనంత్‌కుమార్ హెగ్డే, సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వంటి వివాదాస్పదులకూ మొండిచేయి చూపారు. -
ఢిల్లీలో ఏ పార్టీ ఏం చేస్తోంది?
దేశరాజధాని ఢిల్లీలో ఎన్నికల వేడి రాజుకుంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు ప్రచారంలో వేర్వేరు వ్యూహాలను అనుసరిస్తున్నాయి. ఢిల్లీలో బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించగా ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుకు నిరసన వ్యక్తం చేస్తూ ప్రదర్శనలకు దిగుతోంది. దేశరాజధానిలో బీజేపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకు మేనిఫెస్టోలను సిద్ధం చేయడానికి కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. అభ్యర్థులతో పాటు బీజేపీ నేతలు సభలు, పాదయాత్రలతో ఢిల్లీలో రాజకీయ వేడిని మరింతగా పెంచుతున్నారు. బీజేపీ రాష్ట్ర స్థాయి ఎన్నికల కార్యాలయాన్ని కూడా ప్రారంభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారం స్తబ్ధుగా మారింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకించడంపైనే పార్టీ దృష్టి పెట్టినట్లుంది. మరోవైపు ఈ నెల 31న రాంలీలా మైదాన్‌లో తలపెట్టిన ర్యాలీకి పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు ముందు, పొత్తు ఒప్పందం కింద నాలుగు స్థానాలకు ఆప్ తన అభ్యర్థులను ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నా ఢిల్లీలో మూడు స్థానాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థుల పేర్లను ఇంకా ప్రకటించలేదు. మిగిలిన రెండు పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ ఎన్నికల సన్నాహాల్లో ఇంకా వెనుకబడి ఉంది. ప్రస్తుతం అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే దిశగా పార్టీ కసరత్తు చేస్తోందని సమాచారం. ఢిల్లీలో లోక్‌సభ స్థానాలు, అభ్యర్థుల వివరాలు న్యూఢిల్లీ: బసురి స్వరాజ్ (బీజేపీ) సోమనాథ్ భారతి (ఆప్) తూర్పు ఢిల్లీ: హర్ష్ మల్హోత్రా (బీజేపీ) కులదీప్ కుమార్ (ఆప్) దక్షిణ ఢిల్లీ: రాంవీర్ సింగ్ బిధూరి (బీజేపీ) సహిరామ్(ఆప్) పశ్చిమ ఢిల్లీ: కమల్జిత్ సెహ్రావత్ (బీజేపీ) మహాబల్ మిశ్రా (ఆప్) ఈశాన్య ఢిల్లీ: మనోజ్ తివారీ (బీజేపీ) ప్రకటించలేదు (కాంగ్రెస్) చాందినీ చౌక్: ప్రవీణ్ ఖండేల్వాల్ (బీజేపీ) ప్రకటించలేదు (కాంగ్రెస్) వాయువ్య ఢిల్లీ: యోగేంద్ర చందోలియా (బీజేపీ) ప్రకటించలేదు (కాంగ్రెస్) -
ఇన్వెస్టర్స్ అలర్ట్: బడ్జెట్ 2024.. స్టాక్ మార్కెట్ స్ట్రాటజీ..!
మార్కెట్ ఆల్‌టైమ్‌హైలో ఉంది. రానున్న రోజుల్లో మార్కెట్ పయనం ఏ విధంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపర్లు ఎలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి? రానున్న బడ్జెట్ సెషన్లో ఎలాంటి కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. దాని ప్రభావం స్టాక్‌మార్కెట్‌పై ఎలా ఉండబోతుంది. మదుపరులు ఎలాంటి స్ట్రాటజీలను అనుసరించాలో తెలుసుకోవడానికి ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ శ్రీధర్ సత్తిరాజుతో బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు ముఖాముఖి ఈ వీడియోలో చూడండి. -
తెలంగాణ సీఎం ఎంపిక.. ఇది కాంగ్రెస్సేనా?
కాంగ్రెస్ అధిష్టానం ఏనాడైనా త్వరగతిన ఓ నిర్ణయం తీసుకుంటుందా?.. చర్చోపచర్చలు, అసంతృప్త నేతల బుజ్జగింపులు.. స్టేట్ టు హస్తిన రాజకీయాలు.. క్యాంప్ రాజకీయాలు.. హైకమాండ్ తీవ్ర తర్జన భర్జనలు.. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇలాంటి పరిస్థితులే కనిపించేవి. ఈ పరిస్థితుల్నే ఆధారంగా చేసుకుని ప్రత్యర్థులు హస్తం పార్టీపై జోకులు కూడా పేల్చేవాళ్లు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది ఇంత వేగంగా ప్రకటిస్తుందని, అసంతృప్తుల పంచాయితీని కూడా ఇంత తక్కువ టైంలో తేలుస్తుందని రాజకీయ వర్గాలు ఊహించి ఉండవు!. ఏ పార్టీలో అయినా వర్గపోరు.. నేతల విభేదాలు సహజం. అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో అవి పరిధి దాటిపోతూ కనిపిస్తూ వస్తున్నాయి. సపోజ్.. తెలంగాణ కాంగ్రెస్‌నే పరిశీలిద్దాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్సెస్ ఆయన వ్యతిరేకవర్గం(కొందరు సీనియర్లు) మధ్య విభేదాలతో తెలంగాణ కాంగ్రెస్ నిలువునా చీలిపోతుందేమో అనే పరిస్థితి నెలకొంది. ఒక్క తెలంగాణ మాత్రమే కాదు, రాజస్థాన్‌లో సీనియర్ వర్గం జూనియర్వర్గం, కర్ణాటకలోనూ కీలక నేతల మధ్య వర్గపోరుతో దాదాపు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. మరీ ముఖ్యంగా సీనియర్లు వర్సెస్ జూనియర్ల పంచాయితీలను తీర్చేందుకు కొన్ని సందర్బాల్లో ఏఐసీసీ పెద్దలే రంగంలోకి దిగాల్సి వచ్చింది. అలాంటిది రేవంత్‌రెడ్డిని సీఎంగా కేవలం రెండే రోజుల్లో ప్రకటించడం ఇప్పుడు కచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేసేదే!. సెటైర్లు.. జోకులు.. ‘‘ఇక్కడ సీఎం పోస్ట్ కోసం కాంగ్రెస్‌లో కనీసం 8 మంది రెడీగా ఉన్నారేమో!’’ అంటూ.. కిందటి ఏడాది హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. అలాగే.. నిన్న జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనూ బీఆర్ఎస్ ఇదే తరహా కామెంట్లతో కాంగ్రెస్‌పై జోకులు పేల్చింది. అంతెందుకు కర్ణాటక ఎన్నికల సమయంలోనూ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలోనూ ఫలితాలు వచ్చాక ఐదు రోజుల సమయం తీసుకోవడంపై హస్తం పార్టీని ప్రత్యర్థులు ఎద్దేవా చేశారు. సీఎం పంచాయితీ తప్పదేమోనని భావించిన తరుణంలో త్వరగతిన, అదీ పక్కా నిర్ణయం తీసుకుని రాజకీయ వర్గాలకు పెద్ద షాకే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మాత్రం తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్న అనుభవంతోనే ముందుకు సాగింది. ఆ తర్వాతే సీన్ మారింది.. వరుసగా పలు రాష్ట్రాల్లో ఓటములు.. అధికారం కోల్పోవడం గ్రాండ్ ఓల్డ్పార్టీని దెబ్బేస్తూ వచ్చాయి. ఈ మధ్యలో రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడ్ని చేశాక.. సీనియర్ల(జీ23 గ్రూప్) స్వరం పెద్ద తలనొప్పిగా మారింది. ఆఖరికి పార్టీ ప్రక్షాళన పేరిట కాంగ్రెస్ చింతన్ శిబిర్ (కాంగ్రెస్ నవ సంకల్ప్ శిబిర్) నిర్వహించినా.. అది కూడా అట్టర్‌ప్లాపే అయ్యింది. ఇలాంటి దశలో కాంగ్రెస్ అంతర్గత సంక్షోభం నుంచి బయటపడుతుందా? అనే అనుమానాలు తలెత్తాయి. అయితే రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత సీన్ మారింది. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూనే.. నేతల మధ్య ఐక్యత కోసం ఏఐసీసీ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. కలిసి ఉంటేనే దక్కును అధికారం అని నేతలకు హితబోధ చేస్తూ వచ్చింది. ఇందుకోసం రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షణకు అనుభవజ్ఞులైన నేతల్ని నియమిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే రాజస్థాన్ సంక్షోభానికి ఎన్నికల వేళ చెక్ పెట్టడం, రెండు రోజుల వ్యవధిలోనే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం, అలాగే.. డీకే శివకుమార్‌లాంటి సమర్థవంతమైన నేతను బుజ్జగించి కర్ణాటకలో సిద్ధరామయ్యను సీఎం చేయడం, ఇప్పుడు తెలంగాణలో అసమ్మతులతో సంప్రదింపులు జరిపి రేవంత్‌రెడ్డిని సీఎం చేయడం చేసింది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్ పెద్ద దెబ్బే. కానీ, తెలంగాణలో బీఆర్ఎస్ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీని ఓడించి అధికారం కైవసం చేసుకోవడం మాత్రం మామూలు విషయం కాదు. ఇందుకు.. పార్టీలో ఐక్యత కూడా ఒక కారణమనేది కచ్చితంగా చెప్పొచ్చు. ఇదే టీమ్ ఎఫర్ట్ స్ట్రాటజీతో గనుక ముందుకు సాగితే.. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించడంంలో సఫలం కావొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇదీ చదవండి: రేవంత్‌రెడ్డి.. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే! -
పిల్లల కథ! వ్యాపారానికి కావాల్సిన స్ట్రాటజీ!
అంజి అనే కోతి కొత్తగా మూలికలతో ఔషధాలు తయారుచేసి అడవిలో అమ్మటం మొదలుపెట్టింది. అది కొంతకాలం పక్క అడవిలో ఉండే తన మిత్రుడు మారుతి అనే కోతి దగ్గర మూలికలతో ఔషధాలు తయారుచేయడం నేర్చుకుంది. తిరిగి తన అడవికి వచ్చి మొక్కల వేర్లు, కాండం, బెరడు, ఆకులు, మొగ్గలు, పూలు, కాయలు, పండ్లు, గింజలు, చిగుళ్లను.. ఉపయోగించి ఎత్తుపెరగటానికి, బరువు తగ్గడానికి, జుట్టు పెరగటానికి, అందంగా అవడానికి.. ఇలా చాలావాటికి మందులు తయారు చేసేది. ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుంది.. ఏ ఆకును ఏ రకంగా వాడాలో అంజికి పూర్తిగా తెలుసు. తన మూలికల ఔషధాలను అడవంతా విస్తరింపచేయాలనే ఆలోచనతో నలుగురు అమ్మకందారులనూ నియమించాలనుకుంది. వెంటనే అడవి అంతా చాటింపు వేయించింది. అంజి తయారుచేసే మందులను అమ్మి పెట్టేందుకు ఏనుగు, ఎలుగుబంటి, నక్క, పంది ముందుకు వచ్చాయి. ఔషధాలను తీసుకుని నాలుగూ నాలుగు దిక్కులకు వెళ్ళాయి. పదిరోజులైనా ఒక్క మందూ అమ్ముడుపోలేదు. అంజి తయారుచేసిన మందుల అడవిలోని జంతువులకు గురి కలగలేదు. దాంతో అంజి ఔషధాల తయారీని నిలిపివేయాలనుకుంది. విషయం తెలుసుకున్న మారుతి.. అంజిని కలసి ‘మిత్రమా! నీకు ఔషధాల తయారీలో మంచి నైపుణ్యం ఉంది. లోపం ఎక్కడుందో రేపు కనిపెడతాను’ అంటూ ధైర్యం చెప్పింది. మరునాడు అంజి వెంట మారుతి వెళ్ళి ఏనుగు, ఎలుగుబంటి, నక్క, పంది మందులను ఎలా విక్రయిస్తున్నాయో గమనించింది. అవి ఎండలో పెద్దగా అరుస్తూ ఔషధాలు కొనమని వాటి గుణాలను వివరిస్తున్నాయి. ఆ అరుపు విని జంతువులు, పక్షులు వస్తున్నాయి. ఏనుగు, ఎలుగుబంటి, నక్క, పందిని.. వాటి చేతుల్లో ఉన్న మందులను చూసి వెళ్ళిపోతున్నాయి. కానీ కొనటంలేదు. లోపం ఎక్కడుందో మారుతికి తెలిసిపోయింది. కాసేపు అలాగే పరిశీలించి.. అంజి, మారుతి రెండూ తిరిగి ఇంటికి బయలుదేరాయి. దారిలో ‘మిత్రమా! నువ్వు చేసిన మందులు సరైనవే’ అంది మారుతి. ‘మరి అమ్మకందారుల్లో లోపమా?’ అడిగింది అంజి. ‘పాపం నిజానికి అవి ఎండలో పెద్దగా అరుస్తూ, కష్టపడుతున్నాయి. వాటి శ్రమలోనూ ఎలాంటి లోపం లేదు’ అంది మారుతి. ‘మరి కారణం ఏంటీ?’ అడిగింది అంజి. ‘సరైన ఔషధాన్ని సరైన అమ్మకందారు అమ్మటం లేదు’ అంది మారుతి. అర్థంకాలేదు అంజికి. గ్రహించిన మారుతి ‘మిత్రమా! మొదట మన మీద నమ్మకం కుదిరితేనే మనం ఎదుటివారికి అమ్మగలం. ఒంటినిండా జుట్టుండే ఎలుగుబంటి జుట్టు పెరగటానికి ఔషధం అమ్మితే ఎలా ఆకర్షితులౌతారో.. సన్నబడడం గురించి ఏనుగు మాట్లాడితే అలాగే పారిపోతారు’ అంది మారుతి. ‘ఔషధం ఎంత గొప్పదైనా నమ్మకం లేకపోతే పనిచేయనట్లు.. తను ఔషధాన్ని ఎంత చక్కగా తయారుచేసినా సరైన వారు విక్రయించకపోతే అది వినియోగదారుడిని ఆకర్షించదని అర్థమైంది అంజికి. ‘మిత్రమా! ప్రతిజీవిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దాన్ని సరైన సమయంలో, సరైన పనికి, సరిగ్గా వినియోగించుకోవాలి’ అని చెప్పింది మారుతి. ఆ సూచన పాటించి చిన్న చిన్న మార్పులతో పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగింది అంజి. పైడి మర్రి రామకృష్ణ (చదవండి: పుట్టుకతో ఎవరూ మోసగాళ్లు కాదు! కానీ ఆ మోసం విలువ..!) -
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఫార్ములా ఇదే..
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏ ఐదు రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించే పనిలో పడింది. స్థానిక నాయకత్వం.. ఇదే ఏడాది కర్ణాటక ఎన్నికల్లోనూ తర్వాత జరిగిన ఉపఎన్నికలలోనూ బీజేపీ వెనుకబడటంతో ఈ విడత ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని నిర్ణయించుకుంది. బీజేపీ పార్టీ ప్రధానంగా 'మోదీ నాయకత్వాన్ని' నమ్ముకోగా రెండో అంశంగా ఆయా రాష్ట్రాల్లో 'పార్టీ సమిష్టి నాయకత్వానికి' పెద్దపీట వేయనుంది. హిందీ భాషా ప్రాబల్యమున్న రాష్ట్రాల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ప్రాధాన్యతనివ్వకుండా నాయకుల మధ్య సమన్వయం కుదర్చడానికే ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో స్థానిక నాయకత్వాన్ని బలపరచాలన్న యోచనలో ఉంది పార్టీ అధిష్టానం. నో వారసత్వం.. ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి ఎలాంటి ప్రస్తావన చేయకుండా ఉంటే స్థానిక నాయకులకు తమ అభ్యర్థిత్వాన్ని బలపరచుకునే అవకాశం కల్పించినట్లు ఉంటుందన్నది అధిష్టానంని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అదే విధంగా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తోన్న ప్రధాని తమ పార్టీలో కూడా వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టే యోచనలో ఉన్నారు. ప్రస్తుత సంచరం ప్రకారం బీజేపీ ఒక కుటుంబం నుంచి ఒకే టికెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్.. ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్ ప్రాధాన్యతను తగ్గించడమే కాకుండా ఇప్పటివరకు ఆయన అభ్యర్థిత్వానికి సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనికి తోడు నలుగురు ఎంపీలు, ముగ్గురు కేంద్ర మంత్రులతో పాటు జాతీయ జనరల్ సెక్రెటరీ విజయ్ వర్గియా కూడా ఈసారి ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. శివరాజ్ సింగ్ భవితవ్యంపై ఎలాంటి సూచనలు లేని కారణంగా వీరిలో ఎవరినైనా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్.. బీజేపీ అదే ఫార్ములాను రాజస్థాన్‌లో కూడా అమలు చేయాలని చూస్తోంది. ఇక్కడైతే బీజేపీ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్ధికి కొదవే లేదు. గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘవాల్, కిరోడీ లాల్ మీనా, దియా కుమార్, రాజ్యవర్ధన్ రాథోడ్, సుఖవీర్ సింగ్, జౌన్పురియాలతో పాటు సింధియా రాజ కుటుంబీకురాలు వసుంధరా రాజే కూడా ఉండనే ఉన్నారు. వీరిలో కూడా అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండా బీజేపీ ఎన్నికలకు వెళ్లాలన్నది పార్టీ యోచన. ఛత్తీస్గడ్.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఛత్తీస్‌గడ్‌లో బీజేపీ కాస్త భిన్నమైన ప్రణాలికను అమలు చేయనుంది. ఇప్పటికే ఆ పార్టీ అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేష్ భాఘేల్ మేనల్లుడు విజయ్ బాఘేల్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. కుటుంబ వైరం ద్వారా లబ్దిపొంది పార్టీని బలోపేతం చేయాలన్నది బీజేపీ అధిష్టానం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. విజయ్ ఈసారి ఎన్నికల్లో పఠాన్ జిల్లాలోని దుర్గ్ నుంచి పోటీ చేయనున్నారు. 2003 నుంచి భూపేష్, విజయ్‌ల మధ్య ఈ స్థానంలో ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చింది. వీరితోపాటు కేంద్రమంత్రి రేణుకా సింగ్, రాజ్యసభ ఎంపీ సరోజ్ పాండే తోపాటు మాజీ ముఖ్యమంత్రి రామం సింగ్ కూడా ఉన్నప్పటికీ బాఘేల్ కుటుంబానికే ప్రాధాన్యతనిచ్చింది బీజీపీ అధిష్టానం. తెలంగాణ.. ఇప్పటివరకు దక్షిణాదిన ఖాతా తెరవని బీజేపీకి ఈసారి కొద్దోగొప్పో ఊరటనిచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే. మిషన్ సౌత్‌లో భాగంగా ఇక్కడ కూడా సీఎం అభ్యర్థిత్వానికి నాయకుల మధ్య పోరే కొలమానం కానుంది. ఇక్కడ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, మరో ఎంపీ ధర్మపురి అరవింద్, రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్ లలో ఎవరైనా సీఎం కావచ్చు. అభ్యర్థిని మాత్రం ముందు ప్రకటించకుండా ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం సమిష్టిగా పనిచేయాలని సూచించింది. మిజోరాం.. ఇక బీజేపీకి ఈ ఎన్నికల్లో క్లిష్టతరమైన రాష్ట్రం మిజోరాం. ఈ రాష్ట్రానికి పొరుగు రాష్ట్రమైన మణిపూర్‌లో జరిగిన అల్లర్లు ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తాయండంలో సందేహంలేదు. దీంతో బీజేపీ ఇక్కడ మాత్రం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరముంది. వారి ప్రధాన అజెండా 'మోదీ నాయకత్వం' 'స్థానిక సమిష్టి నాయకత్వం' రెండూ ఇక్కడ పనిచేయకపోవచ్చు. ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక -
కాంగ్రెస్ రూట్లో కమలం.. సర్ప్రైజ్ అందుకే!
ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనే లేదు. అయితేనేం ఈలోపే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసి సర్ప్రైజ్ చేసింది బీజేపీ. పైగా రిజర్వ్డ్సీట్లు.. గతంలో ఎన్నడూ గెలవని సీట్లకు ముందుగా అభ్యర్థులను ప్రకటించి మరింత ఆశ్చర్యానికి గురి చేయించిందనే చెప్పాలి. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని కమలం ఫాలో అవుతోందా?.. ఎన్నికలకు వంద రోజుల ముందుగానే అభ్యర్థుల ప్రకటన అనేది బీజేపీ నుంచి ఊహించని పరిణామం. అందునా షెడ్యూల్ రాకముందు బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ మల్లాగుల్లాలు పడడం గమనార్హం. ఈ క్రమంలో కష్టతరమైన నియోజకవర్గాల జాబితాను విడుదల చేయడం ద్వారా బీజేపీ ఎలాంటి సంకేతాలు పంపిందనేది విశ్లేషిస్తే.. దక్షిణాది రాష్ట్రం కర్ణాటక వ్యూహం కనిపించకమానదు!. కర్ణాటకలో ఇలా.. కర్ణాటకలో అభ్యర్థులను ఎన్నికలకు ముందుగానే ప్రకటించి సక్సెస్ అయ్యింది కాంగ్రెస్. పేర్లు ప్రకటించిన వెంటనే క్షేత్ర స్థాయిలోకి దిగిన అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేసుకున్నారు. తాము అందించబోయే సంక్షేమం గురించి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టైం దొరికింది. తద్వారా బలంగా దూసుకుపోయి.. ఓట్లు రాబట్టుకోగలిగారు. సరిగ్గా.. అలాంటి ప్రణాళికే ఇప్పుడు బీజేపీ ఛత్తీస్‌గఢ్, అధికార మధ్యప్రదేశ్ విషయంలోనూ అనుసరిస్తోంది. మధ్యప్రదేశ్‌లో 39 మంది అభ్యర్థులను, ఛత్తీస్‌ఘడ్‌లో 21 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. వీటిలో ఎక్కువగా రిజర్వ్డ్ సీట్లుకాగా, మరికొన్ని బీజేపీ గతంలో ఎన్నడూ గెలవని సీట్లు. తద్వారా గెలుపు కఠినమైన నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు వీలుంటుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. నిజానికి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లలో బిజెపి పరిస్థితి బాగానే ఉంది. మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉండగా, ఛత్తీస్‌ఘడ్‌లో ప్రతిపక్షంలో ఉంది. అయితే కర్నాటకలో కాంగ్రెస్‌పార్టీ అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి మంచి ఫలితాలను రాబట్టింది. అందుకే.. అదే ఫార్ములాను బీజేపీ అధిష్టానం అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ సంగతేంది? నిజానికి ఈ కసరత్తు తెలంగాణలో జరగాలి. ఎందుకంటే, తెలంగాణలోనే బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. పైగా.. ఇటీవలి సర్వేలన్నీ బీజేపీ మూడో స్థానానికే పరిమితం కావొచ్చనే అంచనాలను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో.. వంద రోజుల ముందు అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం ఇక్కడే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో(ముందస్తు) బీజేపీ దాదాపు వందస్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. హేమాహేమీలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ లాంటి వారే ఓటమి పాలయ్యారు. కేవలం ఒక్క సీటుకే బిజెపి పరిమితమైంది. అలాంటప్పుడు.. గెలుపు అవకాశాలు అంతంతమాత్రంగా ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రాలలో అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తే.. ఎన్నికల సన్నాహానికి.. ప్రచారానికి తగిన సమయం దొరికడంతో పాటు అన్నిరకాల వనరులు సమకూర్చుకునే వీలు కలిగేది కదా అనే అభిప్రాయాన్ని పార్టీ క్యాడర్ వ్యక్తం చేస్తోంది. ఆగుదాం.. వెతుకుదాం! తెలంగాణలో మాత్రం మరో తరహా ఫార్ములాతో బీజేపీ ముందుకుపోయేలా కనిపిస్తోంది. బీజేపీ అధిష్టానం ఇటీవల చేసిన మార్పులతో తెలంగాణ పార్టీ కేడర్‌లో జోష్ ఒక్కసారిగా తగ్గిపోయింది. బండి సంజయ్ లాంటి డైనమిక్ నేతను పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించడాన్ని ఇప్పటికీ ఆయన వర్గీయులు, పార్టీ శ్రేణి చాలా మట్టుకు జీర్ణించుకోలేకపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకనో.. తిరిగి జోష్ తీసుకువచ్చేందుకు అధిష్టానం నుంచి పెద్దగా ప్రయత్నం కనిపించడం లేదు. ఈ తరుణంలో.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లలో అభ్యర్థుల ఎంపికపై వంద రోజుల ముందే దృష్టి పెట్టిన అధిష్టానం పెద్దలు తెలంగాణపై ఎందుకు ఫోకస్ చేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్పుడే ప్రకటన! బీజేపీకి 35 చోట్ల మినహా మిగిలిన చోట్ల పెద్దగా పోటీ ఇచ్చే నాయకుల లేరట. అందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ జాబితాల ప్రకటన తర్వాత గానీ బీజేపీ తన లిస్ట్ ప్రకటించే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఈ లోపు.. గెలుపు గుర్రాల కోసం తాము అన్వేషిస్తున్నామంటూ రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. -
పచ్చ గూండాలు పేట్రేగిన వేళ..
సాక్షి, చిత్తూరు, పుంగనూరు (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల తెలుగుదేశం పార్టీ సృష్టించిన విధ్వంసంలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. పక్కా ప్రణాళిక, భారీ వ్యూహంతోనే ఈ దాడులు జరిగినట్లు స్పష్టమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయంగా అణగదొక్కటమే లక్ష్యంగా టీడీపీ ఈ దాడులకు వ్యూహ రచన చేసింది పక్కా ప్రణాళికతో జిల్లా నలుమూలల నుంచి టీడీపీకి చెందిన గూండాలను ఎంపిక చేసి మరీ పుంగనూరుకు తెచ్చినట్లు వెల్లడైంది. వారిపై జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో అనేక కేసులు ఉన్నాయి. వీరిని ముందుగానే మారణాయుధాలతో సహా పుంగనూరులో మోహరించారు. చంద్రబాబు పర్యటనను కూడా వ్యూహాత్మకంగా పుంగనూరుకు వచ్చేలా మార్పు చేశారు. ముందస్తు షెడ్యూల్లో లేకపోయినా, పోలీసుల అనుమతి లేకుండానే దాడుల కోసమే ఆయన పుంగనూరు వచ్చారు. చంద్రబాబు వస్తూనే టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టడం, వెనువెంటనే విధ్వంసం సృష్టించడం.. అంతా వ్యూహం ప్రకారం చేశారు. కర్రలు, రాళ్లు, మద్యం సీసాలు, ఇతర మారణాయుధాలతో వందల సంఖ్యలో పోలీసులపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఓ కానిస్టేబుల్ ఓ కంటి చూపు కోల్పోయాడు. అయితే, పోలీసులు చాలా సహనంతో వ్యవహరించడంతో టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. పుంగనూరు విధ్వంసంలో ఇప్పటి వరకు ఏడు నేరాలకు సంబంధించి మొత్తం 277 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో పాల్గొన్న వారిని పోలీసులు ఆధారాలతో సహా గుర్తించారు. వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం వరకు 90 మందిని అరెస్ట్ చేశారు.వారికి కోర్టు రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు చల్లా బాబుతోపాటు కుట్ర, వ్యూహ రచన, దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న పలువురిని పోలీసులు గుర్తించారు. వారి గత చరిత్రను కూడా నిశితంగా పరిశీలించారు. దాడుల్లో భాగస్వాములైన వారిలో ఎక్కువ మంది పాత నేరాల చరిత్ర చూసి పోలీసులే షాక్ అయ్యారు. వారిలో కొందరి నేర చరిత్ర ఇదీ.. 1. నేరాల్లో ఘనుడు చల్లా బాబు పుంగనూరులో దాడి కేసులో ప్రధాన సూత్రదారి, పాత్రదారి ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి అని పోలీసులు తేల్చారు. దాడులకు కుట్ర పన్నడం, వ్యూహాన్ని అమలుపరచడంలో ఇతనిదే ప్రధాన పాత్రగా పోలీసులు నిర్ధారించారు. చల్లా బాబు గత చరిత్ర అంతా నేర పూరితమేనని పోలీసు విచారణలో తేలింది. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. ఇతను ఆలయ భూములు, ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. చల్లా బాబుపై ఉన్న పాత కేసుల్లో మచ్చుకు కొన్ని.. 1.1985లో రొంపిచెర్ల పోలింగ్ స్టేషన్‌పై బాంబు దాడి కేసు 2. రొంపిచెర్ల క్రైం నం.368, 2021లో ఐపీసీ సెక్షన్లు, 143, 188, 341,269, 270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఈడీయాక్ట్ 3. క్రైం నం.18–2021 ఐపీసీ సెక్షన్లు 353, 506 రెడ్‌విత్ 34 కింద కేసు 4. క్రైం నం.8–2022 ఐపీసీ సెక్షన్లు 188, 341 కింద చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు 5. క్రైం నం.89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రెడ్‌విత్ 149 కింద సోమల పీఎస్‌లో కేసు 6. క్రైం నం.72–2022 ఐపీసీ సెక్షన్లు› 341, 143, 290 రెడ్‌విత్ 149 కింద కేసు 7. క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 కింద కల్లూరు పోలీసు స్టేషన్లో కేసు 2. టీఎం బాబు (40) ఊరు: తొట్లిగానిపల్లి, గుడిపల్లి, కుప్పం నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులివీ.. 1. క్రైం నం.30–2009లో గుడిపల్లి పీఎస్‌లో పరిధిలో జరిగిన కేసు 2. క్రైం నం.171 ఇ, 506, 8–బి–1, ఏపీపీయాక్ట్ 3. క్రైం నం.165–2010 ఐపీసీ 392 సెక్షన్ల కింద కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు 3. క్రైం నం.38–2022 ఐపీసీ సెక్షన్ 448, 427, 323, 324, రెడ్‌విత్ 34 కింద గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు 3. భాష్యం విశ్వనాథనాయుడు (45) మండలం: శాంతిపురం, కుప్పం నియోజకవర్గం పార్టీ హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులు: 3 కేసుల్లో నిందితుడు 1. క్రైం నం.191–2021, ఐపీసీ సెక్షన్లు 143, 341, 506, 188, 59 డీఎంఏ, ఈడీఏ కింద రాళ్ళబుదుగూరు పోలీస్ స్టేషన్లో కేసు 2. క్రైం నం.73–2022, ఐపీసీ సెక్షన్లు 177 ,182, 155 సెక్షన్ల కింద రెండో కేసు 3. రామకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైం నం.130–2022 , ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 307, 324తో పాటు రెడ్‌విత్ 149 కింద కేసు 4. జి.దేవేంద్ర (31) ఊరు: గోపన్నగారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: తెలుగు యువత మండల అధ్యక్షుడు పాత కేసులు: కల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 కింద కేసు నమోదైంది. 5. లెక్కల ధనుంజయనాయుడు ఊరు: కొక్కువారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాత కేసులు: రెండుకేసుల్లో నిందితుడు 1. క్రైం. నం. 26–2022 నంబరుతో కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీసీ సెక్షన్ 341, 506, 353, 143, 147, 148, రెడ్‌విత్ 149 కింద కేసు నమోదు 2. క్రైం.నం. 368– 2021. రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఈడీ యాక్ట్ కింద కేసులు 6. ముల్లంగి వెంకటరమణ (52) ఊరు: ముల్లంగివారిపల్లి, పులిచెర్ల మండలం పార్టీలో హోదా: టీడీపీ ఎస్సీ సెల్ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పాత కేసులు: మూడు కేసుల్లో నిందితుడు 1.క్రైం. నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148, రెడ్‌విత్ 149 ఐపీసీ కింద కల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు 2. ఇదే స్టేషన్ పరిధిలో క్రైం.నం. 35–2017 ఐపీసీ సెక్షన్లు 447, 427, 324తోపాటు 34 ఐపీసీ కింద కేసు నమోదు 3. ఇక్కడే క్రైం. నం. 140–2021, ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్ విత్ 34 కింద మరో కేసు 7. నూకల నాగార్జున నాయుడు (33) ఊరు: బొడిపటివారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల యువనేత, రాష్ట్ర ఐటీ విభాగం సభ్యుడు పాత కేసులు: ఆరు కేసుల్లో నిందితుడు. రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, కల్లూరులో 1 , సోమల పరిధిలో మరొక కేసు 1. క్రైం.నం. 368–2021 ఐపీసీ 134, 188, 341, 269, 270, 290 రెడ్ విత్ 149 ఐపీసీతో పాటు సెక్షన్ 3 కింద ఈడీయాక్ట్ నమోదు 2. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్ విత్, 149 3. క్రైం.నం. 374–2021 ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 120బీ, 506, 507 4. క్రైం.నం. 5–2022 ఐపీసీ సెక్షన్లు 153, 427, 290 రెడ్ విత్ 34 ఐపీసీ 5. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్ విత్ 149 ఐపీసీ 6. క్రైం.నం. 149–2022 ఐపీసీ సెక్షన్లు 143, 148, 354డీ, 324, 506, 509 రెడ్‌విత్ 149 8. ఇ. క్రిష్ణమూర్తినాయుడు (55) ఊరు: రాయవారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులు: ఇతనిపై కల్లూరు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి 1 క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 506, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 2. క్రైం.నం. 12–2021, ఐపీసీ సెక్షన్లు 353, 506, రెడ్ విత్ 34 ఐపీసీ 9. నాగిశెట్టి నాగరాజ (38) ఊరు: బొమ్మయ్యగారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం హోదా: మండలం తెలుగు యువత అధ్యక్షుడు పాత కేసులు: ఇతనిపై ఐదు కేసులు ఉన్నాయి. కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3, రొంపిచెర్లలో మరో రెండు కేసులు 1. క్రైం.నం. 140–2021, ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్‌విత్ 34 2. క్రైం.నం. 368–2021 ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149తో పాటు సెక్షన్ 3 ఈడీ యాక్ట్ 3. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్ విత్ 149 ఐపీసీ. 4. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్‌విత్ 149 ఐపీసీ. 5. క్రైం.నం. 350–2021 ఐపీసీ సెక్షన్లు 151 సీఆర్పీసీ 10. కె.సహదేవుడు (50) ఊరు: బొమ్మయ్యగారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారి పల్లి ఎంపీటీసీ పాత కేసులు: రొంపిచెర్ల, మరికొన్ని స్టేషన్లలో 8 కేసుల్లో నిందితుడు 1. క్రైం.నం. 89–2014 ఐపీసీ సెక్షన్లు 447, 506 రెడ్‌విత్ 34 2. క్రైం.నం. 331–2020 సీఆర్పీసీ 151 3. క్రైం.నం. 365–2020 సీఆర్పీసీ 151 4. క్రైం.నం. 14–2021 ఐపీసీ సెక్షన్లు 188 , 353, 506, రెడ్ విత్ 34 5. క్రైం.నం. 356–2021 ఐపీసీ సెక్షన్ 151 6. క్రైం.నం. 368–2021 ఐపీసీ 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149 7. క్రైం.నం. 9–2022 ఐపీసీ సెక్షన్లు 447, 427, 506, 143 రెడ్‌విత్ 149 8. క్రైం.నం. 10–2022 ఐపీసీ సెక్షన్లు 341, 323, 506, 153 11. ఉయ్యాల రమణ (44) ఊరు: బొమ్మయ్యగారిపల్లి, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం హోదా: రొంపిచెర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు పాత కేసులు: కల్లూరు , రొంపిచెర్ల, సోమల పోలీస్స్టేషన్ల పరిధిలో 8 కేసుల్లో నిందితుడు 1. క్రైం.నం. 140–2021 ఐపీసీ సెక్షన్ 353, 341 రెడ్ విత్ 34 2. క్రైం.నం. 368 – 2021 ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269,270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీతోపాటు 3 ఈడీ యాక్ట్ 3. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్‌విత్ 149 4. క్రైం.నం.15–2021 ఐపీసీ సెక్షన్లు 188, 506 రెడ్‌విత్ 34 ఐపీసీ 5. క్రైం.నం.40 – 2014 ఐపీసీ సెక్షన్లు 307, 326, 324 రెడ్‌విత్ 34 6. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 7. క్రైం.నం.140–2021 ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్‌విత్ 34 8. క్రైం.నం. 89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రెడ్‌విత్ 149 ఏ ఒక్కర్నీ వదలం పుంగనూరు దుశ్చర్యలో పోలీసుల రక్తం కళ్ల చూసిన ప్రతి ఒక్కరినీ వదలం. చట్ట ప్రకారం ముందుకెళ్తాం. బందోబస్తు డ్యూటీ కోసం వచ్చిన పోలీసులను మట్టుపెట్టాలని చూడటం, రాళ్లు, మద్యం బాటిళ్లు విసరడంపై మా వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వీడియో ఫుటేజీల ఆధారంగా ఇప్పటికే పలువురిని అరెస్టు చేశాం. ప్రధాన నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఆరోజు పోలీసులు అడ్డుపడకపోతే పుంగనూరు టౌన్లోకి పోయి విధ్వంసం సృష్టించేవాళ్లు. నిందితులపై చట్టరీత్యా చర్యలు తప్పవు.– వై.రిషాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు -
కమలంలో కలవరం
-
టీ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం.. హైకమాండ్ ఏం చెప్పింది?
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ రచన సమావేశం మూడు గంటల పాటు సుదీర్ఘగా సాగింది. కాగా భారీ చేరికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ సంతరించుకుంది. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిలతో పాటు ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీ తదితరలు ఈ ఎన్నికల వ్యూహ భేటీకి హాజరయ్యారు. భేటీ అనంతరం టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఎన్నికల కార్యచరణ మొదలైందని, రాబోయే 120 రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని తెలిపారు. ‘‘మేనిఫెస్టో రూపకల్పన త్వరగా పూర్తి చేయాలని చర్చ జరిపాం. అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై చర్చ జరిగింది. ఎన్నికల సన్నాహక సమావేశం సుదీర్ఘంగా చర్చ జరిగింది. కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయించాం. అక్కడ అనుసరించిన మౌలిక అంశాలు ఇక్కడ కూడా అమలు చేయాలని డిసైడ్ అయింది’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, అందరం ఐక్యంగా ఉండాలని అధిష్టానం కోరిందని, అభ్యర్థులను త్వరగా డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఖాళీగా ఉన్న పదవులు భర్తీ చేయాలి. కర్ణాటక తరహాలోనే వ్యూహం అమలు చేయాలని నిర్ణయం’’ జరిగిందని ఆయన పేర్కొన్నారు. చదవండి: తెలంగాణలో మతతత్వం పెరుగుతోంది: అసదుద్దీన్ ఓవైసీ మాజీ ఎంపీ మధు యాష్కీ మాట్లాడుతూ, బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు ఉండదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారన్నారు. జాతీయస్థాయి ప్రతిపక్ష కూటమి లో బీఆర్ఎస్కు చోటు ఉండబోదు. తెలంగాణలో ప్రజలు త్యాగం చేస్తే, కేసీఆర్ ఫ్యామిలీ భోగం అనుభవిస్తుందని మధు యాషి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మానిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ.. అందరి సూచనలను రాహుల్ గాంధీ విన్నారని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, వ్యూహాల గురించి చర్చించామన్నారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందని విమర్శించారు. చదవండి: ఈటల భార్య జమున సంచలన ఆరోపణలు -
బీఆర్ఎస్ బలం పెరుగుతుందా? తగ్గుతుందా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తమవుతున్నారు. ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ తనకు ప్రధాన ప్రత్యర్ధి అవుతుందేమోనన్న అంచనా కానివ్వండి.. బీజేపీ పెరిగితే తనకే ఎక్కువ రాజకీయ ప్రయోజనం అన్న భావన కానివ్వండి.. లేదా జాతీయ రాజకీయాలలో తన ప్రభావం చూపడానికి ఒక అవకాశం అన్న ఉద్దేశం కానివ్వండి.. ఇంతకాలం ఆయన బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీపై కూడా విమర్శలు కురిపించేవారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనని అనేవారు. ఇప్పటికీ ఆయన తన వైఖరి మార్చుకోకపోయినా, తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణలను ఆయన గమనించి తన రూట్ మార్చారు. ఇప్పుడు బీజేపీపై కన్నా కాంగ్రెస్‌పై దాడి చేస్తున్నారు. తెలంగాణలో తాను చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివిధ సభలలో వివరిస్తున్నారు. పలు జిల్లాలలో నిర్మించిన కలెక్టరేట్ భవనాలను ఆయన ప్రారంభిస్తున్నారు. ఆ సందర్భంగా జరిగే సభలలో ఎన్నికల ప్రచారానికి తగిన విధంగా మాట్లాడుతున్నారు. ప్రజలు ప్రతిపక్షాల వైపు చూడకుండా ఉండడానికి ఎన్ని యత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ అంశాన్ని పెద్ద సమస్యగా మార్చుతోంది. పేదల భూములు కొట్టేయడానికే ధరణి పోర్టల్ తెచ్చారని, తాము అధికారంలోకి వస్తే ఆ పోర్టల్‌ను బంగళాఖాతంలో కలుపుతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని ధరణి పోర్టల్ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని, అవినీతి అరికడుతుందని, దీనిని అడ్డుకునేవారిని బంగళాఖాతంలో కలపాలని ఆయన పిలుపు ఇస్తున్నారు. మొత్తం ధరణి అంశం ప్రభుత్వాన్ని కాస్త ఇబ్బందిపెడుతున్నట్లుగానే ఉంది. వివిధ నీటిపారుదల ప్రాజెక్టులు, రాష్ట్రంలో కరెంటు సరఫరా, తాగునీటి సరఫరా మొదలైన అభివృద్ది అంశాలను పదే,పదే ప్రస్తావిస్తూ మరోసారి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన కోరుతున్నారు. మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన బాగా యాక్టివ్ అయినట్లు కనిపిస్తుంది. మరో వైపు కేటీఆర్ తనదైన శైలిలో ప్రచారం చేస్తుంటే, కేసీఆర్ జరుగుతున్న రాజకీయాలకు అనుగుణంగా ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ తెలంగాణలో హైదరాబాద్ కాకుండా మిగిలిన జిల్లాలలో బీఆర్ఎస్పై కాస్త నెగిటివ్ ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. దానిని తగ్గించడానికి ఆయన ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు. కారణం ఏమైనా సెటిలర్లలో ఎక్కువమంది బీఆర్ఎస్ పట్ల సానుకూలంగా ఉంటే, తెలంగాణలో పుట్టి పెరిగినవారిలో ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న కథనాలు, ఇంటర్వ్యూలు తరచుగా మీడియాలో వస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ లో వంతెనలు నిర్మిస్తే సరిపోతుందా.. జిల్లాల సంగతేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెబుతుంటే, దానినే ఆయనకు మైనస్ చేయడానికి ఆయా రాజకీయ పక్షాలు ,తెలంగాణవాదులు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పుంజుకుంటే బీఆర్ఎస్కు అది చేటు తెస్తుందని గమనించి కేసీఆర్ కాంగ్రెస్‌పై దాడి పెంచారు. అంతేకాక బీజేపీలో మొదట ఉన్న జోష్ ఇప్పుడు లేదన్న భావన ప్రబలింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ వాదనను కొట్టిపారేస్తున్నా, కర్నాటక ఎన్నికల తర్వాత బీజేపీ ఊపు తగ్గిందన్నది వాస్తవం. దీనివల్ల బీజేపీ కన్నా బిఆర్ఎస్ కు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. బీజేపీ, కాంగ్రెస్‌లు సమానంగా ఓట్లు తెచ్చుకుంటే బీఆర్ఎస్ గెలుపు సులువు అవుతుంది. అలాకాకుండా ఏదో ఒక పార్టీనే ప్రత్యర్ధిగా మారితే అది టైట్ ఫైట్‌గా మారవచ్చు. కర్నాటకలో మాదిరి ముస్లిం ఓట్లు తెలంగాణలో కూడా కాంగ్రెస్ వైపు మెగ్గు చూపితే మాత్రం అది బీఆర్ఎస్కు బాగా నష్టం చేసే అవకాశం ఉంటుంది. చదవండి: ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కేసీఆర్ ఏమంటారో! మామూలుగా అయితే ఇక్కడ ముస్లిం ఓట్లు హైదరాబాద్ పాతబస్తీ మినహా మిగిలినచోట్ల టీఆర్ఎస్ వైపే ఉంటారు. కాని బీజేపీని అడ్డుకోవడానికి వారు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారితే అది బీఆర్ఎస్కు కూడా చికాకు కలిగించవచ్చు. వీటన్నిటిని అంచనా వేసుకున్న కేసీఆర్ జిల్లాల పర్యటనల వేగం పెంచి, బీఆర్ఎస్ చెక్కు చెదరకుండా చూడడానికి అన్ని యత్నాలు చేస్తున్నారు. మరో వైపు కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత తెలంగాణలో ఆ పార్టీకి కాస్త జోష్ వచ్చింది. సంస్థాగతంగా కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ , టీఆర్ఎస్కు ప్రధాన పోటీదారు కాంగ్రెస్సే అన్న భావన కొంతమేర తేగలిగారు. దానికి తగ్గట్లుగానే ఆయా నేతలు బీజేపీలో కన్నా కాంగ్రెస్‌లో చేరడానికే సుముఖత చూపుతున్నారు. అదే పెద్ద ఇండికేషన్ అని చెప్పాలి. ఖమ్మం జిల్లాలో స్ట్రాంగ్ మాన్ గా పేరొందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాని, మాజీ మంత్రి , నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు వంటివారు కాని కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. వారిని ఆకర్షించడానికి బీజేపీ యత్నించినప్పటికీ, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వారు ఆ పార్టీలో చేరలేదు. సొంతంగా పార్టీ పెట్టడం కన్నా బీఆర్ఎస్ను ఓడించడానికి కాంగ్రెస్‌లో చేరితే బెటర్ అన్న అభిప్రాయానికి దాదాపుగా వచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.దామోదరరెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరవచ్చని చెబుతున్నారు. చదవండి: చంద్రబాబు కొత్త ట్రిక్కు.. ఆ భయంతోనేనా? అది జరిగితే నాగర్ కర్నాల్ ప్రాంతంలో కాంగ్రెస్ బలం పుంజుకుంటుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం వంటి జిల్లాలలో కాంగ్రెస్ పుంజుకుంటే అది బీఆర్ఎస్ కు గట్టిపోటీనే ఇస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీతో పోల్చితే నియోజకవర్గాలలో బలమైన క్యాడర్, నాయకత్వం కాంగ్రెస్‌కే ఉంది. పార్టీ విజయం సాదించే అవకాశం ఉందన్న నమ్మకం కుదిరితే వారంతా తీవ్రంగా కృషి చేస్తారు. బీజేపీ కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలు ఏర్పాటు చేస్తోంది. బీజేపీ అధికారంలోకి తేవడానికి వారి ప్రయత్నాలు వారు చేస్తారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాదన్న భావన నెలకొంటే, హంగ్ వచ్చేంత బలాన్ని అయినా పొందడానికి యత్నిస్తారు. అదికాకపోతే కాంగ్రెస్ నైతే అధికారంలోకి రావాలని వారు కోరుకోరని, అది జరిగితే దేశ వ్యాప్తంగా కొంత ప్రభావం పడుతుందని వారు భావించవచ్చని చెబుతున్నారు. అప్పుడు బీఆర్ఎస్కే వారు ఎంతో కొంత సాయపడవచ్చన్న ప్రచారం కూడా ఉంది. మామూలుగా అయితే కేసీఆర్‌కు నల్లేరు మీద బండిలా గెలుపు రావాలి. కాని ఆయన వ్యవహార శైలి, వివిధ కారణాల వల్ల పోటీని ఎదుర్కునే పరిస్థితి తెచ్చుకున్నారనిపిస్తుంది. ఏది ఏమైనా రాజకీయం ఎప్పుడూ ఒకరి సొంతం కాదు కదా! -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే.. శరద్ పవార్
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు సీనియర్ నేత శరద్ పవార్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని ఎదుర్కోవడానికి విపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. జూన్ 23న బీహార్‌లో జరగనున్న విపక్షాల సమావేశంలో కూడా తాను ఇదే విషయాన్ని ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవంలో ఆ పార్టీ అధ్యక్షులు శరద్ పవర్ మాట్లాడుతూ పార్టీ వర్గాలకు తమ భవిష్యత్తు కార్యాచరణ గురించి వివరించారు. కేంద్రంలో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఐక్యతతో పోరాడాలని ఆకాంక్షించారు. బీజేపీ పార్టీని ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో బీజేపీని వద్దనుకుంటున్నారంటే రేపు కేంద్రంలో కూడా ఆ పార్టీని వద్దనుకునే అవకాశం లేకపోలేదు. ఇలాంటి సమయంలోనే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి. కలిసికట్టుగా బీజేపీని సాగనంపే ప్రయత్నం చేయాలని అన్నారు. బీజేపీ అధికారంలోకి రావడం కోసం కష్టసాధ్యమైన హామీలిచ్చి ప్రజలను మభ్య పెట్టింది. ప్రజలకు ఆ విషయం తేటతెల్లమైంది. ఇప్పుడు వారు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. అన్ని బీజేపీయేతర పార్టీలు సమిష్టిగా పోరాడితే ఆ పార్టీని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన తీసుకుని రాగా ఆయన స్పందిస్తూ అన్ని పార్టీలకూ తమ విస్తృతిని ఏ రాష్ట్రంలోనైనా పెంచుకునే అవకాశముంది. కానీ నాకెందుకో అది బీజేపీకి చెందిన తోక పార్టీగా అనిపిస్తోందన్నారు. ఇది కూడా చదవండి: వారితో చేతులు కలపడం దండగ.. -
ఎగుమతుల వృద్ధికి రంగాల వారీ ప్రాధాన్యత
న్యూఢిల్లీ: ఎగుమతుల రంగంలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి రంగాల వారీ వ్యూహాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్– బెంగళూరు (ఐఐపీఎంబీ)డైరెక్టర్ రాకేష్ మోహన్ జోషి పేర్కొన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇతర హైటెక్ పరిశ్రమల కోసం ఈ తరహా వ్యూహం అవసరమని పేర్కొన్నారు. భారత్ 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల వస్తు, సేవల ఎగుమతుల లక్ష్యాన్ని చేరడానికి ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు వార్షిక వృద్ధి రేటు 14.5 శాతంగా నమోదుకావాలనీ అంచనావేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► పాలిష్ చేసిన వజ్రాలు, ఆభరణాలు, ప్యాసింజర్ కార్లు, టెలికమ్యూనికేషన్ పరికరాలు వంటి రంగాలు ఎగుమతుల భారీ పెరుగుదలలో దోహదపడతాయి. ► దేశాల పరంగా చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), హాంకాంగ్, జర్మనీ, వియత్నాం, బ్రిటన్, ఇండోనేషియా, మలేషియా, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, ఇటలీ, థాయ్‌లాండ్, టర్కీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, బెల్జియంలకు మన ఎగుమతులను పెంచుకోడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ► ఎగుమతిదారులు, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమాచార, సమన్వయ అంతరాన్ని తగ్గించడం ప్రస్తుతం అవసరం. రియల్ టైమ్ సమాచారాన్ని సేకరించడం, సమీకరించడం, ప్రాసెసింగ్ చేయడం, సంబంధిత వ్యక్తులకు ఆ సమాచారాన్ని సకాలంలో అందేలా చేయడం, ఆధునిక సాంకేతికతను అవలంబించడం చాలా ముఖ్యమైన అంశాలు. ► అమెరికా, యూరోపియన్ యూనియన్ తదితర అభివృద్ధి చెందిన దేశాలలో సెమీకండక్టర్ తయారీని సులభతరం చేయడానికి చిప్స్ చట్టం వంటి రక్షణవాద విధానాల పునరుద్ధరణను భారతదేశం నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ► పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ► వ్యవసాయం, తోటల పెంపకం, ఉద్యానవన అనుబంధ రంగాల పురోగతికి ఐఐపీఎంబీ కీలక సహకారాన్ని అందిస్తోంది. విద్య, ఎగుమతులు, సామర్థ్యం పెంపుదల, శిక్షణ, విధాన పరిశోధన, అభివృద్ధి వంటి వివిధ కోణాల్లో పురోగతికి వ్యూహాలు రూపొందిస్తుంది. -
గేరు మార్చి.. స్పీడ్ పెంచి.. సీఎం జగన్ బలం అదే.. ఇదీ లెక్క..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గేరు మార్చి స్పీడ్ పెంచారు. తన రాజకీయ ప్రత్యర్ధులు ఏదైతే బలం అనుకుంటున్నారో, దానిని ఆయన వారి బలహీనతగా ప్రజలకు చూపిస్తున్నారు. ఒక వైపు తన ప్రభుత్వం పేదల కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరిస్తూనే, మరో వైపు రాజకీయ విమర్శలకు ఆయన బదులు ఇస్తున్నారు. నిజాం పట్నంలో మత్స్యకార భరోసా కార్యక్రమం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అనుసరించిన వ్యూహం ఇదే అనిపిస్తుంది. ప్రతి సందర్భంలోనూ ఇదేరీతిలో ఆయన ప్రసంగాలు సాగుతున్నా, నిజాంపట్నంలో మరింత స్పష్టంగా తన రాజకీయ వ్యూహాన్ని ఆయన అమలు చేసినట్లు అనిపిస్తుంది. తాను పేద ప్రజల కోసం పనిచేస్తుంటే, ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేనలు పెత్తందారి పార్టీలుగా మారాయని, ధనిక వర్గాల కోసం అవి పనిచేస్తున్నాయని జగన్ పేర్కొన్నారు. తద్వారా పేద,పెత్తందారి ధీరిని మరోసారి ప్రజలకు ఆయన వివరించారు. పేదల కోసం తీసుకు వస్తున్న స్కీములను ఈ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పడం ఆయన లక్ష్యం. అంతవరకు ఆయన సఫలం అయినట్లే అనిపిస్తుంది. అందుకే తెలుగుదేశం పార్టీ జనంతో యుద్దం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో మాదిరే ఆర్ధిక పరిస్థితి ఉన్నా, ఇంకా కొన్ని సమస్యలు అదనంగా వచ్చినా తాను ప్రజలకు 2.10 లక్షల కోట్ల మేర నేరుగా అందచేశానని, చంద్రబాబు అలా ఎందుకు చేయలేకపోయారని, ఆయన హయాంలో ఈ డబ్బు అంతా ఏమైందని జగన్ ప్రశ్నించడం ద్వారా తన ప్రభుత్వంలో అవినీతి లేదని, బటన్ నొక్కితే ప్రజల ఖాతాలలోకి వెళుతుందని ఆయన వివరించారు. తాను ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలలో 98.5 శాతం నెరవేర్చిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు.ఈ నేపధ్యంలో తాము అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ స్కీములను తీసివేయబోమని చంద్రబాబు,పవన్ లు చెప్పవలసి వస్తోంది. ఈ రకంగా వారిని జగన్ తన ట్రాప్ లోనే ఉంచుతున్నారు. వారికి తనే ఎజెండా సెట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మత్స్యకారులకు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మేలు గురించి ఆయన చెప్పారు. ఈ రకంగా సంబంధిత కార్యక్రమం, ప్రభుత్వ స్కీముల గురించి మాట్లాడిన తర్వాత రాజకీయ అంశాల వైపు మళ్లుతున్నారు. తెలుగుదేశం, జనసేనల పొత్తు గురించి ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు తాము కలవడం బలం అనుకుంటున్న సంగతి తెలిసిందే. దానినే వారి బలహీనతగా జగన్ చూపిస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని వంటివారిని ఎంపిక చేశానని డాంబికాలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు 175 సీట్లలో పోటీ చేయలేకపోతున్నారని, పవన్ కళ్యాణ్ తను బలహీనుడనని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలు కలిసినా తనను ఓడించలేవని, తన బలాన్ని చూసి భయపడే వారు పొత్తులు పెట్టుకుంటున్నారని జగన్ ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంగా పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం తనకు సీఎం పదవి ఎవరిస్తారని బేలగా మాట్లాడాన్ని జగన్ తనకు అడ్వాంటేజ్‌గా మలచుకున్నారు. లోకేష్ ను నాయకుడిగా చేసేందుకు చంద్రబాబు చేస్తోన్న ప్రయత్నం, దాని కోసం అందరినీ కలుపుకుని ప్రభుత్వంపై విష ప్రచారం దిగుతుందని ప్రజలకు కూడా అర్థమవుతోంది. ఇదే అంశాన్ని వైఎస్సార్ సిపి కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తొంది. ఇది పెత్తందార్లకు, పేదవారికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో పేదవారికి అండగా జగనన్న ప్రభుత్వం ఉంది. అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ యుద్ధంలో మీ మద్దతు ఎవరి వైపు..?#PedavalluVSPetthandarlu #RichVSPoor #YSJaganAgain pic.twitter.com/l75wbvOPAj — YSR Congress Party (@YSRCParty) May 15, 2023 పవన్‌ను ఎప్పుడూ ఆయన దత్తపుత్రుడు అని సంభోదిస్తారు. అదే సంబోధనతో ఆయనకు సీఎం పదవి వద్దట.. ప్యాకేజీ ఇస్తే చాలట అని వ్యంగ్యంగా అన్నారు. చంద్రబాబు ఏమి ఆదేశిస్తే జీహుజూర్ అంటూ పవన్ సిద్దంగా ఉంటారని చెబుతూ ప్రజలలో ఆయన పట్ల మరింత వ్యతిరేకత పెంచడానికి జగన్ యత్నించారు.పొత్తులు పెట్టుకుని వివాహం చేసుకునేది వీరే.. విడాకులు ఇచ్చేది వీళ్లే అని అంటూ గత చరిత్రను ఆయన గుర్తు చేశారు. 2014లో పవన్ కళ్యాణ్ తన పార్టీ పోటీ చేయకుండా కేవలం చంద్రబాబుకే మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికలనాటికి టీడీపీకి దూరం అయి అంటే విడాకులు తీసుకుని వేరే కూటమి కట్టి పోటీచేశారు. అది కూడా తెలుగుదేశం వ్యతిరేక ఓటు చీలడానికే అన్న వ్యూహం అప్పట్లో అమలు చేశారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పేరుకు విడిపోయినా, పవన్ కళ్యాణ్ ఆయా నియోజకవర్గాలలో చంద్రబాబు ఎంపిక చేసినవారికే జనసేన టిక్కెట్లు ఇచ్చారని చెబుతారు. చంద్రబాబు, లోకేష్‌లు పోటీచేసిన కుప్పం, మంగళగిరిలలో పవన్ ప్రచారం చేయలేదు.. అలాగే పవన్ పోటీచేసిన రెండు చోట్ల గాజువాక, భీమవరంలలో చంద్రబాబు ప్రచారం చేయలేదు. ఇదంతా మాచ్ ఫిక్సింగ్ లో భాగమేనని తేలింది. ఓటమి అనంతరం పవన్ కళ్యాణ్ మళ్లీ బిజెపి గూటికి చేరారు. అది కూడా చంద్రబాబును రక్షించే క్రమంలోనే అని వైసీపీ చెబుతుంటుంది. బీజేపీతో పొత్తులో ఉన్నా, పవన్ టీడీపీతో రాజకీయ అక్రమ సంబంధం నెరపుతున్నారు. వీటన్నిటిని జగన్ తో సహా వైసీపీ నేతలు బాగా ఎక్స్ పోజ్ చేశారు. చంద్రబాబు, పవన్ లు విలువలు లేని, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తారని చెబుతూ సోదాహరణంగా ఆయా విషయాలను జగన్ ఉటంకిస్తున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ గత రెండున్నర దశాబ్దాలలో పలు పార్టీలతో పొత్తులు పెట్టుకుంది. వారితో విడిపోయింది. ఉదాహరణకు 1996, 98 లోక్ సభ ఎన్నికలలో వామపక్షాలతో స్నేహం చేసి, బీజేపీని మసీదులతో కూల్చే పార్టీ అని చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టేవారు. చదవండి: రాజకీయాల్లో సినిమావాళ్ల విలువ ఎంతంటే.. కాని 1998 ఎన్నికలు పూర్తి కాగానే చెప్పాపెట్టకుండా వామపక్షాలకు గుడ్ బై చెప్పి బీజేపీ చంక ఎక్కారు. 1999,2004 ఎన్నికలలో వారితో కలిసి పోటీచేసి, ఆ తర్వాత జీవితంలో బీజేపీతో కలవనని అనేవారు. కాని 2014 ఎన్నికలనాటికి బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ చుట్టూ తిరిగి మళ్లీ పొత్తు పెట్టుకున్నారు. 2002లో నరేంద్ర మోదీని నరహంతకుడని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌కే రానివ్వనని అనేవారు. 2014లో ఆయన తో కలిసి రాజకీయంగా లబ్ది పొందినా, తిరిగి 2018 నాటికి మళ్లీ దూరం అయి మోదీ వేస్ట్ అని, దేశం నాశనం అవుతోందని అనేవారు. 2024 నాటికి తిరిగి మోదీతో ఎలాగొలా స్నేహం చేయాలని అర్రులు చాస్తున్నారు. 2009లో టీఆర్ఎస్తో పొత్తు కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. తీరా రాష్ట్ర విభజనకు కేంద్రం పూనుకుంటే సోనియాగాంధీ దెయ్యం, ఏపీకి నష్టం చేసిందని అనేవారు. కాని 2018 తెలంగాణ ఎన్నికల నాటికి కాంగ్రెస్ తోనే చెట్టపట్టాలేసుకుని తిరిగారు. ఇలా ఇన్ని విన్యాసాలు చేసిన వ్యక్తిగా చంద్రబాబును ప్రజల ముందు జగన్ ఉంచే యత్నం చేశారు. చంద్రబాబు మాదిరే పవన్ కూడా పలు కూటములు మార్చిన తీరును ఆయన ఎండగడుతున్నారు. వీరిద్దరూ అనైతిక రాజకీయాలు చేస్తారని ప్రజలలో ఎస్టాబ్లిష్ కావడానికి వీటిని గుర్తు చేస్తుంటారు. వచ్చే శాసనసభ ఎన్నికలలో టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకుంటే వైసీపీకి కొంత ఇబ్బంది వస్తుందన్న ప్రచారాన్ని ఆయన తిప్పి కొడుతున్నారు.చంద్రబాబు, పవన్ లు కుట్ర పూరితంగా రాజకీయం చేస్తున్నారని, తద్వారా పేద ప్రజలకు నష్టం చేయాలని చూస్తున్నారని ఆయన వివరిస్తున్నారు. తాను పేదలవైపు ఉన్నానని, టీడీపీ, జనసేనలు, పెత్తందారుల వైపు ఉన్నాయని ఆయన ఉద్ఘాటిస్తున్నారు. పొరపాటున చంద్రబాబును గెలిపిస్తే ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాలన్ని ఆగిపోతాయని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. చదవండి: మలుపు తిప్పిన ముఠా! పవన్ కల్యాణ్‌కూ వాటా ఈ రకమైన వ్యూహాలతో జగన్ తన ఓటు బ్యాంకును చెక్కు చెదరనివ్వకుండా కాపు కాచుకుంటున్నారని చెప్పాలి. యథా ప్రకారం చంద్రబాబు, దత్తపుత్రుడుతో పాటు ఈనాడు, జ్యోతి, టివి 5 మీడియా సంస్థలు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి అసత్య కదనాలు ఇస్తున్నది చెప్పకుండా మానడం లేదు. వీళ్లందరిని కలిపి ఆయన తోడేళ్ల గుంపుతో పోల్చుతున్నారు. చంద్రబాబు కొంతకాలం క్రితం టీడీపీ, జనసేన కూటమి అంటే జగన్ భయపడుతున్నారని అన్నారు. దానికి ప్రతిగా వారిద్దరూ కలవడం వారి బలహీనత అని, వైఎస్సార్ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ప్రజలే తన ధీమా అని, తాను దేవుడిని, ప్రజలనే నమ్ముకున్నానని జగన్ అంటున్నారు. మీ బిడ్డ అంటూ తనను పరిచయం చేసుకుంటున్నారు. ఇది మీ ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం అని చెబుతూ ప్రజలను ప్రభుత్వంలో భాగస్వాములను చేస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు. సింహంలా సింగిల్ గానే ఎన్నికలలో వైసీపీ పోటీచేస్తుందని, అదే తన బలం అని ప్రజలలో విశ్వాసం కల్పించడానికి జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
పక్కా ప్లాన్డ్గా.. బీజేపీ హైకమాండ్ కొత్త స్ట్రాటజీ..
సాక్షి, చెన్నై: జాతీయ స్థాయి పదవుల్లో తమిళులకు ప్రాధాన్యమిస్తూ అటు నాయకులను, ఇటు ప్రజలను ఆకర్షించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇప్పటికే ఇద్దరు గవర్నర్లు, ఓ కేంద్రమంత్రి తమిళనాడు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా మరొకరికి రాష్ట్ర ప్రథమ పౌరుడి హోదా దక్కింది. దీంతో ఆ పార్టీ నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భారతీయ జనతా పార్టీని నమ్ముకుంటే.. ఎప్పటికైనా పదవి సిద్ధిస్తుందనే ప్రచారం ప్రస్తుతం రాష్ట్రంలో ఊపందుకుంది. ఇది రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమకు లబ్ధి చేకూరుస్తుందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. తమిళనాడులో పాగా వేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ అధిష్టానం ‘కొత్త’ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న మరో సీనియర్ నేతకు గవర్నర్‌గా ప్రమోషన్ ఇచ్చింది. ఝార్ఖాండ్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు వెలువడడంతో ఆయన మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు. సీపీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన తమిళి సై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే మరో సీనియర్‌నేత ఇలగణేషన్‌ను మణిపూర్ గవర్నర్‌గా నియమించారు. తాజాగా ఆయన్ని అక్కడి నుంచి నాగాలాండ్‌కు బదిలీ చేశారు. అలాగే రాష్ట్రానికి చెందిన ఎల్. మురుగన్‌కు ఏకంగా రాజ్యసభ హోదాలో కేంద్ర సహాయమంత్రి పదవి కట్టబెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో తనకు కూడా అవకాశం రాక పోదా..? అని ఎదురు చూసిన బీజేపీ సీనియర్ సీపీ రాధాకృష్ణన్‌కు గవర్నర్ పదవి దక్కింది. లోక్‌సభ ఎన్నికల్లో తమిళుల ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న బీజేపీ అధిష్టానం, మరో నేతను అందలం ఎక్కించడం విశేషం. కార్యకర్త నుంచి గవర్నర్ స్థాయికి.. తిరుప్పూర్‌లో రైతు కుటుంబంలో జన్మించిన సీపీ రాధాకృష్ణన్ 16 ఏళ్ల వయస్సు నుంచే ఆర్ఎస్ఎస్ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1998, 1999లో రెండు సార్లు కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. బీజేపీలో సీనియర్ నేతగా ఉంటూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థల్లో నామినేటెడ్ పదవుల్లో కొనసాగారు. ఒకప్పుడు తమిళనాడు బీజేపీ అంటే సీపీరాధాకృష్ణన్ అనే స్థాయికి చేరుకున్నారు. ఈ క్రమంలో తన కన్నా జూనియర్లు అనేక మంది రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో కీలక పదవుల్లోకి వెళ్తున్న సమయంలో, తనకు అవకాశం దక్కక పోదా? అని ఎదురు చూసిన సీపీఆర్ ఎట్టకేలకు లక్కీచాన్స్ కొట్టేశారు. మద్దతుదారుల సంబరాలు సీపీ రాధాకృష్ణన్‌ను ఝార్ఖాండ్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడగానే ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ఇక సీఎం ఎంకే స్టాలిన్, ప్రధాన ప్రతిపక్ష నేత పళణి స్వామి, ఉప నేత పన్నీరు సెల్వం, గవర్నర్లు తమిళి సై, ఇలగణేషన్, కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో పాటు వివిధ పార్టీలకు చెందిన వారు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం స్టాలిన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ, రాజ్యంగం ప్రకారం విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. చదవండి: ట్రెజర్ హంట్ – ఎంపవర్మెంట్! వారధిగా ఉంటా.. తనను కొత్త గవర్నర్‌గా నియమించినట్లు సమాచారం రావడంతో తిరుప్పూర్‌లో సీపీ రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడారు. ఈ అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవి తనకు దక్కిన గౌరవం కాదని.. తమిళనాడు ప్రజలకు లభించిన గొప్ప అవకాశం అని అభివర్ణించారు. అందుకే తమిళనాడు ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఉంటానని, ఝార్ఖాండ్ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి శ్రమిస్తానని వ్యాఖ్యానించారు. -
గుజరాత్ కాంగ్రెస్ లో కనిపించని ఎన్నికల జోష్
-
తుమ్మల వ్యూహం అర్థం కావడంలేదంటున్న అనుచరులు
-
Munugode Politics: మునుగోడుపై కమలనాథుల వ్యూహమేంటీ?
సాక్షి, హైదరాబాద్/నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా వివేక్‌ను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. 16 మందితో స్టీరింగ్ కమిటీని ప్రకటించారు. స్థానికుడైన గంగిడి మనోహర్‌రెడ్డికి కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించారు. చదవండి: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల! సభ్యులుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, విజయశాంతి, రవీంద్ర నాయక్, రాపోలు ఆనంద్ భాస్కర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీ నారాయణ, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ నేషనల్ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి, దాసోజు శ్రవణ్‌ను నియమించారు. దుబ్బాక, హుజురాబాద్ తరహాలో ఉప ఎన్నిక ఇంచార్జీ అని కాకుండా స్టీరింగ్ కమిటీ అని ప్రకటించడం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జ్ కోసం నేతలు పోటీ పడ్డారు. కానీ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మాత్రం వివేక్ పేరు ప్రతిపాదించారు. ఇతర నేతలను నారాజ్ చేయకుండా స్టీరింగ్ కమిటీ పేరుతో 16 మంది టీం ప్రకటించారు. మరో రెండు మూడు రోజుల్లో మునుగోడు నియోజకవర్గంలో మండలాల వారీగా ఇంచార్జ్‌లను ప్రకటించనున్నారు. వచ్చే వారంలో ప్రతి గ్రామానికి ఇంచార్జ్‌ని నియమించి బూత్ స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ చేయడానికి బీజేపీ పటిష్ట కార్యాచరణ రూపొందిస్తోంది. -
బీజేపీ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. జేపీ నడ్డాతో భేటీ కానున్న హీరో నితిన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. శంషాబాద్ నోవాటెల్‌లో రేపు(శనివారం) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ కానున్నారు. సినీ రచయితలు, క్రీడాకారులతో కూడా నడ్డా సమావేశం కానున్నారు. ఇటీవలే అమిత్‌షాను జూనియర్ ఎన్టీఆర్ కలిసిన సంగతి తెలిసిందే. చదవండి: మునుగోడు ఉప ఎన్నిక: టికెట్ రెడ్డికా.. బీసీకా? -
‘గులాబీ’ బాస్ ఆదేశాలు.. ఆ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు..?
సాక్షి, నిజామాబాద్: రాబోయేది ఎన్నికల కాలం కావడంతో ఇందూరు పాలిటిక్స్ అప్పుడే హాట్ హాట్‌గా మారిపోతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఐదేళ్ళ పాటు గులాబీ పార్టీ హవా కొనసాగింది. ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీగా గెలిచిన తర్వాత రాజకీయాల రంగు మారింది. గులాబీకి కమలం పోటాపోటీగా వస్తోంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ వచ్చాక హస్తం కూడా యాక్టివేట్ అయింది. దీంతో మూడు పార్టీల రాజకీయాలు ఇందూరులో ఆసక్తికరంగా సాగుతున్నాయి. చదవండి: మరో వీడియో విడుదల చేసిన రాజాసింగ్.. సంచలన వ్యాఖ్యలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజామాబాద్ జిల్లా యావత్తు గులాబీ మయంగా మారింది. తొలి ఎన్నికల్లో మొత్తం అసెంబ్లీ సీట్లు, లోక్‌సభ స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకుంది. ఇందూరు జిల్లాలో మరో పార్టీకి అవకాశమే లేదన్నంతగా పరిస్థితులు టీఆర్ఎస్కు అనుకూలంగా మారాయి. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించింది. అయితే ఆ తర్వాత క్రమంగా గులాబీ రంగు వెలియడం మొదలైంది. 2018 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితుల్లో కొంత మార్పు కనిపించింది. ఉద్యమపార్టీగా ప్రజల అభిమానం పొందిన గులాబీ పార్టీపై అసంతృప్తి ప్రారంభమైనట్టు స్పష్టమైంది. అంతకుముందు ఉమ్మడి జిల్లాలో 9 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకున్న గులాబీ పార్టీకి 2018లో ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన జాజుల సురేందర్ కారెక్కేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆరు నెలలకు వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో కవిత ఓటమి చెంది బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎంపీగా విజయం సాధించారు. తొలిసారి నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో కమలం వికసించింది. ఇది రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత జిల్లా రాజకీయాలు మారుతూ వస్తున్నాయి. అప్పటివరకూ ఏకఛత్రాధిపత్యంగా దూసుకుపోతున్న కారుకు... అడుగడుగునా కమలం అడ్డుపడుతుండటంతో జిల్లాలో మళ్లీ అధికార, ప్రతిపక్షాల మధ్య ఫైట్‌కు తెరలేచింది. అయితే తర్వాత మళ్లీ నిజామాబాద్ కేంద్రంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత విజయం సాధించారు. పలు సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ... కొన్నింటిని అందిస్తూ... గత పాలక పార్టీలతో పోల్చి చూసినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే బెటర్ అనే చర్చ జనసామాన్యంలో జరుగుతోంది. అయితే పథకాలు అందరికీ అందకపోవడం, గులాబీ పార్టీ కార్యకర్తలకే అందుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మంచిప్ప వంటి రిజర్వాయర్స్, దళితబంధు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం... ఇచ్చిన పలు హామీలను నెరవేర్చకపోవడం ప్రజల్లో అసంతృప్తి పెంచుతున్నాయి. కొత్త పింఛన్లు రాకపోవడం.. క్షేత్రస్థాయిలో గులాబీ కార్యకర్తల విపరీత పోకడలు వంటివెన్నో ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకతకు కారణమయ్యాయి. అయితే ఈ వ్యతిరేకతను అదేస్థాయిలో విపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకోలేకపోయాయి. కాంగ్రెస్ ఈ విషయంలో పూర్తిగా వెనుకబాట పట్టగా... బీజేపినే అంతో ఇంతో చెరకు రైతుల సమస్యలు, పసుపు రైతుల సమస్యల వంటివాటిని ముందుకు తెస్తూ ప్రజల్లో ప్రచారం తెచ్చుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి, మంత్రి పదవులు అనుభవించిన ధర్మపురి శ్రీనివాస్ ఆపద కాలంలో హస్తానికి హ్యాండిచ్చి.. కారెక్కడం ఆ పార్టీని కోలుకోలేని దెబ్బ తీసింది. హస్తాన్ని వీడినందుకు రాజ్యసభ సీటు దక్కినా, కొన్నాళ్ళ తర్వాత కారులో కూర్చోలేక బయటికొచ్చారు ధర్మపురి శ్రీనివాస్. ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా బాస్‌గా నిలిచిన మండవ వెంకటేశ్వరరావు వంటి సీనియర్ నేతల ఉనికే లేకుండా పోయింది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి లాంటివాళ్లు రెండు సార్లుగా ప్రేక్షక పాత్రకే పరిమితం కావల్సి వచ్చింది. అయితే ధర్మపురి శ్రీనివాస్ తనయుడు అరవింద్ ఎంపీ కావడంతో... ఇందూర్ లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపి ఫైట్ ముదిరి రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రావచ్చన్న ప్రచారంతో ప్రతిపక్షాలు అప్రమత్తమయ్యాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం కావాలన్న పార్టీల అధినాయకత్వాల ఆదేశాలతో ఇందూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదే సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయిస్తుండటంతో... శాసనసభ్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తప్పదన్నట్టుగా పీకే సర్వే సారాంశమున్నట్టుగా వార్తలు గుప్పుమన్నాయి. జిల్లాలోనూ ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బోధన్ తో పాటు.. జుక్కల్ వంటి నియోజకవర్గంలోనూ రాబోయే రోజుల్లో గులాబీలు మళ్లీ వికసిస్తాయా అన్న అనుమానాలైతే ఇప్పటికే బలపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 9 నియోజకవర్గాల్లో ఐదారు నియోజకవర్గాల్లో అధికారపార్టీకి ఎదురుగాలి వీస్తున్నదనే ప్రచారమైతే జరుగుతోంది. జిల్లాలో ఏర్పడిన ఈ ప్రతికూల పరిస్థితులను అధికారపార్టీ ఎలా అధిగమిస్తుంది? కాంగ్రెస్, బీజేపీలు తమకనుకూలంగా ఎలా మల్చుకుంటాయన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్రిముఖ పోటీ ఉంటుందనుకుంటున్న క్రమంలో.. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రూపంలో బీఎస్పీ, షర్మిల రూపంలో వైఎస్సార్టీపీ, తెలంగాణాలోనూ పోటీ చేస్తామంటున్న ఆప్ వంటి పార్టీలు కూడా బరిలోకి దిగడం వల్ల ఎవ్వరికి లాభం, ఎవ్వరికి నష్టమనే లెక్కలు వేసుకుంటున్నారు. -
పాతబస్తీలో బీజేపీ పాగా వేస్తుందా?.. వ్యూహం ఇదేనా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం మినీ భారతదేశం. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు.. ఉత్తరాదివారు ఎక్కువగా నివసించే నగరం హైదరాబాద్. పైగా మైనారిటీలు కూడా అధికంగా ఉండే ప్రాంతం. ఇక్కడ ఒక్కో నియోజకవర్గం వైవిధ్యభరితంగా ఉంటుంది. సామాజిక సమీకరణాల్లో కూడా విభిన్నమైన నగరం. అందుకే ఏ పార్టీ అయినా హైదరాబాద్ నగరాన్ని గెలవాలనుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో రాజధాని నగరం మీద ఏ పార్టీ పట్టు సాధించే అవకాశం ఉంది. పోటీలో నిలిచేదెవరు? గెలిచేదెవరు? రాజధాని రాజకీయాలపై సాక్షి ప్రత్యేక కథనాలు. చదవండి: ‘రాజాసింగ్ సస్పెన్షన్ పెద్ద డ్రామా.. కేంద్ర పెద్దల హస్తం ఉందా?’ తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో రాజకీయాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలంగాణ సెంటిమెంట్‌కు అతీతంగా హైదరాబాద్ ప్రజల తీర్పు ఉంటోంది. పాతబస్తీలోని 7 నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. న్యూ సిటీలోని 8 సెగ్మెంట్లలో ఆధిపత్యం కోసమే అన్ని పార్టీలు పోరాడుతున్నాయి. ఇందుకోసం అప్పుడే కసరత్తు కూడా ప్రారంభించేశాయి. కోటికి పైగా ఉన్న జనాభాతో నగరం కిక్కిరిసి ఉండటంతో పార్టీల ప్రచారం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. చాలా సెగ్మెంట్లలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరా హోరీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రేటర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో డివిజన్లు సాధించుకున్న కాషాయ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బలం నిరూపించుకోవాలని తహతహలాడుతోంది. అదేవిధంగా పార్టీల్లో టిక్కెట్ల కోసం పోటీ కూడా ఎక్కువగానే ఉంది. గత ఎన్నికల్లో గోషామహల్ సీటులో బీజేపీ విజయం సాధించింది. మిగిలిన ఏడు సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంది. ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉన్నందున గులాబీ పార్టీ కొందరు సిటింగ్‌లను మారుస్తుందనే ప్రచారం సాగుతోంది. పాతబస్తీలోని సీట్లను గెలవడం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు కష్టమే అయినప్పటికీ ఈ పార్టీలు సీరియస్‌గానే ప్రయత్నిస్తున్నాయి. అదే వ్యూహంతో బీజేపీ ఎమ్మెల్యేలు లేవనెత్తుతున్న సున్నిత అంశాలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు, దానిపై వెల్లువెత్తిన నిరసనలు, పార్టీలోనే అసంతృప్తి.. ఇవన్నీ కూడా ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు. ఇన్నాళ్లు పాత బస్తీని ప్రయోగ క్షేత్రంగా తీసుకున్న బీజేపీ నేతలు ఇప్పుడు ఎలాగైనా అక్కడ పాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పాతబస్తీకి బ్రాండ్ అంబాసిడర్ చార్మినార్‌కు కూతవేటు దూరంలో ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయం నుంచే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏ కార్యక్రమాన్నయినా చేపడుతున్నారు. హోంమంత్రి అమిత్‌షా, ఢిల్లీ నుంచి ఏ ప్రముఖులు వచ్చినా ఇక్కడ పూజలు నిర్వహించడం వల్ల బీజేపీ ఓ వర్గం ఓట్లన్నింటిని కేంద్రీకృతం చేసే వ్యూహాంలో ఉన్నట్టు కనిపిస్తోంది. న్యూ సిటీలోని సెగ్మెంట్లలో టీఆర్ఎస్ అసంతృప్త నేతలు, కార్పోరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీలలో ఇప్పటికే టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రతీ నియోజకవర్గంలో కనీసం ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. అన్ని పార్టీలు తమ బలాలు, బలహీనతలపై అంతర్గత సర్వేలు చేయించుకుంటున్నాయి. సర్వేలో వెల్లడైన సానుకూల అంశాలు, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని టిక్కెట్లు కేటాయించేందుకు సిద్ధం అవుతున్నాయి. దీంతో రాజధాని నగర రాజకీయం వేడెక్కుతుంది. -
అయోమయంలో కాంగ్రెస్.. రేవంత్ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా?
సాక్షి, హైదరాబాద్: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చేలా కనిపించిన కాంగ్రెస్ తీరా పోలింగ్ ప్రక్రియలో చతికిల పడింది. టీడీపీతో పొత్తు కాంగ్రెస్ పార్టీ పుట్టిముంచిందంటూ... కాంగ్రెస్ పాతకాపులు ఎన్నికల తరువాత పంచనామా చేసి ప్రకటించారు. తాము ఎంత మొత్తుకున్నా వినకుండా ఢిల్లీ పెద్దలు... బలవంతంగా చంద్రబాబును అంటగట్టారని నిట్టూర్చారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లాంటి సాఫ్ట్ లీడర్ నాయకత్వం పార్టీని అధికారంలోకి తేలేదని కాంగ్రెస్ గ్రహించలేకపోయింది. అందుకే ఉత్తమ్ తరువాత పక్కపార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు పీసీసీ పీఠం అప్పగించారు. ఓటుకు నోటు వంటి తీవ్రమైన కేసులున్నా... రేవంత్ దూకుడు తమకు పనికి వస్తుందని కాంగ్రెస్ పెద్దలు ఆశించారు. అందుకే రేవంత్ తీసుకున్న ప్రతీ నిర్ణయానికి అండగా నిలిచారు. చదవండి: టీఆర్ఎస్లో టెన్షన్.. మునుగోడుపై ‘ఐ ప్యాక్’ కీలక నివేదిక! తొలినాళ్లలో సీనియర్లతో కాస్త ఇబ్బంది పడ్డా... చివరికి రేవంత్‌రెడ్డి పార్టీని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. టీడీపీలో కలిసి పనిచేసిన సీతక్క, వేం నరేందర్‌రెడ్డి లాంటి ఒకరిద్దరు నేతలతో ప్రారంభించి ఇప్పుడు రేవంత్ తనకంటూ బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన నాయకులను తిరిగి వెనక్కి తెచ్చెందుకు రేవంత్ తెరవెనక మంత్రాంగం ప్రారంభించారు. ప్రతీ జిల్లాలో తన వర్గానికి టికెట్లు వచ్చేలా ఇప్పటి నుంచే రేవంత్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. తన వ్యతిరేకులకు చెక్ పెట్టే విధంగా ఢిల్లీ పెద్దలు తనతోనే ఉన్నారనే సంకేతాలు వచ్చేలా రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. కాంగ్రెస్ నుంచి నాయకులు టీఅర్ఎస్లోకి వెళ్లినా క్యాడర్ మాత్రం బలంగానే ఉంది. కేసీఆర్‌పై తనదైన స్టయిల్లో విమర్శలు చేసే రేవంత్‌రెడ్డి.. టీఆర్ఎస్కు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం అనే సంకేతాలిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాల్లోని నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ బలపడిందనే సిగ్నల్ ఇవ్వాలన్నది రేవంత్ స్ట్రాటజీ. రాహుల్ గాంధీని రెండురోజుల పాటు తెలంగాణాలో తిప్పడం ద్వారా పార్టీ క్యాడర్‌ను ఉత్సాహపరిచేందుకు టీ కాంగ్రెస్ ప్రయత్నించింది. ఇక టీఆర్ఎస్తో కాంగ్రెస్ మధ్య సంబంధాలపై ఉన్న అనుమానాలకు రాహుల్ చెక్ పెట్టారు. టీఆర్ఎస్తో పొత్తు అసంభవం అంటూ రాహుల్ ద్వారా గట్టి మెసేజ్ ఇప్పించడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. హుజురాబాద్ ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలైనప్పటికీ... రేవంత్ తన ఇమేజ్ డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఎమ్మెల్యే స్థాయి నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా టీఆర్ఎస్కు సవాల్ విసరాలనేది కాంగ్రెస్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. చేరికలపై దూకుడుగా ఉన్నా స్థానిక నేతలకు సమాచారం ఇవ్వడంలేదనే ఆరోపణలతో పార్టీలో కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. టీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న నేతలను టార్గెట్ చేయడం ద్వారా అధికారపక్షం బలహీనపడుతోందనే మెసేజ్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే అనుకున్న స్థాయిలో చేరికలు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ బలపడలేకపోతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక చాలా చేరికలకు సంబంధించి స్థానికంగా ఉన్న సీనియర్లకు అభ్యంతరాలున్నాయి. అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీలో చేరికలు పార్టీని బలోపేతం చేయడం కంటే బలహీనపరుస్తున్నాయనే మెసేజ్ వెళుతోంది. అయితే ఇప్పటికే పార్టీకోసం పనిచేస్తున్న నాయకులను కాదని బయటి నుంచి వచ్చేవారికి అవకాశాలివ్వడం ఏంటనే విమర్శలూ వస్తున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో చేరికల విషయంలో కాంగ్రెస్ అయోమయంలో ఉంది. చదవండి: ఆకర్ష ఆకర్ష! బీజేపీ బిగ్ ప్లాన్.. గులాబీ నేతల్లో గుబులు!