
వాషింగ్టన్ : భారత్‌పై అమెరికా మరోసారి ప్రశంసలు కురిపించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్ చేస్తున్న కృషి చాలా గొప్పదని పేర్కొంది. తమ దక్షిణాసియా వ్యూహంలో భారత్‌దే కీలక పాత్ర అని వెల్లడించింది. ఉగ్రవాదంపై పోరాటం విషయంలో భారత్ పాత్ర ఏ మేరకు ఉందని భావిస్తున్నారని పెంటగాన్ చీఫ్ అధికారిక ప్రతినిధి దానా వైట్‌ను ప్రశ్నించగా ఆమె పై విధంగా స్పందించారు.
'భిన్న విధాలుగా ఉపయోగించుకునేలా భారత్‌తో మాకు అనుబంధాలు ఉన్నాయి. చాలా హుందాగా దక్షిణాసియా వ్యూహానికి భారత్ సహాయం చేస్తోంది. దీని అభివృద్ధి కోసం గొప్ప నిధిని కేటాయించింది. ఏవియేషన్ మెయింటెన్స్ విషయంలో కూడా భారత్ అద్భుతంగా సాయం చేస్తోంది. ఉగ్రవాదాన్ని ఎలాన్ని నిర్మూలించాలనే విషయంలో భారత్‌నే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భాగస్వామ్యులను భారత్ ఏకం చేస్తున్న తీరునే తాము కొనసాగిస్తే లక్ష్యం నెరవేరుతుంది. ఈ రోజు మా దక్షిణాసియా స్ట్రాటజీ విజయవంతంగా అమలవుతుందంటే దానికి కారణం భారతే' అని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment